Thursday, 19 March 2026

Blog

అన్నమయ్య

ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ ఉచిత ఐ క్యాంప్‌కు ‘రికార్డు’ స్పందన

ప్రజా సేవకు, ప్రజల అభివృద్ధికి అంకితమైన ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైల్వే కోడూరులో నిర్వహించిన ఆరో ఉచిత కంటి శిబిరం (ఐ క్యాంప్)కు అనూహ్య స్పందన లభించింది. వేలాది మంది ప్రజలు భారీగా తరలివచ్చి ఈ శిబిరాన్ని విజయవంతం చేశారు. రైల్వే కోడూరు ప్రజల అభివృద్ధిని ధ్యేయంగా ముందుకు సాగుతున్న ముక్కా రూపానంద రెడ్డి సేవలకు ప్రజలు ఘనంగా అభినందించారు. ​రికార్డు స్థాయిలో సేవలు: ఇప్పటికే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో విజయవంతంగా కంటి శిబిరాలు నిర్వహించిన ఫౌండేషన్, ఈరోజు నిర్వహించిన శిబిరం ఆరోవది. శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. ​ఉచితంగా శతాధిక ఆపరేషన్లకు ఏర్పాట్లు:- కంటి ఆపరేషన్ అవసరమైన సుమారు 200 నుండి 300 మంది రోగులను ఆదివారం సాయంత్రం ప్రత్యేక బస్సుల ద్వారా తిరుపతికి తరలించారు. అక్కడ అరవింద ఐ హాస్పిటల్లో మరిన్ని పరీక్షలు పూర్తి చేసిన అనంతరం సోమవారం వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నారు. ఆపరేషన్ల అనంతరం తిరిగి కోడూరుకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ​పరీక్షలు, కళ్లద్దాలు, తిరుపతి ప్రయాణం, ఆపరేషన్లు, వసతి, ఆహారం – ఈ మొత్తం వ్యయాన్ని పూర్తిగా ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ భరించడం విశేషం. ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ​పాల్గొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్:- ఈ బృహత్తర సేవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పాల్గొని ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ​సేవలో ముక్కా కుటుంబం:- ఈ శిబిరం వ్యవహారాలను రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్, కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, వారి సతీమణి ముక్కా వరలక్ష్మి, యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. వారు రోగులను పరామర్శిస్తూ, వారికి ధైర్యం చెప్పి నమ్మకాన్ని పెంపొందించారు. ప్రజల సేవ కోసం ముక్కా కుటుంబం చేస్తున్న కృషి పట్ల స్థానికులు అపారమైన కృతజ్ఞతలు తెలియజేశారు.

పిల్లలకు

శివ భక్తురాలు

అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక అమ్మాయి ఉంది. తన పేరు మహేశ్వరి మహేశ్వరి ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. తను పుట్టినప్పుడు తన నోటి నుండి మొదటగా పలికిన మాట “శివ శివ”అంటూ పలికింది.అందువలన తనకు మహేశ్వరి అని శివుని పేరును పెట్టారు వారి తల్లిదండ్రులు. మహేశ్వరి పెద్దయీ, తను చదువును ఊరిలో ఉన్న ఒక పాఠశాలలో చదువుతుంది. మహేశ్వరి రోజు ఉదయం తొందరగా లేచి వాళ్ళ ఊరిలో ఉన్న శివుని గుడికి వెళుతూ ఉండేది. రోజు శివునికి అభిషేకం చేసి నైవేద్యంగా ఫలాలు లేదంటే తన అమ్మని అడిగి ప్రసాదం చేయించుకుని తీసుకు వెళుతుంది. రోజు శివలింగానికి పూజలు చేసేది. ఒక రోజు తన తల్లికి ఒక పాపా లేదా ఒక బాబు పుడతాడని వారి నాన్న మహేశ్వరి తో చెప్పాడు, అప్పుడు మహేశ్వరి శివుని దగ్గరకు వెళ్లి చాలా ఆనందంగా శివా నాకు ఒక చెల్లెలు లేదా ఒక తమ్ముడు రాబోతున్నాడు నాకు సంతోషంగా ఉంది అని శివునితో చెప్పుకుంటుంది. తరువాత కొన్ని రోజులకు తన తల్లికి బిడ్డ పుట్టే క్రమంలో తన తల్లి మరణించి ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్వరి బాధతో శివుని దగ్గరకు వెళ్లి”ఓ శివ!ఎందుకు ఇలా చేశావు నా తల్లిని ఎందుకు నాకు దూరం చేశావు,ఎప్పుడైన తమ్ముడు అమ్మ ఏది అక్క అని అడిగితే నేను ఏం చెప్పను” అని శివుడిని ప్రశ్నించింది మహేశ్వరి. కొన్ని నెలల తర్వాత వాళ్ల తమ్ముడికి శివా అని నామకరణం చేశారు.తరువాత పాఠశాలకు తన అక్కతో వెళ్లడం ప్రారంభించాడు.తన తండ్రి పని కోసం పట్నం వెళ్లి తన పిల్లలను వాళ్ళ అమ్మ దగ్గర ఉంచి వెళ్ళాడు. శివ పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చాక తన అక్కని ఏడుస్తూ ఇలా అడిగాడు “అక్క అమ్మ ఎక్కడ ఉంది ఎప్పుడు వస్తుంది నా స్నేహితుడిని తన తల్లి పాఠశాలకు తీసుకువచ్చింది అప్పుడు వారు నన్ను మీ అమ్మ ఎక్కడ ఉంది అని నన్ను అడిగారు” అని ఏడుస్తూ తన అక్కతో చెప్పాడు.అప్పుడు మహేశ్వరి తన తమ్ముడిని తీసుకొని శివుని గుడి దగ్గరకు తీసుకువెళ్ళింది తన తమ్ముడు శివకి మహేశ్వరి ఇలా చెప్పింది “మనకు అమ్మ అయినా నాన్న అయినా అన్ని శివుడే” అని చెప్పింది.అప్పుడు తన తమ్ముడు “ఎందుకు అక్క తనే మనకు అమ్మానాన్న “అని అడిగాడు. అప్పుడు తన అక్క మహేశ్వరి ఇలా చెప్పింది “తమ్ముడు నేను చిన్నప్పటి నుండి నా ప్రతి ఆనందాన్ని బాధను శివునితోనే చెప్పుకున్నాను, నా ప్రతి సమయంలోను తోడున్నాడు,శివుడు ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళడు” అని చెప్పింది.అప్పుడు తన తమ్ముడు శివ రోజు తన అక్కతో గుడికి వచ్చి శివునికి పూజ చేసి నైవేద్యం సమర్పించి, పాఠశాలకు వెళ్లేవారు.అలా ఇద్దరు పెద్దయి మహేశ్వరి ఇంటర్ పూర్తయింది. తన తమ్ముడి శివ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. వారి తండ్రి పట్నం నుండి మహేశ్వరి చదువుకు కావాల్సినంత డబ్బును పంపాడు.పై చదువులు చదవడం కోసం మహేశ్వరి పట్నం వెళ్లి, హాస్టల్లో ఉండి, తన తమ్ముడికి ఉత్తరాలు రాసేది. తన తమ్ముడు శివ ఊరిలోని గవర్నమెంట్ పాఠశాలలో తన నానమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నాడు. మహేశ్వరి తన చదువును పూర్తి చేసుకుని,మంచి ఉద్యోగం తెచ్చుకుని,తన ఊరికి వచ్చి, తన ఇంటికి వెళ్లి,తన తమ్ముడు శివను గుడికి తీసుకువెళ్ళింది. ఇద్దరూ భక్తిశ్రద్ధలతో గుడికి వెళ్లి, శివుని దగ్గర తనకు ఉద్యోగం వచ్చిందన్న సంతోషాన్ని గురించి శివునికి చెప్పుకుంది.మహేశ్వరి ఇలా ప్రతి విషయం తను శివునితో చెప్తూ తన తమ్ముడికి తల్లి లేని లోటు తీర్చింది. మహేశ్వరి శివల అపరమైన భక్తికి శివుడు ప్రసన్నమై ఒకరోజు మహేశ్వరికి తన తమ్ముడు శివకు శివుడు కలలో వచ్చి” ఓ మహేశ్వరి నీ ప్రతి సుఖదుఃఖాలను నువ్వు నాతో చెప్పుకున్నావు,అలాగే నువ్వు రోజు నాకు నిష్టగా పూజలు చేసి నీ తమ్ముడిని కూడా నా దగ్గరకు తీసుకువచ్చి తనకు తల్లి లేని లోటును తీర్చావు, నీకు ఏమి కోరిక కావాలో చెప్పు నేను తీరుస్తాను” అని శివుడు చెప్పాడు.అప్పుడు మహేశ్వరి శివునితో ఇలా చెప్పింది “నాకు, నా తమ్ముడికి నువ్వు ప్రతి సమయంలోనూ , మా ప్రతి ఉనికిలో, ప్రతి చోటు నువ్వే మాకు కనిపించాలి, నువ్వే మాకు సర్వస్వంగా,మా దగ్గర ఉండాలి” అని చెప్పింది. తర్వాత తెల్లవారి తొందరగా నిద్ర లేచి మహేశ్వరి తన తమ్ముడడు శివ గుడికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేసి,పూజలు చేసి,నైవేద్యం సమర్పించారు. శివుడు తనకు ప్రతి సమయంలోనూ తోడుంటాడనే నమ్మకం మహేశ్వరి చాలా బలంగా నమ్మి తన నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోనని శివునికి చెప్పింది.ఇలా మహేశ్వరి శివునికి ఒక ప్రియమైన భక్తురాలిగా శివుని మనసులో నిలిచిపోయింది.

ఆంధ్రప్రదేశ్

డిసెంబర్ లో కొత్త ఆధార్ కార్డు వ్యక్తిగత వివరాలన్నీ తొలగింపు

డిసెంబర్ లో కొత్త ఆధార్ కార్డు వ్యక్తిగత వివరాలన్నీ తొలగింపు , న్యూఢిల్లీ : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డును పూర్తిగా పునఃరూపకల్పన చేయడానికి సిద్ధమైంది. డిసెంబర్ నెలలో విడుదల కాబోయే ఈ కొత్త ఆధార్ కార్డు లో ఫోటో, QR కోడ్ మాత్రమే ఉంటాయి. ఇప్పటివరకు కార్డు మీద కనిపించే పేరు, ఆధార్ నంబర్, చిరునామా, పుట్టిన తేదీ వంటి ముద్రిత వ్యక్తిగత వివరాలను పూర్తిగా తొలగించనున్నారు. ఈ కొత్త కార్డులో ఉండే ఎన్‌క్రిప్టెడ్ QR కోడ్ ద్వారానే అవసరమైన సమాచారం ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. దీనిని కేవలం అధికారిక పద్ధతుల ద్వారా మాత్రమే స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. UIDAI అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హోటళ్ళు, కార్యాలయాలు, ఈవెంట్‌ లలో ఆధార్ కార్డు ఫోటో కాపీలు తీసుకొని నిల్వ చేసేవారికి ఇది పెద్ద పరిరక్షణగా మారనుంది. ఈ కొత్త రూపకల్పనతో గోప్యత పెరగడమే కాకుండా డేటా దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టడమే లక్ష్యమని సంబధిత అధికారులు పేర్కొన్నారు.

E-పేపర్

కొండూరు ప్రభాతమ్మ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు సనిశెట్టి నవీన్ కుమార్

రాయలసీమ మొట్టమొదటి మహిళ MLA నాలుగు దశాబ్దాలుగా రాజంపేట నియోజకవర్గని పాలించి శాసించిన నాయకురాలు రాష్ట్ర వైస్సార్సీపీ సీనియర్ లీడర్ పెద్దలు గౌ౹౹శ్రీ.కొండూరు ప్రభాతమ్మ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు . మీ సనిశెట్టి నవీన్ కుమార్ రాజంపేట మునిసిపల్ కౌన్సిలెర్ అధ్యక్షుడు- అన్నమయ్య జిల్లా YSRCP వాణిజ్య విభాగం అధ్యక్షుడు – అన్నమయ్య జిల్లా వరల్డ్ అర్యవైశ్య మహసభ మాజీ అద్యక్షులు – అన్నమయ్య జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపఅధ్యక్షులు -శ్రీ వాసవీ అర్యవైశ్య సామూహిక వివాహ సమస్త. కార్యదర్శి – రాజంపేట క్లాత్ మర్చంట్ అసోసియేషన్ కార్యదర్శి – మీనేస్తం వెల్ల్ఫర్ అసోసియేషన్ రాజంపేట.

ఎన్ టి ఆర్ జిల్లా

వెల్లంకిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతుకు గిట్టుబాటు – పారదర్శక కొనుగోళ్లే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

వీరులపాడు మండలం వెల్లంకి గ్రామంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతీ గింజకు గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వమే ముందుండి చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటను విక్రయించేందుకు కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. తూకం ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, చెల్లింపులు ఆలస్యం కాకుండా చూసేలా అధికారు లను ఆదేశించినట్లు తెలిపారు. రైతుల హక్కులను కాపాడటం, గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని సౌమ్య పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నదని, త్వరలో మరిన్ని పథకాలు అమలు కానున్నాయని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మండల ప్రజాప్రతి నిధులు, పిఏసీఎస్ చైర్మన్లు, కూటమి నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నిర్మల్

డిసిసి అధ్యక్షులు వెడ్మ బుజ్జి పటేల్ గారికి స్వాగతం పలికిన జిల్లా గ్రంథాలయ చైర్మన్

డిసిసి అధ్యక్షులు వెడ్మ బుజ్జి పటేల్ గారికి స్వాగతం పలికిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన వెడ్మ బొజ్జు పటేల్ గారు మొట్టమొదటిసారిగా నిర్మల్ జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఘన స్వాగతం పలికిన నిర్మల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమాంద్ అలీ గారు. వారితోపాటు మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు, మాజీ సారంగాపూర్ జెడ్పిటిసి చైర్మన్ పత్తి రాజేశ్వర్ రెడ్డి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమిరెడ్డి,జిల్లా మైనారిటీ చైర్మన్ జూనెద్ మెమన్,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నాందేడపు,యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సమరసింహారెడ్డి, మైనారిటీ పట్టణ అధ్యక్షులు MA మతిన్,ఖిజార్,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.