Wednesday, 18 March 2026

Blog

అమరావతి

చిన్న‌ప‌త్రిక‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాంః I&PR డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్‌*

*చిన్న‌ప‌త్రిక‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాంః I&PR డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్‌* చిన్న‌,మ‌ధ్య‌త‌ర‌హాప‌త్రిక‌ల అసోషియేష‌న్ ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మైన డెరెక్ట‌ర్‌ స‌మ‌గ్రంగా చ‌ర్చిన వైనంః స‌మ‌స్య‌ల‌పై ప‌రిష్కారానికి కృషి చేస్తామ‌ని హామీ *అమరావతి విశాఖ పున్నమి ప్రతినిధి:- * స్మాల్ , మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, అధ్యక్షుడు కె.ఎస్. రంగసాయి నేతృత్వంలో, బుధవారం ఇక్కడ రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయంలో I&PR డైరెక్టర్‌ను కలిసారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు చిన్న మరియు మధ్య తరహా పత్రికలకు సంబంధించి పలు సమస్యలను డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. 1. పాత పత్రికలకు జారీ చేసిన PRGI ఆన్‌లైన్ సర్టిఫికేట్‌లు మరియు RNI సర్టిఫికేట్‌లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇకపై నమోదు చేసుకునే కొత్త పత్రికలకు PRGI నుండి జారీచేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను మాత్రమే ఇవ్వాలని సూచించారు. 2. పాత జిల్లాలు మరియు కొత్త జిల్లాలు రెండింటిలోనూ పాత RNI సర్టిఫికేట్‌లను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 3. ప్రతి జిల్లాకు వేర్వేరు RNI సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదని వివరించారు. 4. న్యూస్ పేపర్ ఎంపానెల్‌మెంట్‌ను తక్షణం పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని, అలాగే RJDs స్థాయిలో పరిశీలనలో ఉన్న ఫైళ్లను కూడా క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయ‌న స్పందిస్తూ ఎంపానెల్‌మెంట్‌ కొరకు వేచి ఉన్న పత్రికల ఎంపానెల్‌మెంట్‌ను త్వ‌ర‌లోనే పూర్తి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరగా, డైరెక్టర్ రెండు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని హామీ ఇచ్చారు. సాధారణంగా పత్రికల ఎంపానెల్‌మెంట్ ప్రతి సంవత్సరం మార్చి మరియు నవంబర్ నెలల్లో జరుగుతుందని, అయితే ఈ నియమాన్ని సడలిస్తూ, ఇప్పటికే ఉన్న ఫైళ్ల ఎంపానెల్‌మెంట్ పూర్తి చేసి, వచ్చే నెలలో ఎంపానెల్‌మెంట్ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. 5. మధ్య తరహా పత్రికల విధానం (మిడియం న్యూస్ పేపర్ పాలసీ) త్వరితగతిన రూపొందించాలనీ కోరారు. 6. పాత పత్రికలకు పిఆర్‌జిఐ ప్రింటింగ్ స‌ర్టిఫికెట్‌ అవసరం లేదని వివ‌ర‌ణ ఇచ్చారు. దీనిపై అధికారుల‌కు తాను మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చాన‌ని ఆయ‌న అసోషియేష‌న్ ప్ర‌తినిధుల‌కు తెలిపారు. 7. ఎంపానెల్ లేని పత్రికల జర్నలిస్టులకు రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ ఇవ్వాలనే ప్రతిపాదనపై, డైరెక్టర్ సమగ్రంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 8. వార్షిక రిటర్న్‌లతో నమోదు చేసిన రిపోర్టులో ఉన్న CA సర్టిఫికేట్‌లను పరిగణించాలని అభ్యర్థించారు. 9. అక్రిడిటేషన్ G.O.లో 4-8 పేజీల పత్రికలకు ఒక విభాగం, 8 లేదా అంతకంటే ఎక్కువ పేజీల పత్రికలకు మరో విభాగంగా విభజించాలని కోరారు. 10. కేంద్ర విధానానికి అనుగుణంగా ప్రకటనల రేటు కార్డులను పునఃసమీక్షించి పెంచాలని అభ్య‌ర్థించ‌గా తాను దీనిపై అధ్య‌య‌నం చేస్తున్నాన‌ని, త‌రువాత నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. అసోషియేష‌న్ ప్ర‌తినిధులు చెప్పిన స‌మ‌స్య‌ల‌పై డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ శ్రద్ధగా విన్నారు. అన్నింటిని వివ‌రంగా రాసుకున్నారు. త‌రువాత వీటిపై అధికారుల‌తో చ‌ర్చించి స‌మ‌గ్ర‌మైన నిర్ణ‌యాన్ని తీసుకుంటాన‌ని ఆయ‌న తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌ అనిల్ కుమార్ రెడ్డి, కోయిలా డ పరశురామ్, కొఠపల్లి, హనుమంతు రావు, రాజధాని వార్తలు హుస్సేన్ ఖాన్, రేప‌టికోసం పత్రిక ఎడిట‌ర్ శాఖ‌మూరి శ్రీనివాస ప్ర‌సాద్‌, సత్యాగ్రహం శ్రీనివాస్, ముప్పిరిశెట్టి జగదీశ్, ఉదయ అక్షరం సుబ్బారావు మరియు ఇతరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

రవాణా శాఖలో రాజ్యాంగ దినోత్సవం

విశాఖపట్నం, నవంబర్ 26 (పున్నమి ప్రతినిధి) భారత రాజ్యాంగం మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఈ మహాన దేశం యొక్క పౌరుల హక్కులు, విధులు, సామూహిక ఆకాంక్షలను నిర్వచించే శాశ్వత పత్రంగా ఇది ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ప్రత్యేక స్థానం పొందింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగం దత్తత తీసుకున్న గౌరవార్థం, ప్రతి ఏడాది ఈ రోజును దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్)గా జరుపుకుంటున్నారు. “హమారా సంవిధాన్ – హమారా స్వాభిమాన్” అనే ఇతివృత్తంతో ఏడాది పాటు కొనసాగిన ఉత్సవాల ముగింపు సందర్భంగా 2025 నవంబర్ 26న దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమం రాజ్యాంగంపై ప్రజల అవగాహనను పెంపొందిస్తూ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్వం వంటి ప్రధాన విలువలను జీవితంలో అమలు చేయాలని పౌరులను ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంలో విశాఖపట్నంలోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో స్టాఫ్ మరియు ప్రజలు కలిసి భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు రాజ్యాంగం అందించిన హక్కులను నిలబెట్టేందుకు, బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించేందుకు పిలుపునిచ్చారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

భారత రాజ్యాంగ పీఠిక కరపత్రాల విడుదల

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి వంగరి ప్రవీణ్ హాజరై రాజ్యాంగ పీఠిక, ఆర్టికల్ 51(ఏ) పౌరుని ప్రాథమిక విధులకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ “రాజ్యాంగం” మన దేశ ప్రజాస్వామ్యానికి ప్రాణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటి సభ్యులు మాదాస్ నాగేష్, సముద్రాల దామోదర్, మద్దెల సురేష్ పాల్గొన్నారు.

రంగారెడ్డి

పాత్రికేయ నేత ఆలంపల్లి దుర్గేష్ & మాధవి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన సోషల్ మీడియా మిత్రులు సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు దూపం అంజనేయులు

పున్నమి: నవంబర్ 26 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ట్ మండలం: పాత్రికేయ మిత్రుడు ఆలంపల్లి దుర్గేష్ మరియు మాధవి బుధవారం రోజున సోషల్ మీడియా, పాత్రికేయ మిత్రులు కలిసి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. పాత్రికేయ మిత్రునికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన పాత్రికేయ మిత్రులు కలిసి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు దుర్గేష్ & మాధవి దంపతులతో కేక్‌ కట్‌చేయించి శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు దూపం అంజనేయులు, సాయి కిరణ్, మహేష్, రాజేష్ పాత్రికేయ, సోషల్ మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా రాయల్ లుక్స్ షాపింగ్ మాల్ ప్రారంభం

కాకినాడ,కాకినాడ సిటీ,పున్నమి న్యూస్: బుధవారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా నూతనంగా రాయల్ లుక్స్ షాపింగ్ మాల్ ప్రారంభించడం జరిగింది.వస్త్ర వ్యాపార సంస్థ రాయల్ లుక్స్ షాపింగ్ మాల్ కాకినాడలో మెయిన్ రోడ్డు చందన బ్రదర్స్ ఎదురుగా నూతనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నమ్మకమైన నాణ్యతతో పాటు అందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందించాలని సూచించారు.కాకినాడ, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు. రాయల్ షాపింగ్ మాల్ కాకినాడ ప్రజల అభిరుచులకు తగ్గట్లు అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని ఈ వస్త్రాలు మీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంపూర్ణ కుటుంబ కొనుగోలు అనుభవాన్ని రాయల్ లుక్స్ షాపింగ్ మాల్ ఇస్తుందన్నారు. ఎత్నిక్ వేర్ నుంచి ఆధునిక వెస్ట్రన్ వరకు మీకు అందుబాటులో ఉండే ధరలలో ఆఫర్లతో మీకు ఆహ్వానం పలుకుతుందనన్నారు.ఈ కార్యక్రమంలో రాయల్ లుక్స్ యజమానులు మహేంద్ర కుమార్ జైన్,నికిన్ జైన్,రాజు జైన్,ఆషిక్ జైన్,చింటూ జైన్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

హైదరాబాద్ మహానగరాన్ని మరింత విస్తృతపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. GHMCలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 దేశంలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్! హైదరాబాద్ మహానగరాన్ని మరింత విస్తృతపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. GHMCలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేయాలని నిర్ణయించింది. ORR వరకు, అవతలి వైపు ఆనుకుని ఉన్న కొన్ని ప్రాంతాలనూ గ్రేటర్గా పరిగణించనుంది. 1,2 నెలల్లో డివిజన్లు, కార్పొరేషన్ల విభజన పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. దీంతో 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.

కామారెడ్డి

హిందీ కాంప్లెక్స్ సమావేశం… – ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షలకు ముందస్తు సన్నద్ధతపై ఎంఇఓ ఆనంద్‌రావు సూచనలు

కామారెడ్డి, 26 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల పరిధిలో హిందీ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల ల సముదాయ సమావేశం జరిగింది.ఈ కార్యక్ర మంలో మండల విద్యాధికారి ఆనంద్‌రావు మాట్లా డుతూ ఎస్‌ఎస్‌సి విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు దశలవారీ ప్రణాళికతో సిద్ధం చేయాలని ఉపాధ్యా యులకు సూచించారు. రామారెడ్డి మండలం కామారెడ్డి జిల్లాలోని విద్యా విభాగంలో కీలక మండలంగా గుర్తింపు పొందింది.వచ్చే నెలలోనే సిలబస్ పూర్తిచేసి, ఆపై రివిజన్ తరగతులకు ప్రా ధాన్యత ఇవ్వాలని ఆయన ఆదేశించారు.విద్యార్థు ల్లో ఆత్మవిశ్వాసం పెంచే పరీక్షా శిక్షణ, ప్రాక్టీస్ టెస్ట్‌లు నిర్వహించాలని సూచించారు. సమావే శంలో జడ్పీహెచ్ఎస్ పోసానిపేట్ హిందీ ఉపాధ్యా యులు డా. షకీల్ పిహెచ్‌డీ పూర్తిచేసిన సందర్భం గా, ఎంఇఓ ఆనంద్‌రావు ప్రత్యేకంగా సన్మానించా రు. రామారెడ్డి, పాల్వంచ, మాచారెడ్డి ప్రాంతాల ఉన్నత పాఠశాలల హిందీ ఉపాధ్యాయులు, సీఆ ర్పీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

E-పేపర్

బోధి పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

నారాయణఖేడ్ లోని బోధి పాఠశాల లో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భముగా నమూనా అసెంబ్లీ (Mock assembly) విద్యార్థులతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భముగా గవర్నర్ గా పీ శ్రేష్ఠ, సభాపతిగా స్పందన, ముఖ్యమంత్రిగా షాహిస్త తమన్నా, ఉపముఖ్యమంత్రిగా నిహారిక, మిగతా విద్యార్థులు మంత్రులుగా, MLA లు గా తమ పాత్రలు నిర్వహించి సభను జయప్రదం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి వెంకటేశం, మరియు విజయ్ కుమార్, లక్ష్మణ్, సిద్ధు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

E-పేపర్

బోధి పాఠశాలలో షి టీమ్ అవగాహన కార్యక్రమం

నారాయణఖేడ్ లోని బోధి పాఠశాల లో షి టీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మహిళల మరియు విద్యార్థినిల భద్రత విషయాల గురించి తెలియపరిచారు. మరియు T సేఫ్ అప్లికేషన్ ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకోమని దానిని ప్రయాణ సమయంలో తమ భద్రత కోసం ఎలా ఉపయోగించుకోవాలో తెలిపారు. మొబైల్ ఫోన్ వాడకం లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు.Helpline numbers 1098, 112,8712656772, తమకు అందుబాటులో ఉంచుకోవాలి అని తెలియచేశారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: వసతి గృహం ప్రారంభించాలని ఏటీడబ్ల్యూఓ కు వినతి

అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహం ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ఐసుబాబు కోరారు. ఈ మేరకు బుధవారం ఏటిడబ్ల్యూఓ వెంకటరమణ కు వినతిపత్రం అందించారు. కళాశాల వసతి గృహం పూర్తి చేసి ఏడాది కాలం గడుస్తున్నా ప్రారంభించలేదని పేర్కొన్నారు. వసతి గృహం అందుబాటులో లేకపోవడంతో విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.