అరవపల్లి లైబ్రరీలో రాజ్యాంగ దినోత్సవం — అంబేద్కర్‌కు పుష్పాంజలి
భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాది వేసిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ,రాజ్యాంగ దినోత్సవంను పురస్కరించుకొని అరవపల్లి గ్రామ లైబ్రరీలో మంగళవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి గ్రామ పెద్దలు,లైబ్రరీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు కలిసి పూలమాలలు వేసి వినయపూర్వకంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం,స్వేచ్ఛ, న్యాయంను హామీ ఇస్తుందన్నారు.సామాజిక వివక్షను నిర్మూలించి, పేదల ఎత్తుగడ కోసం అంబేద్కర్ జీవితాంతం పోరాటం చేశారని చెప్పారు.ఆధునిక భారత నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర అపూర్వమని,ఆయన చూపించిన మార్గం నేటికీ యువతకు ఆదర్శమని అభిప్రాయపడ్డారు.గ్రంథాలయ నిర్వాహకులు ఈ సందర్భంగా రాజ్యాంగంపై పుస్తక ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసి, గ్రామస్తులకు అందుబాటులో ఉంచారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా గ్రామంలో సామాజిక సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అంబేద్కర్ చూపించిన స్ఫూర్తి, రాజ్యాంగ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అరవపల్లి లైబ్రరీలో జరిగిన ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది.











