Wednesday, 18 March 2026

Blog

అన్నమయ్య

అరవపల్లి లైబ్రరీలో రాజ్యాంగ దినోత్సవం — అంబేద్కర్‌కు పుష్పాంజలి

భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాది వేసిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ,రాజ్యాంగ దినోత్సవంను పురస్కరించుకొని అరవపల్లి గ్రామ లైబ్రరీలో మంగళవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి గ్రామ పెద్దలు,లైబ్రరీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు కలిసి పూలమాలలు వేసి వినయపూర్వకంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం,స్వేచ్ఛ, న్యాయంను హామీ ఇస్తుందన్నారు.సామాజిక వివక్షను నిర్మూలించి, పేదల ఎత్తుగడ కోసం అంబేద్కర్ జీవితాంతం పోరాటం చేశారని చెప్పారు.ఆధునిక భారత నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర అపూర్వమని,ఆయన చూపించిన మార్గం నేటికీ యువతకు ఆదర్శమని అభిప్రాయపడ్డారు.గ్రంథాలయ నిర్వాహకులు ఈ సందర్భంగా రాజ్యాంగంపై పుస్తక ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసి, గ్రామస్తులకు అందుబాటులో ఉంచారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా గ్రామంలో సామాజిక సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అంబేద్కర్ చూపించిన స్ఫూర్తి, రాజ్యాంగ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అరవపల్లి లైబ్రరీలో జరిగిన ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది.

తూర్పు గోదావరి

రాజమహేంద్రవరంలో గోదావరి జోన్ “మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గ” కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి.

రాజమహేంద్రవరంలో గోదావరి జోన్ “మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గ” కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా బిజెపి కార్యాలయంలో గోదావరి జోన్ “మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గ” కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గార్లతో కలసి పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

అన్నమయ్య

యల్లటూరు శివరామరాజు నేతృత్వంలో ‘రైతన్నా! మీ కోసం’ – పథకాలపై రైతులకు పూర్తి వివరాలు

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఊటుకూరు పంచాయతీలో బుధవారం “రైతన్నా! మీ కోసం” కార్యక్రమం ఘనంగా జరిగింది.అన్నదాత సంక్షేమాన్ని అగ్ర ప్రాధాన్యంగా తీసుకుని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామస్థాయిలో రైతులకు చేరవేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన పార్టీ నాయకులు,మాజీ జడ్పిటిసి యల్లటూరు శివరామరాజు,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబూ బకర్ పాల్గొన్నారు.రైతులకు పథకాలను అందించే విధానం,వాటి ప్రయోజనాలు వివరించే కరపత్రాలను ప్రజల్లో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా యల్లటూరు శివరామరాజు మాట్లాడుతూ ఇకపై రైతును అన్నదాత అన్న మాటకు తగిన గౌరవంతో నిలిపే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.రాబోయే ఐదు సంవత్సరాల్లో రైతును రాజు చేయడం మా కూటమి ప్రభుత్వ లక్ష్యం.నీటి భద్రతా కార్యక్రమాలు, డిమాండ్ ఆధారిత పంటల ప్రోత్సాహం,శాటిలైట్ టెక్నాలజీ ద్వారా పంటల పర్యవేక్షణ వంటి ఆధునిక వ్యవసాయ చర్యలను సమర్థంగా అమలు చేస్తోంది అని తెలిపారు.అలాగే అన్నదాత సుఖీభవ,పీఎం కిసాన్ వంటి పథకాలలో రైతులు ఎదుర్కొంటున్న భూముల నమోదు లోపాలు,ఆధార్ లింక్ సమస్యలు మరియు ఇతర సాంకేతిక ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.కార్యక్రమంలో మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ నాగలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది శిరీష, రాజేశ్వరి,పద్మ,ఇంజనీరింగ్ అసిస్టెంట్ అచ్యుత్ పాల్గొన్నారు. అలాగే స్థానిక నాయకులు పెడకాల సుధాకర్,లక్ష్మీపతి రాజు,పెడకాల వెంకటసుబ్బయ్య,మలిశెట్టి వెంకటరమణ,సంబారు రాజశేఖర్, చల్లా వెంకటేష్,సగినాల వేణుగోపాల్ రాజు, అయ్యప్ప హరిరాజు, లవిడి ఈశ్వర్ రాజు, సమ్మెట సుబ్బరాజు, సంబారు ఓబులేష్, శివుడు తదితరులు పాల్గొన్నారు.రైతు సమస్యలను గ్రామ స్థాయిలోనే గుర్తించి, పరిష్కారం దిశగా ముందడుగు వేసే కూటమి ప్రభుత్వ సంకల్పాన్ని ఈ కార్యక్రమం మరొకసారి ప్రజలకు చేరవేసింది.

అన్నమయ్య

అడపూరులో ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమాన్ని సందర్శించిన రాజంపేట సబ్‌ కలెక్టర్

అడపూరు గ్రామంలో జరుగుతున్న ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమాన్ని రాజంపేట సబ్‌ కలెక్టర్ హెచ్.ఎస్. భావన (ఐఏస్) నేడు ప్రత్యక్షంగా సందర్శించారు. కార్యక్రమం ఏర్పాటు,అమలు విధానం, రైతులకు అందిస్తున్న సేవలను ఆమె సమీక్షించారు.రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సబ్‌ కలెక్టర్ ఈ కార్యక్రమం యొక్క అసలు ఉద్దేశాలను రైతులకు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచించిన ఐదు ప్రధాన సూత్రాలు అయిన నీటి భద్రత,డిమాండ్ ఆధారిత పంటల సాగు,అగ్రిటెక్ వాడకం,ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్రభుత్వం అందిస్తున్న సహాయం వంటి అంశాలను సవివరంగా రైతులకు తెలియజేశారు. అలాగే రైతులు సాగుచేస్తున్న పంటలు,వాటికి లభించే మద్దతు ధరలు,పంటల ఆధారంగా ప్రభుత్వం అందించే వివిధ ప్రయోజనాలపై చర్చించారు.కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్‌,మండల వ్యవసాయ అధికారి మల్లికార్జున,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సుబ్బయ్య, సచివాలయ సిబ్బంది మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

“భారత రాజ్యాంగ దినోత్సవం” సందర్భంగా రాజ్యాంగ నిర్మాత, భారతరత్న Dr.B.R. అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన MLA నల్లమిల్లి.

తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. అనపర్తి మండలం రామవరంలో “భారత రాజ్యాంగ దినోత్సవం” సందర్భంగా రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల కూటమి నాయకులు, రామవరం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నమయ్య

హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

నాగిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ ప్రధాన శిల్పి బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంత్యుత్సాహాన్ని తలపించేలా ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, పాల్గొని ఆయన చిత్రపటానికి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన విస్డం స్కూల్ అధినేత వలిమి సుధాకర్ మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం కేవలం ఒక జ్ఞాపక దినం మాత్రమే కాకుండా,దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడటానికి ప్రతీ భారతీయుడిగా మనం పాటించాల్సిన సూత్రాలను గుర్తు చేసే సందర్భమని పేర్కొన్నారు.సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి అంబేద్కర్ ప్రవచించిన విలువలు భారత సమాజాన్ని మరింత బలపరుస్తాయని వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతీ వ్యక్తికి హక్కులు మాత్రమే కాకుండా బాధ్యతలను కూడా నిర్దేశించినదని, అవి పాటించినప్పుడే సమాజం శాంతియుతంగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు.సామాజిక చైతన్యం పెంపొందేందుకు అంబేద్కర్ సిద్ధాంతాలు నేటికీ మార్గదర్శకాలని ఆయన గుర్తుచేశారు.కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు రాచూరి మురళి, వీరబల్లి జయకుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు పఠాన్ మహర్ ఖాన్, పొంబల నరసింహా పాల్గొని ప్రజాస్వామ్య బలపాటుకు ప్రతి పౌరుడూ రాజ్యాంగ విలువలు అర్థం చేసుకొని వాటిని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న విస్డం స్కూల్ అధినేత వలిమి సుధాకర్ మాట్లాడుతూ, పిల్లలకు చిన్నప్పటినుంచే రాజ్యాంగ సూత్రాలను పరిచయం చేసేలా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.గ్రామంలోని వ్యాపార వర్గం తరఫున దార్ల సురేష్, తదితరులు పాల్గొని అంబేద్కర్ దర్శించిన సమానత్వ తత్వం ఆర్థిక రంగంలోనూ ప్రతి ఫలించాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రతి ఒక్కరు హక్కులు,బాధ్యతల పట్ల అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

ఆదిలాబాదు

రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్న డాక్టర్ కమలాకర్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించగా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కమలాకర్ ముఖ్యఅతిథిగా హాజరై రాజ్యాంగ పీఠిక, పౌరుని ప్రాథమిక విధులు కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందిందన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నడిపిస్తున్న ఘనత భారత రాజ్యాంగం దాని అన్నారు. అంబేద్కర్ సారధ్యంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు. దేశ ప్రజలందరూ భిన్నత్వంలో ఏకత్వంగా జీవించడానికి మూల కారణం రాజ్యాంగమే అని అన్నారు. రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటిదని అన్నారు. భారత రాజ్యాంగంపై , ప్రభుత్వ చట్టాలు, పథకాలపై మరియు సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్, సంతోష్, సుదర్శన్, మధు, రాజు, సాయి ప్రసాద్, శ్రీనివాస్, సురేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ …. తాడిగడప మున్సిపాలిటీ పోరంకి శ్రీనివాస్ నగర్ కాలనీలో శాసనసభ్యులు గౌరవనీయులు బోడె ప్రసాద్ గారు మొక్కలు నాటడం.

విజయవాడ….తాడిగడప మున్సిపాలిటీ పోరంకి గ్రామం నందు గల శ్రీనివాస్ నగర్ కాలనీలో కొత్తగా వేయబడిన CCరోడ్డును ప్రస్తుత శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బోడే ప్రసాద్ గారు ఆదివారం 23.11.2025 తేదీన సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో అనుమోలు ప్రభాకర్ గారు మరియు మూడవ డివిజన్ అధ్యక్షులు చనుమోలు శ్రీనివాస్ గారు ,వెలగపూడి శంకర్రావు గారు, తాడిగడప మున్సిపాలిటీ కమిషనర్ నజీర్ గారు తదితరులు పాల్గొన్నారు, అనంతరం శ్రీనివాస్ నగర్ లోని “శ్రీమతే రామానుజాయ నమః ” భవనము మరియు శాంతి నిలయం భవనముల సమీపంలో అనేక రకాల పూల ,పండ్ల మొక్కలను గౌరవనీయులు శ్రీ బోడే ప్రసాద్ గారు నాటడం జరిగినది . కాలనీవాసులు శ్రీమాన్ గుదిమెళ్ళ లక్ష్మీనరసింహగారు ఈ మొక్కలకి గాను రాజమండ్రి నుంచి రకరకాల ఎరువులతో కూడిన మట్టిని తెప్పించి ఉపయోగించారు.ఈ కార్యక్రమంలో అనేకమంది కాలనీవాసులు ,మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.

విశాఖపట్నం

నగరంలో గల ఆస్తి , ఖాళీ స్థలాల పన్నులు, నీటి చార్జీలు సకాలంలో చెల్లించండి .

నగరంలో గల ఆస్తి , ఖాళీ స్థలాల పన్నులు, నీటి చార్జీలు సకాలంలో చెల్లించండి . – నగరంలో భవన యజమానులకు విజ్ఞప్తి చేసిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * జీవీఎంసీ పరిధిలోని ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను, నీటి చార్జీలను సకాలంలో చెల్లించి విశాఖ నగర అభివృద్ధికి భవన యజమానులు సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని భవన యజమానులు, ఆస్తి ఖాళీ స్థలాల పన్నులను 2025-26 ఆర్ధిక సంవత్సరం ముగుయుచున్నందున మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ నకు చెల్లించవలసిన ఆస్తి పన్ను బకాయిలు, ఖాళీస్థలము పన్ను బకాయిలు, మంచి నీటి కుళాయి చార్జీల బకాయిలును వెంటనే చెల్లించాలని కమిషనర్ తెలిపారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని యెడల బకాయిదారులు ఆస్తుల జప్తులకు గురి కాగలరని కమిషనర్ తెలిపారు. కావున భవన యజమానులందరూ తక్షణమే మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కు చెల్లించవలసిన ఇంటి పన్ను, ఖాళీస్థలము పన్ను, మంచి నీటి కుళాయి చార్జీలును సకాలములో చెల్లించి, వడ్డీలకు గురికాకుండా పన్నుల బకాయిలను వెంటనే చెల్లించాలని భవన యజమానుదారులకు కమిషనర్ తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ పోరంకి లోని శ్రీనివాస్ నగర్ కాలనీలో CC Road ప్రారంభం

విజయవాడ….తాడిగడప మున్సిపాలిటీ పోరంకి గ్రామం నందు గల శ్రీనివాస్ నగర్ కాలనీలో కొత్తగా వేయబడిన CCరోడ్డును ప్రస్తుత శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బోడే ప్రసాద్ గారు ఆదివారం 23.11.2025 తేదీన సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో అనుమోలు ప్రభాకర్ గారు మరియు మూడవ డివిజన్ అధ్యక్షులు చనుమోలు శ్రీనివాస్ గారు ,వెలగపూడి శంకర్రావు గారు, తాడిగడప మున్సిపాలిటీ కమిషనర్ నజీర్ గారు తదితరులు పాల్గొన్నారు, అనంతరం శ్రీనివాస్ నగర్ లోని “శ్రీమతే రామానుజాయ నమః ” భవనము మరియు శాంతి నిలయం భవనముల సమీపంలో అనేక రకాల పూల ,పండ్ల మొక్కలను గౌరవనీయులు శ్రీ బోడే ప్రసాద్ గారు నాటడం జరిగినది . కాలనీవాసులు శ్రీమాన్ గుదిమెళ్ళ లక్ష్మీనరసింహగారు ఈ మొక్కలకి గాను రాజమండ్రి నుంచి రకరకాల ఎరువులతో కూడిన మట్టిని తెప్పించి ఉపయోగించారు.ఈ కార్యక్రమంలో అనేకమంది కాలనీవాసులు ,మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.