Wednesday, 18 March 2026

Blog

అన్నమయ్య

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెజిట్‌ విడుదల – కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల రూపకల్పనలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్‌ ఫార్మేషన్‌ ఆక్ట్‌, 1974 ప్రకారం విడుదల చేసిన ఫార్మ్–1 నోటిఫికేషన్ ద్వారా పలు మండలాల భౌగోళిక పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలు గెజిట్‌లో పేర్కొంది.ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి వేగవంతం చేసే లక్ష్యంతో కొత్త జిల్లా/రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు మరియు కొన్ని మండలాల బదిలీలు ప్రతిపాదించబడుతున్నాయి. అన్నమయ్య జిల్లాలోకి చేరనున్న మండలాలు గెజిట్‌ ప్రకారం వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి క్రింది మండలాలు అన్నమయ్య జిల్లాలోకి చేర్చేందుకు ప్రతిపాదించారు:అందులో 1 ఒంటిమిట్ట మరియు2. సిద్ధవటం ఉన్నాయి. మదనపల్లె కొత్త జిల్లా ప్రతిపాదన ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్–II ప్రకారం మదనపల్లెను కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా ప్రస్తావించింది. ఈ కొత్త జిల్లాలో కలుపబోయే మండలాలు:మదనపల్లె,రామసముద్రం,తంబల్లపల్లె,ములకలచేరువు, పెద్దమండ్యం,కురబలకోట,పెద్ది తిప్ప సముద్రం, బిరంగీ కోతకోట,చౌడేపల్లె, పుంగనూరు,సోదుం,సోమల, పీలేరు(కొత్త డివిజన్‌ హెడ్‌క్వార్టర్‌) ప్రతిపాదన)గుర్రంకొండ, కలకాడ,కలికిరి, కంభంవారి పల్లె,కల్లూరు,వాల్మీకి పురం,ఈ మండలాలులో కొన్నింటిని చిత్తూరు,పలమనేరు, రాయచోటి,అన్నమయ్య జిల్లాలకు పునర్విభజించే అంశాలు కూడా నోటిఫికేషన్‌లో ఉన్నాయి. అభ్యంతరాల ఆహ్వానం ఈ ప్రతిపాదనలపై జిల్లాలో నివసించే ప్రతి వ్యక్తి నుంచి అభ్యంతరాలు, సూచనలు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.అభ్యంతరాలు 30 రోజుల్లోగా ఆయా కలెక్టర్లను లిఖితపూర్వకంగా సంప్రదించాలని గెజిట్‌లో పేర్కొంది.ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ పునర్వ్యవస్థీకరణలు అమల్లోకి వస్తే,జిల్లాల పరిపాలన మరింత సమర్థవంతం అవుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కామారెడ్డి

ఆశీర్వదించండి….. అభివృద్ధి చేసి చూపెడుతా

కామారెడ్డి, 27నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి గ్రామంలో రాజకీయ రంగంలో నూతన సంచలనం ఎంపికైంది. యువ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షల పల్లకీలో తొలిసారి సర్పంచ్ బరిలో నిల పడుతున్న బండి ప్రవీణ్, తన వర్గం ప్రజలతో బారి ఎత్తున ఘనంగా నామినేషన్ వేసి, గ్రామ ప్రజలను ముందుంచి ఆయన సంకల్పం స్పర్శిస్తూ అందరి హృదయాలను వ్యాపింపజేశారు. ప్రతి గ్రామ అభి వృద్ధికి నేనే అందిస్తున్న వాగ్దానం..ప్రజల సమస్య ల పరిష్కారమే నా తొలి ధ్యేయం అని బండి ప్రవీణ్ గర్వంగా ప్రకటించారు. సర్పంచ్ గా ఎన్నికై తే గ్రామంలో ప్రగతికి నూతన రీతిని తీసుకురా నున్నట్టు,మాత్రమేగాక పోలిక నాయకత్వం చూపిం చి మంచి పరుపు పెట్టే బట్టి పంట లాతన సామ ర్థ్యాన్ని చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రక టించారు.ఈ తొలి అడుగులోనే ప్రజల విశ్వాసం గెలుచుకున్న ఆయన నా మాటలు వాగ్దానం మాత్ర మే కాదు, నమ్మకపు మూలస్తంభమే అనిచెబుతుం డడం, గ్రామ విధులను శీఘ్రమే మోడర్న్ మర్కెట్ సొల్యూషన్స్ తో మార్చేందుకు కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. ప్రతి వర్గానికీ స్వేచ్ఛ, సమ్మత, బలమైన ప్రతినిధిగా నిలబడే ధైర్యం ఆయన చూ పించి, రామారెడ్డిని జిల్లాలో అభివృద్ధి తుపాకీగా మారబోతున్న యువ నాయకుడిగా భావిస్తున్నా రు.ఈ నూతన రాజకీయ విజయం బండి ప్రవీణ్ కి మాత్రమే కాకుండా గ్రామ ప్రజలకు కొత్త ఆశావహా ల వెలుగులు నింపుతూ, రాజకీయాల్లో రాజకీయ కవచాల కదళికను తీసుకువస్తున్నట్లుగా ఈ ఉద్య మం గ్రామస్థాయిలో క్రాంతికారి మార్పును సూచి స్తోంది. రామారెడ్డి యువ నాయకుడు బండి ప్రవీణ్ అద్భుతంగా ఊరేగిన ఈ ప్రయత్నం అందరి అభి మానాన్ని అభిమానించుకుం టోంది.భవిష్యత్తులో సాధించబోయే విజయం ఈ సర్పంచ్ పోటీకి మాత్రమే పరిమితమవ్వదు, అది గ్రామాల అభివృ ద్ధికి మిగిలిన ప్రతి హృదయానికీ ప్రేరణగా నిలవ నుందని స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీ బండి ప్రవీణ్ నేతృత్వంలో రామారెడ్డి గ్రామాల్లో నూతన చైత న్యం పుట్టి, రైతు, యువకులు, మహిళల పక్షంలో అందరికీ ఆదర్శంగా నిలవబోతుంది. అనంతరం ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాన్ని అందజేశారు

E-పేపర్

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి: డిజిపి శ్రీ బి. శివధర్ రెడ్డి

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 తేది 27-11-2025 పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి: డిజిపి శ్రీ బి. శివధర్ రెడ్డి హైదరాబాద్: నవంబర్ 27 : రాష్ట్రంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల పోలీస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. శివధర్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై గురువారం నాడు డిజిపి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హైదరాబాద్ కమిషనరేట్ మినహా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు మొదలుకొని స్టేషన్ హౌస్ ఆఫీసర్ల స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిపి శ్రీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ… పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికలను నిస్పాక్షికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని,ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో శాంతి భద్రతల అదనపు డిజిపి శ్రీ మహేష్ ఎం భగవత్, మల్టీ జోన్ 2 అడిషనల్ డిజిపి శ్రీ డి.ఎస్. చౌహాన్, మల్టి జోన్ 1 ఐ.జి.పి. శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఏఐజీ శ్రీ రమణ కుమార్, లీగల్ అడ్వైజర్ శ్రీ ఇ. రాములు తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

దుర్గమ్మ సేవలో జనసేన నేతలు అలయానికి ₹1.16 లక్షల విరాళం

నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం బోర్డు సభ్యురాలు తంబళ్ళపల్లి రమాదేవి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఐటీ చైర్మన్ మిర్యాల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాటు కుమార్తె సంహిత, అల్లుడు సాత్విక్‌తో కలిసి మంగళవారం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించారు. అమ్మవారి దర్శనా నంతరం వేదపండితులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వ చనాలు అందించారు. అనంతరం ఆలయ అభివృద్ధి నిమిత్తం ₹1,16,000 విరాళాన్ని సాత్విక్–సంహితలు రమాదేవి సమక్షంలో దేవస్థాన అధికారు లకు అందజేశారు.

కాకినాడ

నన్నయలో ఆల్ ఇండియా బెస్ట్ ఫిజిక్ మెన్ ఛాంపియన్షిప్

డిసెంబర్ 27 నుండి 30 వరకు పోటీలు బ్రోచర్ ఆవిష్కరించిన వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ కాకినాడ జిల్లా, కాకినాడ సిటీ, పున్నమి ప్రతినిది:ఆదికవి నన్నయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ మెన్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ తెలియజేశారు.గురువారం యూనివర్సిటీలో దీనికి సంబంధించిన బ్రోచర్ ను వీసీ ఆవిష్కరించి వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సహకారంతో నిర్వహించే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ మెన్ పోటీలుకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వేదిక అవుతుందన్నారు.డిసెంబర్ 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఈ పోటీలను నిర్వహించేందుకు కార్యాచరణ ప్రారంభించామన్నారు. దేశం నలుమూలల నుండి బెస్ట్ ఫిజిక్ పోటీలకు క్రీడాకారులు హాజరవుతారని, పోటీలలో పాల్గొనే క్రీడాకారులు డిసెంబర్ 15వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ప్రతిభవంతులైన క్రీడాకారులకు నన్నయ విశ్వవిద్యాలయం చక్కని వేదిక అవుతుందని,విశ్వవిద్యాలయం ప్రతిష్టను పెంచే ఈ జాతీయ స్థాయి పోటీలను సమష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ ను సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్, సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డ్ ఆచార్య కె.వి.స్వామి, అసోసియేట్ సెక్రటరీ డా.ఎం.వి.ఎస్.ఎస్.మూర్తి, ప్రిన్సిపాల్స్,విశ్వవిద్యాలయ అధికారులు,ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు పాల్గొన్నారు.

తిరుపతి

నేడు శ్రీకాళహస్తిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రజాదర్బార్ కార్యక్రమం

శ్రీకాళహస్తి నవంబర్ 27, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు స్థానిక పంచాయితీరాజ్ అతిధి గృహంలో ప్రత్యేకంగా ప్రజాదర్బార్ ఏర్పాటు ప్రజా సమస్యలను పరిష్కారానికై ఉదయం 9:30 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటన ద్వార తెలిపారు. నియోజిక వర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే ప్రత్యక్షంగా తెలుసుకుని, వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలు చూపడం లక్ష్యంగా ఈ దర్బార్‌ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి వెల్లడించారు. ప్రజల వద్దకు అధికారులు, ప్రజాప్రతినిధులు చేరే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తోందని శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చేపడుతున్న ఈ కార్యక్రమం స్థానికంగా ఎంతో ఉపయోగకరంగ ఉంటుందని బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పరిశీలించిన ఎంపీ గురుమూర్తి

శ్రీకాళహస్తి నవంబర్ 27, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్‌లో రూ.50 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గురువారం పరిశీలించారు. స్టేషన్‌లో మొదటి దశలో జరుగుతున్న పనుల పురోగతిని ఆయన తనిఖీ చేశారు. పాత ఎల్‌సీ గేట్ నెం. 28 వద్ద అండర్‌పాస్ మూసివేయడంతో అక్కడ అండర్‌ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, వారి అభ్యర్థనను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. స్టేషన్‌లో తాగునీటి వసతి, సైన్‌బోర్డులు, ఇతర మౌలిక వసతులపై ఎంపీ ప్రత్యేకంగా ఆరాతీశారు. తాగునీరు సక్రమంగా అందుబాటులో ఉండేలా చూడాలని, స్టేషన్‌లో సైన్‌బోర్డులు సరిగా లేవని గమనించి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాళహస్తి ఆలయ ఈఓతో మాట్లాడిన ఎంపీ, రైల్వే స్టేషన్‌లో ఉన్న సమాచార కేంద్రంలో భక్తులకు 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆలయ సేవలకు సంబంధించిన వివరాలను రైల్వే స్టేషన్ ఆవరణలో ఒక డిజిటల్ బోర్డు ద్వారా ప్రదర్శించేలా వెంటనే ఏర్పాట్లు చేయాలని సూచించారు. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ ద్వారా గతంలో నడుస్తున్న గుంటూరు–తిరుపతి ప్యాసింజర్, గూడూరు–తిరుపతి ప్యాసింజర్, చెన్నై–రేణిగుంట–నెల్లూరు మెమూ ప్యాసింజర్ వంటి రైళ్లు కోవిడ్ అనంతరం నిలిపివేశారని స్థానిక నాయకులు, ప్రయాణికులు ఎంపీకి విన్నవించారు. ప్రస్తుతం రేణిగుంట–గూడూరు, గూడూరు–రేణిగుంట ప్యాసింజర్ రైళ్లు మాత్రమే నడుస్తున్నందున నిలిపివేసిన ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ మొదటి దశ అభివృద్ధి పనులు మే 26 నాటికి పూర్తికానున్నాయని స్టేషన్ మాస్టర్ ఈ సందర్బంగా ఎంపీకి తెలిపారు. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తామని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

ఎంపీ సీఎం రమేష్ మాతృమూర్తి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి నవంబర్ 27, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు అనకాపల్లి ఎంపీ శ్రీ సీఎం రమేష్ మాతృమూర్తి చింతకుంట రత్నమ్మ పరమపదించిన వార్త తెలుసుకొని, కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తిగ్రామం లోని వారి నివాసానికి చేరుకుని భౌతిక కాయానికి నివాళులర్పించి ఎంపీ సీఎం రమేష్ మాతృమూర్తి అంత్యక్రియల్లో పాల్గొని మాతృమూర్తి రత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్ధించారు.

తిరుపతి

వైకాపా నాయకుని మృతికి సంతాపం తెలిపిన బియ్యపు ఆకర్ష్ రెడ్డి

శ్రీకాళహస్తి నవంబర్ 27, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి మండలంలోని కమ్మకొత్తూరు గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు గుడ్లూరు నరేంద్ర నాయుడు ఆకస్మిక మృతి చెందారు. గురువారం నాడు ఆయన పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తనయుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి పూలమాల వేసిన నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతల తోడుగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వయ్యాల కృష్ణారెడ్డి, పుల్లయ్య, ప్రకాష్ చౌదరి, చోడవరం శివ, రామారావు,సుబ్బారావు,రామ్మూర్తి, ముద్దుమూడి రవి, రాజీవ్ గాంధీ, బాబి, సుధాకర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శాస్రోక్తంగా ఆగ్నేయ గణపతి ఆలయ కుంభాభిషేకం

శ్రీకాళహస్తి నవంబర్ 27, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చతుర్మాడ వీధుల నందలి ఆగ్నేయ మూలలో ఉన్న ఆగ్నేయ గణపతి స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట, దేవాలయ మహాకుంభాభిషేకము సందర్భంగా గురువారం నాడు స్థానిక బేరివారి మండపం నందు జరిగిన వినాయక స్వామి కుంభాభిషేకంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు కొట్టేసాయి సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహకాధికారి బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు వాకచర్ల గుర్రప్పశెట్టి, ఆలయ సిబ్బంది మరియు ఇతర స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.