Wednesday, 18 March 2026

Blog

కడప

అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న రాజు వెడ్స్ రాంబాయ్ చిత్ర యూనిట్

కడపలోని అమీన్ పీర్ దర్గాను ‘రాజు వెడ్స్ రాంబాయ్’ చిత్ర యూనిట్ సభ్యులు శుక్రవారం దర్శించుకున్నారు. హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ తేజేశ్వి, డైరెక్టర్ సాయిల్ కాంపాటి, రైటర్ మెట్టపల్లి సురేంద్ర, ఈటివి నీతిన్, ఆర్టిస్ట్ విక్రమ్ ఆదిత్య, చైతన్య జొన్నలగడ్డ, ప్రొడ్యూసర్ రాహుల్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారు దర్గా విశిష్టతను కూడా అడిగి తెలుసుకున్నారు.

క్రైమ్

28 ఏళ్ల తర్వాత ప్రతీకారం: ఇంటర్వ్యూకే ప్రాణం పోయిన మాజీ మావోయిస్టు

సిరిసిల్ల జిల్లా లో 58 ఏళ్ల మాజీ మావోయిస్టు సిద్ధయ్య హత్య చర్చనీయాంశమైంది. యూట్యూబ్ ఇంటర్వ్యూలో తాను 1997లో ఇన్ఫార్మర్‌గా పనిచేశాడన్న కారణంతో జగ్గయ్యపేటకు చెందిన అంజయ్యను చంపినట్లు వెల్లడించాడు. ఈ వీడియో చూసిన అంజయ్య కుమారుడు సంతోష్, మళ్లీ ఇంటర్వ్యూ పేరుతో సిద్ధయ్యను సంప్రదించి అగ్రహారం గుట్టలకు తీసుకెళ్లాడు. అక్కడ బండరాయితో తలపై దాడి చేసి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక సమాచారంతో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

తమిళనాడులో దిత్వా ప్రభావం: భారీ వర్షాలు, పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

దిత్వా తుఫాన్ తమిళనాడు–పుదుచ్చేరి తీరం వైపు చేరుతున్న నేపథ్యంలో ఇప్పటికే TNలో భారీ వర్షాలు ఒకటికి తర్వాత ఒకటి కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. నేడు, రేపు దక్షిణ మరియు కావేరీ డెల్టా జిల్లాల్లో భారీవర్షాలకు IMD రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో తంజావూరు, అరియలూర్, పెరంబలూర్, పుదుకొట్టై, నాగపట్నం తదితర జిల్లాల్లో స్కూళ్లు–కాలేజీలకు అధికారాలు సెలవులు ప్రకటించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోవూరులో కాల్పుల కలకలం: నిందితులకు గాయాలు, GGHలో చికిత్స

నెల్లూరులో హత్య కేసు నిందితులపై శనివారం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలో జేమ్స్ అనే నిందితుడు కాలికి గాయపడగా, దాడిలో ఒక కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరూ నెల్లూరు GGHలో చికిత్స పొందుతున్నారు. షుగర్ ఫ్యాక్టరీ వద్ద నిందితులు దాగి ఉన్నారనే సమాచారంతో గాలింపు చేపట్టిన సమయంలోనే ఈ సంఘటన జరిగిందని రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాస్ రావు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

BOBలో 2,700 అప్రెంటిస్ పోస్టులు – అప్లైకి ఎల్లుండే డెడ్‌లైన్

బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో మొత్తం 2,700 అప్రెంటిస్ పోస్టులు భర్తీకి దరఖాస్తుల చివరి తేదీ ఎల్లుండి. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. వీటిలో తెలంగాణకు 154, ఆంధ్రప్రదేశ్‌కు 38 పోస్టులు కేటాయించారు. NATS/NAPS పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలి. ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. తాజా జాబ్ నోటిఫికేషన్లు జాబ్స్ కేటగిరీలో చూడవచ్చు.

ఆంధ్రప్రదేశ్

రేపు–ఎల్లుండి అతిభారీ వర్షాల హెచ్చరిక: తెలంగాణ–ఏపీ అలర్ట్

తెలంగాణలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు, ఎల్లుండి మహబూబ్నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నారు. ఇదే సమయంలో ఏపీలో కూడా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీగా, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని APSDMA హెచ్చరించింది.

జాతీయ అంతర్జాతీయ

హైదరాబాద్‌లో మెస్సీ మేజిక్: మ్యాచ్ టికెట్లు రూ.30,000 వరకు హాట్ సేల్!

ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మ్యాచ్ కోసం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం డిసెంబర్ 13న సిద్ధమవుతోంది. టికెట్ విక్రయం ప్రారంభమయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ధరలు రూ.1,750 నుంచి ప్రారంభమై రూ.30,000 వరకు ఉన్నాయి. హై–ఎండ్ టికెట్లకు హాస్పిటాలిటీ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటుంది. టికెట్లు జొమాటో యాప్‌లో కొనుగోలు చేయవచ్చు. మెస్సీ మ్యాచ్ కావడంతో సెలబ్రిటీలు భారీగా హాజరవుతారని అంచనా.

ఆంధ్రప్రదేశ్

కాలువల పూడికలు తీయించిన కౌన్సిలర్

కడప జిల్లా పొద్దుటూరు మండలం శ్రీనివాస్ నగర్ వార్డ్ కౌన్సిలర్ షేక్ జిలాని భాష శ్రీనివాస్ నగర్ లోని అన్ని కాలువల్లొ పూడికలు తీయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలువల్లో నీరు సరిగ్గా పోకుంటే దోమల బెడద ఎక్కువ అవుతుందని దుర్వాసన వ్యాపిస్తుందని అందువల్ల ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని అందుకే ఈ పూడికలు తీయించామని తెలియజేశారు వార్డులోని ప్రజలకు ఏ సమస్యలు ఉన్న తనను వెంటనే సంప్రదించాలని ఆయన తెలియజేశారు

సినిమా

కార్తి ‘అన్నగారు వస్తారు’ టీజర్ విడుదల – వెంకటేష్ ‘పెళ్లి చేసుకుందాం’ రీ-రిలీజ్ గ్రాండ్ ప్లాన్

( పున్నమి ప్రతినిధి ) హీరో కార్తి ప్రధాన పాత్రలో వస్తున్న ‘అన్నగారు వస్తారు’ సినిమా టీజర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. ఈ చిత్రం డిసెంబర్లో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు విక్టరీ వెంకటేష్ జన్మదిన సందర్భంగా డిసెంబర్ 13న ‘పెళ్లి చేసుకుందాం’ సినిమాను 4K క్వాలిటీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా రీ–రిలీజ్ చేయడానికి సిద్ధాలు జరుగుతున్నాయి.

జాతీయ అంతర్జాతీయ

18 ఏళ్ల మాత్రే సెన్సేషన్ — రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్!

18 ఏళ్ల మాత్రే సెన్సేషన్ — రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్! ( పున్నమి ప్రతినిధి ) ముంబై యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే (18 సంవత్సరాలు 135 రోజులు) వరల్డ్ డొమెస్టిక్ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో (ఫస్ట్ క్లాస్, లిస్ట్-A, T20) సెంచరీ చేసిన అతి పిన్న క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. SMATలో విదర్భపై 53 బంతుల్లో 110 పరుగులు చేసి ఈ రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ ఘనత రోహిత్ శర్మ (19y 339d) పేరిట ఉండేది. తర్వాతి స్థానాల్లో ఉన్ముక్త్ చంద్, డికాక్, అహ్మద్ షెహజాద్ ఉన్నారు. ముంబై యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే (18 సంవత్సరాలు 135 రోజులు) వరల్డ్ డొమెస్టిక్ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో (ఫస్ట్ క్లాస్, లిస్ట్-A, T20) సెంచరీ చేసిన అతి పిన్న క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. SMATలో విదర్భపై 53 బంతుల్లో 110 పరుగులు చేసి ఈ రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ ఘనత రోహిత్ శర్మ (19y 339d) పేరిట ఉండేది. తర్వాతి స్థానాల్లో ఉన్ముక్త్ చంద్, డికాక్, అహ్మద్ షెహజాద్ ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.