Tuesday, 17 March 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

కృష్ణా జిల్లా గన్నవరం మండలం మానికొండ గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ రఫీ గారిని బిజెపి పార్టీ మైనారిటీ మొర్చా కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులుగా నియమకం

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మానికొండ గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ రఫీ గారిని బిజెపి పార్టీ మైనారిటీ మొర్చా కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులుగా నియమించటము జరిగింది అని కృష్ణా జిల్లా బిజెపి మైనారిటీమోర్చ జిల్లా అధ్యక్షులు షేఖ్ చిన్నా గారు పాత్రికేయులకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, చిన్నా గారు మాట్లాడుతూ బిజెపి పార్టీ లోకి మైనార్టీలను సాధారoగా ఆహ్వానిస్తూ వారికి స్నేహ హస్తం అందించి పార్టీలోని సముచిత స్థానం కల్పించితీరుతాముఅని బిజెపి ఆగ్ర నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు ఇవ్వడం జరిగింది అని ఈ మాటకు ఆకర్షితులమై మైనారిటీలు బిజెపి పార్టీలో సంతోషముతో జాయిన్ అవుతున్నారు అని మైనార్టీలకు పార్టీ పదవుల లోను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల లోను సముచిత స్థానం లభిస్తుందని బిజెపి పార్టీపై పూర్తి విశ్వాసం ఉన్నదిఅని చిన్నా గారు తెలిపారు, ఇంకా ఈ కార్యక్రమంలో బిజెపి మైనార్టీ మోర్చా జిల్లా కార్యదర్శి షేక్ కరీముల్లా, మరియు పార్టీ సభ్యులు పాల్గొన్నారు, షేఖ్ ముహమ్మద్ రఫీ గారు మాట్లాడుతూ బిజెపి పార్టీ లోకి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అలాగే పార్టీ నియమ నిబంధనలు పాటించుతూ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని అన్నారు. E N D

వనపర్తి

కమిటీ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించినందుకు జిల్లా విద్యాధికారిచే సన్మానం

*జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ఎం జె పి చిట్యాల ప్రదర్శనలో ప్రెస్ మరియు ఫోటో యాంకరింగ్ కమిటీలో ఉత్సాహవంతంగా ఎంఎన్ విజయకుమార్ రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగారు నిర్వహించినందుకు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని మరియు డిఎస్ఓ శ్రీనివాసులు తదితరులు వారితో సన్మాన దృశ్యం నిజమైన రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు వనపర్తి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య గారు తదితరులు*

ఆంధ్రప్రదేశ్

బంటుమిల్లి లో సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమం లో పాల్గొన్న AICC సెక్రటరీ సంజయ్ దత్ గారు

రాహుల్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏఐసీసీ సెక్రటరీ, మహారాష్ట్ర కో ఇంచార్జ్ &SSA అబ్జర్వర్ శ్రీ సంజయ్ దత్ గారు బంటుమిల్లి విచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ పెడన ఇంచార్జ్ సొంటి నాగరాజు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంజయ్ దత్ గారు మాట్లాడుతూ అటు కేంద్ర ప్రభుత్వం విధానాలను ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. అలాగే ఇక్కడ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కనీసం అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై గళ మెత్తే పరిస్థితి కూడా లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ గద్దె దిగేటప్పటికీ పెట్రోలు, డీజిల్, గ్యాస్,కూరగాయలు, బియ్యము తదితర నిత్యవసర వస్తువుల రేట్లు తక్కువగా ఉండేవని ఇప్పుడు వాటి ధరలు అమాంతం పెరిగిపోయి సామాన్యుడు కొనలేని మరియు బ్రతకలేని పరిస్థితికి ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ లాంటి వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత నిస్తుందని రాబోయే ఎన్నికలలో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని వర్గాల ప్రజల నుండి కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు అవసరమైన సలహాలు సూచనలు, అభిప్రాయాలను అయన సేకరించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

విరాట్ కోహ్లీ 52వ వన్డే సెంచరీతో మరోసారి తన ఆధిపత్యం చాటాడు

క్రికెట్‌లో సాంకేతికత, క్రమశిక్షణ, క్లాస్‌కు ప్రతీకగా నిలిచే విరాట్ కోహ్లీ మరోసారి తన దూకుడు చూపించాడు. వన్డేల్లో తన 52వ సెంచరీని సైతం అద్భుతంగా నమోదు చేసి ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకున్నాడు. ప్రతి ఇన్నింగ్స్‌తో కొత్త మైలురాళ్లు నమోదు చేస్తూ, భారత జట్టుకు కీలక మద్దతుదారు‌గా నిలుస్తున్న కోహ్లీ, ఈ శతకంతో రికార్డుల పుస్తకాన్ని తిరగరాశాడని చెప్పాలి. ఒత్తిడి సమయంలో కూడా స్థిరంగా నిలిచి జట్టును ముందుకు నడిపే అతని సామర్థ్యం మరోసారి స్పష్టమైంది. ఆటపై అతని అంకితభావం, శ్రమ, ఫిట్‌నెస్ కారణంగానే ఈ స్థాయిలో కొనసాగుతున్నాడు. భారత క్రికెట్ అభిమానులకు కోహ్లీ సెంచరీలు ఎప్పుడూ ప్రత్యేకమే.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వన్డేల్లో అత్యధిక సిక్స్ల వీరుడిగా రోహిత్ శర్మ

రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక సిక్స్ల వీరుడిగా నిలిచాడు. రాంచిలో దక్షిణాఫ్రికా, టీమిండియా మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ లో ప్రేనెలన్ సుబ్రాయెన్ బౌలింగ్లో రోహిత్ రెండు వరుస సిక్స్లు బాదాడు. ఈ మ్యాచ్ ముందు వరకు రోహిత్ శర్మ ఖాతాలో వన్డేల్లో 349 సిక్స్లున్నాయి. ప్రేనెలన్ సుబ్రాయెన్ బౌలింగ్లో వచ్చిన రెండు వరుస సిక్స్లతో రోహిత్ శర్మ.. పాకిస్థాన్ బ్యాటర్ షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న అత్యధిక సిక్స్ల (351) రికార్డ్ను సమం చేశాడు. అనంతరం మార్కో యాన్సన్ బౌలింగ్లో బౌలింగ్లో అతడు అద్భుతమైన సిక్స్ బాదాడు. దీంతో హిట్మ్యాన్ వన్డేల్లో అత్యధిక సిక్స్ (352) వీరుడిగా నిలిచాడు.

విశాఖపట్నం

సమైక్యతా భావాలకు* *ప్రతి బింభాలు క్రీడలు!* *గ్రీన్‌ డేల్ స్కూల్ వార్షిక క్రీడా దినోత్సవ వేడుకలలో* *భీమిలి ఎమ్మల్యే గంటా శ్రీనివాసరావు*

విద్యార్థులలో తమ క్రమశిక్షణని మెరుగు పరచుకోడానికి, మానసిక, శారీరక దృఢత్వానికి, “సమైక్యతా భావాలకు ప్రతిబింభాలుగా క్రీడలు” గోచరిస్తాయని భీమిలి ఎమ్మల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ‘ గ్రీన్‌ డేల్ స్కూల్ వార్షిక క్రీడా దినోత్సవం 2025 – 26″ లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. పోతినమల్లయ్యపాలెం స్కూల్ మైదానంలో “ఆల్ రౌండ్ ది వరల్డ్ ఇన్ 90 మినిట్స్” అనే ప్రత్యేక థీమ్‌తో, ప్రపంచ సాంస్కృతిక వైవిధ్యం, ఐక్యత, అవగాహన, సమన్వయంతో కూడిన పలు కళాప్రదర్శనలు ప్రతిబింబించాయి.ఈ వేడుకలలో విశిష్ట అతిధులుగా పాల్గొన్న గ్రీన్ డేల్ స్కూల్ చైర్మన్ డా.ఎస్.పీ.రవీంద్ర, కరస్పాండెంట్ డా.సుంకరి విజయరవీంద్రమాట్లాడుతూ తమ స్కూల్లో చదివే విద్యార్థులకు సమగ్రమైన ఆధునిక విద్యతో పాటుగా, ఉన్నత విలువలకు దోహదపడే అనేక క్రీడలు,యోగ, హార్స్ రైడింగ్ తదితర అంశాలలో శిక్షణను అందిస్తున్నా మన్నారు. గౌరవఅతిధిగా పాల్గొన్న సిఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్, ఫ్లూయెంట్స్ గ్రిడ్ లిమిటెడ్ ఫౌండర్ & సీఈఓ మురళీకృష్ణ గన్నమని మాట్లాడుతూ చిన్నతనం నుండే చిన్నారులకు విద్యతో పాటుగా సంపూర్ణ వ్యక్తిత్వ వికాశానికి కృషి చేస్తున్న గ్రీన్ డేల్ స్కూల్ యాజమాన్యం చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ వేడులలో భాగంగాలో ‘ థీమ్ ఆధారిత గ్రాండ్ డ్రిల్ ప్రదర్శనలు,వివిధ దేశాల సంస్కృతులను ప్రతిబింభిస్తూ రంగురంగుల వేషధారణలతోనూ, పరుగుపందాలతో, నోవల్టీ గేమ్స్ తదితర పోటీలలో, తమ ప్రదర్శనలతో అలరిస్తూ, కరతాల ధ్వనుల మధ్యన అహూతుల అభినందనలను అందుకున్నారు. ఉత్సవ ప్రధాన నిర్వాహకురాలు, ప్రిన్సిపల్ ఎస్‌ పీ ఎం. దివ్యదాస , డైరెక్టర్ తేజముత్యం మాట్లాడుతూ ” క్రీడా దినోత్సవం 2025–26″ లో 1300 విద్యార్థులు , 4000 మందికి పైగా తల్లి తండ్రులు, బంధువులు పాల్గొనడం ఆనందనీయమని , వేడుకలను విజవంతం చేసిన ముఖ్య అతిధులకు, గ్రీన్ డేల్ స్కూల్ యాజమాన్యం, సిబ్బందికి, తల్లి దండ్రులకు తమ కృతజ్ఞతలను తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

ప్రజల మనోభేష్టాలకు వ్యతిరేకంగా విభజన చేస్తున్నారు* — రంగారెడ్డి ఆగ్రహం.

* గూడూరు జిల్లా చేయండి లేదా నెల్లూరులో కలపండి. తిరుపతిలో కలుపుతామంటే ఒప్పుకోం… బిజెపి నేత రంగారెడ్డి నెల్లూరులో తన స్వగృహం నుండి పాత్రికేయుల కోసం వీడియో విడుదల చేశారు. ఒక నేత నెల్లూరు జిల్లా ప్రజలకు గాయం చేస్తే.. మరో నేత గాయాన్ని గెలుకుతున్నారు. రాపూరు కలువాయి ప్రాంతాలను ఎందుకు విడగొడుతున్నారు.. విడగొట్టమని ఎవరు అడిగారు. తిరుపతిలో కలుపుమని చెప్పింది ఎవరు. కూటమిలో పెద్దలను గౌరవిస్తాం.. కూటమి పేరుతో ప్రజలకే అన్యాయాన్ని చేస్తే సహించం. అందరినీ కలుపుకొని పోరాటం చేస్తాం. మండలాలు విభజన *అయ్యోరు బొమ్మను చేయమంటే కోతి బొమ్మను చేసినట్లు ఉంది*. రాపూరు సైదాపురం కలవాయి మండలాలను నెల్లూరు జిల్లాలోని కొనసాగించాలని రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాల నేపథ్యంలో..నెల్లూరు లో మంత్రి ఆనం టెలి కాన్ఫరెన్స్:::

* దిత్వా తుఫాను భారీ వర్షాలపై అధికారులతో మంత్రి ఆనం టెలీ కాన్ఫరెన్స్… * నెల్లూరు జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారి, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి యువరాజ్IAS, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై చర్చించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి…. * సోమశిల, కండలేరు జలాశయాలు, సంగం, నెల్లూరు బ్యారేజ్ ల నీటి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి ఆనం.. * జలాశయాల వద్ద ఎప్పటికప్పుడు నీటి పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి * ఆత్మకూరు ప్రాంతాల్లో బీరాపేరు వాగు, బొగ్గేరు వాగులపై ప్రత్యేక నిఘా పై వాకబు చేసిన మంత్రి ఆనం… * జిల్లాకు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు, ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించిన మంత్రి ఆనం * ప్రభుత్వపరంగా ఏ సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులకు తెలిపిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి * ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరాయంగా తుఫాను ప్రభావం పై నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్న మంత్రి ఆనం…

ఆంధ్రప్రదేశ్

“రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ ఇవ్వాలనే డిమాండ్: తెలుగు ప్రజల అభిప్రాయాలు”

(పున్నమి ప్రతినిధి) సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చలు జరగడం చూస్తున్నాం. కొందరు నెటిజన్లు ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని విమర్శిస్తున్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ ఇవ్వడం ద్వారా ఆయనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఆయన హాస్య నటుడిగా చేసిన కృషిని గుర్తించి, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పద్మశ్రీ ఇవ్వాలని కోరుతున్నారు. సరదాగా మాట్లాడిన మాటలను అర్ధం తప్పుగా తీసుకోవడం మంచిది కాదని కూడా కొందరు తెలుగు ప్రేక్షకులు పేర్కొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్

*నందవరం మండలం ముగతి గ్రామంలో రచ్చబండ & కోటి సంతకాల ఉద్యమం*

*ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించే నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలతో సంతకాలు సేకరించి నిరసన తెలియజేస్తూ,* *ఎమ్మిగనూరు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జి,యువ నేత శ్రీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు,* *రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డిగారు,* *వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధానకార్యదర్శి ముగతి విరుపాక్షిరెడ్డి గారి ఆదేశాల మేరకు* *ఈరోజు అనగా 30-11-2025వతేదిన ముగతి గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుభారంభం చేశారు.* *🔹 పీపీపీ విధానంతో ప్రజలకు కలిగే నష్టాలను వివరించారు.* *🔹 మెడికల్ కాలేజీలు ప్రజాస్వామ్య సొత్తు, వాటిని ప్రైవేటు చేతుల్లోకి వదిలేయడం ప్రజాహక్కులపై దాడి అని స్పష్టం చేశారు.* *ప్రజలు గొప్ప ఉద్వేగంతో, అపారమైన విశ్వాసంతో, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాల ద్వారా తమ మద్దతును తెలిపారు* *ఈ కార్యక్రమం లో వైసీపీ యువజన జిల్లా ప్రధానకార్యదర్శి ముగతి దేవపాల్ గారు,వైస్సార్సీపీ నాయకులు చిన్నన్న గారు,దేవపుత్ర గారు,దావీదు గారు,సామేల్ గారు,అబ్రహం గారు,ప్రకాశం గారు,రాజేంద్రప్రసాద్ గారు, కె దావీదు గారు,కార్యక్రర్తలు,పాల్గొని విజయవంతం చేసారు* 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.