Thursday, 5 March 2026

Blog

తిరుపతి

అలరించిన ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్దుల విజ్ఞాన ప్రదర్శనలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 03, శ్రీకాళహస్తి పట్టణంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ కరెస్పాండంట్ చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన “ఆక్స్ఫర్డ్ ఎక్స్పో & ఫుడ్ ఫెస్ట్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండంట్ చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు, వారి ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని విద్యార్థుల కృషిని అభినందించి, తల్లిదండ్రుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. విజ్ఞాన ప్రదర్శనలో విద్యార్థులు వివిధ సైన్స్ ప్రాజెక్టులు, కళాత్మక ప్రదర్శన, సృజనాత్మక ఆవిష్కరణల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించారు. పిల్లలు తయారు చేసిన వినూత్న ప్రాజెక్టులు, శాస్త్రీయ నమూనాలు, సామాజిక అంశాలపై రూపొందించిన ప్రదర్శనలు తల్లిదండ్రులను, సందర్శకులను ఆకట్టుకోగా పాఠశాల వారు ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్ట్ లో రుచికరమైన వంటకాలను స్వీకరించి ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని ప్రదర్శనలను విజయవంతం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నూతన గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి శుభారంభం చేయడం ఆనందంగా ఉంది ఉదయగిరి ఎమ్మెల్యే

వింజమూరు మండలం చాకలికొండ గ్రామపంచాయతీ పరిధిలోని బీసీ కాలనీలో పైడిమల్ల రమణయ్య గారి నూతన గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి శుభారంభం చేయడం ఆనందంగా ఉంది. కుటుంబ సభ్యులు వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయ పద్ధతుల్లో పూజలు నిర్వహించగా, గ్రామస్తులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పైడిమల్ల రమణయ్య గారి కుటుంబం కొత్త ఇంటిలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యాలతో నిండిన జీవితం గడపాలని హృదయపూర్వకంగా ఆకాంక్షించాను. ప్రతి కుటుంబం స్వగృహ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం గర్వకారణమని పేర్కొంటూ, గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా నా కృషి నిరంతరం కొనసాగుతుందని వెల్లడించాను. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొని కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం

స్వర్గీయ దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి గారి జ్ఞాపకార్థంగా, మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామంలో సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ మినరల్ వాటర్ ప్లాంట్‌ను మా నాన్నగారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించడం గర్వకారణం. గ్రామాభివృద్ధి దిశగా ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ప్రజలకు మేలుచేసే కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా వారి ఆశయాలను నిలబెట్టుకోవడం మా కుటుంబ బాధ్యతగా భావిస్తున్నాం.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గొప్ప మనసు చాటుకున్న నెల్లూరు కలెక్టర్ హిమాన్ శుక్ల

కావలికి చెందిన రమాజ్యోతి అనే వృద్ధురాలిని ఆమె కన్నకొడుకే మోసం చేసి ఇల్లు తన పేరుమీద రాయించుకుని బయటకు గెంటేశాడు. నిలువనీడ లేక ఇబ్బందులు పడుతున్న ఆమె, సమస్యను తెలియజేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గారిని గ్రీవెన్స్‌లో ఆశ్రయించింది. తన నివాసాన్ని మభ్యపెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. మానవీయ దృక్పథంతో స్పందించిన కలెక్టర్ గారు వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించి విచారణ చేపట్టించారు. చట్టపరమైన ప్రక్రియను అనుసరించి అన్యాయంగా జరిగిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయించారు. అనంతరం ఆ ఇంటిని తిరిగి రమాజ్యోతి గారికే గౌరవప్రదంగా అప్పగించారు. తనకు న్యాయం చేసిన కలెక్టర్ హిమాన్షు శుక్లా గారిని స్వయంగా కలిసి రమాజ్యోతి కృతజ్ఞతలు తెలియజేశారు. “కన్నకొడుకు గెంటేశాడు… కానీ జిల్లా కలెక్టర్ పెద్ద కొడుకులా కాపాడారు” అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ నిఘా

నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నెల్లూరు పోలీస్జి ల్లా వ్యాప్తంగా డ్రోన్ నిఘాను మరింత విస్తరించింది. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు సంబంధిత డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు సమక్షంలో నెల్లూరు పట్టణం, శివారు మరియు నిర్మానుష్య ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో క్షుణ్ణంగా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. క్రైమ్ ప్రోన్ ఏరియాలు, పాడుబడిన భవనాలు, తోటలు, పార్కులు, నదీతీరాలు వంటి అనుమానాస్పద ప్రదేశాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం మరియు రవాణా, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, దొంగతనాలు, రహదారి ప్రమాదాలకు దారితీసే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు గమనించిన ప్రజలు డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మంత్రి నారా లోకేష్ఆత్మీయ విందులో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్

మంత్రి నారా లోకేష్ఆ త్మీయ విందులో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉండవల్లిలోని గౌరవ ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ఆత్మీయ విందు కార్యక్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. స్నేహపూర్వక వాతావరణంలో సాగిన ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ గారు అందరితో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. నాయకత్వానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఆత్మీయ సమ్మేళనం పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేసింది. ప్రజా సేవలో సమన్వయం, సత్సంబంధాలు ఎంత ముఖ్యమో ఈ విందు మరోసారి చాటి చెప్పింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని జిల్లా ఎస్‌పీ Dr. Ajitha Vajendla ఆధ్వర్యంలో విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాత్రి వేళల్లో జరుగుతున్న “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని జిల్లా ఎస్‌పీ Dr. Ajitha Vajendla ఆధ్వర్యంలో విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా అడిషనల్ ఎస్‌పీ (అడ్మిన్) సూచనల మేరకు పోలీసులు ట్రావెల్స్ బస్సులు, లారీలు, వ్యాన్లు తదితర వాహనాలను అర్ధరాత్రి తర్వాత ఆపి డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నారు. నిద్ర మత్తు కారణంగా జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. టోల్ ప్లాజాలు, ప్రధాన జంక్షన్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ప్రత్యేక బృందాలు పహారా కాస్తున్నాయి. అతివేగం వల్లే దేశంలో 70%కిపైగా ప్రమాదాలు జరుగుతున్నందున స్పీడ్ లిమిట్స్ పాటించాలని హెచ్చరిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, డ్రంకెన్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలపై 112కు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బండారు వెంకటేష్ పదవీ విరమణ

ఉదయగిరి Sub-Registrar ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్‌గా కర్తవ్యనిష్ఠతో, నిజాయితీతో సేవలందించిన శ్రీ బండారు వెంకటేష్ పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని శాలువాతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ సేవలో ఆయన చూపిన అంకితభావం, క్రమశిక్షణ, ప్రజల పట్ల మానవతా దృక్పథం అందరికీ ఆదర్శంగా నిలిచాయి. కార్యాలయ అభివృద్ధికి, ప్రజలకు సకాలంలో సేవలు అందించడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమే. రిటైర్మెంట్ అనంతరం ఆయురారోగ్యాలతో, ఆనందంతో, కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరు మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో ఎంపీపీ వనిపెంట హైమావతి సారథ్యంలో మహోత్సవాలు

వింజమూరు మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో ఎంపీపీ వనిపెంట హైమావతి సారథ్యంలో వింజమూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి క్రీడా, సాంస్కృతిక మహోత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొని 15 రకాల క్రీడల్లో ప్రతిభ కనబరిచారు. విజేతలైన 750 మందికి బహుమతులు అందజేయడం ఆనందంగా నిలిచింది. చాకలికొండ ఆర్కే ఉన్నత పాఠశాల మొదటి స్థానం, ఊటుకూరు జడ్పీ ఉన్నత పాఠశాల రెండో స్థానం, వింజమూరు జడ్పీ ఉన్నత పాఠశాల మూడో స్థానం సాధించాయి. సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ మార్గదర్శకత్వంలో విద్యారంగం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని విద్యార్థులకు సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పదో తరగతి విద్యార్థుల కోసం పరీక్ష కిట్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

సీతారామపురం కస్తూరిబా బాలికల విద్యాలయంలో పదో తరగతి విద్యార్థుల కోసం పరీక్షా కిట్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కుర్రా రత్తయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ ఉదయగిరి ఎమ్మెల్యే Kakarla Suresh పాల్గొని సుమారు 300 మంది విద్యార్థులకు పరీక్షా సామగ్రి కిట్‌లను అందజేశారు. పెన్నులు, పెన్సిళ్లు, స్కేలు, రబ్బరు, రైటింగ్ ప్యాడ్‌లతో కూడిన కిట్‌లు విద్యార్థులకు ఉపయుక్తంగా నిలిచాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యే భవిష్యత్తుకు భరోసా అని పేర్కొంటూ క్రమశిక్షణ, సమయపాలనతో చదివి మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.