Tuesday, 17 March 2026

Blog

కామారెడ్డి

అధికారులు వాహనాలపై విస్తృత తనిఖీలు

కామారెడ్డి, 01 డిసెంబర్, పున్నమి ప్రతినిధి : మోడల్ కోడ్ అమల్లో ఉన్నందున, అక్రమ నగదు, ప్రచార సామాగ్రి లేదా అనుమానాస్పద వస్తువులు తరలింపును అడ్డుకోవడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశ్యం.రాత్రి సమయంలో ప్రధాన రహదారుల్లో అధికారులు వాహనాలను ఆపి, దాని లోపల ఉన్న వస్తువులను పరిశీలిస్తున్నారు. అధికారుల బృం దం ఒక్కో వాహనాన్ని ఓపెన్ చేసి చూస్తూ, అవసర మైతే యజమానులను ప్రశ్నించటం జరుగుతోంది. ఎవరైనా అధిక మొత్తంలో నగదు లేదా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వస్తువులు తీసుకెళ్తున్న ట్లు కన్పిస్తే, వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.ప్రజలకు సూచనలుఎన్నికల సమయంలో అక్రమంగా నగదు, వస్తువులు తరలించకూడదని అధికారులు సూచిస్తున్నారు.తమ వాహనాల్లో అనుమతినిచ్చినదానికంటే అధిక నగదు లేదా అనుమానాస్పద వస్తువులు ఉంటే, అధికారులకు తెలియజేయాలని సమీప పోలీస్ స్టేషన్ లేదా ఎన్నికల అధికారులతో సంప్రదించాల్సిందిగా తెలిపారు.ఈ తనిఖీలు రామారెడ్డి మండల ప్రజల కు, ఎన్నికల పారదర్శకత సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు

నాగర్‌కర్నూల్

నాగులపల్లి 03వ వార్డు అభ్యర్థిగా దూపం అంజనేయులు నామినేషన్, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం

పున్నమి నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం: నాగులపల్లి గ్రామంలోని గ్రామంలో మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి మాజీ ఎంపిటిసి, కోడేరు మండలం సింగల్ విండో డైరెక్టర్, గ్రామ ప్రజలు కార్యకర్తలు బలపరిచిన గ్రామపంచాయతీ నాగులపల్లి గ్రామ 03వ వార్డు అభ్యర్థి దూపం అంజనేయులు అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. వారితో పాటు 10 మంది అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దూపం అంజనేయులు మాట్లాడుతూ గ్రామ ప్రజల కొరకు, ఎలాంటి అక్రమాలకు అన్యాయాలకు పాల్పడకుండా నీతి న్యాయం కోసం గ్రామ అభివృద్ధి కొరకు సహకరిస్తూ ప్రజాక్షేత్రంలో ఉంటూ గ్రామ ప్రజల సమస్యల పట్ల నా వంతుగా స్వచ్ఛందంగా సేవ చేస్తాను, గ్రామ ప్రజలందరికీ యువకులకు మహిళలకు విద్యావంతులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలు అందరు కూడా మంచి మనసుతో ఆదరించి సర్పంచ్ అభ్యర్థిగా మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి, పదిమంది వార్డు నెంబర్లను గెలిపించి ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతోపాటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

నాగర్‌కర్నూల్

మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్, నాగులపల్లి గ్రామన్నీ ఆదర్శ గ్రామం చేయడమే నా లక్ష్యం

పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం: నాగులపల్లి గ్రామంలోని గ్రామ ప్రజలు కార్యకర్తలు బలపరిచిన గ్రామపంచాయతీ ఎన్నికల సర్పంచ్ అభ్యర్థి మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. వారితో పాటు గ్రామ ప్రజలు కార్యకర్తలు బలపరిచిన వార్డు సభ్యులు 10 మంది అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా గ్రామ ప్రజల కొరకు, ఎలాంటి అక్రమాలకు అన్యాయాలకు పాల్పడకుండా నీతి న్యాయం కోసం గ్రామ అభివృద్ధి కొరకు సహకరిస్తూ ప్రజాక్షేత్రంలో ఉంటూ గ్రామ ప్రజల సమస్యల పట్ల నా వంతుగా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నందుకు ఇన్ని సంవత్సరాలకు ఈ గ్రామానికి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సేవ చేసే అవకాశం రిజర్వేషన్ ద్వారా కలిగినందుకు గ్రామ ప్రజలందరికీ యువకులకు మహిళలకు విద్యావంతులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలు అందరు కూడా మంచి మనసుతో ఆదరించి సర్పంచ్ అభ్యర్థిగా, పదిమంది వార్డు నెంబర్లను గెలిపించి ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతోపాటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అని ఈ సందర్భంగా తెలిపారు.

E-పేపర్

ఒకే ఊరు.. ఒకే వార్డు.. ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండడం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది.

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 ఒకే ఊరు.. ఒకే వార్డు.. ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండడం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది… రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామానికి చెందిన 11 వార్డులో ఓటరుగా ఉన్న ఆలంపల్లి మల్లయ్య ఓటరుగా నమోదయ్యాడు. దీంతో పాటు మండలంలో రెండేండ్ల కింద చనిపోయిన వారితో పాటు వివాహమై అత్తారింటికి వెళ్లిన వారి ఓట్లు అలాగే ఉన్నాయి.

E-పేపర్

సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులదే గెలుపు : జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులదే గెలుపు : జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి మొదటి విడతగా 18 సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటన ———————————————— సర్పంచ్ ఎన్నికలలో జిల్లాలోని మెజారిటీ స్థానాలను బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జిగా ఆయన సోమవారం మొదటి విడతగా నియోజకవర్గంలోని 18 గ్రామాలకు సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించారు. *ఇబ్రహీంపట్నం మండలం* ————————————— 1. రాయపోల్ – అచ్చన మమత శ్రీశైలం 2. ⁠పోచారం – పంది మాధవి కృపేష్ 3. ⁠తులేకలాన్ – సామ అశ్విని రవీందర్ రెడ్డి 4. ⁠చెర్లపటేల్ గూడ – కాలె గణేష్ *అబ్దుల్లాపూర్ మెట్ మండలం* ——————————————— 5. ఇనాంగూడ – దేశారం రాఘవేందర్ గౌడ్ 6. జాఫర్ గూడ – కొర్ర రాధాకృష్ణ యాదవ్ 7. చిన్న రావిరాల – అబ్బతి బసవయ్య *యాచారం మండలం* ———————————- 8. గున్ గల్ – తోటిరెడ్డి రాజేందర్ రెడ్డి 9. మాల్ – మహ్మద్ గులాం సుభాని 10. కేస్లీతండా – జర్పుల రమేష్ నాయక్ 11. కుర్మిద్ద – నీలం శ్రీవిద్య 12. మంతన్ గౌరెల్లి – కారింగు యాదయ్య గౌడ్ 13. అయ్యవారి గూడ – నక్క వెంకటేశ్ యాదవ్ *మంచాల మండలం* ———————————- 14. ఆగాపల్లి – బచ్చలకూర సుజాత జంగయ్య 15. అంబోత్ తండా – అంబోత్ రాణి శ్రీనివాస్ నాయక్ 16. కొర్రవానితండా – కొర్ర కిషన్ నాయక్ 17. లింగంపల్లి – బత్తుల కిషన్ రెడ్డి 18. లోయపల్లి – అంగోత్ రఘురాం నాయక్ సం/- *సత్తు వెంకటరమణారెడ్డి* జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ , రంగారెడ్డి జిల్లా

అనకాపల్లి

ఏటికొప్పాక కళాకారుడికి ఘన సత్కారం..!

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజవర్గం పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ : జాతీయ అవార్డుకు ఎంపికైన ఎలమంచిలి మండలం ఏటికొప్పాక లక్క బొమ్మల హస్త కళాకారుడు గొర్స సంతోష్ కుమారును క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సోమవారం విశాఖ గ్రీన్ పార్క్ లో సత్కరించి రూ. 25,000 చెక్కును అందజేసింది. జాతీయ అవార్డుకు ఎంపిక కావడంతో పాటు 2025 రిపబ్లిక్ డే పేరెడలో సంతోష్ కుమార్ తయారుచేసిన శకటానికి మూడవ బహుమతి వచ్చిన సందర్భంగా నగదు బహుమతి అందజేసినట్లు క్రాఫ్ట్ కౌన్సిల్ ప్రతినిధులు తెలిపారు.

E-పేపర్

హయత్ నగర్ పోలిస్టేషన్ పరిధిలోని గౌరెల్లి ORR EXIT NO 10 దగ్గర తారామతి పేట్ వెళ్ళే రోడ్డులో ప్రమాదం స్పాట్ లో మరణించిన వ్యక్తి

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 హయత్ నగర్ పోలిస్టేషన్ పరిధిలోని గౌరెల్లి ORR EXIT NO 10 దగ్గర తారామతి పేట్ వెళ్ళే రోడ్డులో అతి వేగంగా వచ్చిన పెండ ట్రాక్టర్ మలుపు దగ్గర అదుపుతప్పి బైక్ పై వస్తున్న వ్యక్తి పైన పడడంతో స్పాట్ డెడ్ అయ్యాడు. ట్రాక్టర్ కింద పడిపోయిన వ్యక్తిని JCB సహాయంతో తీసి అంబులెన్స్ లో తహాస్పిటల్ కి తరలించారు.. మరణించిన వ్యక్తి సరూర్ నగర్ కి చెందిన పోనేమోని శివ యాదవ్ గా గుర్తించారు..

కడప

కలెక్టర్ గారి ఆదేశాలు బేఖాతర్

కలెక్టర్ గారి ఆదేశాలు బేఖాతర్!! ప్రొద్దుటూరు జీవనజ్యోతి విద్యాసంస్థలు కలెక్టర్ గారి ఆదేశాలను బేఖాతర్ ఈరోజు అనగా 1- 12- 2025 రోజున జిల్లా వ్యాప్తంగా దిత్వా తుఫాను సందర్భంగా జిల్లాలోని పాఠశాలలన్నింటికీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు సెలవు ప్రకటించారు ఈ ఆదేశాలను పక్కనపెట్టి ప్రొద్దుటూరు జీవనజ్యోతి విద్యాసంస్థలు స్కూల్ ఓపెన్ చేసి విద్యార్థులకు ఎగ్జామ్స్ మరియు క్లాసులు నిర్వహించారు గౌరవ కలెక్టర్ మరియు డిఇఓ గారి ఆదేశాలను పక్కనపెట్టి స్కూలును నడుపుతున్న ఈ సంస్థపై చర్యలు వెంటనే తీసుకోవాలి

అన్నమయ్య

రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారు. మాట మరిచారు కూటమి ప్రభుత్వం

ప్రభుత్వంలో కేవలం మంత్రి మీసం మెసేలి రాయచోటి జిల్లా కేంద్రంగా నిలుపుకుంటే… రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు, కూటమి ఏర్పాటుకు అనేక మెట్లు దిగి, పొత్తులో భాగంగా బిజెపికి ఎనిమిది అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే, జనసేనకు కేటాయించిన 23 అసెంబ్లీ సీట్లలలో రెండు బిజెపి ఇచ్చి, అలాగే ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారు. మరి సీఎం, డిప్యూటీ సీఎం హామీలకు విలువ లేదా?. రాయచోటిలో టీడీపీ గెలిచి, రాజంపేటలో టీడీపీ ఓడిపోయి ఉండచ్చు. ప్రభుత్యం ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన జనసేన రైల్వే కోడూరు లో గెలిచింది కదా? రాజంపేట జిల్లా కేంద్రం అయితే రాయచోటి ప్రజలకు రాజంపేటకు రావడానికి దూరం తక్కువ. అదే రైల్వే కోడూరు ప్రజలకు రాయచోటి కి వెళ్ళాలి అంటే రెండు బస్సులు మారాలి, నూరు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇటీవల ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచింది కదా. ఈవిషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. ఇవన్నీ అటుంచితే…..చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజంపేటను జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. మరి రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగితే సీఎం చంద్రబాబు నాయుడు కు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నిజంగా అది పరాభవం అనే చెప్పాలి…

అన్నమయ్య

కోసం జేఏసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ప్రజాసంఘాలు , ఉద్యోగ సంఘాలు

రాజంపేట ఆర్ అండ్ బి బంగ్లాలో జిల్లా కేంద్ర సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ప్రజాసంఘాలు , ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆర్థికంగాను అన్నివేళలా జిల్లా కేంద్ర సాధన కోసం మేము కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. జాయింట్ ఆక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్, సిపిఎం సిపిఐ, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, తెలుగుదేశం పార్టీ ,జనసేన బిజెపి పార్టీల నాయకులు హాజరయ్యారు. రాజంపేట జిల్లా కేంద్రం చేయాలి మధ్యలో ఉన్నటువంటి రాజంపేటను కాకుండా వేరే అవకాశమే లేనటువంటి రాయచోటిని కేంద్రంగా ఉంచుతే మేము ఉద్యమించడానికి సంసిద్ధమని అక్కడికి వచ్చినటువంటి వక్తలు రాజకీయ పక్షాలు తెలియజేయడం జరిగింది. కార్యచరణ ప్రకటించుకొని ముస్లిం మైనార్టీ నాయకులు గల కార్యాచరణ అమలు పరుస్తామని తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.