Tuesday, 17 March 2026

Blog

విశాఖపట్నం

జివిఎంసి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో 111 వినతులు.

జివిఎంసి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో 111 వినతులు. – నగర మేయర్ పీలా శ్రీనివాసరావు *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-*: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (PGRS) కార్యక్రమంలో జీవీఎంసీ లో అన్ని విభాగాలకు కలిపి 111 వినతులు వచ్చాయని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన జివిఎంసి ప్రధాన కార్యాలయం లోని పాత సమావేశ మందిరం లో జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ తో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి జివిఎంసికి సంబంధించి 111 అర్జీలు/ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. అందులో ముఖ్యంగా 2వ జోన్ కు 18, 3వ జోన్ కు 16, 4వ జోన్ కు 09, 5వ జోన్ కు 11, 6వ జోనుకు 15, 8వ జోన్ కు 11, జివిఎంసి ప్రధాన కార్యాలయానికి 31 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అలాగే జివిఎంసి అడ్మినిస్ట్రేషన్ & అకౌంట్సు విభాగమునకు 13, రెవెన్యూ విభాగమునకు 13, ప్రజారోగ్య విభాగమునకు 07, పట్టణ ప్రణాళిక విభాగమునకు 48, ఇంజినీరింగు విభాగమునకు 21, మొక్కల విభాగమునకు 05, యుసిడి విభాగమునకు 04 కలిపి మొత్తంగా 111 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అనంతరం కమిషనరు వీడియో కాన్పరెన్స్ ద్వారా జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులతో మాట్లాడుతూ జివిఎంసి పి.జి.ఆర్.ఎస్ లో అన్ని విభాగాలలో ప్రతివారం నమోదు చేసిన ఫిర్యాదులే తిరిగి నమోదు అవుతున్నాయని, అధికారులు స్వయంగా పి.జి.ఆర్.ఎస్ అర్జీదారులతో సంప్రదించి సమస్యలను పరిష్కరించాలనన్నారు. పట్టణ ప్రణాళికా విభాగం లో ఎక్కువగా పిర్యాదులు నమోదు అవుతున్నాయని, అధికారులు పి.జి.ఆర్.ఎస్ పై ప్రత్యేక దృష్టి సారించాలనన్నారు. ప్రభుత్వం ప్రజలు సౌలభ్యం కోసమే పురమిత్ర యాప్ ను ప్రవేశపెట్టిందని, ప్రజలకు పురమిత్ర యాప్ డౌన్ లోడ్ చేసుకొనేవిధంగా అవగాహన పరచాలని, పురమిత్ర యాప్ లో ప్రజలు సమస్యలు నమోదు చేసుకోవడం ద్వారా వారి సమస్యలు పరిష్కారం మవుతాయని తెలియజేయాలని సచివాలయ కార్యదర్శిల ద్వారా ప్రజలకు అవగాహణ పరిచేలా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లకు ఆదేశించారు. తద్వారా వారు నేరుగా పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమానికి వచ్చి సమస్యలు తెలియజేసే శ్రమను వారికి తగ్గుతుందని అవగాహన పరచాలని కమిషనరు తెలిపారు. జివిఎంసి ప్రధాన కార్యాలయం సిటీ ఆఫరేషన్ సెంటర్ కు టోల్ ఫ్రీ నెం.180042500009 కు ఫోన్ ద్వారా, అలాగే అన్ని పని దినాలలో ఉ.గం.10.30 ని.ల నుండి సా.గం.5.00 ల వరకు జివిఎంసి ప్రధాన కార్యాలయం ప్రంగణం పిర్యాదుల కేఁద్రం లో ప్రజలు ఫిర్యాదులు, వినతి పత్రాలు సమర్పించవచ్చునని ప్రజలకు తెలియజేయాలని కమిషనరు తెలిపారు. ఈ సమావేశంలో జీవీఎంసీ ప్రధాన ఇంజినీరు పి.వి.వి.సత్యనారాయణరాజు, అదనపు కమీషనర్ డి.వి.రమణ మూర్తి, సిసిపి ఎ.ప్రభాకారరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి.నరేష్ కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి.వాసుదేవరెడ్డి, సెక్రటరీ బి.వి.రమణ, డిసిఆర్ ఎస్.శ్రీనివాసరావు, డిడిహెచ్ ఎం.దామోదరరావు, పర్యవేక్షక ఇంజనీర్లు పల్లమరాజు, గోవింద రావు, ఏడకొండలు, కె.శ్రీనివాసరావు, గోవిందరావు, సంపత్ కుమార్, శాంతిరాజ్, బయోలజిస్ట్ సాంబమూర్తి, స్పోర్ట్ డైరెక్టర్ ఇ.ఎ.రాజు, ఆర్.ఎఫ్.ఒ హనుమంతురావు, డిసిపిలు హరిదాసు, రామమోహన్, ఎసిపి లు, యుసిడి పి.ఒ ప్రేమ ప్రసాన్న వాణి, డిపిఒ శాంతి కుమారి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

హ్యూస్టన్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా

విశాఖపట్నం, డిసెంబర్ 1: చలికాలంలో వణుకుతున్న నిరాధారులకు అండగా నిలుస్తూ “హ్యూస్టన్ హెల్పింగ్ హాండ్స్” ఆధ్వర్యంలో నిర్వహించిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం సాయంత్రం విశాఖపట్నంలో భవ్యంగా జరిగింది. ప్రవాసాంధ్రుల సేవాస్పూర్తికి ఉదాహరణగా నిలిచిన ఈ కార్యక్రమంలో శతాధిక నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయబడింది. కార్యక్రమాన్ని విశేషంగా మార్చిన ప్రముఖులు టి.ఎస్.ఆర్ కాంప్లెక్స్ వద్ద జరిగిన ఈ సేవా కార్యక్రమానికి పోలీస్ శాఖ నుంచి ప్రత్యేక హాజరు లభించింది. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీ శంఖభ్రత బాగ్చి, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏసీపీ శ్రీ లక్ష్మణమూర్తి గారు, టూ టౌన్ సీఐ శ్రీ ఎర్రనాయుడు గారు ప్రత్యేక అతిథులుగా విచ్చేసి దుప్పట్లు అందజేశారు. పోలీస్ అధికారుల సమక్షంలో పంపిణీ జరగడం వల్ల కార్యక్రమం మరింత విశ్వసనీయంగా, పారదర్శకంగా సాగింది. పోలీస్ కమిషనర్ గారి అభినందనలు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ పోలీస్ కమిషనర్ శ్రీ శంఖభ్రత బాగ్చి గారు మాట్లాడుతూ: “సమాజంలో అత్యంత బలహీన వర్గాలకు చేయూతనందించే ఈ కార్యక్రమం నిజంగా ప్రశంసనీయం. హ్యూస్టన్ హెల్పింగ్ హాండ్స్ వంటి ప్రవాసాంధ్రుల సేవా మనసు విశాఖకు గర్వకారణం. పోలీస్ శాఖ ఎప్పుడైనా ఇలాంటి మంచికారణాలకు అండగా ఉంటుంది” అని పేర్కొన్నారు. అతని మాటలు కార్యక్రమానికి మరింత ప్రోత్సాహాన్ని, గౌరవాన్ని చేకూర్చాయి. ప్రవాసాంధ్రుల సేవాస్ఫూర్తి అమెరికాలో నివసిస్తూ తమ స్వస్థలంపై ప్రేమను మరువని హ్యూస్టన్ ప్రవాసులు— రాపర్తి శ్రీను, సాలాపు బాలరాజు, నాయుడు, దువ్వలూరి సాల్మన్ రాజు, రాపేటి సత్య, కర్ణం వరహాలు, పెంటకోట రమణ, కంబాల సూర్యప్రకాశ్, బోడీ కృష్ణ, పలిక రమణ, మొక శ్యాం, కడియాల సురేష్, గోటిముక్కల మౌలేశ్వరరావు, వడేగోర గణేష్, మద్ది వెంకట గురునాధరావు— అమెరికా నుంచే ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసి, నిధులు అందించి, సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిర్వాహకుల సందేశం “మన ప్రజల్లో ఎవరైనా ఇబ్బంది పడితే అండగా ఉండటం మన బాధ్యత. అమెరికాలో ఉన్నా, మన హృదయం మన ఊరినే చేరుతుంది. చలిలో వణికే వారికి ఈ చిన్న సహాయం కొంత సాంత్వన అందిస్తుందని ఆశిస్తున్నాం” అని నిర్వాహకులు తెలిపారు. మీడియాకు కృతజ్ఞతలు కార్యక్రమాన్ని కవర్ చేసిన ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు హ్యూస్టన్ హెల్పింగ్ హాండ్స్ ధన్యవాదాలు తెలిపింది. స్థానిక సేవాసంస్థల ప్రశంసలు నిరుపేదలకు అండగా నిలిచిన హ్యూస్టన్ ప్రవాసాంధ్రుల ఈ సేవా కార్యక్రమం విశాఖలోని సేవాసంస్థలకు ప్రేరణగా నిలిచిందని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో హ్యూస్టన్ హెల్పింగ్ హాండ్స్ ప్రతినిధులుగా రెడ్డి సూర్యనారాయణ, యువతరం న్యూస్, ఉత్తరాంధ్ర ఇన్చార్జ్, అప్పారావు, కృష్ణ, సత్యనారాయణ, జి ఎల్ ఎన్ మూర్తి, నాగు తదితరులు పాల్గొని కార్యక్రమం నిర్వహించారు

అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడ:ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు స్నేహం, తోడ్పాటు అవసరం

డుంబ్రిగుడ మండలం కిల్లోగుడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సోమవారం అరకు సంతబయలు లో ఎయిడ్స్ డే నిర్వహించారు. ఈ మేరకు ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ పై ప్రజలకు అవగాహణ పరచారు. స్ధానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్ధులతో ప్రధాన రహదారిలో ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహణ ర్యాలీ చేపట్టారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు స్నేహం, తోడ్పాటు అవసరమని అన్నారు. వైద్యులు డా నజీబుల్లా, సిబ్బంది పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: జీసిసి చైర్మన్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ కి అత్యంత ప్రాధాన్యమైనవి, ప్రతి గ్రామం, బూత్‌ లలో టీడీపీ పటిష్టంగా నిలవాలని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. అనంతగిరి లో సోమవారం నిర్వహించిన టీడీపీ మండల నాయకుల సమావేశంలో కిడారి మాట్లాడారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే నాయకత్వమే పార్టీని గెలిపిస్తుందన్నారు. యువజన,మహిళా శక్తిని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

అల్లూరి సీతారామరాజు

అడ్డతీగల: 89.9% సామాజిక ఫించన్లు పంపిణీ

అడ్డతీగల మండలంలో సోమవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా ఫించను పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీవో ఏవివి కుమార్ పోల్గొన్నారు. మండలంలోని గొండోలు గ్రామ పంచాయతీ, చేనుపాకలు గ్రామంలో వృద్దులకు, వితంతువులకు ఫించను పంపిణీ చేశారు. మండలంలో సాయంత్రం 6 గంటల వరకు 5240 ఫించను లకు గాను 4713(89.90%) పంపిణీ చేయడమైనదని ఎంపీడీఓ తెలిపారు. మిగిలిన రేపు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: ఎయిడ్స్ వ్యాధి నియంత్రణపై అవగాహణ ర్యాలి

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ డే ఘనంగా జరిపారు. ఈ మేరకు విద్యార్ధులకు ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ పై అవగాహణ పరచి, గ్రామాల్లోని ప్రజలకు ఎయిడ్స్ వ్యాధి నియంత్రణపై అవగాహణ కల్పించాలని ప్రిన్సిపాల్స్ డా నాయక్ విద్యార్థులకు సూచించారు. అనంతరం కళాశాల నుండి రవ్వలగూడ జంక్షన్ వరకు ఎయిడ్స్ వ్యాధి పై అవగాహణ ర్యాలీని నిర్వహించారు. అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ పిఓ లు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమానికి 90 ఫిర్యాదులు*

ప్రతీ సోమవారం నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS)కు సోమవారం 90 ఫిర్యాదులు రావడం జరిగినది* ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ Dr.శంఖబ్రత భాగ్చి, ఐ.పీ.ఎస్., ప్రత్యక్షముగా పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు ఉండి, నగర సబ్-డివిజన్ ఏ.సి.పి లు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లు, ఎస్సైలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనీ, ఫిర్యాదులు స్వీకరించారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక *(PGRS)* కార్యక్రమానికి 90 మంది ఫిర్యాదుదారులు వచ్చి తమ తమ సమస్యలను రిపోర్టులు ద్వారా పోలీసు కమిషనర్ కి అందజేసినారు. సిపి ఫిర్యాదులను పరిశీలించి ఫిర్యాదిదారులతో స్వయముగా మాట్లాడి, వారి వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, సమస్యకు సంబంధించి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించవలసినదిగా ఆదేశాలు ఇవ్వడమైనది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక *(PGRS)* కార్యక్రమంలో ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదులలో కుటుంబ కలహాలు, భూ వివాదాలు, భార్య భర్తల గొడవలు, మోసానికి సంబంధించినవి సివిల్ కేసుల విషయం సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి

హనుమకొండ

హన్మకొండ లో ఓ నర్సింగ్ కాలేజీ యువతీ పై రసాయనాలతో గుర్తు తెలియని వ్యక్తుల దాడి

హనుమకొండలోని ఓ నర్సింగ్ కాలేజీలో చదువుతున్న ఓ యువతి మీద కడిపికొండ బ్రిడ్జిపై గుర్తుతెలియని వ్యక్తులు రసాయనాలతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలిది జనగాం జిల్లా జఫర్ ఘడ్ మండలం అని తెలిసింది. కాజీపేట ఏసీపీ, పోలీసులు ఎంజీఎం ఆస్పత్రిలో బాధితురాలితో మాట్లాడి విచారణ చేస్తున్నారు. ఈ విషయం నగర పరిధిలో సంచలనం సృష్టించింది. బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. తన కూతురు కాలేజీకి వెళ్లొస్తున్న సమయంలో కడిపికొండ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు రసాయనాలతో తన కూతురిపై దాడి చేశారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారిస్తున్నట్టు వెల్లడించారు.

కామారెడ్డి

అధికారులు వాహనాలపై విస్తృత తనిఖీలు

కామారెడ్డి, 01 డిసెంబర్, పున్నమి ప్రతినిధి : మోడల్ కోడ్ అమల్లో ఉన్నందున, అక్రమ నగదు, ప్రచార సామాగ్రి లేదా అనుమానాస్పద వస్తువులు తరలింపును అడ్డుకోవడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశ్యం.రాత్రి సమయంలో ప్రధాన రహదారుల్లో అధికారులు వాహనాలను ఆపి, దాని లోపల ఉన్న వస్తువులను పరిశీలిస్తున్నారు. అధికారుల బృం దం ఒక్కో వాహనాన్ని ఓపెన్ చేసి చూస్తూ, అవసర మైతే యజమానులను ప్రశ్నించటం జరుగుతోంది. ఎవరైనా అధిక మొత్తంలో నగదు లేదా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వస్తువులు తీసుకెళ్తున్న ట్లు కన్పిస్తే, వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.ప్రజలకు సూచనలుఎన్నికల సమయంలో అక్రమంగా నగదు, వస్తువులు తరలించకూడదని అధికారులు సూచిస్తున్నారు.తమ వాహనాల్లో అనుమతినిచ్చినదానికంటే అధిక నగదు లేదా అనుమానాస్పద వస్తువులు ఉంటే, అధికారులకు తెలియజేయాలని సమీప పోలీస్ స్టేషన్ లేదా ఎన్నికల అధికారులతో సంప్రదించాల్సిందిగా తెలిపారు.ఈ తనిఖీలు రామారెడ్డి మండల ప్రజల కు, ఎన్నికల పారదర్శకత సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు

నాగర్‌కర్నూల్

నాగులపల్లి 03వ వార్డు అభ్యర్థిగా దూపం అంజనేయులు నామినేషన్, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం

పున్నమి నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం: నాగులపల్లి గ్రామంలోని గ్రామంలో మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి మాజీ ఎంపిటిసి, కోడేరు మండలం సింగల్ విండో డైరెక్టర్, గ్రామ ప్రజలు కార్యకర్తలు బలపరిచిన గ్రామపంచాయతీ నాగులపల్లి గ్రామ 03వ వార్డు అభ్యర్థి దూపం అంజనేయులు అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. వారితో పాటు 10 మంది అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దూపం అంజనేయులు మాట్లాడుతూ గ్రామ ప్రజల కొరకు, ఎలాంటి అక్రమాలకు అన్యాయాలకు పాల్పడకుండా నీతి న్యాయం కోసం గ్రామ అభివృద్ధి కొరకు సహకరిస్తూ ప్రజాక్షేత్రంలో ఉంటూ గ్రామ ప్రజల సమస్యల పట్ల నా వంతుగా స్వచ్ఛందంగా సేవ చేస్తాను, గ్రామ ప్రజలందరికీ యువకులకు మహిళలకు విద్యావంతులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలు అందరు కూడా మంచి మనసుతో ఆదరించి సర్పంచ్ అభ్యర్థిగా మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి, పదిమంది వార్డు నెంబర్లను గెలిపించి ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతోపాటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.