Tuesday, 17 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ముక్కొల్లు ఆర్. బీ. కె వద్ద అన్నదాతల ఆందోళన

పెడన నియోజకవర్గం గూడూరు మండలం ముక్కొల్లు గ్రామ పంచాయతీ రైతులు మంగళవారం గ్రామంలోని ఆర్ బి కే నీ ముట్టడించి ఆందోళనకు దిగారు.అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు.ఒకవైపు తుపాన్ ప్రమాదం ముంచుకొస్తుంటే ఎప్పుడో వారం క్రితం కోసిన తమ దాన్యాన్ని కొనకుండా అప్పటికప్పుడు కోసిన దళారుల ధాన్యం కొంటున్నారని, తమకు ధాన్యం పై కప్పుకోవడానికి పరదాలు కూడా యివ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

11 కోట్ల శ్రీరామ నామ లికిత జపం.

ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో వి.హెచ్.పి. జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అయోధ్య లో సుందర భవ్య దివ్య రామమందిర నిర్మాణం పూర్తి చేసుకొని బాలారాముడుగా మరియు పట్టాభిరాముడు గా కొలువై మన సుదీర్ఘ మనోభీష్టం నెరవేర్చినందుకు కృతజ్ఞతగా విశ్వహిందూ పరిషత్ నేత్రుత్వం లో రామభక్తులచే 11 కోట్ల శ్రీరామ నామం స్మరిస్తూ వ్రాయించే *కరపత్రం, శ్రీరామకోటి పుస్తక ఆవిష్కరణ* శృంగవృక్షం శ్రీదత్తపీఠం పీఠాధిపతి శ్రీ సాయిదత్త నాగనంద సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధి గా భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి శ్రీ తనికెళ్ళ రవికుమార్ మరియు కార్యదర్శి శ్రీ ప్రయోగ నరసింహ మూర్తి, సహా కార్యదర్శి రాజా నాగరత్న కుమార్, విశేష సంపర్క ప్రముఖ్ శ్రీ భమిడిపాటి కృష్ణమూర్తి, బజరంగ్ దళ్ ప్రముఖ్ శ్రీ శిరంగు నాయుడు, అర్చక మందిర పురోహిత ప్రముఖ్ కోటిపల్లి వెంకట సుబ్రహ్మణ్యం, అడబాల నరేష్, యాతం కృష్ణ, వివేకానంద సోసైటీ కార్యదర్శి గోవ్వాల నాగరాజు, కోనసీమ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ స్వరూప్. ఐపోలవరం ఖండ ఆర్ఎస్ఎస్ కార్యవాహ శ్రీ గోపాలకృష్ణ రాజు, గొలకోటి వెంకటరెడ్డి ,ఆర్ఎస్ఎస్ నాయకులు శ్రీ సలాది శ్రీనివాసరావు, *ఎస్ ఎస్ ఎఫ్* ముమ్మిడివరం ఖండ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు ఏలూరి రాంబాబు కోడమర్తి శర్మ పాల్గొన్నారు.

E-పేపర్

హయత్‌నగర్‌లో దారుణం ఏడేళ్ల చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు చెవి ఊడిపోయి, తీవ్ర గాయాలపాలైన బాలుడు

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 హయత్‌నగర్‌లో దారుణం ఏడేళ్ల చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు చెవి ఊడిపోయి, తీవ్ర గాయాలపాలైన బాలుడు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పరిధిలోని శివగంగ కాలనీలో, ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై దారుణంగా దాడి చేసిన 10 వీధి కుక్కలు సమయానికి స్పందించి, బాలుడిని రక్షించి, ఆసుపత్రికి తరలించిన కాలనీ వాసులు నగరంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేస్తున్నాయని, జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న నగర వాసులు

విశాఖపట్నం

హ్యూస్టన్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా

చలికాలంలో వణుకుతున్న నిరాధారులను ఆదుకుంటూ హ్యూస్టన్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం సాయంత్రం విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ప్రవాసాంధ్రుల సేవాస్ఫూర్తిని ప్రతిబింబించిన ఈ కార్యక్రమంలో శతాదిక నిరుపేదులకు దుప్పట్లు అందించబడ్డాయి. కార్యక్రమాన్ని విశిష్టం చేసిన ప్రముఖుల హాజరు టి.ఎస్.ఆర్ కాంప్లెక్స్ వద్ద జరిగిన ఈ సేవా కార్యక్రమానికి పోలీస్ శాఖ నుంచి విశేష ఆదరణ లభించింది. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి, ఐపీఎస్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ లక్ష్మణమూర్తి , టూ టౌన్ సీఐ ఎర్రనాయుడు ప్రత్యేక అతిథులుగా విచ్చేసి దుప్పట్లు అందజేశారు. పోలీస్ అధికారుల సమక్షం కార్యక్రమానికి మరింత విశ్వసనీయతను తీసుకువచ్చింది. పోలీస్ కమిషనర్ అభినందనలు కార్యక్రమాన్ని అభినందిస్తూ పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి ఈ విధంగా పేర్కొన్నారు: సమాజంలో అత్యంత అవసరం ఉన్న వర్గాలకు చేయూతనందించే ఈ కార్యక్రమం నిజంగా ప్రశంసనీయం. హ్యూస్టన్ హెల్పింగ్ హాండ్స్ వంటి ప్రవాసాంధ్రుల సేవా భావం విశాఖకు గర్వకారణం. ఇలాంటి మంచికార్యాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.” అయన అభినందనలు కార్యక్రమానికి మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. యువతరం న్యూస్ ఉత్తరాంధ్ర ప్రతినిధి సూర్యనారాయణకు ప్రత్యేక అభినందనలు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో యువతరం న్యూస్ ఉత్తరాంధ్ర ప్రతినిధి సూర్యనారాయణ కృషి విశేషం. మొత్తం కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి ముగింపు వరకు స్వయంగా పర్యవేక్షించారు. పోలీస్ అధికారులు, నిర్వాహకులు, ప్రవాసాంధ్రులు, మీడియా ప్రతినిధుల మధ్య సమన్వయం అద్భుతంగా నిర్వహించారు. గ్రౌండ్ లెవెల్ నిర్వహణ, సమాచారం చేరవేత, అతిథుల సమన్వయం అన్నీ బాధ్యతగా నిర్వర్తించారు. నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందిస్తూ— “ఈ కార్యక్రమం సజావుగా, విజయవంతంగా సాగడానికి సూర్యనారాయణ సమన్వయపూర్వక కృషి కీలకం. యువతరం న్యూస్ తరఫున ఆయన చేసిన సేవ ప్రశంసనీయం” అన్నారు. ప్రవాసాంధ్రుల సేవాస్ఫూర్తి ప్రవాసాంధ్రులు— రాపర్తి శ్రీను, సాలాపు బాలరాజు, నాయుడు, దౌలూరు సాల్మన్ రాజు, రాపేటి సత్య, కర్ణం వరహాలు, పెంటకోట రమణ, కంబాల సూర్యప్రకాశ్, బోడీ కృష్ణ, పలిక రమణ, మొక శ్యాం, కడియాల సురేష్, గోటిముక్కల మౌలేశ్వరరావు, వడేగోర గణేష్, మద్ది వెంకట గురునాధరావు— అమెరికా నుంచే సమన్వయం చేసి, నిధులు అందించి, సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిర్వాహకుల సందేశం “మన ప్రజల్లో ఎవరైనా ఇబ్బంది పడితే అండగా నిలవడం మన కర్తవ్యం. విదేశాల్లో ఉన్నా, మన హృదయం మన ఊరుతోనే ఉంటుంది. చలిలో వణికే వారికి ఈ చిన్న సహాయం కొంత సాంత్వన అందిస్తుందని ఆశిస్తున్నాం” అని నిర్వాహకులు తెలిపారు. మీడియాకు ధన్యవాదాలు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు హ్యూస్టన్ హెల్పింగ్ హాండ్స్ ధన్యవాదాలు తెలిపింది. సమగ్ర సమన్వయం చేసిన సూర్యనారాయణ పాత్రను ప్రత్యేకంగా గుర్తించి అభినందించారు. స్థానిక సేవాసంస్థల అభినందనలు హ్యూస్టన్ ప్రవాసాంధ్రుల ఈ సేవా కార్యక్రమం, విశాఖలోని సేవాసంస్థలకు కూడా ప్రేరణగా నిలిచిందని వారు అభినందించారు.

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో మూడు జోన్ల వ్యవస్థ — ప్రభుత్వం కీలక నిర్ణయం

🔷 ఆంధ్రప్రదేశ్‌లో మూడు జోన్ల వ్యవస్థ — ప్రభుత్వం కీలక నిర్ణయం పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా పునర్వ్యవస్థీకరించింది. ప్రతి జోన్‌కి ప్రత్యేక అధికారి నియామకంతో కొత్త పరిపాలన విధానం అమలులోకి వచ్చింది. 🔹 కొత్త జోన్ల వివరాలు 1️⃣ విశాఖపట్నం జోన్ – మొత్తం 9 జిల్లాలు ఈ జోన్‌లో చేర్చబడ్డాయి. 2️⃣ అమరావతి జోన్ – ఈ జోన్‌లో 8 జిల్లాలు ఏర్పాటు చేశారు. 3️⃣ రాయలసీమ జోన్ – మొత్తం 9 జిల్లాలను రాయలసీమ జోన్‌లో చేర్చుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 🔹 రాయలసీమ జోన్‌లో ఉన్న జిల్లాలు (9) 1. అన్నమయ్య జిల్లా 2. వైఎస్సార్ కడప జిల్లా 3. తిరుపతి జిల్లా 4. కర్నూల్ జిల్లా 5. నెల్లూరు జిల్లా 6. నంద్యాల జిల్లా 7. అనంతపురం జిల్లా 8. శ్రీ సత్యసాయి జిల్లా 9. చిత్తూరు జిల్లా 🔹 రాయలసీమ జోన్‌కు కీలక నియామకం రాయలసీమ జోన్‌కు సీనియర్ IAS అధికారి కృష్ణబాబు గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా నియమితులయ్యారు.

తూర్పు గోదావరి

సూపర్ సిక్స్ – సూపర్ హిట్ ప్రతీ నెలా సక్రమంగా పింఛన్ల పంపిణీ జరుగుతుంది – MLA నల్లమిల్లి

తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. అనపర్తి, డిసెంబర్ 2 (పున్నమి ప్రతినిధి) : అనపర్తి ఏరియా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదంలో ఇళ్ళు కాలిపోయి గాయలై చికిత్స పొందుతున్న పెన్షన్ లబ్దిదారు వడ్డీ మేరీకి పెన్షన్ రూ.4000 మరియు బిక్కవోలు టిడిపి గ్రామ శాఖ ఆధ్వర్యంలో రూ.5000 లను అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బిక్కవోలు గ్రామ కూటమి నాయకులు. ఈ సందర్బంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ప్రతి నెలా ఒకటో తేదీన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరుగుతుంది. ముఖ్యంగా గతంలో వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే పింఛన్ల పంపిణీ జరగదని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. దానికి భిన్నంగా ఇవాళ సచివాలయ ఉద్యోగులు గాని వారికి సహకారం అందిస్తున్న కూటమి నాయకులు వల్ల కానీ సక్రమంగా పంపిణీ జరుగుతోంది దానికి ఒక ఉదాహరణ ఈరోజు ఇక్కడ జరిగిన వ్యవహారం. బిక్కవోలు తోటపేటకి చెందిన వడ్డీ మేరీ అనే మహిళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారు. వారి ఇల్లు గత నాలుగు రోజుల క్రితం అగ్ని ప్రమాదానికి గురవటం అగ్ని ప్రమాదానికి గురైన పరిస్థితులలో ఆవిడ ఒంటిపైన గాయాలు కావడం జరిగింది. ఆవిడ ఇక్కడ అనపర్తి ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఆ పెన్షన్ సచివాలయ ఉద్యోగి, కూటమి నాయకులు కలిసి వచ్చి ఇక్కడ అందివ్వడం జరిగింది. నాలుగు వేల రూపాయలు 12 గంటలకి ఇవ్వడం జరిగింది. ఉదయం అంతా గ్రామంలో 85 – 90% పెన్షన్ పంపిణీల కార్యక్రమం పూర్తిచేసి ఇప్పుడు ఈ విధంగా హాస్పిటల్ లో ఉన్న వారికి ఇబ్బందులలో ఉన్న వారికి గాని లబ్ధిదారులకు అందరికీ అందించే దిశగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సక్రమమైన విధానంలో ఇవాళ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అవసరం లేకుండా ఇవాళ ప్రభుత్వం సక్రమంగా పెన్షన్ల పంపిణీ చేస్తుంది. గతంలో దీనిని రూ.3000 పెన్షన్ ఇస్తానని దానికి నాలుగు సంవత్సరాలు సమయం తీసుకుంటే ఇవాళ రూ.4000 పెన్షన్ ఇస్తానని వచ్చిన 12 రోజులకే నిర్ణయం తీసుకుని సక్రమంగా ప్రతినెలా 1వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆరోజు సెలవు అయితే ముందు రోజునే సక్రమంగా పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి ఈరోజు జరిగిన సంఘటన ఉదాహరణ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ సూపర్ సిక్స్ ఏదైతే హామీలు ఇవ్వటం జరిగిందో సూపర్ సిక్స్ – సూపర్ హిట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అన్నారు.

E-పేపర్

బంగారు రుణాలపై తక్కువ వడ్డీ రేటు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వాసు

రైల్వేకోడూరు మండలం స్థానిక ఆర్ఎస్ రోడ్ బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వాసు, మాట్లాడుతూ మా ఖాతాదారులకు డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు కల్పిస్తున్నాము అంతేకాకుండా ఇంటిపై రుణాలు వాహన రుణాలు బంగారం పై రుణాలు వ్యాపారాలపై లోన్ సౌకర్యం కల్పించబడును. కావున ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము.

E-పేపర్

బంగారు రుణాలపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు తక్కువ వడ్డీ రేట్లు మేనేజర్ వాసు

రైల్వేకోడూరు మండలం స్థానిక ఆర్ఎస్ రోడ్ బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వాసు, మాట్లాడుతూ మా ఖాతాదారులకు డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు కల్పిస్తున్నాము అంతేకాకుండా ఇంటిపై రుణాలు వాహన రుణాలు బంగారం పై రుణాలు వ్యాపారాలపై లోన్ సౌకర్యం కల్పించబడును. కావున ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము.

అన్నమయ్య

అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తే ఆందోళన ఉదృతం చేస్తాం

-సిద్దవటం తహసీల్దారుకు వినతిపత్రం అందచేసిన జేఏసీ నాయకులు సిద్దవటం,డిసెంబర్ 01 పున్నమి ప్రతినిధి సిద్దవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తే ఆందోళన ఉదృతం చేస్తామని సిద్ధవటం జేఏసీ నాయకులు అన్నారు.సిద్ధవటాన్ని రాయచోటిలో కలపడం పట్ల సిద్దవటం జె.ఏ.సి సభ్యులు సోమవారం మండల వ్యాప్తంగా వందలాది మంది ప్రజల సంతాకాలు సేకరించి సిద్దవటం తహసీల్దారు ఆకుల తిరుమల బాబుకు వినతిపత్రం అందచేశారు.ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మాట్లాడుతూ సిద్దవటం మండలాన్ని యధావిధిగా కడపలోకే వుంచాలని లేదా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించి సిద్దవటం మండలాన్ని రాజంపేటలోకి కలపాలని తహసీల్దారు గారికి వినతిపత్రం అందచేశామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తహసీల్దారు కార్యాలయం ఎదుట రాయచోటి వద్దు కడప ముద్దు- రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అనే నినాధాలతో హోరెత్తించారు. మండలంలోని అన్ని పార్టీల నాయకులు ఉద్యమించాలని చాలా మంది నోరు విప్పి ముందుకు రావడం లేదని ఇలాగైతే వచ్చే స్దానిక ఎలక్షన్లలో ప్రజలు తగిన బుద్ది చెపుతారని అన్నారు. ఇప్పటికైనా నాయకులు ఉద్యమాన్ని ముందుండి నడిపించి పై స్దాయి నాయకులకు ప్రభుత్వ పెద్దలకు విన్నవించి సామాన్య ప్రజల పక్షాన నిలవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ఉన్న రైతులు, చేనేత కార్మికులు, విద్యావంతులు, మేధావులు, వ్యాపార వేత్తలు, స్వచ్చంద సంస్థ సభ్యులు, పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. జేఏసీ కార్యాచరణలో భాగంగా తదుపరి కడప జిల్లా కలెక్టరు గారిని కలసి వినతిపత్రం అందించ నున్నట్లు సభ్యులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.