Tuesday, 17 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు పొలాలను పరిశీలించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

*భారీవర్షాలకు మనుబోలు మండలంలో ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించిన సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి* *నష్టపోయిన రైతులను పకలరించి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చిన సోమిరెడ్డి* *అన్నదాతలతో పాటు పేదలకు జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ* *రాజగోపాల్ రెడ్డి వెంట ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ పొన్నూరు రామకృష్ణయ్య, రాజా, మరియుమనుబోలు మండల నాయకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నిండిపోయిన మనుబోలు పెద్ద చెరువు

04/12/2025 మనుబోలు పెద్ద చెరువు నిండిపోవడంతో చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలోకి నీళ్లు రాసాగాయి దీంతో నీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి ఆదేశాలతో రైతులు పెద్ద చెరువు కలుజులు పైకి తీస్తున్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బీఎస్పీ పార్టీ గడప గడప కార్యక్రమం నిర్వహించిన రాష్ట్ర మహిళ కన్వీనర్

ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో గడప గడప కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం బీఎస్పీ రాష్ట్ర మహిళ కన్వీనర్ క్రాకుటూరు పుష్పాoజలి పార్టీ గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గం కన్వీనర్ బెజవాడ ప్రకాష్ రావు చెన్నయ, మాధవ, మళ్ళీఖర్జునా తదితరులు పాల్గొన్నారు

తూర్పు గోదావరి

బిక్కవోలు మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఫ్యామిలీ క్రిస్మస్ వేడుక” లలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి

తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. బిక్కవోలు, 4 డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) : ముప్పిడి సామ్యూల్ రాజ్ మెమోరియల్ ఆడిటోరియంలో బుధవారం జరిగిన బిక్కవోలు మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఫ్యామిలీ క్రిస్మస్ వేడుక” లలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్బంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశంలో మాట్లాడుతూ… ఈరోజు ఫ్యామిలీ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి స్టేజి పైనున్న సంఘ పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందస్తు అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం డిసెంబర్ మాసం వచ్చిందంటే మనకు క్రిస్మస్ వేడుకలు మొదలవుతాయి. నెల రోజులపాటుగా ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకొని జనవరి ఒకటవ తేదీతో ఈ కార్యక్రమాలను ముగించుకోవడం జరుగుతుంది. ఎందువలన ఈ నెల రోజులపాటు నిర్వహించుకుంటామనేది అందరికీ తెలిసిన విషయమే క్రీస్తు అంటేనే వెలుగుకి చిహ్నం, ఒక వెలుగు చూపించడం కోసం, మానవాళిని రక్షించటం కోసం ఆయన అవతరించారనే సంగతి మన అందరికీ విధితమే. ముఖ్యంగా అతి తక్కువ కాలం జీవించిన వ్యక్తి కానీ అతి ఎక్కువ ప్రభావం మానవాళిపై చూపించిన ప్రవక్త ఎవరైనా ఉన్నారు అని అంటే అది క్రీస్తు అని మాత్రం చెప్పక తప్పదు. ఎందువలన అంటే ఆయన ప్రభావం ఎంత పెద్దగా ఉంది అని అంటే ఈరోజుకి కూడా మనం కాలాన్ని గణించేది క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఆధారంగానే మనం కాలాన్ని గణిస్తున్నాము. దీన్ని ప్రపంచమంతా పాటిస్తుంది అంత ప్రభావం చూపించిన మరొక వ్యక్తి లేరు. ఒక ఉదాహరణ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన మానవాళి జీవన విధానం ఎలా ఉండాలో బోధించడమే కాకుండా స్వయంగా ఆచరించి చూపించిన వ్యక్తి అనేది మనమందరం తెలుసుకోవాల్సిన విషయం, వారు అనేక బోధనలు చేశారు ఆయన అనేక కష్టాలను అనుభవించారు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఎక్కడా ఓర్పు, సహనం కోల్పోకుండా ప్రేమతో మానవుడు ఉండాలి అని ఉద్బోధించిన మహానుభావుడు క్రీస్తు అని చెప్పక తప్పదు. ఈ ప్రపంచంలో అతి తక్కువ కాలం జీవించి ఎక్కువ ప్రభావం మానవాళిపై చూపించిన వ్యక్తులు ముగ్గురే ముగ్గురు. ఒకటి క్రీస్తు అయితే రెండు స్వామి వివేకానంద మూడు ఆది శంకరాచార్యులు ఈ ముగ్గురూ కూడా దగ్గర దగ్గరగా 33, 34, 35 సంవత్సరాల లోపే వారు కాలం చేయడం జరిగింది. కానీ అందరినీ మించి క్రీస్తు ప్రభావం ప్రపంచమంతా చూపించే పరిస్థితి ఏర్పడింది. అంటే ఆయన అంత తక్కువ కాలంలో మనపై ఏ విధంగా ప్రభావం చూపించారు అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. మరి వారి బోధనలను ఇవాళ సంఘంలో ఉన్న పెద్దలు మానవులకు తెలియజేస్తూ మానవాళిలో ఒక జీవన విధానంలో మార్పు తీసుకుని రావాలి అందరూ ప్రేమగా సహనంతో ఓర్పుతో ఉండాలి పరులకు సహాయం చేయాలి అనే విషయాలని మీ అందరిలో నింపడం కోసం వారు తీవ్రమైన కృషి చేయడం జరుగుతుంది అటువంటి సందర్భంలో వారు చేస్తున్నటువంటి కృషికి నిజంగా ఈ సమాజం అంతా వారికి చేతులెత్తి ప్రణామం చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియచేసినారు. ఎన్నికల ముందు సంఘ పెద్దలందరిని విజయరావు గారు ఒకచోటకు చేర్చారు దాదాపు 450 – 500 మంది సంఘ పెద్దలను ఒకచోటకు చేర్చారు, ఆరోజు సమావేశానికి రావడం జరిగింది బహుశా అది నా అదృష్టమని భావిస్తున్నాను. ఎందువలన అంటే ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సమావేశానికి క్రీస్తు సంఘ పెద్దలు 500 మంది హాజరు కావడం అనేది బహుశా భారత దేశ చరిత్రలో ఏ అభ్యర్థికి దక్కని గౌరవం అని నేను భావిస్తున్నాను. అటువంటి గౌరవాన్ని సంఘ పెద్దలు అందరూ నాకు ఇచ్చారు, దానికి ముఖ్యమైన కారకులు మా విజయరావు గారు. ఆరోజు స్పష్టంగా నేను ఒకటే చెప్పడం జరిగింది నేను భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను భారతదేశ రాజ్యాంగం ప్రకారం శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ వేసేటప్పటికి ఒక ప్రమాణం చేస్తారు, ఆ ప్రమాణం ఏంటంటే లౌకిక విధానానికి అనుగుణంగా, భారత రాజ్యాంగానికి అనుగుణంగా నేను ప్రమాణం చేసి నామినేషన్ దాఖలు చేశా. అదేవిధంగా ఒకవేళ నేను శాసనసభ్యునిగా ఎన్నికైనట్లయితే శాసనసభలో భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని నేను ప్రమాణం చేసి బాధ్యతలను తీసుకుంటాను. భారత రాజ్యాంగం అంటే లౌకిక విధానం అన్ని మతాలకి అన్ని కులాలకి అన్ని ప్రాంతాలకి సమాన ప్రాతినిధ్యం వహించే రాజ్యాంగం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం ప్రకారం గాని నేను చేసేటప్పుడు శాసనసభ్యుడిగా నేను నా విధి నిర్వహణను నిర్వర్తించాలి తప్ప వేరే విధంగా ప్రవర్తించే పరిస్థితి ఉండదు అని వారికి ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను 2014-19 మధ్య కాలంలో శాసనసభ్యునిగా ఉండగా కూడా లేదా అంతకుముందు మా తండ్రిగారు నాలుగు పర్యాయాలు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉన్నారు. శాసనసభ్యులుగా ఉండగా మేము ఏ విధంగా ప్రవర్తించాం ఏ విధంగా మా విధానాలు ఉన్నాయని ఈ పెద్దలందరికీ తెలుసు, కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున నాకు మద్దతు ఇవ్వటంతో అనపర్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి 20 వేల మెజారిటీతో గెలవడం అంటే అది మీ అందరి వల్ల సాధ్యమైంది అని మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా మైనారిటీ సోదరులందరూ కూడా ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు సంపూర్ణమైన మద్దతు తెలియజేసి నన్ను శాసనసభ్యునిగా ఎన్నుకున్నందుకు మరొకమారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు సమావేశానికి రమ్మని ఆహ్వానించినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల, గ్రామ కూటమి నాయకులు, బిక్కవోలు మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

అన్నమయ్య

భగవద్గీత పోటీలో జోనల్ విజేతగా మెరిసిన శ్రీ అన్నమాచార్య విద్యార్థిని హారికా రెడ్డి

రాష్ట్ర స్థాయి భగవద్గీత పోటీలో శ్రీ అన్నమాచార్య అకాడమీ విద్యార్థిని ఓ. హారికా రెడ్డి జోనల్ విజేతగా నిలిచి పాఠశాల పేరు ప్రఖ్యాతులు చాటింది. శివ దర్శనానంద స్పిర్చువల్ ట్రస్ట్, ప్రొద్దుటూరు నిర్వహించిన ఈ పోటీలో దాదాపు 150 మంది విద్యార్థులు ప్రతిభను ఆవిష్కరించగా,హారికా రెడ్డి అత్యుత్తమ ప్రతిభతో తొలి స్థానాన్ని దక్కించుకుంది. హారికా విజయంపై పాఠశాల కరస్పాండెంట్ సమ్మెట శివప్రసాద్ స్పందిస్తూ మా సంస్థ విద్యా ప్రమాణాలకు ఇది నిదర్శనం.హారికా రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలనే ఆకాంక్ష ఉంది అని అభినందనలు తెలిపారు. డైరెక్టర్లు మాడపూరి హేమలత, బాల ఆంజనేయులు,సమ్మెట ఉమామహేశ్వరరావు, రిటైర్డ్ ఎల్ఐసి ఏవో మాడపూరి సుబ్బరాయుడు, ఉపాధ్యాయురాలు లలితతో పాటు అధ్యాపక వర్గం ఈ విజయాన్ని సంతోషంగా జరుపుకున్నారు.విజేతను కరస్పాండెంట్ సమ్మెట శివప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు.

అన్నమయ్య

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని ఏకగళ స్వరం

అన్నమయ్య జిల్లా కేంద్ర సాధన సమితి పిలుపుతో రాజంపేట పాత బస్టాండ్ సర్కిల్ నుంచి ప్రారంభమైన జేఏసీ ర్యాలీ అపూర్వంగా విజయవంతమైంది. రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల నాయకులు, మహిళలు,విద్యార్థులు, వివిధ సంఘాలు,రాజకీయ పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రాజంపేటనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ గళమెత్తారు.ఈ ర్యాలీలో జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ప్రముఖంగా పాల్గొన్నారు. అనంతరం రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కలిసి సబ్ కలెక్టర్ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాస రాజు మాట్లాడుతూ రాజంపేటకు రోడ్డు, రైల్వే, విమాన సౌకర్యాలు సమృద్ధిగా ఉండటం,అన్నమయ్య నడయాడిన తాళ్లపాక గ్రామానికి అత్యంత సమీపంలో ఉండటం, ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయం వంటి ప్రభుత్వ కార్యాలయాలు రాజంపేటలో ఉండటం,అలాగే రాజంపేట పార్లమెంటు ప్రధాన కేంద్రం కావటం ఇవన్నీ రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించడానికి అవసరమైన అర్హతలన్నీ రాజంపేటకే ఉన్నాయని తెలిపారు.గత పాలకులు స్వప్రయోజనాల కోసం జిల్లా కేంద్రాన్ని వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసారని,ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజల న్యాయమైన అభిలాషను గుర్తించి రాజంపేటనే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,రాజకీయ పార్టీలు,విద్యాసంస్థల ప్రతినిధులు,వ్యాపార వర్గాలు, కుల,విద్యార్థి సంఘాల నాయకులు మరియు ప్రజలు భారీగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

అన్నమయ్య

చెన్నయ్యగారిపల్లి బోరు నీటి సమస్యపై మెడా విజయ శేఖర్ రెడ్డి తక్షణ స్పందన

అన్నమయ్య జిల్లా నందలూరు మండలం చెన్నయ్యగారిపల్లి గ్రామంలో బోరు నీటి సమస్యను గ్రామస్థులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మెడా విజయ శేఖర్ రెడ్డికి తెలియజేయగా, ఆయన వెంటనే స్పందించి సమస్య స్థలానికి చేరుకున్నారు.గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన,సమస్య తీవ్రతను అంచనా వేసి తక్షణ చర్యలు ప్రారంభించారు.స్థానిక పరిస్థితులపై గ్రామ పంచాయతీ కార్యదర్శి సంపత్‌తో సమావేశమైన మెడా విజయ శేఖర్ రెడ్డి, బోరు మరమ్మత్తు పనులను అత్యవసరంగా,త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ ప్రజలు నీటి కోసం ఇబ్బందిపడకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.ప్రజల సమస్యల పరిష్కారం పట్ల నాకున్న కట్టుబాటు ఎల్లప్పుడూ అదే ఉంటుంది. ఏ సమస్య అయినా వెంటనే నాకు తెలియజేయండి,మీ సమస్యల్ని త్వరగా పరిష్కరించేలా పనిచేస్తాను అని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు.చెన్నయ్యగారిపల్లిలో బోరు మరమ్మత్తు కోసం అవసరమైన సాంకేతిక సహాయం యంత్రాంగం కూడా వేగంగా అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.గ్రామస్థులు తమ సమస్యపై వెంటనే స్పందించి వచ్చి పరిష్కార చర్యలు ప్రారంభించినందుకు మెడా విజయ శేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పొంగిన పొట్టేళ్ల కాలువ

04/12/2025 మనుబోలు మండలంలో నీ గొట్ల పాలెం వద్ద పొంగిన పొట్టేళ్ల కాలువ:పొదలకూరుకు నిలిచిపోయిన రాకపోకలు: భద్రతా చర్యలు చేపట్టిన వీఆర్వో గుణశేఖర్

రంగారెడ్డి

మమ్మల్ని భారం అనుకోవద్దు.. భాగస్వాములుగా గౌరవించండి ఎన్పి ఆర్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగ రెడ్డి షాద్ నగర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

పున్నమి: రంగారెడ్డి జిల్లా: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆపేయ అనురాగాలతో వేడుకలను జరుపుకున్నారు.జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి భుజంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి జేర్కొని రాజు నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో దివ్యాంగ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆశన్నగారి భుజంగారెడ్డి మాట్లాడుతూ…దివ్యాంగులను సమాజం బాధితులుగా కాకుండా సమాన భాగస్వాములుగా గుర్తించాలి. వారికి ఇతరులతో సమాన హక్కులు, అవకాశాలు, గౌరవం లభించాలి. కానీ ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయి.దివ్యాంగుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేస్తూ, సమాన అవకాశాలు కల్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ చరిత్రను గుర్తుచేస్తూ ఆయన మాట్లాడుతూ…1976లో ఐక్యరాజ్యసమితి 1981ని అంతర్జాతీయ దివ్యాంగుల సంవత్సరంగా, 1983-92 మధ్య కాలాన్ని దివ్యాంగుల దశాబ్దంగా ప్రకటించింది. 1992 నుంచి ప్రతి డిసెంబరు 3న ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు.దివ్యాంగుల గౌరవం, హక్కులు, శ్రేయస్సు కోసం అవగాహన పెంచడం, వారిని రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవనంలో భాగస్వాములను చేయడమే ఈ దినోత్సవ లక్ష్యమని వివరించారు.కళలు, విజ్ఞానం, క్రీడలు, ఆవిష్కరణలు , ఏ రంగంలోనైనా దివ్యాంగులు అద్భుతాలు సాధిస్తున్నారు.వారి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ వేడుకల ఉద్దేశ్యం.కానీ ప్రభుత్వాలు ఈ సామర్థ్యాన్ని గుర్తించకుండా, వివక్షతతో వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల కోసం ప్రకటించిన పథకాలను సంపూర్ణంగా అమలు చేయాలని, వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా నాయకులు మొగదాటి ప్రమోద్, దిర్షిణం శంకర్, మూర్తి, సీమ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

కృష్ణ యూనివర్సిటీ అంతర్ కళాశాల వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల

కృష్ణ యూనివర్సిటీ వాలీబాల్ మహిళా జట్టు విజేత శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళ కళాశాల….. 3. 12. 2025 వ తేదీన జరిగిన కృష్ణ యూనివర్సిటీ అంతర్ కళాశాల వాలిబాల్ పోటీలు శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో నిర్వహించడం జరిగినది. ఈ టోర్నమెంటులో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వాలీబాల్ జుట్టు విజేతగా నిలిచినది అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం కుమార్ గారు తెలిపారు. సిద్ధార్థ మహిళా కళాశాల ప్రథమ స్థానంలోనూ, పద్మావతి మహిళా కళాశాల(మచిలీపట్నం) ద్వితీయ స్థానంలోనూ …మేరీస్ స్టెల్ల కళాశాల (విజయవాడ), తృతీయ స్థానంలోనూ…. పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నాలుగవ స్థానంలోనూ నిలిచాయి. P. అంకిత (థర్డ్ బిఎ). S. సంజన S. దీప్తి D .దీవెన . D. దివ్య (SECOND BA) N. మహేశ్వరి వి. తనుశ్రీ లను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి కుమార్ గారు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ హేమ ,కోచ్, మరియు యాజమాన్యం. .. కళాశాల సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ హేమ మాట్లాడుతూ చెన్నై లో డిసెంబర్ 15వ తేదీ నుంచి 19.2025 వరకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరగబోయే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఉమెన్ వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొనబోతున్నారని తెలియజేశారు ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ హేమాను, వాలీబాల్ టీం ను ….సిబ్బందిని కళాశాల ప్రిన్సిపల్ అభినందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.