Monday, 16 March 2026

Blog

అన్నమయ్య

నాగవరం హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్

పాత కక్షల దాడి కేసు – రిమాండ్‌కు తరలింపు చిట్వేల్, డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి చిట్వేల్ మండలంలో పాత కక్షల నేపథ్యంలో మన్నూరు పవన్ కుమార్ రెడ్డిపై చాకుతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.డిసెంబర్ 2, బుధవారం సాయంత్రం నాగవరం గ్రామంలో జరిగిన ఈ హత్యాయత్నం కేసులో నిందితుడైన జగదాబి ప్రసాద్ రాజు వయస్సు: 38 తండ్రి: లేట్ నాగ రాజు, కులం: క్షత్రియ, వృత్తి: వ్యవసాయం, నివాసం: దేవుని నాగవరం)ను పోలీసులు అరెస్ట్ చేశారు.రైల్వే కోడూరు సీఐ శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు, చిట్వేల్ పోలీస్ స్టేషన్ ఏఎస్సై యంగయ్య ఆధ్వర్యంలో పోలీసు బృందం గురువారం మధ్యాహ్నం నిందితుడిని అరెస్ట్ చేసింది.అరెస్టు చేసిన అనంతరం, ముద్దాయి జగదాబి ప్రసాద్ రాజు ను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించినట్లు చిట్వేల్ పోలీసులు తెలియజేశారు. గతంలో జరిగిన భూ వివాదాలు, పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

అన్నమయ్య

చిట్వేల్ – రాపూరు రోడ్డుపై సబ్‌కలెక్టర్ హెచ్‌.ఎస్‌. భావన పర్యటన

-వరద ఉధృతిని పరిశీలించి అధికారులకు తక్షణ ఆదేశాలు – రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం చిట్వేల్, డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా, రాజంపేట సబ్‌కలెక్టర్ హెచ్‌.ఎస్‌. భావన గురువారం చిట్వేల్ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ముఖ్యంగా, చిట్వేల్ – రాపూరు – నెల్లూరు రోడ్డు ఆర్ అండ్ బి మార్గంలో అనంపల్లి చెక్‌పోస్ట్ వద్ద నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న సమస్యలను ఆమె పరిశీలించారు. -అధికారులతో సమీక్ష రహదారిపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాన్ని సబ్‌కలెక్టర్ గారు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆమె సంబంధిత శాఖాధికారులతో తక్షణ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో రోడ్డు మీదుగా నీటి ప్రవాహాన్ని అడ్డుకునే అంశాలను గుర్తించి, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారిని త్వరగా పునరుద్ధరించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చిట్వేల్ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నిఖిల్ కుమార్, చిట్వేల్ ఏఎస్‌ఐ వెంగయ్య, ఆర్‌ అండ్ బి అసిస్టెంట్ ఇంజనీర్ నరేంద్ర, అలాగే గ్రామ రెవెన్యూ అధికారి సుధాకర్ పాల్గొన్నారు.

అన్నమయ్య

నేడు చిట్వేల్‌కు ఖాదీ చైర్మన్‌ కె.కె. చౌదరి

నేడు చిట్వేల్‌కు ఖాదీ చైర్మన్‌ కె.కె. చౌదరి -ఎంపీటీసీ 3.0 కార్యక్రమానికి హాజరు, కూటమి నేతలతో భేటీ చిట్వేల్, డిసెంబర్ 4: పున్నమి ప్రతినిధి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల చైర్మన్‌ కె.కె. చౌదరి శుక్రవారం (నేడు) చిట్వేల్‌ మండలంలో పర్యటించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేశ్‌ ఆదేశాల మేరకు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. -ముఖ్య కార్యక్రమాలు: సమయం:ఉదయం 10:00 గంటలకు. ప్రదేశం:చిట్వేలి జెడ్‌పీ హైస్కూల్‌. కార్యక్రమం:ఇక్కడ నిర్వహిస్తున్న “మెగా పేరెంట్స్‌ అండ్‌ టీచర్స్‌ డే (ఎంపీటీసీ) 3.0″కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. -కూటమి నేతలతో భేటీ: మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు చైర్మన్‌ కె.కె. చౌదరి చిట్వేలిలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో అందుబాటులో ఉంటారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక తెదేపా, జనసేన, భాజపా (కూటమి) నాయకులతో సమావేశమై ప్రాంతీయ అంశాలు, పార్టీ వ్యవహారాలపై చర్చించనున్నారు.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్ పై ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇండ్లలో సోదాలు.

*రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్ పై ఏసీబీ సోదాలు.* *ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇండ్లలో సోదాలు.* పున్నమి న్యూస్ ప్రతినిధి 4 డిసెంబర్ 2025 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : హైదరాబాద్ , రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న సోదాలు. రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు. ల్యాండ్ రికార్డ్స్ ఈడిగా పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తింపు. మహబూబ్నగర్ లో ఒక రైస్ మిల్లును కూడా గుర్తించిన అధికారులు. పలుచోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తింపు. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం తో పాటు రాయ్ దుర్గ మై హోమ్ భూజా లో సోదాలు చేస్తున్న (రంగారెడ్డి ల్యాండ్ రికార్డ్స్ ఏడి, శ్రీనివాస్) అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గురువారం ఆయన్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడీ శ్రీనివాస్ ఇళ్లు, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. ఏడీ శ్రీనివాస్కు రాయదుర్గం మైహోం భుజాలో ప్లాట్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, ఏపీలోని అనంతపురంలో మరో 11 ఎకరాల వ్యవసాయ భూమి, మహబూబ్నగర్లో నాలుగు ఎకరాలు, నారాయణపేటలో మూడు ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు.. ఇంట్లో రూ.5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 770 పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలకు సంబంధించిన పూర్తి తెలియాల్సి ఉంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*మర్రిపాడులో ఘనంగా దివ్యాంగుల దినోత్సవ వేడుకలు*

(పున్నమి ప్రతినిధి)* ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను మర్రిపాడు మండల విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి నాగేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ దివ్యాంగులలో అంతర్గతంగా ఎన్నో దివ్యమైన శక్తులు దాగి ఉంటాయని,వాటిని వెలికి తీయడానికి తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు కృషిచేయాలని అన్నారు.ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు తిరుపతయ్య,ధనలక్ష్మి,ఫిజియోథఫీ వైద్యులు రఫీ,రిసోర్స్ పర్సన్ రాజేంద్రకుమార్,సహిత విద్య ఉపాధ్యాయులు రషీద్,విజయలక్ష్మి,సీ.ఆర్.ఎం.టీ ఉపాధ్యాయులు,మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది,తల్లిదండ్రులు,దివ్యాంగ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సర్వేపల్లి లో హై లెవెల్ వంతెన మిస్టరీ

వెంకటాచలం (పున్నమి, డిసెంబర్ 04):– తిరుమలమ్మపాలెం హై లెవెల్ వంతెన నిర్మాణం ఎక్కడ ఆగిపోయిందో తెలుసుకోవడానికి జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. 2018లో ఆనాటి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 9 కోట్లతో వంతెన శిలాఫలకం వేశారు. 2019లో వైసిపి గెలిచిన తర్వాత ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేసినట్లు బొబ్బేపల్లి ఆరోపించారు. 13 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పినా, వంతెన మాత్రం కనిపించడం లేదు… ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి? వంతెన ఎక్కడ ఉంది? అని ఆయన ప్రశ్నించారు. తీవ్ర వర్షాల వల్ల తిరుమలమ్మపాలెం రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజల సమస్యలు చూస్తూ ప్రభుత్వం ఎలా మౌనంగా ఉంది? అని బొబ్బేపల్లి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

వడ్డేశ్వరంలో డిసెంబర్18 నుంచి రాష్ట్ర యువజనోత్సవాలు యువతలో నైపుణ్యాల వెలికితీతే యువ–2025 లక్ష్యం : కమిషనర్ భరణి

యువతలో నిక్షిప్తమైన ప్రతిభను వెలికితీయడమే రాష్ట్ర యువజనోత్సవం యువ– 2025 ప్రధాన లక్ష్యమని యువజన సేవల శాఖ కమిషనర్ ఎస్.భరణి తెలిపారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోని శాప్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆమె పాత్రికేయుల సమావేశం లో మాట్లాడారు. డిసెంబరు 18,19,20 తేదీల్లో గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలను “యూత్ ఫర్ స్వర్ణాంధ్ర” థీమ్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ థీమ్ యువత ఆలోచనలు, సృజనాత్మకత, ప్రతిభ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి జిల్లా స్థాయి విజేతలు పాల్గొంటారని, మొత్తం 700 మందికి పైగా యువత రాష్ట్ర స్థాయి పోటీల్లో పోటీ పండిస్తున్నారని తెలిపారు. 15–29 ఏళ్ల మధ్య వయస్సు కలిగినవారికి పోటీలు ఉంటాయని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి సాధించినవారిని జాతీయ యువజనోత్సవం–2026లో పాల్గొనడానికి పంపుతామని వెల్లడించారు. భారత ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జానపద నృత్యం, జానపద గానం, పెయింటింగ్, ప్రకటన రచన, కవితా రచన, కథా రచన, ఆవిష్కరణ–సైన్స్ మేళా వంటి ఏడు విభాగాల్లో పోటీలు జరుగుతాయని వివరించారు. విజేతలకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలతో పాటు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేస్తామని చెప్పారు. ఈవెంట్‌లో గ్రాండ్ కార్నివల్ పరేడ్, ప్యానెల్ డిస్కషన్లు, యూత్ కాన్, యూత్ ఇంపాక్ట్ ల్యాబ్స్ నిర్వహిస్తామని, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఢిల్లీ పాలసీ నిపుణులు, వైద్యులు, సివిల్ సర్వెంట్స్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ పాల్గొంటారని ఆమె వివరించారు. CII, I-WIN, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు అసోసియేషన్లు, NSS, స్వచ్ఛంధ సంస్థలు, కమ్యూనిటీ ఆర్గనైజేషన్లు కూడా భాగస్వామ్యం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన డిజిటల్ మారథాన్ #AndhraYuvaSankalp2k25 ఫైనల్స్, బహుమతి కార్యక్రమం కూడా మహోత్సవంలో జరుగుతుందని చెప్పారు. యువత “స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో, వికసిత్ భారత్ నిర్మాణంలో ఇంటెలెక్సువల్ వారియర్స్‌గా తీర్చి దిద్దుకోవాలి’’ అని రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారని కమిషనర్ భరణి తెలిపారు. అనంతరం యువ–2025 ఈవెంట్ కర్టెన్‌రైజర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ఏపీ యూత్ సర్వీసెస్ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల సీఈవోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి

రామారెడ్డి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నోముల సందీప్‌కు నీలం చిన్న రాజులు ఘన మద్దతు

కామారెడ్డి,4 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల పోరులో బలం మరింత పెరిగే సంకేతాల మధ్య, రామారెడ్డి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నోముల సందీ ప్‌కు బీకామారెడ్డి నీలం చిన్న రాజులు బహుముఖ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా నీలం చిన్న రాజులు మాట్లాడుతూ, నోముల సందీప్ పట్ల తమ పూర్తి విశ్వాసం ఉన్నద ని, గ్రామ అభివృద్ధికి ఆయన అంకితభావంతో పనిచేస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం భారతీయ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో గ్రామ పంచాయతీలకు ప్రతివంద వరకు నిధులు జారీ చేస్తోందని, ఎనర్జీ, సబ్బునీటి ప్రాజెక్టులు వంటి అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా ముమ్మ రంగా సాగుతున్నాయని తెలిపారు.జిల్లా అధ్యక్షు లు గ్రామ ప్రజలను నోముల సందీప్ గుర్తు బ్యాట్ గుర్తుతో ఓటు వేసి అతనిని అత్యధిక మెజారిటీతో విజయం సాధించేందుకు ఆకాంక్షించారు. ప్రచారం లో బీజేపీ మాజీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థికి ఘన మద్దతు ప్రకటించారు.ఈ విజయ భవిష్యత్తు రామారెడ్డి గ్రామానికి కొత్త ఆశయాలకు గాలిచ్చేలా ఉంటుందని ఎన్నికల వాతావరణంలో బీజేపీ నేతల ఆత్మవిశ్వాసమే స్ఫూర్తిగా నిలిచిందన్నారు.

అన్నమయ్య

నేడు చిట్వేల్‌లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0

-ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలి: ఎంఈఓలు ఖాజా మొహిద్దీన్, ఈశ్వరయ్య చిట్వేల్, డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిట్వేల్ మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0ను తప్పనిసరిగా నిర్వహించాలని మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈఓలు) ఖాజా మొహిద్దీన్ మరియు ఈశ్వరయ్య లు తెలియజేశారు. -సక్రమ నిర్వహణకు ఆదేశాలు ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్ మరియు నియమ నిబంధనల ప్రకారం ఈ సమావేశాలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలపై ఉందని ఎంఈఓలు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థి ప్రగతి, పాఠశాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, విద్యా ప్రమాణాల మెరుగుదల వంటి అంశాలపై చర్చించనున్నారు.మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీనికి సంబంధించిన నివేదికను మండల విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించాలని అధికారులు ఆదేశించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.