Monday, 16 March 2026

Blog

విశాఖపట్నం

లోకో రన్నింగ్ సిబ్బంది 48 గంటల నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది”

“లోకో రన్నింగ్ సిబ్బంది 48 గంటల నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది” *విశాఖపట్నం డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి:-* అఖిల భారత లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (AILRSA) కేంద్ర వర్కింగ్ కమిటీ నిర్ణయం మేరకు, లోకో రన్నింగ్ సిబ్బంది తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా 02-12-2025 ఉదయం 10 గంటల నుండి 04-12-2025 ఉదయం 10 గంటల వరకు 48 గంటల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని క్రూ లాబీలు, డీఆర్‌ఎం కార్యాలయాల ఎదుట నిర్వహించారు. అదేవిధంగా వాల్తేరు డివిజన్‌లో డీఆర్‌ఎం కార్యాలయం, వాల్తేరు వద్ద ఈ నిరాహార దీక్ష కార్యక్రమం జరిగింది. రన్నింగ్ సిబ్బంది రైళ్ల విధుల్లో పాల్గొంటూ “నేను 48 గంటల నిరాహార దీక్షలో ఉన్నాను” అనే బ్యాడ్జీలు ధరించి 04-12-2025 ఉదయం 10 గంటల వరకు నిరాహార దీక్షను కొనసాగించారు. ప్రధాన డిమాండ్లు: 1. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్‌ను వెంటనే ఉపసంహరించాలి. 2. 01-01-2024 నుండి TA రేట్లు పెరిగిన తరహాలో కిలోమీటరేజ్ భత్యాన్ని 25% పెంచాలి. 3. కిలోమీటరేజ్ అలవెన్సులో 70%ను ఆదాయపు పన్ను నుండి మినహాయించాలి. 4. ALP భర్తీ ప్రక్రియ (RRB–2025) మరియు శిక్షణ ప్రక్రియ (RRB–2024)ను వేగవంతం చేయాలి. 5. రన్నింగ్ స్టాఫ్ టర్న్ అరౌండ్ / హెడ్‌క్వార్టర్స్ అబ్సెన్స్ 48 గంటల లోపు ఉండేలా చేసి, దానిని మరింతగా 36 గంటలకు తగ్గించాలి. 6. క్రూ నైట్ డ్యూటీని వరుసగా రెండురాత్రులకే పరిమితం చేయాలి. 7. సిబ్బంది దీర్ఘకాల పని గంటలను నిలిపివేసి, సైనింగ్ ఆన్ నుండి సైనింగ్ ఆఫ్ వరకు గరిష్టంగా 10 గంటలకే పరిమితం చేసి, దానిని 8 గంటలకు తగ్గించాలి. 8. పీరియాడికల్ రెస్ట్ 16+30 గంటలు అంటే మొత్తం 46 గంటలు తప్పనిసరిగా అమలు చేయాలి. 9. లోకో క్యాబ్‌లలో టూల్ బాక్స్ మరియు FSD సదుపాయం ఏర్పాటు చేయాలి. వాల్తేరు డివిజన్‌లో లోకో రన్నింగ్ సిబ్బంది స్థానిక సమస్యలు: • లోకో పైలట్లను 12 గంటల డ్యూటీకి బలవంతంగా వినియోగించడం, అలాగే 16 గంటల విశ్రాంతికి బదులుగా కేవలం 12 గంటల ట్రిప్ రెస్ట్ మాత్రమే ఇవ్వడం తక్షణం నిలిపివేయాలి. • సింహాచలం నార్త్, విజయనగరం వద్ద హెడ్‌క్వార్టర్స్ లేదా రిలీఫ్ పాయింట్‌లను అండర్ యుటిలైజేషన్, యార్డ్ కాంగెషన్ పేరుతో బైపాస్ చేయడం నిలిపివేయాలి. • DPWCS (లోటస్) లోకో పేరిట అసిస్టెంట్ లోకో పైలట్ లేకుండా లోకో పైలట్‌ను పని చేయమని బలవంతం చేయడం ఆపాలి. • లోకో పైలట్‌తో కలిసి పని చేసిన తర్వాత అసిస్టెంట్ లోకో పైలట్‌కు రిలీవ్ ఇవ్వకుండా వివక్ష చూపడం ఆపాలి. • సైడింగ్స్ నుండి GDR చెక్స్ లేకుండా, TXR సిబ్బంది పరీక్ష లేకుండా లాంగ్ హాల్ రైళ్లను క్లియర్ చేయడం నిలిపివేయాలి. • ఒకే ట్రైన్ ఆర్డర్‌లో బహుళ రైళ్లను నడపమని సిబ్బందిపై ఒత్తిడి చేయడం ఆపాలి. • పూర్తిగా అసురక్షితమైన K.K లైన్‌లో డౌన్‌లోడెడ్ లాంగ్ హాల్ రైళ్లను నడపడం నిలిపివేయాలి. • MIPM, SCMN, VZM అవుట్ స్టేషన్ సిబ్బందిని PSA & RGDA వద్ద విశ్రాంతి తీసుకున్న తర్వాత షార్ట్ ట్రిప్స్ లేదా షటిల్ ట్రైన్లకు వినియోగించడం వల్ల హెడ్‌క్వార్టర్స్ నుంచి ఎక్కువగా దూరమవుతున్నారు – ఇది నిలిపివేయాలి. • డ్యూటీ గంటల కుదింపు, విడగొట్టడం పూర్తిగా ఆపాలి. • అన్ని హ్యాండిక్యాప్డ్ సెక్షన్లలో కనీస గ్యారంటీ కిలోమీటర్ అలవెన్స్ 120 కిలోమీటర్లు ఇవ్వాలి. • RGDA రన్నింగ్ రూమ్‌లో కాంట్రాక్టర్‌కు మేలు చేసే విధంగా ప్రవేశపెట్టిన ఫిక్స్‌డ్ మీల్స్ సిస్టమ్‌ను వెంటనే రద్దు చేయాలి. ఈ సందర్భంలో, ఒక మెమోరాండం గౌరవ భారత రైల్వే మంత్రి గారికి, రైల్వే బోర్డు చైర్మన్ గారికి న్యూఢిల్లీకి పంపబడింది. మరో మెమోరాండం స్థానిక సమస్యలపై డీఆర్‌ఎం–వాల్తేరు గారికి సమర్పించబడింది. ఈ కార్యక్రమానికి అఖిల భారత స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ డివిజనల్ సెక్రటరీ శ్రీ పాణికుమార్, అఖిల భారత గార్డ్స్ కౌన్సిల్ డివిజనల్ సెక్రటరీ శ్రీ వర్మ, ఈ.కో.ఆర్.ఎస్‌.యూ జనరల్ సెక్రటరీ శ్రీ ఆర్.సి.సాహో, జోనల్ ప్రెసిడెంట్ శ్రీ సంపత్ తదితరులు సంఘీభావం ప్రకటిస్తూ మాట్లాడారు. AILRSA జోనల్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్.కె. హూబే, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వి.ఎస్.వి.బి. రాజు దీక్ష ముగింపు సభలో ప్రసంగించి, అన్ని డిమాండ్ల సాధన కోసం ఐక్య పోరాటాలు అవసరమని పిలుపునిచ్చారు. విశాఖపట్టణ యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ, CITU విశాఖ జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీ జగన్ మాట్లాడుతూ, ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, 21-12-2025 నుండి 4 లేబర్ కోడ్స్ అమలు చేయడం, లోకో రన్నింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించకపోవడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం వంటి అంశాలను తీవ్రంగా విమర్శించారు. ఐక్య పోరాటాలకు పిలుపునిచ్చారు. 48 గంటల నిరాహార దీక్షను విజయవంతంగా పూర్తి చేసిన సిబ్బందిని అభినందిస్తూ వారికి నిమ్మరసం అందించి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమం శ్రీ ఎస్.సి. పాణిగ్రాహి (డివిజనల్ ప్రెసిడెంట్), బివి.ఎస్.వి. రాజు (సెంట్రల్ జాయింట్ సెక్రటరీ), హరికృష్ణ (జాయింట్ డివిజనల్ సెక్రటరీ), ఎం. చిన్నోడు (AILRSA, వాల్తేరు) నాయకత్వంలో నిర్వహించబడింది.

విశాఖపట్నం

దక్షిణ నియోజకవర్గం జోన్ – 4 కార్యాలయం లో డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయ ప్రారంభోత్సవం*.

*దక్షిణ నియోజకవర్గం జోన్ – 4 కార్యాలయం లో డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయ ప్రారంభోత్సవం*. *డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, గౌరవ కలెక్టర్ హరేందర్ ప్రసాద్ గారు* *ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికిన జిల్లా స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు*. *కార్యాలయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*. *విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి:- * ఈరోజు డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు…..వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. అందులో భాగంగా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు గత 5 సంవత్సరాల వైసిపి పాలనలో రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ కార్యాలయాలను సర్వనాశనం చేసిందని ఎమ్మెల్యే గారు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు నుంచి ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి జరగకుండా పారదర్శకంగా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రథమ లక్ష్యం……ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో మొదట నిలబడాలనేదే ప్రధమ ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం శ్రీ శ్రీ శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు సందర్శించారు. కార్యక్రమంలో స్థానిక భక్తులతో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. గురువారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారని తెలిపారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలత్తకుండా క్యూ లైన్ భక్తులు ఆగకుండా వెళ్లే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు….

E-పేపర్

పుల్లంగేరు ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్ నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ సి.హెచ్ భావన

పుల్లంగేరు ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్ నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ సి.హెచ్ భావన పుల్లంగేరు నుండి పుల్లంపేట, మరియు పుత్తనవారిపల్లి చెరువులుకు ఎన్నో దశాబ్దాలుగా నీళ్లు రాని తరుణంలో రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మరియు,కు.డా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన కలెక్టర్ నిశాంత్ కుమార్ గారికి తెలియజేయడంతో వెంటనే స్పందించి ఈరోజు పుల్లంపేట రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న కాలువ పనులను పరిశీలించి,అనంతరం అప్పయ్య రాజుపేట పంచాయతీ పెరయవరంఅరుంధతి వాడ దగ్గర ఉన్న చెక్ డ్యామ్ ను, మరియు పుల్లంగేరు ప్రవాహాన్ని పరిశీలించారు. పుల్లంగేరు నుండి నుండి కాలువలు పూడిపోయి చెరువులకు నీళ్లు రాకుండా ఉంటే పరిశీలించి, తమదృష్టికి తీసుకురావాలని,కాలువలతో అన్ని చెరువులు నిండేటట్లు చూడాలని ఇరిగేషన్ ఏ.ఈ. ఈ నాగేంద్ర నాయక్ ను ఆదేశించారు. అలాగే పుల్లంపేట మండలంలో చెరువులకు ఎక్కడైనా గండ్లుపడి నీరు వృధా అయ్యే పరిస్థితి ఉంటే ప్రమాదాన్ని ముందే గమనించి తగు చర్యలు తీసుకోవాలని పుల్లంపేట మండల తహసిల్దార్ పుల్లారెడ్డిని ఆదేశించారు.కలెక్టర్ గారు జోరువర్షాన్ని కూడా లెక్కచేయకుండా పుల్లంపేట మండలంలో పర్యటించినందుకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాపెర్ల చంద్రశేఖర్ నాయుడు ధన్యవాదములు తెలియజేశారు. రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ముక్కారూపానంద రెడ్డి గారు, పుల్లంపేట మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టారని,అందులకు కలెక్టర్ గారు కూడా సహకరించి పుల్లంపేట మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని కోరగా అందులకు కలెక్టర్ నిశాంత్ కుమార్,సబ్ కలెక్టర్ సి.హెచ్ భావన గారు సానుకూలంగా స్పందించి సమస్యలను మా దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కలెక్టరు పర్యటన లో ఏ.వో శ్రీధర్ రెడ్డి,ఆర్.ఐ రాజశేఖర్ మరియు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ నేలపాటి రామచంద్రయ్య నాయుడు,మాజీ మండలాధ్యక్షులు ఆరే సుధాకర్ నాయుడు,పోలూరు కృష్ణమ నాయుడు,బత్తిన వేణుగోపాల్ రెడ్డి,క్లస్టర్ ఇంచార్జ్ చుండు ఈశ్వర్ నాయుడు,యూనిట్ ఇన్చార్జి అణపాలచంద్ర, సెక్రటరీ జీ.కేసుబ్బారెడ్డి,ఆదినారాయణ రెడ్డి,శంకర్ రెడ్డి,రామచంద్రారెడ్డి, మాదినేనిబలరామయ్యనాయుడు,పోలు ప్రేమకుమార్,కుప్పాల రామకృష్ణయ్య,మల్లికార్జున,ఒలేటి వెంకట్,బాలకృష్ణ,రామయ్య, మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు యన్.డి.ఏకూటమి నాయకులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంపై కమిషనర్ సమీక్ష

జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంపై కమిషనర్ సమీక్ష విశాఖపట్నం డిసెంబర్ 04 పున్నమి ప్రతినిధి:- నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయానికే పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జీవీఎంసీ ప్రధానకార్యాలయం సమావేశ మందిరంలో జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం పై అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, ప్రధాన ఇంజనీరు సత్యనారాయణ రాజు, పర్యవేక్షక ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ నగరంలో జీవీఎంసీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు త్వరతగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పబ్లిక్ వర్క్లు, మెకానికల్ పనులు, తాగునీటి సరఫరా మొదలైన వాటిపై సుధీర్ణంగా చర్చించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అలాగే అభివృద్ధి పనుల అంచనాలను తయారు చేసేటప్పుడు పూర్తి వివరాలను పొందుపరచాలన్నారు. నగరంలో ప్రధాన రహదారులకు అదనంగా స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారని, సేఫ్టీ కమిటీ నిర్ణయం మేరకే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రాంట్లు, బడ్జెట్లకు అనుగుణంగా అవసరం ఉన్నచోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సంబంధించి ఎంత కేటాయింపు జరిగింది ఎంత ఖర్చు చేశారు. ఎంత విడుదల కావలసి ఉంది అని అధికారులను ఆరా తీశారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల ఆలస్యంపై కమిషనర్ అధికారులను అడిగి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పి.జె.ఆర్.ఎస్. లో రోడ్లు పై గుంతలు కాలువలు తాగునీటి విభాగంపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. నీటి చార్జీలు, భూగర్భ డ్రైనేజీ చార్జీలు వసూలు చేయాలని, సుదీర్ఘకాలం నీటి చార్జీలు చెల్లించని వారి నీటి కనెక్షన్లకు ముందుగా నోటీసులు జారీ చేసి అనంతరం తొలగించాలని ఆదేశించారు. అనంతరం బీచ్ రోడ్ ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పలు ప్రాజెక్టుల అమలుపై ఎస్ ఆర్ యు టీం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కమిషనర్ తిలకించారు. APUIML, SRU టీం, ఇంజనీరింగ్ విభాగంతో సంయుక్తంగా విశాఖ నగర అభివృద్ధికి పలు వినూత్న ప్రాజెక్ట్ లను సూచించి తగు ప్రణాలికలను సిద్దం చేయాలన్నారు. ఈ సమీక్షలో జీవీఎంసీ కార్యనిర్వహక ఇంజనీర్లు ఉపకార్య నిర్వహణ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం 

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం

*శ్రీకాకుళం డిసెంబర్ 4( విశాఖ పున్నమి ప్రతినిధి)* విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం పైడిభీమవరం వద్ద ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పార్టీ శ్రేణులు, ప్రజలకు అభివాదం చేసిన మంత్రి నారా లోకేష్. కార్యకర్తలు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, ఫోటోలు దిగిన మంత్రి శ్రీకాకుళం కొత్తరోడ్ జంక్షన్ వద్ద ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో స్వాగతం పలికిన పార్టీ నాయకులు, ప్రజలు ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం కూన ప్రమీల, జనసేన ఇంఛార్జ్ పేడాడ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన మంత్రి లోకేష్

విశాఖపట్నం

ఈ నెల 6న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విశాఖ రాక*

*ఈ నెల 6న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విశాఖ రాక* *విశాఖపట్నం డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి:- * ఈ నెల 6,7వ తేదీలలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ శ్రీ నజీర్ విశాఖపట్నం లో పర్యటించ నున్నారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 8.00 గంటలకు వాయు మార్గం ద్వారా విశాఖపట్నం చేరుకొని అక్కడ నుండి నోవాటెల్ కు చేరు కుంటారు. మద్యాహ్నం 12.45 గంటలకు నోవాటెల్ నుండి బయలుదేరి మధురవాడ లోని ACA-VDCA క్రికెట్ స్టేడియంకు వెళ్తారు. రాత్రి 10.00 గంటలకు స్టేడియం నుండి నోవాటెల్ హోటల్ కు చేరుకుని రాత్రి బస చేస్తారు. 7వ తేది మధ్యాహ్నం 1.45 గంటలకు ఎయిర్ పోర్ట్ కు చేరుకుని వాయు మార్గం ద్వారా విజయవాడ వెళ్తారు.

విశాఖపట్నం

రాష్ట్ర ఎన్నికల సంఘం CEO విశాఖలో పర్యటన*

రాష్ట్ర ఎన్నికల సంఘం CEO విశాఖలో పర్యటన* *విశాఖపట్నం డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి:- * ఈ నెల 5, 6,7వ తేదీలలో రాష్ట్ర ఎన్నికల సంఘం CEO వివేక్ యాదవ్ విశాఖపట్నం ఎ.యస్.ఆర్. జిల్లాలలో పర్యటిస్తారు .ఆయన ఈ నెల 5వ తేదీ రాత్రి వాయు మార్గం ద్వారా విశాఖపట్నం చేరుకుంటారు. 6వ తేది ఉదయం విశాఖపట్నం కలెక్టరేట్ లోని ఓటర్ల జాబితా కు సంబంధించిన అంశాలపై ERO, AERO లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 7వ తేది అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించి పోలింగ్ స్టేషన్ లు తనిఖీ చేస్తారు. 8 వ తేదీ విజయవాడ వెళతారు.

విశాఖపట్నం

భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖపట్నం (NARI 2025) గుర్తింపు

*విశాఖపట్నం డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి:-* భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖపట్నం (NARI 2025) గుర్తింపు పొందిన సందర్భంగా విశాఖపట్నం బీచ్ లో ర్యాలీలో పాల్గొన్న హోం మంత్రి అనిత. అనంతరం ఏ.యూ. కన్వెన్షన్ హాల్ లో సమావేశంలో పాల్గొన్న హోం మంత్రి. మహళల భద్రతతే ఎన్డియే ప్రభుత్వం లక్ష్యం. సంఘటన జరిగిన వెంటనే శిక్షలు పడుతున్నాయి. విశాఖ అంటే ఎంతో సుందరమైన నగరం. విశాఖపట్నం అనునిత్యం పర్యాటకులతో రద్దీగా ఉంటుంది. విశాఖ రోజురోజుకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖపట్నం గుర్తింపు పొందడం సంతోషం. పోలీస్ ఉద్యోగంలో సంతృప్తి చాలా ఎక్కువుగా ఉంటుంది. శక్తి టీమ్స్,శక్తి యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. శక్తి టీమ్స్ ఎంతో సమర్థవంతంగా పని చేస్తున్నాయి. పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఎన్డియే ప్రభుత్వంలో ఫోక్సో కేసుల్లో పురోగతి కూడా చూస్తున్నాం. గంజాయి,డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాం. ప్రభుత్వం ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. మీరు మీ వంతుగా గంజాయి,డ్రగ్స్ పై అవగాహన కల్పించండి. పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించడం వలన సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అమ్మకు చెప్పలేనంత పని పిల్లలు చేయకూడదని చాగంటిగారు చెప్పారు. విశాఖ ప్రగతిని జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన విశాఖ పోలీసులను అభినంధించిన హోం మంత్రి అనిత. నేరస్తులకు తక్కువ సమయంలో శిక్ష పడేలా చేసిన అధికారులను సన్మానించిన హోం మంత్రి అనిత.

Blog

తాడివాండ్లపల్లె ప్రజలకు సహాయ సహకారాలు అందించిన వై ఎస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి

తాడివాండ్లపల్లె ప్రజలకు సహాయ సహకారాలు అందించిన వై ఎస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు మండలం విపిఆర్ కండ్రిక పంచాయతీ అయ్యవారిపల్లి తాడివాండ్లపల్లె పల్లె చుట్టుపక్కల ఉన్న వాగులు వంకలు చెరువులు నిండి ఆ నీళ్లంతా ఊరు మీద ప్రవహించడంతో అక్కడ ఉన్న ప్రజలు ఆందోళన చెందినారు గతవారం నుంచి పడుతున్న వర్షంకు అధికారులు స్పందించకపోవడంతో గ్రామ ప్రజలు వైయస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి కి సమాచారం చెప్పగానే వెంటనే ఆయన స్పందించి అక్కడికి కావలసిన జెసిబిలు ట్రాక్టర్లు పంపించి పొంగి పోరులుతున్న నీటిని చెరువులకు కాలువలకు మళ్లించడం జరిగినది. వైయస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజ రెడ్డి మీ కు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా నేను చేస్తానని మాట ఇవ్వడం జరిగినది. అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రజలందరూ కలసి రామిరెడ్డి ధ్వజారెడ్డి నీ అభినందించడం జరిగినది ఆయనకు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము అని చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కుoచెం హరి వార్డు మెంబర్ ,పలిగల వెంకటేశు, చంటి, నాగరాజు, కిరణ్ మొదలగువారు పాల్గొన్నారు.

అన్నమయ్య

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చిట్వేల్, డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, రైల్వే కొడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ప్రత్యేకంగా ముందుకు వచ్చారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి, రాజంపేట ప్రాంత ప్రజల ఆశయాలను వివరించారు. ఈ సందర్భంగా, రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న ప్రజల బలమైన కోరికను ప్రతిబింబించే వినతిపత్రాన్ని ఉప ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే శ్రీధర్ అందజేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ మాట్లాడుతూ, రాజంపేట చాలా ఏళ్లుగా జిల్లా కేంద్రానికి అర్హత కలిగిన ప్రాంతమని,పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి వేగవంతం కావడం, ప్రజా అవసరాలు తీరడంలో ఇది కీలకమని,ఈ నిర్ణయం స్థానిక ప్రజల కలల సాకారం అవుతుందని వెల్లడించారు.వినతిపత్రాన్ని స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల అభిలాషను గౌరవిస్తూ ఈ అంశాన్ని ప్రభుత్వం స్థాయిలో సమీక్షిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకోవడంతో స్థానికంగా రాజకీయ వర్గాలు, ప్రజాసంఘాలు విశేష ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.