Monday, 16 March 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

అన్నమయ్య జిల్లా… శాకoవారిపల్లిలో ఘనంగా జరిగిన ప్రతిష్టాత్మక తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం….3.0..

అన్నమయ్యజిల్లా వాల్మీకిపురం మండలం గ్రామం లోని మండల ప్రజాపరిషత్ పాఠశాలలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మక తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం….3.0.. జరిగినది. ఈ సందర్భంగా పాఠశాల ప్ర ధానోపాధ్యాయురాలు అయినవోలు కృష్ణవేణి మాట్లాడుతూ *మాతృదేవోభవ ,పితృదేవోభవ ,ఆచార్యదేవోభవ * ….. పిల్లలకు తల్లిదండ్రులు మొదటి గురువులు అని వారిలోని ప్రతిభను వెలికి తీసుకుని వచ్చే బాధ్యత అందరిదీ అని వారి ప్రతిభను సాన పెడితే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని ఆకాంక్షించారు. తదుపరి ఉపాధ్యాయులు జి.మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ ఆటపాటలతో ఆర్జించే విజ్ఞానం ఆనందాన్ని ,ఆరోగ్యాన్ని ఇస్తుంది అని కొనియాడారు. తల్లితండ్రులు ఉపాధ్యాయులు కృషిని కొనియాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరల్డ్ డిజేబుల్ డే కార్యక్రమంలో ఏపీసీ – పాఠశాల అభివృద్ధిపై సమీక్ష

ఇందుకూరు పేట డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి) ఇందుకూరుపేట మండలంలోని భవిత సెంటర్‌లో జరిగిన వరల్డ్ డిజేబుల్ డే కార్యక్రమాన్ని గౌరవ ఏపీసీ గారు, జిల్లా IE కోఆర్డినేటర్ పొట్లూరు ప్రసాద్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి అధికారి ప్రశంసలు తెలిపారు. అనంతరం కొత్తూరు హైస్కూల్‌ను సందర్శించి PM Shri స్కూల్‌లోని కెమిస్ట్రీ ల్యాబ్ పనితీరును సమీక్షించారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి బోధన ప్రమాణాలు, విద్యార్థుల హాజరు, ప్రయోగశాల వినియోగంపై కీలక సూచనలు, సలహాలు అందించారు.

కర్నూలు

Dr. br అంబేద్కర్ గారి 69 వ వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలమాల వేయడం జరిగింది

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూర్ గ్రామం పున్నమి ప్రతినిధి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూర్ గ్రామంలో ఈ రోజు DR.br అంబేద్కర్ గారి 69 వ వర్థంతి సందర్భంగా గ్రామంలో ఉన్న యువకులు పెద్దలు అందరూ కలిసి మన రాజ్యాంగ గ్రహీత ఐనటి వంటి మన DR.br అంబేద్కర్ గారికి పులమలతో నివాళి అర్పించడం జరిగింది

జాతీయ అంతర్జాతీయ

*కెనడా టొరంటోలో – డర్‌హమ్ తెలుగు క్లబ్ (డి.టి.సి)

ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడిన – డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ 2025(ఫ్యామిలీ ఫెస్టివల్ 2025)* కెనడాలోని డర్‌హమ్ తెలుగు క్లబ్ (DTC) ఆధ్వర్యంలో, కార్తీక మాసపు వనభోజన కాన్సెప్ట్‌తో “డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ 2025:” వేడుకలు టొరంటోలోని మ్యాక్స్‌వెల్ హైట్స్ సెకండరీ స్కూల్, ఓషావా ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి సుమారు 800కి పైగా తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నాయి కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా అపర్ణా రంభోట్ల సంతోష్ కుంద్రు, అలాగే యువ వ్యాఖ్యాతలుగా ఆశ్రిత పోన్నపల్లి, శిరి వంశికా చిలువేరు, శ్రేయస్ ఫణి పెండ్యాల వ్యవహరించారు. డి.టి.సి ఎగ్జిక్యూటివ్ కమిటీసభ్యులు నరసింహారెడ్డి గుత్తిరెడ్డి, రవి మేకల, వెంకటేశ్వర్ చిలువేరు, రమేష్ ఉప్పలపాటి, శ్రీకాంత్ సింగి శెట్టి, గుణశేఖర్ కోనపల్లి, యుగంధర్ చెరుకురి, గౌతమ్ పిడపర్తి, వసుదేవ‌కుమార్ మల్లుల, కమల్ మూర్తి, సర్దార్ ఖాన్ చెరుకు పాలెం, శివరామ్ మోహన్ పసుపులేటి గార్ల చేతులమీదుగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. తరువాత కెనడా జాతీయ గీతం మరియు మా తెలుగు తల్లి గీతంతో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. తదుపరి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్ని వయసుల పిల్లలు, కళాకారులు అద్భుతమైన నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, సంప్రదాయ కళారూపాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ వేడుకలో డి.టి.సి కుకింగ్ షో మరియు డి.టి.సి కిడ్స్ ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. విజేతలు మరియు పాల్గొన్న వారికి Advanced Physio వారి బహుమతులు గ్రాండ్ స్పాన్సర్‌గా తూసి వినయగమూర్తి అందజేశారు. డి.టి.సి కల్చరల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు గారు మాట్లాడుతూ, మన సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో ఇలాంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. కెనడాలో నివసిస్తున్న తెలుగు సమాజం చూపుతున్న ఐక్యత, సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మన భారత సాహితి, సంపద ఉత్సవాలను కెనడా లో ఘనంగా జరపడం మన అదృష్టం గా భావిస్తున్నానని డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు గారు గుర్తు చేసారు ఈ వేడుకలకు విశిష్ట అతిథులుగా డా. బాబీ యానగావా గారు (ఎం.డి, పీహెచ్.డి, ఎఫ్.ఆర్.సి.ఎస్.సి), డివిజన్ హెడ్ – కార్డియాక్ సర్జరీ, సెయింట్ మైకేల్ హాస్పిటల్ విచ్చేశారు. ఆయన కార్డియో ఆరోగ్యం మరియు కుటుంబ ఆరోగ్యంపై విలువైన సూచనలు అందించి డర్‌హమ్ తెలుగు క్లబ్ (డి.టి.సి) కుటుంబ సభ్యులకు మరింత ఆరోగ్య సంరక్షణ గురించి అందరికీ ఉపయోగపడే విషయాలను చక్కగా వివరించారు. ఈ సందర్భంగా డీ.టి.సి ఎక్సలెన్సీ అవార్డులు అందజేయబడ్డాయి. డా. బాబీ, డా. శరత్ గుండల, డా. శ్రీవాణి గుండల గారి చేతుల మీదుగా డి.టి.సి కమ్యూనిటీ సర్వీస్ ఎక్సలెన్సీ అవార్డు – శ్రీమతి ఉషా నడుఱి గారికి, డి.టి.సి ఆర్ట్స్ మ్యూజిక్ & క్లాసికల్ డాన్స్ ఎక్సలెన్సీ అవార్డు – చిన్నారి సిరి వంశిక చిలువేరు కి, డి.టి.సి ఆర్ట్స్ & సింగింగ్ ఎక్సలెన్సీ అవార్డు – చిన్నారి శ్రేయస్ ఫణి పెండ్యాలకి, అందజేసారు. ముగ్గురు అవార్డు గ్రహీతలకు DTC తరఫున సత్కారం చేసి, వారి ప్రతిభను అభినందించారు. కార్యక్రమ విజయానికి చేయూతనిచ్చిన ప్రాయోజకులను DTC సంస్థ శాలువాలతో సత్కరించింది. ఈ సందర్భంగా గ్రాండ్ స్పాన్సర్‌గా తూసి వినయగమూర్తి, ఫుడ్ స్పాన్సర్స్‌గా సింప్లీ సౌత్ రెస్టారెంట్ – ఓషావా (రామ్ & సస్య పెడ్డి) గార్లు సహకరించారు. సిల్వర్ స్పాన్సర్స్‌గా రామ్ జిన్నాల, గెట్ హోమ్ రియాల్టీ (రమేష్ గోలు, ఆనంద పెరిచెర్ల), రఘు జులూరి, భారత్ లా గార్లు మద్దతు అందించారు.అలాగే సపోర్టింగ్ స్పాన్సర్స్‌గా అడ్వాన్స్ ఫిజియో (గౌతమ్ పిడపర్తి), డా. శరత్ గుండల, డా. పద్మజరాణి కొంగరా, డా. సౌజన్య కసులా, దేశీ కార్ట్ గ్రోసరీస్ (రాజశేఖర్), సివమ్మ టిఫిన్స్, బండీ మేడ బజ్జి (శ్రవంతి), నమస్తే ఇండియా సూపర్ మార్కెట్ – ఏజాక్స్ (యోగేశ్ జీ), షోబి డెకోర్స్, పవన్ పీ.కె ఫోటోగ్రఫీ వంటి ప్రాయోజకులు ఈ కార్యక్రమానికి విలువైన సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా గ్రేటర్ టొరాంటో ఏరియా(జీ.టీ.ఏ) లోని పలు తెలుగు సంఘాల ప్రతినిధులను డర్‌హమ్ తెలుగు క్లబ్ (DTC) వారు ఆహ్వానించి వారిని సత్కరించారు. ఈ సందర్భంలో DTC ప్రెసిడెంట్ శ్రీ నరసింహారెడ్డి గుత్తిరెడ్డి మాట్లాడుతూ: “తెలుగు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించే దిశగా, గ్రేటర్ టొరాంటో ఏరియా(జీ.టీ.ఏ) లోని అన్ని సంస్థలు పనిచేస్తున్నాయి అని పేర్కొన్నారు. అంతేకాక, డర్‌హమ్ తెలుగు క్లబ్ (డి.టి.సి) సమాజ కార్యక్రమాలు, వినూత్న ప్రోగ్రామ్స్, ఎక్సలెన్సీ అవార్డులు, సహకార కార్యక్రమాల విజయానికి ప్రాయోజకులు అందిస్తున్న మద్దతుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే, డర్‌హమ్ తెలుగు అసోసియేషన్ (డీ.టి.ఏ) నుండి శ్రీమతి స్వాతి మీర్యాల గారు, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (ఓ.టి.ఎఫ్) నుండి శ్రీ ప్రవీణ్ నీలా గారు, బర్చ్‌మాంట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ (బి.ఎఫ్.సి) నుండి – శ్రీ జగపతి రాయల గారు, శ్రీ సూర్య కొండేటి, టొరంటో తెలుగు కమ్యూనిటీ (టి.టి.సి) నుండి – శ్రీ విజయ కుమార్ కోట గారు, క్లారింగ్టన్ హిందూ అసోసియేషన్ మరియు డర్‌హమ్ హైదరాబాదీ అసోసియేషన్ నుండి వారి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని, డర్‌హమ్ తెలుగు క్లబ్ (DTC) వారు తెలుగు సమాజానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ కార్యక్రమంలో తెలుగింటి భోజనం, తినుబండారాలు, తేనీరు విందును సింప్లీ సౌత్ – ఒషావా సౌజన్యంతో అందించారు. అలాగే, డర్‌హమ్ తెలుగు క్లబ్ (డి.టి.సి) వారు 20 కిపైగా బహుమతులతో రాఫెల్ డ్రా విజయవంతంగా నిర్వహించారు. డీటీసీ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి గారు మాట్లాడుతూ – ఏ దేశమేగినా ఎందుకాలిడిన ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్న భావంతో, తెలుగు సంస్కృతి, ఐక్యత, ఆనందాలతో నిండిన డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ 2025 కార్యక్రమం కెనడా టొరంటోలో ఘనంగా విజయం సాధించింది. చివరగా డి.టి.సి కల్చరల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు గారు డి.టి.సి కార్యకర్తలు, స్పాన్సర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు, వందన సమర్పణలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు

కామారెడ్డి

ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

కామారెడ్డి, 06డిసెంబర్,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి యి గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి వేడుక లు ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆదర్శ పురు షుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు, అర్పించినివాళులు అర్పించారు.స్థానిక నాయకు లు, యువత,రైతులు సహా పాల్గొని, ఆయన సంఘ సంస్కరణలకు ఘన నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ,, బాబాసాహెబ్ రాజ్యాంగ రచన, అస్పృశ్యత నిర్మూలన పోరాటాలను గుర్తు చేశారు. ప్రత్యేకంగా మహిళా సంఘాలు, యువ సంఘాలు, అంబేద్కర్ సిద్ధాంతాలు గ్రామీణ జీవితాల్లో అమలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల స్పందనకుల్వాయి ప్రజలు ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం వల్ల గ్రామంలో ఐక్యత, సామాజిక న్యాయ భావనలు మరింత పెరిగాయి. డా. అంబేద్కర్ ఆదర్శాలు తెలంగాణ గ్రామాల్లో జీవించాలని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఇలాం టి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తాయని నాయకులు చెప్పారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ కొత్తల గంగారం సొసైటీ డైరెక్టర్ నారాయణరెడ్డి రాజకీయ నేతలు, అంబేద్కర్ సంఘం నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

జోగులాంబ గద్వాల

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన.అంబేద్కర్ సంఘం

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన.అంబేద్కర్ సంఘం… డిసెంబర్ 6వ తేదీన ఈరోజున ఆయన భారత రాజ్యాంగ రూపకల్పనలో చేసిన కృషి, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ దేశవ్యాప్తంగా, వర్ధంతి నిర్వహిస్తారు.. ఈరోజు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చిన్న తాండ్రపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని స్మరించుకుంటూ గ్రామ పెద్దలు యువకులు ప్రజలందరూ పాల్గొన్నారు..

E-పేపర్

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జట్ల రాజను పరామర్శించి ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ. న

రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 05: ఇటీవలే కంటి శాస్త చికిత్స చేయించుకున్న రౌతులపూడి మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జట్ల రాజా ను ప్రతిపా నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. రౌతులపూడి మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పైల వేణుగోపాల్, రౌతులపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తమరాల సత్యనారాయణ, రౌతులపూడి మండల అధ్యక్షురాలు గంటి మల్ల రాజ్యలక్ష్మి, మాజీ ఎంపీపీ ఇట్టం శెట్టి సూర్య భాస్కర బాబు, పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తెలుగు చలనచిత్ర గానవిభూషణం – ఘంటసాల వెంకటేశ్వరరావు స్మరణ సందర్భం గా సంకీర్తనా కళా సమితి వాట్స్ అప్ గ్రూప్ మెంబర్స్ వినమ్ర నివాళులు

తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచానికి చిరస్మరణీయమైన వెలుగు పంచిన గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటున్నాం. స్వరసాహిత్య సమ్మేళనానికి ప్రతిరూపంగా నిలిచిన ఘంటసాల గారు, సంగీతాన్ని భగవద్గీతలా భావించి ప్రతి తరం గుండెల్లో నిలిచిపోయే అమర గానాలు అందించారు. భక్తి, భవగీత, దేశభక్తి, జనపదం—ఏ శైలినైనా తన ప్రత్యేక స్వరంతో అద్భుతంగా మలిచిన సంగీతవిద్వాంసుడు. తెలుగు కళారంగానికి ఆయన చేసిన సేవలు అపూర్వమైనవి. బిరుదాంకితుడైన ఈ మహానుభావుడి జయంతి సందర్భంగా, ఆయన త్యాగం, సంప్రదాయం, సంగీతానికి చూపిన నిబద్ధతకు సంకీర్తన కళా సమితి వాట్సప్ గ్రూప్ మెంబర్స్ తరుపున ప్రసాద్ బాబు హృదయపూర్వక వినమ్ర నివాళులు అర్పించారు

E-పేపర్

ఘనంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం.

రౌతులపూడి,( పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 05: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రశ్నాత్మకంగా చేపట్టిన మెగా( పిటిఎం ) తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మండలంలోని రౌతులపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రౌతులపూడి మండల అధ్యక్షురాలు గంటి మల్ల రాజ్యలక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులచే పలు సంస్కృతిక కార్యక్రమాలు చేశారు. అనంతరం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో క్రీడల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ షేక్ సలీం మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి పాఠశాలను తలదన్నేలా ఈ మెగాపిటీఎం నిర్వహించిన స్కూలు ప్రధానోపాధ్యాయుడు కోళ్ల రాంబాబును పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందిని ఆయన అభినందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి పెట్టాలని తద్వారా వాళ్ల ఉన్నతికి తోడ్పడిన వారు అవుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పైల సాంబశివరావు, మాజీ ఎంపీపీ ఇట్టం శెట్టి భాస్కర బాబు, నీటి సంఘాల చైర్మన్ పైల రాజేష్, శెట్టి రమణ, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ బండారు సత్తిబాబు, మండల విద్యాశాఖ అధికారులు సతీష్ బాబు, గాడి కొండబాబు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు నాగమణి, వెంకటలక్ష్మి ములకపూడి పీహెచ్సీ డాక్టర్ సౌందర్య, మరియు స్కూలు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు కార్యాలయంలో ప్రభుత్వ అధికారి వి ఆర్ ఓ సస్పెండ్

దుత్తలూరు మండల లో VRO గా పనిచేస్తున్న చింతల చెరువు శ్రీనివాసులు సస్పెండ్ చేస్తూ జిల్లా ఉన్నతాదికారులు ఆదేశాలు జారీచేశారు ఈ వివరాలను దుత్తలూరు తహశీల్దార్ యనమల నాగరాజు VRO గా గతంలో ఏరుకొల్లు పనిచేస్తున్న సమయంలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడంతో పాటు ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించాడని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు విచారణలో నేరం రుజువు కావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు .

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.