Saturday, 2 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బీస్పీ రాష్ట్ర మహిళ క్రాకటూరు పుష్పంజలి, మరియు పార్టీ వారు

కావలి నియోజకవర్గం లోని అల్లూరు మండలం వెలిచర్ల గ్రామానికి సంబంధించిన భూ సమస్యలను అధికారులతో కలిసి భూములను సందర్శించి సమస్య ఫై ప్రాతి నిద్యం చేశారు అనంతరం ఆ గ్రామ ప్రజలను సమావేశపరిచి బహుజన పార్టీ గురించి, మాయావతి గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అధికారులు, బీస్పీ రాష్ట్ర మహిళ పుష్పంజలి,కన్వీనర్ టీ కృష్ణా,మరియు అడ్వైజర్, తదితరులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ నో షో..! ఐసీసీ సంచలన నిర్ణయం

2026 ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ జట్టు తప్పుకుంది. భారత్లో తమకు భద్రతా ముప్పు ఉందని పేర్కొంటూ తమ మ్యాచ్‌లను పూర్తిగా శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేందుకు ఐసీసీ ఇచ్చిన 24 గంటల గడువును కూడా బంగ్లాదేశ్ అంగీకరించలేదు. ఫలితంగా ఐసీసీ నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు ఈ మెగా టోర్నీలో పాల్గొనే అవకాశం లభించింది. ఈ పరిణామం క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేపింది. Uploaded Video:

తెలంగాణ

చుక్క అనసూర్య దశ దిన కార్యక్రమములో పాల్గొని పూల మాల వేసి నివలర్పించిన సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రాజేష్ కుమార్ మరియు నాయకులు*

*పున్నమి ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పట్టణం వరలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు చుక్క అప్పారావు తల్లి చుక్క అనసూర్య దశ దిన కార్యక్రమములో పాల్గొని అనసూర్య చిత్రపటానికి పూల మాల వేసి నివలర్పించిన కొత్తగూడెం నియోజకవర్గం సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రాజేష్ కుమార్ మరియు సంగ అశోక్,గుంజి భాను, సత్తార్,అజీజ్, సాయి తేజ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

గూడూరు

ఎస్ కే ఆర్ లో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం & స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర

గూడూరు : ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఆధ్వర్యంలో (జనవరి 25) జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సింహాద్రి మాట్లాడుతూ 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నదని, అర్హులని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, విద్యార్థిని విద్యార్థులు తమ పరిసర ప్రాంతాలలో ఓటర్ గుర్తింపు కార్డు తీసుకోని వారిని పేరు నమోదు చేసుకునేటట్లు చూడాలని సూచించారు. అనంతరం కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర అధ్యాపకులు రవిరాజు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పోరాడి పొందిన హక్కు ఓటు హక్కు అని, ప్రతి ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర వహిస్తుందని అటువంటి ఓటును విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, డాక్టర్ కే. శివప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణరాజు, అధ్యాపకులు డాక్టర్ ఝాన్సీ వాణి, డాక్టర్ గోవిందు సురేంద్ర, శ్రీధర్ శర్మ, డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ విజయ్ మహేష్, డాక్టర్ శైలజ, డాక్టర్ పీర్ కుమార్ తదితర అధ్యాపక సిబ్బంది అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. # స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర # ఎస్.కే.ఆర్ కళాశాలలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి, ప్లాస్టిక్ రహిత, చెత్త రహిత, ఆకుపచ్చని పరిసరాలను పెంపొందించడం మొదలైన అంశాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా పరిసరాలను సంరక్షిస్తామని అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానంలో ఘనంగా క్షీరాభిషేకం–అన్నదానం.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి( పున్నమి ప్రతినిధి).మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి క్షీరాభిషేకం, నూతన పట్టు వస్త్రాల సమర్పణతో పాటు విశ్వనాథ స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. వేమారెడ్డి వంశీకృష్ణ రెడ్డి–మోనిషా దంపతులు తమ కుమారుడు హనీష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

రాజన్న సిరిసిల్ల

ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యం అన్న జిల్లెల్ల గ్రామ సర్పంచ్

ప్రజల ఆరోగ్యమే గ్రామ సౌభాగ్యం అన్న జిల్లెల్ల. గ్రామ సర్పంచ్ ఇల్లంతకుంట/పున్నమిప్రతినిధి జనవరి 24 జిల్లెల్ల గ్రామ సర్పంచ్ దుబ్బాక రజిత రమేష్ గారి ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్ బి.ఎన్.రావు టీం ఈరోజు జిల్లెల్ల గ్రామపంచాయతీ ఆవరణలో జిల్లెల గ్రామ ప్రజల కోసం ప్రజల బాగుకోసం నిర్వహించినటువంటి హెల్త్ క్యాంపుకు విశేషమైన స్పందన లభించింది వీరి కృషికి ఈరోజు దాదాపుగా 450 పైగా ఓపీ కేసులు అదేవిధంగా అందులో 125 ఈసీజీ మరియు105 2D ఈకో చేయడం జరిగింది ఈ కృషికి ముఖ్యంగా జిల్లెల్ల గ్రామ సర్పంచ్ దుబ్బాక రజిత రమేష్ & ఉప సర్పంచ్ మొగిలి కరుణాకర్ గారికి పాలకవర్గ సభ్యులకు గ్రామ ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రజలందరూ తన పరిసరాలు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని మంచి ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉంటేనే అదే మనకు విలువైన సంపద అని సర్పంచ్ గారు ప్రజలకు తెలియజేశారు ఈ ఆరోగ్యం పైన ప్రజలకు కల్పించారు ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకు వివిధ అధికారులకు ముఖ్యంగా వైద్య అధికారులకు వైద్య సిబ్బందికి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

E-పేపర్

నిరుపేద కుటుంబానికి 1,64000 వేలు ఆర్థిక సహాయం అందచేసిన మేడిపల్లి నక్కర్త గ్రామ ప్రజలు.

*నిరుపేద కుటుంబానికి 1,64000 వేలు ఆర్థిక సహాయం అందచేసిన మేడిపల్లి నక్కర్త గ్రామ ప్రజలు.* *మృతుని పిల్లలు అమ్మాయి పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో పి ఎం సుకన్య యోజన పథకం కింద జమ* పున్నమి న్యూస్ ప్రతినిధి: 24 జనవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్: *రంగారెడ్డి జిల్లా యాచారం మండల మేడిపల్లి నక్కర్త గ్రామానికి చెందిన కందడి నర్సిహ ఇటీవల ఆత్మహాత్య చేసుకున్నారు… అతని మరణం తో వారి కుటుంభం పరిస్థితి గమనించిన స్నేహితులు గ్రామ వాసులు, మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించారు. రూ.1,64000 సేకరించిన నగదును మృతుని పిల్లలు అమ్మాయి పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో పి ఎం సుకన్య యోజన పథకం కింద జమ చేసి ధ్రువపత్రాలను మృతుని దశదినకర్మ రోజు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఈ లోకంలో పేద కుటుంభనికి తమ వంతుగా మిత్రుడు నరసింహ కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని గ్రామ వాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థికసహాయ సహకారాలు అందించిన వారికీ పేరు పేరు నా..ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు

కామారెడ్డి

రామారెడ్డి లో ఘనంగా బాల్య సంరక్షణ – విద్య డే

కామారెడ్డి, 24జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో ఆంగన్వాడీ కేంద్రంలో ( ఈసీసీ ) ఘనంగా బాల్య సంరక్షణ – విద్య డే ఘనంగా నిర్వహించారు. ఆకర్షణీయ మేలవంటలు, పోస్టర్లు, చిత్రపటాలతో అలంకరించిన కేంద్రంలో పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మహిళా- శిశు, బాల బాలికల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం పిల్లల సమగ్ర అభివృద్ధికి మార్గదర్శకం గా నిలిచింది. ఆకర్షణీయ గ్రీన్ కలర్ టేబుల్స్, మ్యాట్‌లపై కూర్చున్న పిల్లలు పుస్తకాలు చదివి, పాటలు పాడి సంతోషించారు.సంప్రదాయ దుస్తు లు ధరించిన టీచర్లు, వైట్ ఫ్లోరల్ డ్రెస్‌లలో మెరిసి న బాలికలు కార్యక్రమాన్ని రంగారంగిలో నడిపా రు.వైవిధ్యమైన కార్యకలాపాలు టీచర్లు నేర్పిన పాటలు, సాంస్కృతిక ఆటలు, విద్యా సంబంధిత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పోషకాహారం, ఆరో గ్యం, అక్షరాలు గురించి తెలుగు పాటలు పాడారు. పిల్లలు.ఫోక్ డాన్స్‌లు, ఆటల ద్వారా సామాజిక విలువలు నేర్చుకున్నారు.తల్లిదండ్రుల ముందు పుస్తకాలు చదివి, కథలు చెప్పి అవగాహన పెంచా రు. తల్లిదండ్రులకు పిల్లల అభివృద్ధి, సురక్షిత ఆహారాలు, ఆరోగ్య చిట్కాలపై అవగాహన కల్పిం చారు. పిల్లల ప్రదర్శనలు చూసి అందరూ సంతో షంగా మునిగిపోయారు. స్థానిక ప్రాముఖ్యత రామారెడ్డి మండలంలో ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ పిల్లల విద్య, ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తు న్నాయి. తెలంగాణ వ్యవస్థలో ప్రతి నెల జరిగే బాల్య సంరక్షణ – విద్య డే లు పిల్లల భవిష్యత్తును మెరుగుపరుస్తున్నాయి. ఈ కార్యక్రమం స్థానిక సమాజానికి మైలురాయిగా నిలిచింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బీసీల సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చిన జిల్లా బీసీ నాయకుడు బీద రవిచంద్ర.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి).మనుబోలు మండల బీసీ ఐక్యవేదిక సభ్యులు శనివారం జిల్లా బీసీ నాయకులు బీద రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి పూల బొకే అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఐక్యవేదిక సభ్యులు తమను తాము పరిచయం చేసుకుని, మండలంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి పరిష్కారానికి సాయపడాలని కోరారు. అందుకు బీద రవిచంద్ర సానుకూలంగా స్పందించి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

E-పేపర్

బుట్టాయిగూడెం పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్న పెద్దపులి.

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి ప్రతినిధి సీనియర్ రిపోర్టర్ 9989086083 ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం అంతర్వేది గూడెం, నాగులగూడెం పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్న పెద్దపులి. కొవ్వాసి దూలయ్య, మల్లం కాంతమ్మ లకు చెందిన మూడు అవ్వులపై దాడి (అందులో ఒకటి సుడి ఆవు ) చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన ఫారెస్ట్ అధికారులు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.