Friday, 6 March 2026

Blog

విశాఖపట్నం

బేబీ మౌనిక ఆత్మశాంతికి గాజువాకలో కొవ్వొత్తుల నిరసన

విశాఖ గాజువాక (ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి) నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.కులవివక్ష నేపథ్యంలో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల పసిపాప మృతి చెందడం మానవత్వానికే మచ్చగా నిలిచింది.కుమ్మెర గ్రామానికి చెందిన గణేశ్,ఆయన భార్య మౌనిక తమ రెండు నెలల పసిపాపతో కలిసి జాతరకు హాజరయ్యారు.ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదం కులవివక్ష రూపం దాల్చి,కొంతమంది వ్యక్తులు కుటుంబంపై దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.ఈ దాడిలో పసిపాప తీవ్రంగా గాయపడగా,ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది.ఈ ఘటనపై గాజువాక బీసీ సంఘం అధ్యక్షులు జాగరపు శ్రీను తీవ్రంగా స్పందిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని,పసిబిడ్డ మరణానికి కారణమైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బీసీ సమాజంపై జరుగుతున్న దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని,ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.బేబీ మౌనిక ఆత్మశాంతి కోసం గాజువాక గాంధీ సెంటర్‌లో జాగరపు శ్రీను ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అండిబోయిన అప్పారావు,తోకాడ రాము,బచ్చ త్రిమూర్తులు,జాగరపు హరిత,పూర్ణిమ,సుదమల్ల ఈశ్వరరావు,నవీన్,రాజు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి కులహంకారపు దుశ్చర్యలు జరగడం దురదృష్టకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

అన్నమయ్య

కడపలో ఘనంగా రిషితా రెడ్డి–శశి భూషణ్ రెడ్డి వివాహం

ఈరోజు ఉదయం డిఎస్ఆర్ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో మంగంపేటకు చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు గుత్తి రెడ్డి హరినాథ్ రెడ్డి గారి అన్న కుమార్తె రిషితా రెడ్డి – శశి భూషణ్ రెడ్డి వివాహం ఘనంగా జరిగింది.వివాహ వేడుకకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

బీసీల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ చేపడతాం: రాధాకృష్ణ గౌడ్

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ తిరుపతి జిల్లాలో నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా రేణిగుంటలో ఘన సత్కారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ బీసీ కులాల స్థితిగతులపై సమగ్ర సర్వే చేపట్టి సేవా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. యువత, మహిళలకు ప్రాధాన్యతతో కొత్త కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

పల్నాడు

పోలీస్ స్టేషన్లో … సివిల్ పంచాయతీలు

*మార్కాపురం జిల్లా,త్రిపురాంతకం మండలం:* ▪️మ‌న‌స్తాపంతో బీజేపీ కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్యాయ‌త్నం. ▪️మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం పాత అన్న సముద్రంలో ఘ‌ట‌న. ▪️పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్న బీజేపీ కార్యకర్త పంపనాటి అంకారావు. ▪️సీఐ హసన్ తన స్థలం విషయంలో తమ ప్రత్యర్థి దాసరి అంజయ్య అనే వ్యక్తికి సహకరిస్తూ తమను వేధిస్తున్నారని ఆవేదన. ▪️తనతో పాటు తన తండ్రి, తమ్ముడిని పోలీస్ స్టేషనుకు పిలిచి ఈ వ్యవహారంలో సీఐ వేధిస్తున్నాడని వెల్ల‌డి. ▪️సెల్ఫీ వీడియో తీసుకొని మ‌రీ ఆత్మహత్యాయత్నం చేసిన అంకారావు. *https://youtu.be/qO3jIxXd_ro* Uploaded Video:

ఆంధ్రప్రదేశ్

లింగంపల్లి యువకుడు డా. వెంకటేశ్వర్లుకు డాక్టరేట్ ఘనత

లింగంపల్లి గ్రామానికి చెందిన డా. గార్ల వెంకటేశ్వర్లు న్యూఢిల్లీలోని డి.పి.ఎస్.ఆర్.యులో ఫార్మసీ పరిశోధనలో డాక్టరేట్ పొందారు. శేషాచలం కొండల ఔషధ మొక్కల యాంటీకాన్సర్ లక్షణాలపై ఆయన పరిశోధన చేశారు. విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 8వ స్నాతకోత్సవంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకున్నారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ డా. రవిచంద్రన్, రిజిస్ట్రార్ డా. రామచంద్ర ఖత్రి సహా ప్రముఖులు పాల్గొన్నారు.

తిరుపతి

రెండవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల రిలే దీక్షలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: మండల కేంద్రంలోని స్థానిక ఐ.సి.డి.ఎస్ కార్యాలయం ఎదుట సోమవారం ప్రజా సంఘాలైన సి.ఐ.టి.యు, ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో రెండవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల రిలే దీక్షలు ఈ సందర్భంగా సి.ఐ.టి.యు నాయకులు పెనగడం గురవయ్య మాట్లాడుతూ….అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల 32 వేల కోట్ల లో ఒక్క రూపాయి కూడా అంగన్వాడీల వేతనాలకు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించక పోవడం ఎంతో బాధాకరమని సిఐటియు జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలు కాలం గడిచినప్పటికీ అంగన్వాడి కార్యకర్తల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతో దురదృష్టకరమని ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనం వారి కుటుంబ పోషణకు ఏ మాత్రం సరిపోవడం లేదని రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలను దృష్టిలో ఉంచుకొని అంగన్వాడి కార్యకర్తల వేతనాలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఎక్కడా కూడా రక్తహీనత ఉండకూడదని, పౌష్టిక ఆహారం అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ప్రతి ఒక్కరికి అందజేస్తున్నామని కానీ పౌష్టికాహారం అందజేసే అంగన్వాడి కార్యకర్తల కుటుంబాల్లో మాత్రం చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ ఎంతో బాధాకరంగా వెల్లదీస్తున్నారని అంగన్వాడీల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంతవరకు సిఐటియు వారికి అండగా ఉండి పోరాటాలు చేస్తూనే ఉంటుందని అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కింద ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తకు 26 వేల రూపాయల జీతం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చాలని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేశారు. ఈనెల 25, 26, 27వ తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట రిలే దీక్షలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు నాయకులు గంధం మణి, రాజా, రేవతి, పుష్ప, సక్కుబాయి, ఐ. ఎఫ్.టి.యు నాయకులు జాకీర్, కల్పన తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఏపీ అసెంబ్లీ క్రీడల్లో ఉత్సాహంతో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవాలు ఉత్సాహవంతంగా కొనసాగుతున్నానేపద్యంలో క్రీడా పోటీల్లో చురుకైన ఉత్సాహంతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది. ప్రజా సేవలో నిత్యం తలమునకలలై ఉండే ఆయన క్రీడల పట్ల తన ఆసక్తిని మరోసారి నిరూపించారు. మైదానంలో ఆయన చూపించిన చలాకీతనం, క్రీడాస్ఫూర్తి తోటి శాసనసభసభ్యుల ప్రశంసలు అందుకుంది. రాజకీయ భిన్నాభిప్రాయాలు సహజమైనవే అయినా క్రీడలు అందరినీ ఒకే వేదికపై కలుపుతాయని క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్నీ అందిస్తాయని ప్రజాప్రతినిధులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని శాసనసభ క్రీడా మహోత్సవాలు సభ్యుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఏది ఏమైన ఈ వేడుకల్లో సుధీర్ రెడ్డి పాల్గొనడం మరింత ఉత్సాహాన్ని నింపిందనే చెప్పుకోవాలి తమ నాయకుడు ఈ క్రీడల్లో అత్యంత ప్రతిభ కనపరిచి విజియాన్ని కైవసం చేసుకోవాలని నియోజిక వర్గంలోని నాయకులు, కార్యకర్తలు, సుధీర్ రెడ్డి అభిమానులు ఆశిస్తునారు.

తిరుపతి

కార్యకర్తల గౌరవానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమస్యలపై దృష్టి సారించారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ క్రీడా మహోత్సవాల్లో పాల్గొంటూనే తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడుతున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు, నామినేటెడ్ పదవులు కల్పించాలని కోరుతూ “రాష్ట్ర అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్ యాదవ్” ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ వినతిపై పళ్ళ శ్రీనివాస్ యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

తిరుపతి

విజయవంతమైన జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: శ్రీకాళహస్తి పట్టణంలోని CM ఫంక్షన్ హాల్ నందు జనసేన ఉద్యమి సన్నాహక కార్యక్రమం గూర్చి సమావేశం జనసేన ముఖ్య నాయకులు, జనసైనికులు, వీరమహిళల మధ్య అట్ట హాసంగా జరిగింది. ఈ సమావేశానికి అతిథులుగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వము గురించి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాలహస్తీశ్వర దేవస్థాన పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జనసైనికులకు పాల్గొన్నారు.

తిరుపతి

లబ్ధిదారుల వద్దకేళ్లి సి.యం. రిలీఫ్ ఫండ్ అందజేసిన బొజ్జల రిషిత రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషిత రెడ్డీ, అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మన తొట్టంబేడు మండలం లోని బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని నేడు నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందజేశారు. తొట్టంబేడు మండలంలో 19 మంది లబ్ధిదారులకు సంబంధించి మొత్తం రూ. 12,29,918 విలువైన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.