Monday, 16 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు పోలీస్ స్టేషన్లో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని పోలీస్ స్టేషన్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్సై ఎం.ఎస్. రాకేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్య అతిథులుగా విచ్చేసిన డీఎస్పీ జి. శ్రీనివాసరావు గారు మరియు సీఐ శివరామకృష్ణారెడ్డి గారు ప్రజలకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రోడ్డు భద్రత పట్ల ప్రతి వ్యక్తి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని, హెల్మెట్‌ వినియోగం ప్రాణాలను కాపాడే రక్షాకవచమని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రత్యేకంగా యువత రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసుల సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన తంగళ్ళపల్లి మండలం బాలమల్లు

*స్థానిక సంస్థల ఎన్నికల్లో తంగళ్ళపల్లి మండలం బాలమల్లు పల్లె గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన యాదా ఎల్లయ్య గారికి మరియు శివలింగాపూర్, భరత్ నగర్, నేరెళ్ల గ్రామానికి సంబంధించిన ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఈరోజు కేకే మహేందర్ రెడ్డి గారు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

ఖమ్మం

ఖమ్మంకు రానున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఖమ్మం, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి): భారత మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో 2026 మార్చి 1వ తేదీన నిర్వహించనున్న భారీ సభకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు హాజరుకానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సభను ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ నాయకులు, శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అటల్ జయంతి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తూ, ఆయా కార్యక్రమాల ద్వారా యువతకు దేశభక్తి, సేవాభావం, పరిపాలనా విలువలపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని నిర్వాహకులు తెలిపారు..

E-పేపర్

పోలీస్ స్టేషన్లో దొంగతనం దొంగల వద్ద రికవరీ చేసిన రూ.1.75 లక్షల ఫోను చోరీ చేసిన పోలీస్ డ్రైవర్

పున్నమి ప్రతినిధి పోలీస్ స్టేషన్లో దొంగతనం దొంగల వద్ద రికవరీ చేసిన రూ.1.75 లక్షల ఫోను చోరీ చేసిన పోలీస్ డ్రైవర్ హైదరాబాద్ – మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతు బజార్ వద్ద తన ఫోను పోయిందని ఫిర్యాదు చేసిన వ్యక్తి సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకుని, ఫోన్ రికవరీ చేసి, లాకర్లో దాచిపెట్టిన మెహదీపట్నం పోలీస్ స్టేషన్ సిబ్బంది రూ.1.75 లక్షల ఫోన్ కావడంతో దానిపై కన్నేసి, కొట్టేసిన పోలీస్ డ్రైవర్ శ్రవణ్ కుమార్ శ్రవణ్ కుమార్ దొంగతనం చేసాడని నిర్ధారించి, అతన్ని రిమాండుకు తరలించిన ఉన్నతాధికారులు

E-పేపర్

ఇండిగో విమానాలు రద్దు అవ్వడంతో విమాన టికెట్ రేట్లు ప్రకటించిన కేంద్రం

పున్నమి ప్రతినిధి ఇండిగో విమానాలు రద్దు అవ్వడంతో విమాన టికెట్ రేట్లు ప్రకటించిన కేంద్రం ఇండిగో సంక్షోభం వల్ల భారీగా టికెట్ రేట్లు పెంచిన ఇతర ఎయిర్ లైన్స్ దీంతో కిలోమీటర్ల వరకు టికెట్ రేట్ రూ.7,500 500 కిలోమీటర్ల నుండి 1000 కిలోమీటర్ల వరకు రూ.12,000 1000 కిలోమీటర్ల నుండి 1500 కిలోమీటర్ల వరకు రూ.15,000 1500 కిలోమీటర్ల పైన ఉంటే రూ.18,000 మాత్రమే వసూలు చేయాలని ఫ్లైట్ టికెట్ రేట్లు నిర్ధారించిన కేంద్రం

Others

హార్న్‌బిల్ ఉత్సవంలో విశాఖ యువకుడి మెరిసిన ప్రతిభ — కిసామా నెట్‌వర్క్ సేవలకు కేంద్ర మంత్రుల ప్రశంస

నాగాలాండ్‌ గర్వకారణమైన హార్న్‌బిల్ ఉత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 నుండి 10 వరకు కిసామా హెరిటేజ్ విలేజ్‌లో ఘనంగా జరుగుతుంది. నాగాలాండ్‌లోని 17 ప్రధాన తెగల సాంస్కృతిక వైభవం, వారి సంప్రదాయ కళలు, సంగీత-నృత్యాలు, ఆహార సంస్కృతి, హస్తకళలను ప్రపంచానికి పరిచయం చేసే ఈ వేడుకను ‘ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్’ అని పిలుస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు దీన్ని ప్రత్యక్షంగా చూడటానికి వస్తారు. ఇలాంటి భారీ స్థాయి అంతర్జాతీయ వేడుకలో, కమ్యూనికేషన్ వ్యవస్థలు నిలకడగా పనిచేయడం ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో కిసామా గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్‌వర్క్ కార్యకలాపాలకు విశాఖ వాస్తవ్యుడు వానపల్లి కిషోర్ బిఎస్‌ఎన్ఎల్ తరఫున కీలక బాధ్యతలు చేపట్టి సజావుగా నిర్వహించారు. కేంద్ర మంత్రుల ప్రశంసలు — కిషోర్ సేవలకు గుర్తింపు హార్న్‌బిల్ వేడుకలో ఆదివారం అతిథిగా పాల్గొన్న కేంద్ర కమ్యూనికేషన్స్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, కిసామా నెట్‌వర్క్ యొక్క నిరంతర సేవలను పరిశీలించి కిషోర్ ఆయన బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. వేడుకల సందడిలో పర్యాటకులు, మీడియా ప్రతినిధులు, కళాకారులు, అధికారులతో ప్రాంతం కిటకిటలాడుతున్నా కూడా నెట్‌వర్క్ ఏ చిన్న అంతరాయం లేకుండా పనిచేయడమే కాక, డేటా స్పీడ్ కూడా స్థిరంగా ఉండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. “ఇంత పెద్ద ఈవెంట్లో కూడా ఇలాంటి స్థిరమైన నెట్‌వర్క్ అందించడం నిజంగా ప్రశంసనీయం. మీ కృషి భవిష్యత్తు నెట్‌వర్క్ అభివృద్ధికి దారితీస్తుంది” అని మంత్రి గారు పేర్కొన్నారు. జ్యోతిరాదిత్య సింధియా కూడా అభినందించిన కిసామా నెట్‌వర్కింగ్ టీమ్ ఇటీవలి రోజుల్లో నాగాలాండ్ పర్యటన ముగించి ఢిల్లీకి తిరిగి వెళ్లే ముందు కేంద్ర సమాచారం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా కిసామా నెట్‌వర్క్ పనితీరును ప్రశంసించారు. హార్న్‌బిల్ సందడి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ ఇబ్బందులు లేకుండా సేవలు కొనసాగడం ఆయన ప్రశంసలకు కారణమైంది. కిషోర్ కీలక బాధ్యతలు హార్న్‌బిల్ ఉత్సవం కోసం ప్రత్యేక టవర్ల ఏర్పాటు పర్యవేక్షణ గరిష్ట జనసమ్మోహనం సమయంలో వాయిస్/డేటా ట్రాఫిక్ నిర్వహణ అత్యవసర కమ్యూనికేషన్ స్పందన బృందానికి నాయకత్వం వీవీఐపీ అతిథుల కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ విదేశీ పర్యాటకులకు కనెక్టివిటీ సపోర్ట్ ఈ పనులన్నింటినీ సమర్థంగా నిర్వహించడంతో కిషోర్‌పై కేంద్ర మంత్రుల ప్రశంసలు కురిసాయి కిసామాలో విశాఖ ప్రతిభ మెరుపు విశాఖలో పుట్టి పెరిగిన ఒక యువకుడు, దేశం నలుమూలల దృష్టిని ఆకర్షించే హార్న్‌బిల్ వంటి అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌లో కీలక పాత్ర పోషించడం గర్వకారణం. కేంద్ర మంత్రులతో భేటీ కావడం, వారి నుండి ప్రత్యక్ష అభినందనలు పొందడం కిషోర్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి గా నిలిచింది.

తూర్పు గోదావరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయనున్న డాక్టర్ నల్లమిల్లి ఆదిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయనున్న డాక్టర్ నల్లమిల్లి ఆదిరెడ్డి తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. అనపర్తి, 7 డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తి గ్రామవాసి అయిన డాక్టర్ నల్లమిల్లి ఆదిరెడ్డి, సీరియల్ నెంబర్ 19. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్ధిగా పోటీ చేయుచున్నట్లు తెలిపారు. ఫార్మసీ మిత్రులు అందరూ తమ అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకొని తమని గెలిపించమని కోరి ప్రార్ధించారు.

తూర్పు గోదావరి

బస్సుల కొరతతో ప్రజలు ఇక్కట్లు

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి గోపాలపురం మీదుగా వచ్చే బస్సులను క్యాన్సల్ చేయడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు కొవ్వూరు, తాళ్లపూడి, అన్నశదేవరపేట, చిట్యాల, గోపాలపురం మీదుగా జంగారెడ్డిగూడెం తిరుగుతూన్న బస్సులను క్యాన్సల్ చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు END

అన్నమయ్య

కువైట్‌లో రాజంపేట జిల్లా కేంద్రం కోసం సంఘీభావ సమావేశం ములకల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో నిర్వహణ

రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని రాజంపేటలో జరుగుతున్న ప్రజా ఉద్యమానికి సంఘీభావంగా,కువైట్‌లోని రాజంపేట ప్రాంతానికి చెందిన తెలుగు ప్రజలు శనివారం ఐక్యంగా సమావేశమయ్యారు. ములకల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, తమ స్వస్థల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తమ గళాన్ని వినిపించాలని సంకల్పం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న జిల్లా ఏర్పాటు సాధనకై రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని, భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం ఈ నిర్ణయం కీలకం అవుతుందని సమావేశంలో స్పష్టం చేశారు.రాజంపేటలో ఉధృతంగా సాగుతున్న ప్రజా ఆందోళనలకు, కువైట్‌లో నివసిస్తున్న రాజంపేట ప్రజలంతా పూర్తి మద్దతు ప్రకటించారు.“మా స్వరం రాజంపేట వరకు చేరే వరకు, మా న్యాయ డిమాండ్ నెరవేరే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని సమావేశంలో నాయకులు హామీ ఇచ్చారు.ఈ సంఘీభావ సమావేశంలో ధరురు బలరాం నాయుడు, ఓలేటి దివాకర్, మాలేపాటి సురేష్ బాబు, మాలేపాటి బాబు, పోలారపు బాబు, ములక రవి, రమేష్ దుగ్గినేని, మురళి, మదిన ఈశ్వర్, వీరబల్లి అంజి రెడ్డయ్య, నాయుడు సుదర్శన్, మాలార్పు భాస్కర్, కూరపాటి చంద్ర, పూరపాటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం లో భారీ ఎత్తున మద్యాన్ని పట్టుకున్న పోలీసులు

పున్నమి ప్రతినిధి ఎలక్షన్ కోడ్ అమల్లో……… భారీగా అక్రమ మద్యం స్వాధీనం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం లో భారీ ఎత్తున మద్యాన్ని పట్టుకున్న పోలీసులు యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సె మధు, తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని మాల్, చెక్ పోస్ట్ వద్ద ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా వాహనాలను తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 210 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని మద్యాన్ని తరలించడానికి వాడిన కారును పోలీస్ స్టేషన్ కు తరలించి నిందితుడిపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.