Monday, 16 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

దాత ఆశయానికి తూట్లు… వెయ్యి కోట్లు విలువైన ఆనంద నిలయం భూమిపై అక్రమార్కుల పాగా… అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే కొండబాబు ఘాటైన ఆరోపణలు… త్వరలోనే ఆనందనిలయం ఆస్తుల పరి రక్షణ కు ప్రజా ఉద్యమానికి సన్నాహాలు..

కాకినాడ, కాకినాడ జిల్లా, పున్నమి ప్రతినిధి: పిఠాపురం మహారాజా చిన్నారుల విద్య–వికాసం కోసం అప్పగించిన దాతాస్పద ఆస్తులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఘాటుగా హెచ్చరించారు. ఆనంద నిలయం పరిధిలోని 19 ఎకరాల భూమిని ఆక్రమించేందుకుచోటుచేసుకుంటున్న కుట్రలు దాత ఆశయానికే తూట్లు పొడుస్తున్నాయని ఆయన తీవ్రఆగ్రహంవ్యక్తంచేశారు.ఆదివారం ఆనందనిలయం ప్రాంగాణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుమారు వెయ్యి కోట్లు విలువ చేసే ఈ భూమిని కొందరు అక్రమార్కులు దొడ్డి దోవలో పాగా వేయడానికి పన్నాగం పన్నెరని తెలిపారు. వారి ఆటలు ఇక సాగవని.ఎవరు కొనడానికి ముందుకొస్తే వారు ఇబ్బందుల్లో పడతారని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు.అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే చిన్నారుల గూడు అయిన ఆనంద నిలయాన్ని కాకావికాలం చేసిందని ఆయన మండిపడ్డారు.1910 సంవత్సరంలో దాత ఈ భూమిని దానం గా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే 1000 గజాల భూమిని అక్రమంగా ఆక్రమించిన వ్యక్తుల నుంచి రికవరీ చేసి బాధితులకు అందించామని గుర్తుచేస్తూ,మిగిలిన భూభాగం కూడా ఎవరి బాపాతం కాదన్నారు. దాత ధర్మాన్ని కాపాడాలన్నారు. భూమి వ్యవహారాలపై జరుగుతున్న అనుమానాస్పద చర్యలను అధికారులే పెనుభూతిగా మారుస్తున్నారని చెప్పారు.కాకినాడలో అక్రమ ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,దీనిపై ఇప్పటికే కలెక్టర్‌కు పూర్తి వివరాలతో నివేదించామని వెల్లడించారు. ఆనంద నిలయం ఆస్తుల రక్షణ కోసం త్వరలోనే సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, హాస్టల్ అధికారులు,ఆర్‌ఎంసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల జాతర పుస్తకావిష్కరణ

శ్రీకాళహస్తి డిసెంబర్ 07, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీధిలో వెలసియున్న శ్రీ సంకల్ప సిద్ధి వినాయక ఆలయంలో రిటైర్డ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ APSPDCL రాజేంద్రన్ ధర్మపత్ని అయిన కీ.శే. రమాదేవి జ్ఞాపకార్థం శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల జాతర సంక్షిప్త విశేషాల పుస్తకాన్ని పూజ చేసి ఆవిష్కరించడం జరిగినది.

తిరుపతి

AMC చైర్మన్‌ల రాష్ట్ర ఆత్మీయ సమావేశంలో రైతుసమస్యలపై మాట్లాడిన రంగినేని

శ్రీకాళహస్తి డిసెంబర్ 07, పున్నమి న్యూస్: విజయవాడలోని ఆర్.ఆర్.ఆర్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌ల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు వేదికపై ప్రసంగింస్తూ.. రైతుల సమస్యలు, మార్కెట్ ఆధునీకరణ, పారదర్శక సేవల ప్రాముఖ్యతలను ఆయన ప్రసంగంలో వివరించారు. అనతరం జరిగిన ఏఎంసీ చైర్మన్‌ల సన్మాన సభలో చెంచయ్య నాయుడు కూడా పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెట్ కమిటీల చైర్మన్‌లు హాజరైన ఈ సమావేశంలో తాజా వ్యవసాయ విధానాలు, మార్కెట్ అభివృద్ధి మార్గదర్శకాలు, రైతుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇతర చైర్మన్‌లతో స్నేహపూర్వకంగా చర్చించారు.

తిరుపతి

చెవిరెడ్డి జయమ్మ కర్మక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మేల్యే మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి డిసెంబర్ 07, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, యుగంధర్ రెడ్డిల మాతృమూర్తి చెవిరెడ్డి జయమ్మ ఇటీవల మృతి చెందారు ఆదివారం నాడు వారి స్వగ్రామం పుల్లారెడ్డి కండిగ గ్రామంలో నిర్వహించిన చెవిరెడ్డి జయమ్మ కర్మక్రియలులో మధుసూదన్ రెడ్డి పాల్గొని ఆమె చిత్రపటానికి పుష్పాలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యున్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియచేసారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, శ్రీవారి సురేష్, ఫట్రాన్ ఫరీద్, కంట ఉదయ్ కుమార్, ఫజల్, వెంకటయ్య, యుగంధర్ రెడ్డి, వెంకట రమణారెడ్డి, యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

గోల్డ్ మెడల్ సాధించిన బాడిబిల్దర్ జావిద్ కి సన్మానం

శ్రీకాళహస్తి డిసెంబర్ 07, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన షేక్ జావిద్ దేహదారుడ్య పోటీలలో గోల్డ్ మెడల్ సాధించినందుకు రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్బంగా సిరాజ్ మాట్లాడుతూ… గత నెల 27,28,29 తేదీలలో జరిగిన నేషనల్ నాచురల్ బాడీబిల్డింగ్ కాంపిటీషన్ (ICN గోవా సూపర్ షో) లో పాల్గొన్న మొదటి ఈవెంట్ లోనే తను గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందని ఈ కాంపిటీషన్ కి పాల్గొనడానికి దేశానలుముల నుంచి 1000కి పైగ పోటీదారులు పాల్గొనడంతో అందులో మన శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన షేక్ జావిద్ గోల్డ్ మెడల్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉపాధ్యక్షులు కామీవెంకటేశ్వర్లు. ఎక్స్ కౌన్సిలర్ సురా గారి రమేష్ మాతయ్య జిల్లా యాంటీ కరప్షన్ అధ్యక్షులు లాలు శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

కాణిపాక ధర్మకర్తలి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ముక్కంటి ఆలయ ఛైర్మన్ కొట్టే సాయి

శ్రీకాళహస్తి డిసెంబర్ 07, పున్నమి న్యూస్: శ్రీ కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ధర్మకర్తలమండలి అధ్యక్షులు, ధర్మకర్తలమండలి సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ధర్మకర్తలమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ పాల్గొన్నారు. సభలో శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ… శ్రీకాళహస్తి యొక్క దేవస్థానం ప్రాశస్త్యం గురించి, భక్తుల దర్శన భాగ్య విధివిధానాలు గురించి, శ్రీ వరసిద్ధి వినాయక కాణిపాకం దేవస్థానం యొక్క ప్రాశిస్తం గురించి ప్రసంగించడం జరిగింది. ఈ మహోత్సవ కార్యక్రమములో ఆంధ్ర ప్రదేశ్ హస్తకళల నైపుణ్య అభివృద్ధి అధ్యక్షులు మరియు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, (PAC MEMBER), తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, పూతలపట్టు శాసనసభ్యులు మురళి గారు, కుప్పం నియోజక వర్గ MLC డాక్టర్ శ్రీకాంత్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పల్తోన్నారు.

E-పేపర్

పెట్టుబడుల పేరుతో భారీ మోసం చేసిన CI భార్య సూర్యాపేట మునగాల సీఐ భార్య అరెస్ట్

పున్నమి ప్రతినిధి: *పెట్టుబడుల పేరుతో భారీ మోసం చేసిన CI భార్య* *సూర్యాపేట మునగాల సీఐ భార్య అరెస్ట్* *సూర్యాపేట జిల్లా మునగాల సీఐ భార్య పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేసిన ఘటన హయత్‌నగర్‌లో బయటపడింది. బంగారం, గ్రానైట్ వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే లక్షల్లో లాభాలు వస్తాయని చెప్పి ఆమె పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించింది. భర్త పోలీస్ పదవిని అడ్డం పెట్టుకోవడంతో ప్రజలు ఆమెపై నమ్మకం ఉంచారు*. *అయితే నెలలు గడిచినా వాగ్దానం చేసిన లాభాలు రాకపోవడంతో బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగారు. ఇదే సమయంలో “నన్నే డబ్బులు అడుగుతారా? మీ సంగతి చెబుతా” అంటూ ఆమె బెదిరించిందని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు* *హయత్‌నగర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు*.

E-పేపర్

అయ్యగారు అద్దెకున్న ఇంట్లోనే 30 లక్షలు దొరికాయంటే.. పెద్ద ఆనకొండే.

పున్నమి ప్రతినిధి : అయ్యగారు అద్దెకున్న ఇంట్లోనే 30 లక్షలు దొరికాయంటే.. పెద్ద ఆనకొండే..* హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యాడు.. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోనే 60 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడటం కలకలం రేపుతోంది.. రేపో మాపో IAS అర్హత పొందబోతున్న ఆ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో అదనపు కలెక్టర్‌తో పాటు మరో ఇద్దరు విద్యాశాఖ అధికారులు అరెస్టయ్యారు.. అయ్యగారి పాపాలలో పాలు పంచుకొని జైలు పాలయ్యారు. ఓ ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ రెన్యువల్ చేసేందుకు.. యాజమన్యం నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు.. వెంకట్ రెడ్డి ప్రస్తుతం హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ కోసం లంచం డిమాండ్ చేసి రూ. 60 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు తన ఛాంబర్‌లోనే పట్టుకున్నారు. ఆయనతో పాటు గౌస్, మనోజ్ అనే మరో ఇద్దరు విద్యాశాఖ సిబ్బందిని కూడా పట్టుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే హనుమకొండలోనీ చైతన్యపురి కాలనీలో ఆయన నివాసం ఉంటున్న అద్దె ఇంట్లో 30 లక్షల రూపాయల కరెన్సీ లభ్యం అయింది. ఆ డబ్బుకు సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు.. హైదరాబాద్‌లోని తన నివాసంలో విలువైన భూముల పత్రాలు స్వాదీనం చేసుకున్నారు అదనపు కలెక్టర్ వెంకటరెడ్డిపైన గతంలో కూడా పలు కేసులు నమోదు అయ్యాయి. ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల పైన కేసులు ఉన్నాయనీ ఏసీబీ అధికారులు తెలిపారు.. నల్గొండ జిల్లాలో తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో ఈయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది.. జనగామ RDO గా విధులు నిర్వహిస్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు విషయంలో కూడా అవినీతి కి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. సీసీ కెమెరాలు లేకుండా చూసి లంచం తీసుకున్నాడు. అయినా ఏసీబీ అధికారుల నుండి తప్పించుకోలేకపోయాడు. పక్కా ప్లాన్ ప్రకారం లంచం తీసుకున్నాడు. పగడ్బందీగా దొరికారు. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అడ్డంగా బుక్కై అరెస్ట్ అవడంతో ఆయన బాధితులు సంబరాలు జరుపుకున్నారు.. ఊరుకొండ, ఆరేపల్లి, వంగపహాడ్ గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితులు హన్మకొండ కలెక్టరేట్ ముందు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు పోలీస్ స్టేషన్లో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని పోలీస్ స్టేషన్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్సై ఎం.ఎస్. రాకేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్య అతిథులుగా విచ్చేసిన డీఎస్పీ జి. శ్రీనివాసరావు గారు మరియు సీఐ శివరామకృష్ణారెడ్డి గారు ప్రజలకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రోడ్డు భద్రత పట్ల ప్రతి వ్యక్తి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని, హెల్మెట్‌ వినియోగం ప్రాణాలను కాపాడే రక్షాకవచమని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రత్యేకంగా యువత రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసుల సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన తంగళ్ళపల్లి మండలం బాలమల్లు

*స్థానిక సంస్థల ఎన్నికల్లో తంగళ్ళపల్లి మండలం బాలమల్లు పల్లె గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన యాదా ఎల్లయ్య గారికి మరియు శివలింగాపూర్, భరత్ నగర్, నేరెళ్ల గ్రామానికి సంబంధించిన ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఈరోజు కేకే మహేందర్ రెడ్డి గారు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.