Monday, 16 March 2026

Blog

E-పేపర్

రహదారి విస్తరణకు శ్రీకారం – రైల్వే కోడూరు అభివృద్ధికి కూటమి శ్రీకారం

రహదారి విస్తరణకు శ్రీకారం – రైల్వే కోడూరు అభివృద్ధికి కూటమి శ్రీకారం రైల్వే కోడూరు మేజర్ న్యూస్ కడప-తిరుపతి రహదారి విస్తరణ, అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రూ.100 కోట్ల నిధుల నేపథ్యంలో, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుత్తనవారిపల్లె ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో రహదారి ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్, బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కృషిఫలితంగానే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగిందని నాయకులు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పూర్తయ్యాక కోడూరు–రాజంపేట-తిరుపతి మద్య ప్రయాణం వేగవంతమై, పరిశ్రమలు-వ్యాపారాలకు కొత్త అవకాశాలు సృష్టించబడతాయని తెలిపారు. కార్యక్రమంలో నితిన్ గడ్కరీ, పురందేశ్వరి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి వారికి ప్రజాపక్ష అభివృద్ధి సంకల్పానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు రవాణా భద్రత, ఆర్థికాభివృద్ధి, పర్యాటక విస్తరణ- ఇవన్నీ ఈ రహదారి దశల వారీగా పూర్తికావడంతో సాధ్యమవుతాయని నాయకులు నమ్మకం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, జెడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యులు షబ్బీర్ అహ్మద్, జనసేన నాయకులు మౌలా, చింతల శివ, శంకర్ రాజు, గోవర్ధన్తో పాటు స్థానిక ప్రజలు, కూటమి కార్యకర్తలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

E-పేపర్

కె ఎస్ యు ఎఫ్ ఆధ్వర్యంలో రాయచోటి జిల్లా వద్దు రాజంపేట జిల్లా ముద్దు ఆటో డ్రైవర్ల నిరసన

కె ఎస్ యు ఎఫ్ ఆధ్వర్యంలో రాయచోటి జిల్లా వద్దు రాజంపేట జిల్లా ముద్దు ఆటో డ్రైవర్ల నిరసన రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు కోడూరు స్టూడెంట్ యూనియన్ ఫోర్స్ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి రాయచోటి వద్దు అన్నమయ్య జిల్లా ముద్దు అని నినాదాలు చేసుకుంటూ ఆటో డ్రైవర్ల అందరూ తమ ఆటోలతో నిరసన తెలుపుతూ యూనియన్ డ్రైవర్ల అందరూ కలిసికట్టుగా తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించడం జరిగినదని. తరువాత తాసిల్దార్ అమర్నాథ్ మాట్లాడుతూ మీరిచ్చిన అర్జీని అధికారులకు పంపిస్తానని చెప్పడం జరిగినది కే ఎస్ యు ఎఫ్ అధ్యక్షుడు బండారు మల్లికార్జున మీడియా వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కె ఎస్ యు ఎఫ్ యూనియన్ లీడర్లు శంకరయ్య,నరేంద్ర, మనీ,చాంద్ భాషా, చంగల్ రాయుడు, ఉపాధ్యక్షులు హస్తి భరత్ కుమార్ రాజు, సెక్రటరీ జెట్టి హరీష్, ఓబులవారిపల్లె మండల కన్వీనర్ గంగరాజు సునీల్ వర్మ, మల్లెం హేమంత్ మొదలగు వారు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

* *ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా * — సర్పంచ్ అభ్యర్థి ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి **

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 09 : సంస్థాన్ నారాయణపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కి ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది కావున ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని సంస్థాన్ నారాయణపురం ఓటర్ మహాశ్రయులకు మనవి చేస్తున్న

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలో రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 09 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం: రైతులకు సబ్సిడీపై విత్తనాల పంపిణీ గౌరవనీయులైన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మనుబోలు మండలంలో దిత్వా తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ, నారుమళ్లు దెబ్బతిన్న రైతులకు సబ్సిడీపై విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు ఎదుర్కొన్న నష్టాలను తెలుసుకుని, వారికి తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఎమ్మెల్యే తెలిపారు. రైతుల పంటలు తిరిగి పునరుద్ధరణ పొందేందుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలు ఎంతో ఉపయోగకరమని ఆయన చెప్పారు. స్థానిక అధికారులతో కలిసి రైతుల సమస్యలను పరిశీలించి, అవసరమైన సహాయాన్ని త్వరితగతిన అందించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఖమ్మం

ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు

*చెరువుబజార్ దాసాంజ పున్నమి ప్రతి నిధి ఖమ్మం తెలంగాణా బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు గారి ఆహ్వానం మేరకు 1 టౌన్ అధ్యక్షులు గడీల నరేష్ గారి అధ్యక్షతన ఈరోజు చెరువుబజార్ 41 డివిజన్ ఏరియా నందు గల దాసాంజనేయ ఆలయం ను తెలంగాణా రాష్ట్ర బీజేపీ సంఘటన మంత్రి చంద్రశేఖర్ తివారి గారు,ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి N. గౌతమ్ రావు, రాష్ట్ర కార్యదర్శి మరియు బీజేపీ ఖమ్మం జిల్లా ఇంచార్జ్ బద్దం మహిపాల్ రెడ్డి గారు, సుమారు 8 శాతాబ్దాల చరిత్ర గల ఈ ఆలయాన్ని స్థానిక బీజేపీ నాయకులతో కలిసి దర్శించుకుని ఆలయ ఆవరణలో జరుగు పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి తీర్థ ప్రసాదాలు స్వకరించటం జరిగింది. అనంతరం ఆలయ అర్చకుల వారు నాయకులకు వేద ఆశీర్వచనం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం లొ జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్ నాయకులు, ఖమ్మం అసెంబ్లీ లీగల్ సెల్ కన్వినర్ తుమ్మ శివ, జిల్లా నాయకులు నున్న రవి,పొట్టిమూతి జనార్దన్, బండ్ల రిగాన్ ప్రతాప్, మార్తి ప్రసాద్,ప్రదీప్, వెంకట్,శ్యామ్ మండల నాయకులు పాలేపు రాము, పొట్టిమూతి వాణి,బొడ్ల శ్రీను,తుమ్మ ఇందు, రామచందర్,రమేష్,రామకృష్ణ, రామ్మోహన్ మరియు స్థానికులు పాల్గొనటం జరిగింది.

ఖమ్మం

ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు

*చెరువుబజార్ దాసాంజ పున్నమి ప్రతి నిధి ఖమ్మం తెలంగాణా బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు గారి ఆహ్వానం మేరకు 1 టౌన్ అధ్యక్షులు గడీల నరేష్ గారి అధ్యక్షతన ఈరోజు చెరువుబజార్ 41 డివిజన్ ఏరియా నందు గల దాసాంజనేయ ఆలయం ను తెలంగాణా రాష్ట్ర బీజేపీ సంఘటన మంత్రి చంద్రశేఖర్ తివారి గారు,ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి N. గౌతమ్ రావు, రాష్ట్ర కార్యదర్శి మరియు బీజేపీ ఖమ్మం జిల్లా ఇంచార్జ్ బద్దం మహిపాల్ రెడ్డి గారు, సుమారు 8 శాతాబ్దాల చరిత్ర గల ఈ ఆలయాన్ని స్థానిక బీజేపీ నాయకులతో కలిసి దర్శించుకుని ఆలయ ఆవరణలో జరుగు పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి తీర్థ ప్రసాదాలు స్వకరించటం జరిగింది. అనంతరం ఆలయ అర్చకుల వారు నాయకులకు వేద ఆశీర్వచనం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం లొ జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్ నాయకులు, ఖమ్మం అసెంబ్లీ లీగల్ సెల్ కన్వినర్ తుమ్మ శివ, జిల్లా నాయకులు నున్న రవి,పొట్టిమూతి జనార్దన్, బండ్ల రిగాన్ ప్రతాప్, మార్తి ప్రసాద్,ప్రదీప్, వెంకట్,శ్యామ్ మండల నాయకులు పాలేపు రాము, పొట్టిమూతి వాణి,బొడ్ల శ్రీను,తుమ్మ ఇందు, రామచందర్,రమేష్,రామకృష్ణ, రామ్మోహన్ మరియు స్థానికులు పాల్గొనటం జరిగింది.

E-పేపర్

అవుట్ సోర్సింగ్ & ట్రైనింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి!లేని పక్షంలో భారీ ఉద్యమానికి సిద్ధం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఓబుల్ పిలుపు

ఏపీఎండిసి సంస్థ నందు పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ & ట్రైనింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి!లేని పక్షంలో భారీ ఉద్యమానికి సిద్ధం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఓబుల్ పిలుపు రైల్వేకోడూరు డిసెంబర్ డిసెంబర్ పున్నమి ప్రతినిధి ఏపీఎండిసీ అవుట్ సోర్సింగ్ &ట్రైనీ  కార్మికులను, రెగ్యులర్ చేయాలని, కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు జీవనోపాధిగా  ఆధారపడుతున్న, వేలాది మందికి, జీవనోపాధిగా ఉన్న ఏపీఎండిసి సంస్థ ను పరిరక్షణ కోసం పోరాడాలని,  సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి ఓబుల్ గారు పిలుపునిచ్చారు. మంగళవారం, ఏపీఎండిసీ , కార్మికులతో, ఈరోజు ఉదయం  ఏపీఎండీసీ నందు కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశం పోరాట కమిటీ జేఏసీ కన్వీనర్ ఆర్ వెంకటేష్ అధ్యక్షతన  జరిగింది. ఈ సమావేశం లో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఓబులు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం,  ప్రస్తుత ప్రభుత్వం, ఉపాధి కోసం, ప్రజల అవసరాల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పడిన ఏపీఎండీసీ సంస్థను నిర్వీర్యం చేసి వారి లాభాల కోసం, పాలకవర్గాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. గత 17 సంవత్సరాలుగా సంస్థ కోసం ఇల్లు భూములు ఇచ్చిన, నిర్వాసితుల కార్మికులను గతంలో మాయమాటలు చెప్పి వారి ఇండ్లు, భూములు తీసుకుని వారిని రెగ్యులర్ చేయకుండా, అవుట్ సోర్స్&ట్రైనీ పేరుతో, దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను, చట్టపకారం కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ ఇవ్వకుండా  యాజమాన్యం ఆపు చేయడం దుర్మార్గం అన్నారు. కార్మికులకు ఉపాధి కల్పించడానికి, సి అండ్ డి, కోటి టన్నుల  నిలవలను  ఏ గ్రేడ్ గా మార్చే బెనిఫిరికేషన్ ప్లాంట్ ను వెంటనే ఏపీఎండీసి సంస్థ ఏర్పాటు చేసి ఏపీఎండిసీ సంస్థ లో అవుట్ సోర్సింగ్ &ట్రైనీ కార్మికులుగా పని చేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలన్నారు. చట్ట ప్రకారం ఇవ్వవలసిన గ్రాట్యూటీ ఇవ్వకుండా, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వకుండా, చనిపోయిన కార్మిక కుటుంబాలకు డెత్ ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయలు 8 మందికి చెల్లించకుండా, పెండింగ్ మెడికల్ బిల్లులను చెల్లించకుండా,మధ్యపానం సేవించారని సంవత్సరకాలంగా పక్కన పెట్టిన కార్మికులను ఉద్యోగంలోకి తీసుకోకుండా, ఏపీఎండీసీ యాజమాన్యం కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు, త్వరగా సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి ఉద్యమాలు చేపడుతామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక  చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలి అన్నారు. 140 సంవత్సరాల క్రితం సాధించుకున్న ఎనిమిది గంటల పనిని, 12 గంటల చేయడం దుర్మార్గమన్నారు. ఫిబ్రవరిలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఢిల్లీ రైతాంగ ఉద్యమస్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో సిఐటియు జాతీయ మహాసభలు ఈనెల 31 నుండి,  జనవరి నాలుగో తేదీ వరకు, ఐదు రోజులపాటు, జరుగుతున్నాయని, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయం, గా ఉన్న కార్మిక నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు ఈ మహాసభలో ఏపీఎండిసి కార్మికుల సమస్యలపై తీర్మానం చేసి చర్చిస్తామని తెలియజేశారు. ఏపీఎండీసీ కార్మికులు, సంస్థ పరిరక్షణ కోసం, మరియు వారు చేసే పోరాటాలకు  సిఐటియు రాష్ట్ర కమిటీ  సంపూర్ణ   మద్దతు ఇచ్చి వారి పోరాటంలో పాల్గొంటామని వారు యాజమాన్యం ను హెచ్చరించారి ఈ మహాసభల జయప్రదానికి ప్రతి ఒక్క కార్మికుడు తన వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్. ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్, జనరల్ సెక్రెటరీ,  ఎం. శ్రీనివాసులు, వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ జ్యోతి నాగరాజు, జేఏసీ కో కన్వీనర్, అరుణావతి, మంగంపేట మైనింగ్ వర్కర్స్ యూనియన్, అధ్యక్ష కార్యదర్శులు, పులగంటి శ్రీనివాసులు, ముత్యాల శ్రీనివాసులు,ముఖ్య యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

ఖమ్మం

*యస్.బి.ఐ.టి. లో ఘనంగా ప్రారంభమైన రెండు రోజుల హ్యకథాన్*

ఖమ్మం పున్నమి ప్రతి నిధి రేపటి సమస్యలకు నేడే పరిష్కారం కనుగొనడం హ్యకథాన్ లక్ష్యం అని యస్.బి.ఐ.టి. కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. మంగళవారం కళాశాల ఆవరణలో నిర్వహించిన రెండు రోజుల అంతర్గత హ్యకథాన్ కు ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ఆరంభించారు. హాజరైన విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ ఆలోచనలను కోడ్ రూపంలోకి మార్చడంలో హ్యాకథాన్ ఉపయోగపడుతుందని తెలిపారు. మొదటి సంవత్సరంలోనే విద్యార్థులు ఐడియాధాన్, హ్యకథాన్ వంటి పోటీలలో చురుకుగా పాల్గొనడం హర్షించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. కళాశాలలోని ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యూబేషన్ సెల్ ద్వారా లాంచ్ ప్యాడ్ 1.0 పేరుతో నిర్వహించిన హ్యకథాన్లో 35 బృందాలు పాల్గొనగా, విజేతలకు రానున్న రోజులలో నిర్వహించబోయే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశాలను అందిస్తామని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు. కళాశాల వైస్ చైర్మన్ కె. శ్రీచైతన్య మాట్లాడుతూ విద్యార్థులలోని ఆలోచనలకు పూర్తి రూపాన్ని అందించి, ఆచరణలోకి తీసుకురావడం హ్యకథాన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులలోని సృజనాత్మకత ఆలోచింపజేసే రీతిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. విద్యతో పాటు ఆధునిక సాంకేతిక రంగాలలో జరుగుతున్న మార్పులను అలవర్చుకొని ఇటువంటి వినూత్న పోటీల ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న నూతన ఆవిష్కరణలను వెలికి తీయగలమని కళాశాల ప్రిన్సిపల్ డా॥ జి. రాజ్ కుమార్ తెలిపారు. అటానమస్, న్యాక్ ఏ+ హోదా తమ భాధ్యతను మరింతగా పెంచాయని, అందులో భాగంగానే ఈ విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయి ఐడియాధాన్ నిర్వహించామని గుర్తు చేసారు. హ్యాకథాన్ రెండవ రోజున విజేతలను ప్రకటించి బహుమతులను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యూబేషన్ సెల్ ఇంచార్జ్ డా॥ మురళీ మోహన్, పి. అశ్విని, అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, విభాగాధిపతులు డా॥ అమిత్ బింధాజ్, డా॥ చరణ్ సింగ్, డా॥ సుప్రియ, డా॥ స్పూర్తి, డా॥ పద్మావతి, డా॥ పి. రామకృష్ణ, యస్. నాగమణి, డా|| జి. ప్రభాకర్, టి.పి.ఒ. యన్. సవిత తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

సి యం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి

సి యం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనారోగ్యముతో ఆసుపత్రిపాలై ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసి ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలకు తమ వంతు బాధ్యతగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో బాధితుల ఇంటివద్దకే వెళ్లి రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ ఆరవ శ్రీధర్,మరియు రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్,కు.డా చైర్మన్ ముక్కారూపానంద రెడ్డి తనయుడు యువనేత ముక్కాసాయి వికాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. పుల్లంపేటకు చెందిన మాచికంటి ప్రతిక కృష్ణ కు30,786 రూపాయిలు, అనంతయ్యగారిపల్లికి చెందిన బొమ్ము ప్రభావతికి43,000, కొత్తపేటకు చెందిన పుత్తూరు సుబ్బమ్మకు33,800 రూపాయిలు,సాదువారి పల్లికి చెందిన కేశినేనిశాంతమ్మకు25,041రూపాయిలుటి.బలిజపల్లి అరుంధతి వాడకు చెందిన గోపదాల హరినాథ్ భార్య మల్లేశ్వరికి 30,785 రూపాయిలు విలువచేసే చెక్కులను అందజేశారు.ఈ విధంగా ఇంటి వద్దకే వచ్చి ఆర్థిక సహాయాన్ని అందజేయడం పట్ల ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పుల్లంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాపెర్ల చంద్రశేఖర్ నాయుడు,క్లస్టర్ ఇంచార్జ్ పోలి జగదీశ్వర్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నం శివయ్య, సెక్రటరీ సుధాకర్ రెడ్డి,ఆదినారాయణ రెడ్డి,నారాయణ నాయుడు, శంకర్ రెడ్డి, మహిళా నాయకురాలు వాణిశంకర్ , మోడెం ఈశ్వరయ్య,నాగేశ్వర్ నాయుడు,కేశినేనిమురళి,లక్ష్మీకర్ రెడ్డి,పెంచలయ్య,యానాది, లక్ష్మీనారాయణ గుప్త,విజయ్ కుమార్ గుప్త,వేలూరు నరసింహ కుమార్ గుప్త మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

E-పేపర్

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, *హ్యూమన్ వాల్యూస్ మరియు నో మోర్ టి యర్స్ కమిటీ* వారి ప్రేరణాత్మక కార్యక్రమము…..

శ్రీ దుర్గామల్లేశ్వర సిద్దార్థ మహిళా కళాశాల 9/12/2025 వ తేదీన *హ్యూమన్ వాల్యూస్ మరియు నో మోర్ టియర్స్ కమిటీ *ఆధ్వర్యంలో, ఇషా ఫౌండేషన్ సహకారంతో “మిరాకిల్ ఆఫ్ మైండ్ – ఫ్రం స్ట్రెస్ టు స్ట్రెంగ్త్” అనే ప్రేరణాత్మక కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. మనసు శాంతి, భావోద్వేగ సమతౌల్యం, ఒత్తిడిని శక్తిగా మార్చుకునే ప్రాయోగిక పద్ధతులపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇషా ఫౌండేషన్‌కు చెందిన రిసోర్స్ పర్సన్స్ మార్గదర్శనంలో విద్యార్థులు ధ్యానం, శ్వాస అవగాహన, మైండ్‌ఫుల్‌నెస్ వంటి సరళమైన కానీ ప్రభావవంతమైన పద్ధతులను అభ్యసించారు. ఈ కార్యక్రమం ద్వారా మానసిక ధృఢత్వం, ఆత్మపరిశీలన, విలువల ఆధారిత జీవన విధానాల ప్రాముఖ్యతను విద్యార్థులు లోతుగా గ్రహించారు. ప్రతి రోజు ఎదురయ్యే ఒత్తిడిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలో ఈ సెషన్ ద్వారా అర్థం చేసుకున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ విలువైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కళాశాల నిర్వహణ, ప్రిన్సిపాల్ శ్రీ వివి సుబ్రహ్మణ్య కుమార్ గారు మరియు కమిటీ కన్వీనర్ శ్రీమతి ఎమ్ రాధిక ఇషా ఫౌండేషన్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఈ పద్ధతులను తమ రోజువారీ జీవితంలో ఆచరించాలని సూచించారు. కార్యక్రమం చివర్లో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జాతీయ గీతాలాపన తో కార్యక్రమం ముగిసింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.