Monday, 16 March 2026

Blog

తిరుపతి

గ్రామీణ బ్యాంక్ ఎగువవీధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

శ్రీకాళహస్తి రూరల్, డిసెంబర్ 09 : తొండమనాడులోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఎగువవీధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాడు తిరుపతి అగర్వాల్ మెడికల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించగ కార్యక్రమాన్ని రీజినల్ మేనేజర్ పి.ప్రకాశ్ రత్న బాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా రీజినల్ మేనేజర్ ప్రకాష్ రత్నబాబు మాట్లాడు… ఈ అవకాశాన్ని గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులు, గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అగర్వాల్ కంటి వైద్య హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 80 మంది ఖాతాదారులకు తిరుపతి అగర్వాల్ మెడికల్ హాస్పిటల్ వైద్యులు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించి, అవసరమైన చికిత్సపై సూచనలు ఇచ్చారు. పలు కంటి సమస్యలను గుర్తించి ఖాతాదారులకు తగిన జాగ్రత్తలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఎస్.బాల నరసింహం మరియు సిబ్బంది కలిసి శిబిరాన్ని విజయవంతం గా నిర్వహించారు.

తిరుపతి

కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన నేతలు

శ్రీకాళహస్తి డిసెంబర్ 09, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు, సోనియా గాంధీ గారి 79 వ జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం, రేణిగుంట మండలం,గురవరాజు పల్లి ఎస్టీ కాలనీ నందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిల్లలు నడుమ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ….పేదల కోసం ప్రాణాలు అర్పించి, ప్రజల కోసమే జీవిస్తూ ప్రజలతో మమేకమై నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక కుటుంబం గాంధీల కుటుంబమని పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు రాహుల్, ఏర్పేడు మండల నాయకులు గోపాలరావు, శ్రీకాళహస్తి మండల యువజన అధ్యక్షులు నవీన్, నాగరాజు, మహేష్, సాయి, సారధి, బాబు, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

స్కెటింగ్ క్రీడకారుని ప్రోత్సహకం అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి డిసెంబర్ 09, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజిక వర్గ శాసనసభసబ్యులు బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి ఏర్పేడుకు చెందిన 10 సంవత్సరాల అంధ బాలుడు హర్షవర్ధన్ 220 కిలోమీటర్లు నంగిలి నుంచి శ్రీకాళహస్తికి స్కెటింగ్ ప్రారంభించి శ్రీకాళహస్తికి చేరుకున్న సందర్బంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హర్షవర్ధన్ ను శుభాకాంక్షలు తెలిపి, సన్మానించి రూ 20000/-అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హర్షవర్ధన్ శ్రీకాళహస్తి వాసి అయినందుకు తనకు చాల గర్వాంగవుందని అనుకున్నది సాదించాలంటే ఏది అడ్డు కాదు అని హర్షవర్ధన్ నిరూపించాడని ఈ క్రీడకారుని ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ తో కల్పించి ప్రభుత్వం ద్వార ప్రోత్సహకం అందిస్తామని అయన తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి లోని యాదవ్ పాలెం వి పీ ఆర్ నేత్ర కార్యక్రమం నిర్వహించారు

ఉదయగిరి లోని యాదవ్ పాలెం వి పీ ఆర్ నేత్ర కార్యక్రమం నిర్వహిచారు ఈ కార్యక్రమంలో కంటి వైద్య సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు పలువురు నాయకులు మాట్లాడుతూ ఎంపీ,ఎమ్మెల్యే వేమిరెడ్డి దంపతులు జిల్లాకు సామాజిక సేవలో ముందు ఉంటారని కొనియాడారు పేద మధ్య తరగతి కుటుంబాల్లో వేమిరెడ్డి దంపతులు ఆశాజ్యోతిగా నిలుస్తారన్నారు

రంగారెడ్డి

* బడంగ్పేటలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 09 : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని బడంగ్ పేట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఉన్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత శ్రీమతి సోనియా గాంధీ కే దక్కిందని అన్నారు. త్యాగానికి మారుపేరు సోనియా గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ ఎల్మేటి అమరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటి డైరెక్టర్ బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి నాయకులు రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, నవారు మల్లారెడ్డి, గట్టు బాలకృష్ణ, దిండు శ్రీనివాస్ గౌడ్, క్యారగరి శ్రీధర్, బొల్లపల్లి కుమార్, అమృత నాయుడు, టేకుల సుధాకర్ రెడ్డి, సూర్ణగంటి విజయ్, గిరి ముదిరాజ్, ధనేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

విజయ్ దివస్ సందర్భంగా అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం_ –కెసిఆర్ దీక్ష అమరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు.. సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 09 : మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ – జిల్లెలగూడ ప్రాంతంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో విజయ దివస్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అక్కడినుంచి పాదయాత్రగా చందన చెరువు సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, పాలాభిషేకం నిర్వహించి గులాబీ రంగు బెలూన్లను గాల్లోకి వదిలారు.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం కేసీఆర్ గారు చేపట్టిన 11 రోజుల దీక్ష ఫలితంగానే 2009 డిసెంబర్‌ 9న కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేశారు. ఆ చారిత్రాత్మక రోజును తెలంగాణ ప్రజలంతా విజయ దివస్‌గా జరుపుకుంటున్నారు అని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసిన కేసీఆర్ త్యాగాన్ని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు అవమానించేలా వ్యాఖ్యలు చేయడం విచారకరం. నిజం తెలిసి మాట్లాడాలి. కేంద్ర హోం మంత్రి చిదంబరం కేసీఆర్ కి ప్రత్యక్షంగా ఫోన్ చేసి దీక్ష విరమించండి, తెలంగాణ రాష్ట్ర ప్రకటన విడుదల చేయబోతున్నాము అని చెప్పిన తర్వాతినే దీక్ష విరమించారు. అని స్పష్టం చేశారు.అలాగే, రాష్ట్రాన్ని అస్థిరపరిచే నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కదోవ పట్టించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోంది అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* చార్మినార్ జోన్ మాకొద్దని ఆగ్రహిస్తున్న కాలనీ వాసులు –సమిష్టిగా పోరాడి మన ప్రాంతాన్ని కాపాడుకుందాం.. శ్రీరాములు అందెల*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 09 : బడంగ్ పేట్ కార్పొరేషన్ ను సౌత్ సౌత్ జోన్ లో ఉన్నటువంటి చార్మినార్ జోన్ లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ గుర్రం గూడా 6వ డివిజన్, 7వ డివిజన్ మాజీ కార్పొరేటర్లు దడిగ శంకర్ మరియు గడ్డం లక్ష్మా రెడ్డి ల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం గుర్రం గూడా లోని వివిధ కాలనీ వాసులతో కలిసి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు…ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ఆవేదనను శ్రీరాములు తో వ్యక్తపరుస్తూ ఎట్టి పరిస్థితుల్లో బడంగ్ పేట్ ను ప్రత్యేక జోన్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని దాని కొరకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు విలీనానికి వ్యతిరేకంగా కాలనీవాసులందరూ తమ సంతకాలను చేసి కార్పొరేటర్లకు అందించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ పార్టీలకతీతంగా మన ప్రాంతం కొరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని మీ యొక్క సూచనలను అభిప్రాయాలను తీసుకునేందుకే ఈ సమీక్ష సమావేశం నిర్వహించామని రాష్ట్ర ప్రభుత్వం బడంగ్ పేట్ ను ప్రత్యేక జోన్ గా ప్రకటించేదాకా సమిష్టిగా పోరాడుదామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి వీరకర్ణ రెడ్డి, రాళ్ల గూడెం రామకృష్ణా రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ తోట శ్రీధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ గూడెపు ఇంద్రసేన, బిజెపి సీనియర్ నాయకులు జంగా రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్చల భాస్కర్ రెడ్డి, వివిధ కాలనీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కాలనీవాసులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

విశాఖపట్నం

విశాఖ రోడ్ల మీద బండ్ల మీద టిఫిన్ చేస్తే మటాష్.

(పున్నమి ప్రతినిధి విశాఖ జిల్లా తేదీ 10-12-2025) కోత కోత పేర్లుతో టిఫిన్లు పెరుతో పాచిపోయినా ఆహారం.ఎం వి పి లో చిట్టి చిట్టి నేతి ముత్యాల ఇడ్లీల పెరిటా టిఫిన్ బండ్లు.తనిఖీ చేసిన జి వి ఎం సి షీ టీం, ఆహార భద్రతా అధికారులు.పాచిపోయిన, నిలవ ఉంచినా ఆహార పదార్థాలు వాడుతున్నట్లు గుర్తింపు.పుట్టగొడుగులు, పన్నీర్ వంటి కూరలు దుర్వాసనలు వస్తుండటం.2500 రూపాయలు మాత్రమే జరిమాన విధించి చేతులు దులుపుకున్న ఆహార భద్రత అధికారులు.

కామారెడ్డి

తమ ప్రచారాన్ని ముగించాలి

కామారెడ్డి, 09, పున్నమి ప్రతినిధి : జిల్లా మంగళవారం – 10 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు; మద్యం దుకాణాలు మూసివేత కామారెడ్డి జిల్లాలో ఈనెల 11 వ తేదీన (గురువారం) జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ప్రచారంపై అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. తొలి విడత ఎన్నికలు జరిగే 10 మండలాల పరిధిలో నేటి సాయంత్రం 5:00 గంటల (17:00 hrs) వరకు మాత్రమే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత బహిరంగ ప్రచారానికి అనుమతి ఉండదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల దశలు I, II & III – ఎన్నికల ప్రచార ముగింపు సమయాల ప్రకటన రాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల దశలు-I, II మరియు III లకు సంబంధించి ఎన్నికల ప్రచారం ముగిసే తేదీలు, సమయాలు క్రింది విధంగా నిర్ణయించబడినవి: 1. దశ – I ఎన్నికల ప్రచారం 09.12.2025 సాయంత్రం 5.00 గంటలకు ముగియవలసి ఉంటుంది. 2. దశ – II ఎన్నికల ప్రచారం 12.12.2025 సాయంత్రం 5.00 గంటలకు ముగియవలసి ఉంటుంది. 3. దశ – III ఎన్నికల ప్రచారం 15.12.2025 సాయంత్రం 5.00 గంటలకు ముగియవలసి ఉంటుంది. పోలింగ్ తేదీలకు 48 గంటల ముందు అమల్లోకి వచ్చే ‘నిశ్శబ్ద కాలం (Silence Period)’ నిబంధనల ప్రకారం, పై తేదీల తర్వాత ఎటువంటి విధమైన ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదు. ఉల్లంఘన జరిగిన పక్షంలో ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోబడును. ​నిషేధాజ్ఞల అమలు: ఎన్నికల సజావుగా నిర్వహణ కోసం ఇప్పటికే 10 మండలాల్లో నిషేధాజ్ఞలు ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి (Sec 163 BNSS) అమలులోకి వస్తాయి. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధం. ​మద్యం దుకాణాలు బంద్: ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఈ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ​పోలింగ్ వివరాలు: పోలింగ్ డిసెంబర్ 11వ తేదీ, గురువారం ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించబడుతుంది ​ఓట్ల లెక్కింపు: పోలింగ్ ముగిసిన అనంతరం, అదే రోజు (డిసెంబర్ 11న) సాయంత్రం ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి జరుగుతుంది. తేది:09.12.2025 కామారెడ్డి జిల్లా మంగళవారం పకడ్బందీగా మొదటి విడత ఎన్నికలకు సంబందించిన ఏర్పాట్లు పూర్తి చేయాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు- 2025 సందర్భంగా ఈ నెల 11వ తేదీన జరగనున్న మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి ఎన్నికల సంఘం కమిషన్ సభ్యులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, సాధారణ, వ్యయ పరిశీలకులు, జిల్లా పంచాయతీ అధికారులతో ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు తీసుకోవలసిన చర్యలు, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఓటర్ల ప్రభావిత అంశాలను అరికట్టడంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి విడతలో రాష్ట్రంలోని 3 వేల 834 గ్రామపంచాయతీ సర్పంచ్, 27 వేల 628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఇందు కొరకు 37 వేల 562 పోలింగ్ కేంద్రాలలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. సర్పంచ్ స్థానానికి 12 వేల 960 మంది, వార్డు సభ్యుల స్థానానికి 65 వేల 455 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు. పంచాయతీ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ సమయాలలో జాగ్రత్తలు వహించాలని, ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ , జిల్లా ఎస్పీ , సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నిర్వహించడానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికలు నిర్వహించే అధికారులకు పోలింగ్, ఇతర పోలింగ్ అధికారులకు శిక్షణ అందించి పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ అందించడం జరుగుతుందని, ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేయడం జరిగిందని, పోలింగ్ కేంద్రాలలో సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు. ఆయా మండల కేంద్రాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో కౌంటర్లు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు, పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక సజావుగా జరిగేలా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.ఎన్నికల సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ జూనియర్ కళాశాల సంఘం ఏపీ

ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ ఆంధ్ర ప్రదేశ్ సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ మరియు మాజీ MLC రామకృష్ణ సమక్షంలో ఏకగ్రీవంగా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి (తిరుపతి), ఉపాధ్యక్షుడు అప్పారావు (విజయనగరం), కార్యదర్శి సల్మాన్ రాజు( విజయవాడ) అదనపు ప్రధాన కార్యదర్శి సికిందర్ ( నెల్లూరు), ఆర్థిక కార్యదర్శి రంగ నాయకులు (ఒంగోలు),సహాయ కార్యదర్శి సుబ్రమణ్యం (కర్నూలు) మహిళా కార్యదర్శి శాంతి రాజశ్రీ (కోనసీమ)ను ఎన్నుకొన్నారు. తదనంతరం ఇంటర్మీడియేట్ విద్యా మండలి కార్యదర్శి శ్రీ రంజిత్ భాషా గారిని కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య,అందించడానికి తీసుకోవలసిన చర్యలు, అదేవిధంగా GO 283 ప్రకారం రూపొందించ బడిన సీనియారిటీ జాబితా ప్రకారం ప్రిన్సిపల్స్ కు పదోన్నతులు కల్పించాలని, ప్రతి FAC పోస్ట్ ను కూడా సీనియారిటీ ప్రాతిపదిక గా ఇవ్వాలని, కళాశాలల టైమింగ్స్ మార్చాలని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల ను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సూచించడం జరిగినది. అనంతరం విద్యా మండలి పరీక్షల నియంత్రణ అధికారి విక్టర్ గారిని కలిసి , 2026 లో జరుగు ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, సీనియారిటీ ప్రాతిపదికన అధికారులను నియమించాలని 4 సార్లు ఒకే విధమైన డ్యూటీ చేసిన వారిని తప్పించి వేరే సీనియర్ లకు అవకాశం కల్పించాలని అదేవిదంగా ప్రభుత్వ కళాశాలలో పనిచేసే అతిధి అధ్యాపకుల సేవలు పరీక్ష లలో ఉపయోగించుకోవాలని కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.