Sunday, 15 March 2026

Blog

E-పేపర్

మీరు ఒంటరిగా లేరు… మీతో పాటు మేమున్నాం” — నిర్మల్ కుమార్

పున్నమి ప్రతినిధి / నెల్లూరు ఈ రోజు (11.12.2025) అబైడింగ్ హోప్ ట్రస్ట్ కార్యాలయంలో 50 మంది క్యాన్సర్ రోగులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. డైరెక్టర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ, గత 12 నెలలుగా నిరంతరంగా పౌష్టికాహారం అందిస్తున్నామని, నూతన సంవత్సరంలో 100 మంది క్యాన్సర్ పేషెంట్స్‌కు ఉచిత న్యూట్రిషన్ అందించే లక్ష్యం ఉందని తెలిపారు. ముఖ్య అతిథి క్యాన్సర్ హాస్పిటల్ కౌన్సిలర్ శ్రీమతి కన్యాకుమారి మాట్లాడుతూ, క్యాన్సర్ రోగుల ఆరోగ్యం కోసం ప్రోటీన్ ఫుడ్, మల్టిగ్రెయిన్, ఎనర్జీ సప్లిమెంట్స్, డ్రై ఫ్రూట్స్, ఇమ్యూనిటీ బూస్టర్స్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. పత్రికా రచయిత శ్రీ జయప్రకాశ్ మాట్లాడుతూ, పౌష్టికాహారం రోగ నిరోధక శక్తిని పెంచి, శారీరక–మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ రమ, జయ, నిర్మలా తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఏపీలో వైద్య విద్యా రంగాన్ని కాపాడాలి – పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి డిమాండ్

న్యూఢిల్లీ/తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యా రంగంలో నెలకొన్న ప్రస్తుత సంక్షోభంపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలలో బాగంగా మంగళవారం అత్యంత ముఖ్యమైన ప్రజా సమస్యలు ప్రస్తావించే అధికరణ 377 కింద రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించారు. ప్రజల ధనంతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యను విస్తరించాలనే సదుద్దేశంతో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగింది. వీటిలో ఇప్పటికే 7 కాలేజీల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరికొన్ని చివరి దశలో ఉన్నాయని ఎంపీ గుర్తు చేశారు. అయితే, నిర్మాణాలు పూర్తయి సిద్ధంగా ఉన్న కాలేజీలకు కూడా అనుమతులు ఇవ్వడంలో జరుగుతున్న అనవసర జాప్యం అత్యంత దురదృష్టకరమని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జాప్యం కారణంగా, ఈ విద్యాసంవత్సరంలో సుమారు 1000కి పైగా ఎంబీబీఎస్ సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎంతోమంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని డాక్టర్ గురుమూర్తి తెలిపారు. ప్రైవేట్ యాజమాన్యాలు కేవలం లాభాపేక్షతో పనిచేస్తాయని, అదే జరిగితే పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల్లో ప్రజలకు వైద్య సేవలు దూరమవుతాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో, కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. సిద్ధంగా ఉన్న ప్రభుత్వ కాలేజీలకు వెంటనే అనుమతులు మంజూరు చేసి, ఏపీలో ప్రభుత్వ వైద్య విద్యా రంగాన్ని రక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

*బొక్కోనిగూడ గ్రామంలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం*

పున్నమి ప్రతినిధి, ఘట్ కేసర్: ఘట్ కేసర్ మండలం బొక్కోని గూడ గ్రామంలో అనురాగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం నిర్వహించారు.అగ్రికల్చర్ 4వ సంవత్సరం విద్యార్థులు గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక సదస్సుని (పీఆర్ఏ) నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామ రైతుల నుండి సమాచారం సేకరించారు. గ్రామం సామాజిక, వనరుల పటాన్ని గీసి వివరించారు.ఈ సందర్భంగా వ్యవసాయ కాలచక్రం,సీజనల్ కేలండర్‌తోపాటు,వ్యవసాయ సాగులో ఉన్న సమస్యలను, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై వివరించారు. వివిధ రకాల పంటల గురించి రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల ఆధ్యాపకులు రవి, దివాకర్,అభ్యుదయ రైతులు,విద్యార్థిని, విద్యార్ధులు పాల్గొన్నారు.

కామారెడ్డి

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో భారీ పోలింగ్

– 18 గ్రామపంచాయతీల్లో సగటు 75 శాతం దాటిన ఓటింగ్ కామారెడ్డి, 11 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలోని 18 గ్రామపంచాయతీల్లో రెండో సాధారణ గ్రామపంచా యతీ ఎన్నికల్లో పోలింగ్ ఉత్సాహంగా కొనసాగీం ది. మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 27,061 మంది నమోదు చేసిన ఓటర్లలో 20,365 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో సగటు పోలింగ్ శాతం 75.28గా నమోదైంది.గ్రామాల వారీగా విశేషాలు ఉదయం నుంచే అన్నారం, గిద్ద, గోడుగుమర్రీ తండా, గోల్లపల్లి, జగదాంబ తండా, మోషంపూర్ వంటి గ్రామాల్లో ఓటర్లు బూత్‌లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అన్నారం గ్రామంలో 2,614 మంది ఓటర్లలో 2,018 మంది ఓటు వేయ డంతో 77.20 శాతం, గిద్దలో 1,655 మందిలో 1,225 ఓట్లు పడటంతో 74.02 శాతం, గోడుగుమ ర్రీ తండాలో 2,253 మందిలో 1,687 మంది ఓటు వేసి 74.86 శాతం పోలింగ్ నమోదైంది.గొల్లపల్లి లో 86 శాతం దాటగా, జగదాంబ తండా, మోషం పూర్, ఉప్పల్వాయి గ్రామాల్లో కూడా 80 శాతం దాటిన పోలింగ్ శాతం నమోదు కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.రామారెడ్డిలో రికార్డు స్థాయి ఓటింగ్ మండల కేంద్రం రామారెడ్డి గ్రామంలో ఓటర్లు రికార్డు స్థాయిలో బూత్‌లకు తరలివచ్చా రు. 2,655 మంది నమోదు చేసిన ఓటర్లలో 2,532 మంది ఇప్పటికే ఓటు వేశారు, దీంతో మధ్యాహ్నం 1 గంట కల్లా 95.36 శాతం పోలింగ్ నమోదు అయ్యి మండలంలోనే అత్యధికంగా నిలిచింది. రంగంపేట, రెడ్డిపేట్, స్కూల్ తండాలో కూడా 70 శాతానికి పైగా ఓటింగ్ నమోదవడంతో స్థానిక అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది.ప్రశాంత వాతావరణంలో పోలింగ్మొత్తం మండలంలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుండ గా, ఎలాంటి అపశ్రుతులు నమోదు కావడం లేదు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భద్రతా దళాలుమోహరిం చడంతో పాటు, ఎన్నికల అధికారులు కేంద్రాలను సందర్శిస్తూ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఓటర్ల సౌకర్యార్థం తాగునీటి, షెడ్లు, ప్రత్యేక వరుసలు వంటి ఏర్పాట్లు ఉండటంతో మహిళలు, వృద్ధులు కూడా నిరభ్యంతరంగా తమ ఓటు హక్కు వినియోగిస్తున్నారు.సాయంత్రం వరకు మరింత పెరుగనున్న పోలింగ్ఇప్పటికే మూడు వంతులకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కోవడం ఎన్నికల ఉత్సాహానికి నిదర్శనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. సాయంత్రం వరకు ఓటర్ల రద్దీ ఈ వేగంతో కొనసాగితే, మొత్తం మండలంలో పోలింగ్ శాతం 85 నుంచి 90 శాతం వరకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామస్థాయిలో అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం, నాయకులపై నమ్మకం వంటి అంశాలపై ప్రజలు తీర్పు ఇవ్వడాని కి భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం ప్రజాస్వామ్య స్పూర్తిని చాటుతుంది.

ఖమ్మం

ముగిసిన పోలింగ్.. మొదలైన కౌంటిగ్

ఖమ్మం డిసెంబర్ పున్నమి ప్రతి నిధి సర్పంచ్ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ మధ్యాహ్నం 1 గంట కి ముగిసింది. భోజన విరామం అనంతరం కౌంటింగ్ ప్రారంభం అయింది. 5 నియోజకవర్గాల ఖమ్మం జిల్లా లో మొదటి దశలో మధిర నియోజకవర్గం లో ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం తొ ప్రజలు ఫలితాలు మీద ఆసక్తి గా ఎదురు చూస్తన్నారు. మొత్తం మీద ఈ రోజు రాత్రి కి ఫలితాలు విడుదల అయి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలియజేసారు.

విశాఖపట్నం

గాజువాకలో మెగా జాబ్ మేళా – యువతకు స్వర్ణావకాశం

గాజువాక : డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో గాజువాకలో రేపు (12.12.2025, శుక్రవారం) మెగా జాబ్ మేళా నిర్వహించబడుతోంది. శ్రీనగర్‌లోని టి.ఎస్.ఆర్. & టి.బి.కె. (ఆపిల్ ఐ స్కూల్) ప్రాంగణంలో ఉదయం నుంచి ఈ మేళా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో సుమారు 40 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఐటీ, రిటైల్, సేల్స్, ఫార్మా, మాన్యుఫ్యాక్చరింగ్, కస్టమర్ సపోర్ట్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా, జూనియర్ స్థాయి నుంచి మిడ్ లెవెల్ పోస్టుల వరకు వివిధ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. నిరుద్యోగ యువత, యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ గాజువాక శాసన సభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ప్రతి అభ్యర్థి ఈ మేళాకు హాజరై కంపెనీల ప్రతినిధులతో ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని చెప్పారు. స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా కల్పించబడినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఉద్యోగ ఆశావహులు బయోడేటా, అవసరమైన పత్రాలు, ఐడీ ప్రూఫ్‌లు వెంట తీసుకొని రావాలని సూచించారు.

నిర్మల్

రత్నాపూర్ కాండ్లి గ్రామానికి సేవ చేసే అవకాశాన్ని ఇవ్వండి: సర్పంచ్ అభ్యర్థి గడ్డం హరీష్

నిర్మల్ జిల్లా డిసెంబర్ 11 (పున్నమి ప్రతినిధి) . రత్నాపూర్ కాండ్లి గ్రామంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి గడ్డం హరీష్ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ— ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి, అఖండ మెజారిటీతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని హరీష్ హామీ ఇచ్చారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే కష్టపడి పని చేసే నాయకుడు కావాలని, ప్రతి వ్యక్తి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కరించేందుకు ముందుంటానని తెలిపారు. సమాజ సేవకుడిగా గ్రామ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ, నీతి–నిజాయితీతో సేవలు అందిస్తానని హరీష్ స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం తన ప్రధాన లక్ష్యమని అభ్యర్థి పేర్కొన్నారు.

ఖమ్మం

బిజెపి నాయకుల ఆగ్రహం: ఖమ్మం కూరగాయల మార్కెట్‌లో జరుగుతున్న అక్రమాలపై ఘాటుగా ఖండన:

ఖమ్మం డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పాత బస్టాండ్ సమీపంలోని వీధి వ్యాపారుల ప్రాంగణ మార్కెట్‌లో జరుగుతున్న అక్రమాలను తీవ్రంగా ఖండిస్తూ బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరువ్యాపారులపై జరుగుతున్న అన్యాయ వసూళ్లు, బెదిరింపులు పెరుగుతున్నాయనే సమాచారం తెలుసుకున్న బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, తెలంగాణ బిజెపి రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవ్ రావు, టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రతి నిధుల బృందం మార్కెట్‌ను సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు. వ్యాపారుల నుంచి రసీదు లేకుండా ఒక్కొక్కరి దగ్గర ₹10,000 చొప్పున వసూలు చేసినట్టు వచ్చిన ఫిర్యాదులు అత్యంత ఆందోళనకరమని వారు పేర్కొన్నారు. డబ్బులు తీసుకున్నప్పటికీ ఎలాంటి అధికారిక రికార్డులు, రసీదులు ఇవ్వకపోవడం తీవ్ర అవకతవకలకు నిదర్శనమని తెలిపారు. అదనంగా, పాత వ్యాపారులను బయటకు పంపి కొత్త వ్యక్తులను మార్కెట్లోకి తీసుకురావాలనే ప్రయత్నాలు పేద వ్యాపారుల జీవనాధారాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి నాయకులు నాలుగు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు— వసూళ్లకు సంబంధించిన పూర్తి వివరాల వెల్లడి. రసీదు లేకుండా డబ్బులు వసూలు చేసిన అధికారులపై దర్యాప్తు. పాత వ్యాపారులను తొలగించే చర్యలకు తక్షణ విరమణ. పేద వ్యాపారుల జీవనాధార రక్షణకు ప్రభుత్వ హామీ. పేదలపై అన్యాయం జరిగితే ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే కానీ కఠినమైన పోరాటం చేస్తామని బిజెపి నేతలు హెచ్చరించారు.

E-పేపర్

మాదగ్గర ఇచ్చేకవర్లు అతితక్కువ సమయంలో గమ్యస్థానం చేరుస్తాం ప్రొఫెషనల్ కొరియర్స్ రాజేష్ కుమార్

మాదగ్గర ఇచ్చేకవర్లు అతితక్కువ సమయంలో గమ్యస్థానం చేరుస్తాం ప్రొఫెషనల్ కొరియర్స్ రాజేష్ కుమార్ రైల్వే కోడూరు స్థానిక ఎంజీ రోడ్డు నందు పోస్ట్ ఆఫీస్ పక్కన ప్రొఫెషనల్ కొరియర్స్ ధర తక్కువ సేవలు ఎక్కువ అతి తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేర్చే ఏకైక కొరియర్ ప్రొఫెషనల్ కొరియర్ అని బ్రాంచ్ ఇన్చార్జ్ రాజేష్ కుమార్ తెలిపారు. మా దగ్గర కువైట్ ఏ దేశానికైనా మా దగ్గర నుంచి పంపించడం జరుగుతుందని తెలిపారు. మా 3 8179521931.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.