Friday, 6 March 2026

Blog

తిరుపతి

ఆర్తులకు ఆపన్నహస్తం సి.యం.సహాయనిధి- బొజ్జల రిషితా రెడ్డి

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి బాధిత కుటుంబాలకు సి.యం.సహాయనిధి క్రింద సుమారు సుమారు 78,25,920 రూ సీయంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబాలకు బుధవారం నాడు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి అందజేసి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు.78,25,920 విలువచేసే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల రిషితా రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత ఆశయంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని కొనియాడారు. పేదరికం లేని సమాజ స్థాపనే సంకల్పంగా ముందుకు సాగుతున్నారని ఇందులో భాగంగానే పలు వ్యాధులతో బాధపడే వారికి, ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 19 నెలల కాలంలోనే పార్టీలకతీతంగా నాలుగు కోట్ల 15 లక్షల 420 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారన్నారు. బాధిత కుటుంబాలను అందుకుంటూ, వారిలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉండటానికి తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనా దక్షతకు నిదర్శనమని సీఎం సేవలను ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, కంటా రమేష్, పేట బాలాజీ రెడ్డి, పోలూరు శ్రీనివాస్ రెడ్డి, ముని కృష్ణారెడ్డి, మునిరాజా యాదవ్, రేణుకమ్మ, కుమారి, ఆర్ముగం, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

వైభవంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి పుష్ప యాగం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 25: శ్రీకాళహస్తి మండలం తొండమంతపురంలో వెలసిన తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ దేవాలయలో శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి అమ్మవార్లకు పుష్ప యాగం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు గ్రామస్తులు వివిధ రకాల పుష్పాలను సాంప్రదాయ బద్ధంగా ఆలయానికి తీసుకొచ్చారు. పుష్ప పాన్పుపై స్వామి అమ్మ వార్ల ఉత్సవమూర్తులను చేర్చి అర్చకులు శాత్స్రోక్తంగా పూజలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో సూపర్నెంట్ జ్ఞాన శేఖర్ మహేష్ సీనియర్ అసిస్టెంట్ మహేష్, ఆల ఇన్స్పెక్టర్ సుధీర్ గ్రామ పెద్దలు దామోదర్ రెడ్డి,కందాటి శేఖర్ రెడ్డి, సంజీవయ్య,విజయ్ కుమార్, మాధవరెడ్డి, చెంగారెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పుష్పయాగాన్ని తిలకించారు.

ఖమ్మం

కమ్మ కులం ప్రస్తావనపై తీవ్ర అభ్యంతరం – తెలుగు మహిళ తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షురాలు చలాసాని ఝాన్సీ స్పందన

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) కమ్మ కులం ప్రస్తావన తీసుకువచ్చిన తొలి వెలుగు జర్నలిస్ట్ రఘుపై తెలుగు మహిళ తెలంగాణ మాజీ ఉపాధ్యక్షురాలు చలాసాని ఝాన్సీ తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో కుల ప్రస్తావనలు చేయడం సరికాదని, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖమ్మం జిల్లాకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మం ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని ఝాన్సీ పేర్కొన్నారు. ఆ సమయంలో మంత్రి గా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు ద్వారా అనేకమంది పేదలకు హౌస్ ప్లాట్లు మంజూరు చేయడం, గృహ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని ఆమె తెలిపారు. 1990లలో ఖమ్మం అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేశాయి. ఆ విషయాలు తెలియకపోయినా సరే, కులాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం సమంజసం కాదు” అని ఆమె అభిప్రాయపడ్డారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తోందని, జర్నలిస్టులు సమాజంలో విభేదాలు రేకెత్తించే విధంగా వ్యాఖ్యలు చేయకూడదని ఆమె హెచ్చరించారు. కమ్మ సమాజం కష్టపడే స్వభావం కలిగి ఉందని, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడమే తమ ధ్యేయమని ఆమె పేర్కొన్నారు. కులం ఆధారంగా వ్యక్తులపై వ్యాఖ్యలు చేయడం వల్ల సమాజంలో అనవసర ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు చేయవచ్చుగానీ, వాటిని కుల రంగు పూయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చలాసాని ఝాన్సీ స్పష్టం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో ఈఈ ప్రసాద్ గారుసిబ్బందితో సమావేశం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) నెల్లూరు రోలర్స్ ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ గారు 01-02-2026న బాధ్యతలు స్వీకరించిన అనంతరం మనుబోలు మండలంలోని సెక్షన్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది సూచనలు స్వీకరించి, తాను కూడా మార్గదర్శకాలు ఇచ్చారు. వినియోగదారుల సమస్యలను సెక్షన్ కార్యాలయానికి తెలియజేస్తే త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీ సుబ్రహ్మణ్యం, ఏఈఈ అనిల్ కుమార్ ,జేఈ రాంబాబు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

హైదరాబాద్

రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు ప్రజలకు గౌరవప్రదమైన సేవలే లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పున్నమి ప్రతి నిధి రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్ మరియు ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 ఆర్డీవో కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. అలాగే రెండ‌వ విడ‌త‌లో శిధిలావ‌స్ధ‌లో ఉన్న 170 ఆర్డీవో, త‌హ‌సీల్దార్ కార్యాల‌యాల‌ను నిర్మిస్తామ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే నమూనాలో, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేయనున్నట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించి డిజైన్లకు తుది రూపు ఇస్తామని చెప్పారు. త‌క్కువ ఖ‌ర్చుతో ప్ర‌జ‌ల‌కు అత్యుత్త‌మ సేవ‌లు అందేలా ఈ భ‌వ‌నాల నిర్మాణం ఉంటుంద‌న్నారు. బుధవారం సచివాలయంలో తన కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్స రెడ్డి మీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్ని తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి, శిధిలావ‌స్ధ‌, పాల‌న‌కు అనువుగా లేని భ‌వ‌నాలు వివ‌రాలను సేకరించారు. “ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడం సరైంది కాదు. ప్రజలకు సేవలందించే కేంద్రాలు గౌరవప్రదంగా ఉండాలి” అన్న గౌర‌వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డక ముందు, ఏర్ప‌డిన త‌ర్వాత కూడా రెవెన్యూ కార్యాల‌యాలు ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్య‌వంతంగా లేక‌పోవ‌డంతోపాటు చాలా వ‌ర‌కు అద్దె భ‌వ‌నాల‌లోనే కొన‌సాగుతున్నాయ‌ని అన్నారు. గత ప్రభుత్వం ముందుచూపు లేకుండా, ప్రణాళికాబద్ధత లేకుండా మండలాల పునర్విభజన చేపట్టిందని, కొన్ని మండలాలు రెండు మూడు జిల్లాల పరిధిలోకి వచ్చే విధంగా రూపొందించింద‌ని మంత్రి విమర్శించారు. అనేక కార్యాలయాల్లో కనీస వసతులు లేకపోవడం, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మండలాలకు అవసరమైన పోస్టులు మంజూరు చేసి పరిపాలనను బలోపేతం చేశామని తెలిపారు. అలాగే ప్ర‌జ‌ల‌కు దూరంగా కల‌క్ట‌రేట్‌ల‌ను నిర్మించి నిర్వ‌హ‌ణ‌ను గాలికివ‌దిలేశార‌ని విమ‌ర్శించారు. స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో అత్యాధునిక వసతులతో సమీకృత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి సమీకృత భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే గచ్చిబౌలి, మేడ్చల్-మల్కాజిగిరి, పఠాన్ చెరువులలో భవనాలకు శంకుస్థాపన పూర్తయ్యిందని, గచ్చిబౌలిలో నిర్మాణ పనులు తుది దశలో ఉండి మరికొద్ది నెలల్లో ప్రారంభానికి సిద్ధమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ఆధునికీకరించి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్తె రెడ్డి లిపారు.

ఖమ్మం

ఖమ్మంలో బీజేపీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యశాల ఘనంగా నిర్వహణ:

ఖమ్మం, ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను కార్యకర్తలలో మరింత బలంగా ప్రతిష్టించాలనే లక్ష్యంతో ఖమ్మం నగరంలోని మినర్వాగ్రాండ్ వేదికగా బుధవారం “పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యశాల–2026” ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది. జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బసవాపురం లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి & ఖమ్మం జిల్లా ప్రబారి బద్దం మైపాల్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏకాత్మ మానవతావాదం మరియు అంత్యోదయ సిద్ధాంతాలు సమాజంలోని చివరి వ్యక్తికి చేరేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి క్రమశిక్షణ, సిద్ధాంత నిబద్ధత మరియు క్షేత్రస్థాయి కార్యాచరణ అత్యవసరమని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, వక్కలంక సుబ్రహ్మణ్యం, పెరుమాళ్లపల్లి విజయరాజు, చిలుకూరు రమేష్, నున్న రవి కుమార్, అల్లిక అంజయ్య రవి గౌడ్, మణిమందా సరస్వతి, గుత్త వెంకటేశ్వర్లు, నాయుడు రాఘవ, ఆపతి రామరావు, గడీల నరేష్, వంకదాని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

రజక కుటుంబంపై దాడి దుర్మార్గం – పసికందు మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలి: బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు వెంకటనారాయణ

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) నాగర్‌కర్నూల్ జిల్లా లోని కొమురెల్లి మల్లన్న దేవస్థానం జాతర సందర్భంగా రజక కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో రెండు నెలల పసికందు మృతి చెందడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని కులం పేరుతో దూషిస్తూ, ఆలయంలోకి ప్రవేశం నిరాకరించి కొందరు అగ్రకుల వ్యక్తులు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాట, దాడిలో కుటుంబ సభ్యులు గాయపడగా, రెండు నెలల శిశువు ప్రాణాలు కోల్పోవడం సమాజం తలదించుకోవాల్సిన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్షతో వ్యవహరించడం, దేవాలయంలోకి ప్రవేశం నిరోధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న వెంకటనారాయణ, బాధ్యులపై వెంటనే హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయని, బాధిత కుటుంబానికి న్యాయం చేయడం ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తిసుకోవాలని ధనియాకుల వెంకట్ నారాయణ కోరారు.

ఖమ్మం

ప్రత్యామ్నాయం లేకుండా ఇళ్లు కూల్చడం అమానుషం – అసలైన పేదలకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం: దేవకీ వాసుదేవరావు

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం భూదాన్ కాలనీలో గత 14 ఏళ్లుగా నివాసం ఉంటున్న నిరుపేదలను ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా గెంటివేయడాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు తీవ్రంగా ఖండించారు. అసలైన పేదలకు న్యాయం జరగాల్సిందేనని, వారికి ఇళ్ల హక్కు కల్పించేవరకు బీజేపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఇళ్లు కోల్పోయి ప్రస్తుతం ఖమ్మం నగరంలోని Ambedkar Bhavan లో తలదాచుకుంటున్న బాధితులను దేవకీ వాసుదేవరావు జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు బీజేపీ ప్రతి నిధి బృందం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుల సమస్యలను తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం రోడ్డు మీద నిరసన కార్యక్రమం చేపట్టిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపులోకి తీసుకొనేందుకు నాయకులను రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా దేవకీ వాసుదేవరావు మాట్లాడుతూ, పేదలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అన్యాయమని, ఇళ్లకు ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేయడం అమానుష చర్య అని విమర్శించారు. బాధితులకు తక్షణమే పునరావాసం కల్పించి, అసలైన అర్హులకు ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అసలైన పేదలకు న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున అన్ని విధాలుగా పోరాటం కొనసాగిస్తామని బీజేపీ నాయకులు భరోసా ఇచ్చారు. కార్యక్రమం లో రాజేష్ గుప్తా, రవి రాదోడ్, నరేష్, రామ కృష్ణ, అల్లిక అంజయ్య, రాఘవ రావు, గుత్త వంశీ, విజయరాజు, బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు

నారాయణపేట

ఫిబ్రవరి 26 నుంచి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి- జనసేన హనుమంతు

జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి గారి ఆదేశాల మేరకు తెలంగాణ విభజన విభాగం సభ్యులు డాక్టర్ మణికంఠ గౌడ్ గారి ఆధ్వరంలో ఫిబ్రవరి 26 నుండి మక్తల్ నియోజకవర్గం లో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు నిర్వహించబడుతుందనీ మక్తల్ నియోజక వర్గం జనసేన నాయకులు హనుమంతు గారు తెలియజేశారు. భావితరాల భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధినే ధ్యేయంగా పనిచేస్తున్న జనసేన పార్టీ 13వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభసందర్భాన్ని పురస్కరించుకొని 5 వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతుంది అని అందులో భాగంగా మక్తల్ నియోజకవర్గం లో వందమంది సాధకులతో ఉద్యమి సభ్యత్వాలు నమోదు చేయబడతాయని తెలియజేశారు. సభ్యత్వ నమోదు ద్వారా 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించబడుతుంది. పార్టీ కార్యకర్తకు అనుసంధానంగా ఉండటం కోసం ఉద్యమి సభ్యత్వం ఉపయోగపడుతుందని భవిష్యత్తులో పదవులు గానీ స్థానిక సంస్థల ఎన్నికలలో గానీ ఈ ఉద్యమి సభ్యత్వమే ప్రధాన పాత్ర వహిస్తుందని హనుమంతు తెలియజేశారు. కావున పార్టీ సిద్ధాంతలపట్ల ఆకర్షితులైన వ్యక్తులు పార్టీ భావజాలం పట్ల నమ్మకం ఉన్న వ్యక్తులు పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చేవారందరు కూడా ఈ ఉద్యమి సభ్యత్వం తీసుకోవాలని తెలియజేశారు.

తిరుపతి

మహిళ సాధికారత అవగాహన ర్యాలీ

పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం రామచంద్రపురం మండలం వెంకట్రామపురం సమీపంలో ఉన్న సెవన్ హిల్స్ ఫార్మసీ కళాశాల, ఐక్యూఏసి ఆధ్వర్యంలో మహిళా సాదికారత అవగాహన ర్యాలీ తిరుపతి రూరల్ మండలం తనపల్లె గ్రామమునందు నిర్వహించారు. “డ్యూ టు గైన్” థీమ్ ఆధారంగా జరిగే ప్రపంచ మహిళా దినోత్సవం -2026 ను పురస్కరించుకొని భారతదేశ గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన ద్వేయంగా సాదికారిత సాదించాలని ర్యాలీలో పాల్గొన్న డైరక్టర్ డాక్టర్ లక్షలయ్య, ఎన్ఎస్ఎస్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శరవణకుమార్ మహిళా సిబ్బంది మరియు విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.