Sunday, 15 March 2026

Blog

విశాఖపట్నం

విశాఖపట్నంలో 88.35 కి.మీ. నగర రహదారుల అభివృద్ధికి రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ఆమోదం.

విశాఖపట్నంలో 88.35 కి.మీ. నగర రహదారుల అభివృద్ధికి రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ఆమోదం. * యాన్యుటి మోడల్ రోడ్ల అభివృద్ధికి రెండవ జోన్ లో కార్యాచరణను ప్రారంభించిన జీవీఎంసీ కమిషనర్ *విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి* యాన్యుటి మోడల్ రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణ అభివృద్ధి (MA&UD) శాఖ ఉత్తరవులను జారీ చేసిందని, ఆ దిశగా కార్యాచరణను వెంటనే ప్రారంభించడం జరిగిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. గురువారం ఆయన ఆన్యూటీ మోడల్ రోడ్ల అభివృద్ధి కార్యాచరణలో భాగంగా రెండవ జోన్ పరిధిలో కార్ షెడ్ నుండి పీఎం పాలెం రోడ్డును జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ పి వి సత్యనారాయణ రాజు చీఫ్ సిటీ ప్లానర్ ఏ ప్రభాకర్ రావు, జోనర్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, ఇతర ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విశాఖపట్నంలో 88.35 కి.మీ. నగర రహదారుల అభివృద్ధికి రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఆమోద ఉత్తర్వులను బుధవారం జారీ చేశారన్నారు . ఈ ప్రాజెక్టు PPP – హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద, మొత్తం ₹306.95 కోట్ల వ్యయంతో, పూర్తిగా GVMC అంతర్గత ఆదాయ వనరుల ద్వారా అమలు చేయబడనుందని, ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ గ్రాంట్ అవసరం ఉండదనికమిషనర్ తెలిపారు. 88.35 కి.మీ. రహదారుల అభివృద్ధి పనులను PPP-HAM మోడల్‌లో అమలు ప్రాజెక్ట్‌కు APUIAML ను ట్రాన్సాక్షన్ అడ్వైజర్ & స్వతంత్ర ఇంజనీర్ కన్సల్టెంట్ గా నియమించడానికి అనుమతించిందని,ప్రాజెక్ట్ చెల్లింపుల కోసం ఆస్తిపన్ను ఆదాయాన్ని ప్రత్యేక ఎస్క్రో ఖాతాకు మళ్లించడం. RFP & కన్సెషన్ అగ్రిమెంట్ (CA) డ్రాఫ్ట్ బిడ్ పత్రాలకు అనుమతి కలదని, బిడ్‌ను విడుదల చేసి, ఫలితాలను GVMC కౌన్సిల్/ప్రభుత్వ ఆమోదం కోసం సమర్పించడానికి అనుమతి కలిగిందని కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ సూచనలు మేరకు ప్రాజెక్టు సాధ్యత అధ్యయనం, నాణ్యత పరిరక్షణ, రిస్క్ షేరింగ్, ప్రాజెక్టు మానిటరింగ్ వంటి అన్ని అంశాలను కచ్చితంగా అనుసరించి, నగర రహదారి మౌలిక వసతులను ఆధునిక ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగా జీవీఎంసీ వేగంగా చర్యలు ప్రారంభిస్తుందన్నారు. విశాఖపట్నం ప్రజలకు ఉన్నత ప్రమాణాల రహదారి సదుపాయాలు అందించడానికి జీవీఎంసీ కట్టుబడి ఉందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ రోడ్ల అభివృద్ధి కార్యాచరణలో భాగంగా జీవీఎంసీ రెండవ జోన్ పరిధిలో యాన్యుటి మోడల్ రోడ్డు అభివృద్ధికి కార్ షెడ్ జంక్షన్ నుండి పీఎం పాలెం రోడ్డును పరిశీలించడం జరిగిందని కమిషనర్ తెలిపారు. పీఎం పాలెం ఆఖరి బస్ స్టాప్ వరకు, బాబా కాలేజ్ వరకు, సాయి ప్రియ లేఅవుట్ వరకు మూడు దశలలో 4.6 కిలోమీటర్ల ప్రస్తుతం ఉన్న రోడ్డును అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ రోడ్డు అభివృద్ధిలో రోడ్డు విస్తరణ, సెంటర్ మీడియన్, గ్రీనరీ, రోడ్డు మార్కింగ్ పెయింటింగ్, రోడ్ స్టడ్లు, సైనేజులు, కాలువలు, కాలువల పై కవరింగ్ స్లాబులు, ఫుట్పాతులు, ఎఫ్ ఆర్ పి గ్రేటింగు, కేబుల్ లో కొరకు డక్టులు, స్ట్రీట్ లైటింగ్, బస్టాప్లు, కూర్చునే బెంచీలు, డస్ట్ బిన్లు, హోర్డింగులు తదితర అన్ని సదుపాయాలతో, ప్రజలు వాహనాల రాకపోకలకు వీలుగా అందమైన మొక్కలతో సుందరీ కరణతో రోడ్డు అభివృద్ధికి, నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రధాన ఇంజనీర్ కు చీఫ్ సిటీ ప్లానర్ కు, ఏపీ యు ఐ ఎం ఎల్ ప్రతినిధులకు అవసరమగు కార్యాచరణ వెంటనే చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ఈ రోడ్డు విస్తరణ అభివృద్ధి కార్యక్రమం లో అవసరమగు కార్యాచరణ, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు కు కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజనీరు శాంతిరాజ్, డిసిపి హరిదాస్, ఏసిపి శాస్త్రి, ఏపీ యుఐఎంఎల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌరవ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు విశాఖ లో మాట్లాడుతూ……*

*విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి* జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌరవ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు మాట్లాడుతూ……* *విశాఖపట్నంలో గతంలో నగర పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది* *ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలోపేతం చేయాలని దృష్టి పెట్టాము* *ఎచ్చెర్ల నుండి ప్రతీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను* *జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నాము* *క్రియాశీల సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి, పొలిటికల్ పార్టీలో క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకుంటే వచ్చే లాభమేంటి అని ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్న* *పార్టీలో క్రియాశీల సభ్యులుగా చేరితే ఒంటరిగా పోరాటం చేయలేని వారికి, పార్టీతో జతకట్టి పోరాటము చేయడానికి ఉపయోగపడుతుంది, సమస్యలు పరిష్కరించుకోవచ్చు* *పార్టీలో క్రియాశీల సభ్యత్వం చాలా ముఖ్యమైనది, ప్రతి కార్యకర్తకు భద్రత కల్పిస్తుంది* *త్రిశూల్ అనే కార్యక్రమం కార్యకర్తలు కోసం ప్రారంభించనున్నట్లు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలోనే ప్రకటించారు* *పవన్ కళ్యాణ్ గారి అన్నగా కాకుండా ,పార్టీలో సామాన్య కార్యకర్తలా పనిచేయడానికి ఇష్టపడతాను* *గతంలో వైసీపీ లాంటి దుర్మార్గ పార్టీపై విజయవంతంగా జనసేన పార్టీ తరపున పోరాడాము* *తెలుగుదేశం, బిజెపి పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి వైసీపీ పార్టీపై పోరాడి విజయము సాధించి,ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నాము* *జనసేన పార్టీ స్థాపించి 14 సంవత్సరాలు గడిచినా ఎటువంటి పదవులు పవన్ కళ్యాణ్ గారు ఆశించలేదు* *నేడు జనసేన పార్టీ లేకపోతే రాష్ట్ర రాజకీయాలు లేవు అనే విధంగా మన పార్టీ పైకి ఎదిగింది* *క్రియాశీల సభ్యత్వం జనసైనికులు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న ప్లాట్పామ్ వంటిది* *పవన్ కళ్యాణ్ గారు పార్టీ, ప్రజల కోసం పాటుపడుతూ వ్యక్తిగత జీవితం చాలా కోల్పోతున్నారు* *రానున్న రోజుల్లో గ్రామస్థాయి, కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయి* *కూటమిలో భాగస్వామ్యంగా ఉండడం వలన అవకాశాలు హెచ్చుతగ్గుగా ఉండవచ్చు* *ప్రతి కార్యకర్త రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది* *పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా కార్యకర్తలకు ఇంకా పదవులు రాదలేదని కొంతమంది అసహనంతో ఉన్నారు* *పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది* *ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కోసం, క్రియాశీల సభ్యత్వంలో చురుకుగా పాల్గొనాలని కోరుతున్నాను* *వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ…..* *క్రియాశీల సభ్యత్వం నమోదు(మెంబర్షిప్ డ్రైవ్) ,నూతన కమిటీలు నియామకం కోసం ఈ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది* *క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమం విజయవంతం గా నిర్వహించి జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం జరపాల్సిన అవసరం ఉంది* *పార్టీ కార్యకర్తలు ఎంత బలంగా ఉంటే మన పార్టీ అంత బలంగా ఉంటుంది* *ఏపార్టీలో అయినా నాయకులు మారుతున్నారు, కార్యకర్తలు మారరు* *కొన్ని పార్టీలు బలంగా ఉన్నాయంటే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు బలంగా ఉండటమే ప్రధాన కారణం* *ప్రతి పార్టీ బలోపేతానికి ప్రతికార్యకర్త చాలా ముఖ్యమైన వారు* *రానున్న కొద్దిరోజుల్లో మున్సిపల్ ఎన్నికల రానున్నాయి* *జనంలో బలంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు గెలిచే అవకాశం ఉంది* *మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నేడు నేషనల్ పొలిటికల్ స్టార్ అయ్యారు* *ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్ గారిని ప్రచారానికి రమ్మని ఆహ్వానిస్తున్నారు* *వేద పండితులు శ్రీకృష్ణదేవరాయలతో పవన్ కళ్యాణ్ గారిని పోల్చారు, అభినవ శ్రీకృష్ణదేవరాయల వారు అనే బిరుదు ఇచ్చారు* *2024 ఎన్నికల్లో ఎలాగైతే గెలిచామో రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు మనకి ఇస్తే అన్ని సీట్లు గెలిచే బాధ్యత మనపై ఉంది* *పోటీ చేయాలనుకునేవారు గ్రౌండ్ లెవెల్ లో పార్టీ కోసం పనిచేయాలి* *ఒక క్రమ పద్ధతిలో పార్టీ నిర్మాణం చేపడతామని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది* *ఏ వార్డులో ఎక్కువ గెలిచే అవకాశం ఉంటే ఆసీట్లు అడిగి తీసుకోవడం జరుగుతుంది* *మూడు పార్టీలు పొత్తులో కూటమిగా ఉన్నాము* *ప్రతి వార్డులో పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది* *పార్టీ నిర్మాణంలో, క్రియాశీల సభ్యత్వంలో ప్రతీకార్యకర్త పాలు పంచుకోవాలని కోరుతున్నాము*. *వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ…..* *క్రియాశీల సభ్యత్వం నమోదు(మెంబర్షిప్ డ్రైవ్) ,నూతన కమిటీలు నియామకం కోసం ఈ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది* *క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమం విజయవంతం గా నిర్వహించి జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం జరపాల్సిన అవసరం ఉంది* *పార్టీ కార్యకర్తలు ఎంత బలంగా ఉంటే మన పార్టీ అంత బలంగా ఉంటుంది* *ఏపార్టీలో అయినా నాయకులు మారుతున్నారు, కార్యకర్తలు మారరు* *కొన్ని పార్టీలు బలంగా ఉన్నాయంటే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు బలంగా ఉండటమే ప్రధాన కారణం* *ప్రతి పార్టీ బలోపేతానికి ప్రతికార్యకర్త చాలా ముఖ్యమైన వారు* *రానున్న కొద్దిరోజుల్లో మున్సిపల్ ఎన్నికల రానున్నాయి* *జనంలో బలంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు గెలిచే అవకాశం ఉంది* *మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నేడు నేషనల్ పొలిటికల్ స్టార్ అయ్యారు* *ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్ గారిని ప్రచారానికి రమ్మని ఆహ్వానిస్తున్నారు* *వేద పండితులు శ్రీకృష్ణదేవరాయలతో పవన్ కళ్యాణ్ గారిని పోల్చారు, అభినవ శ్రీకృష్ణదేవరాయల వారు అనే బిరుదు ఇచ్చారు* *2024 ఎన్నికల్లో ఎలాగైతే గెలిచామో రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు మనకి ఇస్తే అన్ని సీట్లు గెలిచే బాధ్యత మనపై ఉంది* *పోటీ చేయాలనుకునేవారు గ్రౌండ్ లెవెల్ లో పార్టీ కోసం పనిచేయాలి* *ఒక క్రమ పద్ధతిలో పార్టీ నిర్మాణం చేపడతామని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది* *ఏ వార్డులో ఎక్కువ గెలిచే అవకాశం ఉంటే ఆసీట్లు అడిగి తీసుకోవడం జరుగుతుంది* *మూడు పార్టీలు పొత్తులో కూటమిగా ఉన్నాము* *ప్రతి వార్డులో పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది* *పార్టీ నిర్మాణంలో, క్రియాశీల సభ్యత్వంలో ప్రతీకార్యకర్త పాలు పంచుకోవాలని కోరుతున్నాము*.

విశాఖపట్నం

కనకమహాలక్ష్మి ఆశీస్సులు విశాఖపై ఉండాలి*

*శ్రీ కనకమహాలక్ష్మి ఆశీస్సులు విశాఖపై ఉండాలి* *మొక్కుబడి చెల్లించు కున్న వాసుపల్లి కుటుంబం* *ప్రత్యేక పూజలు పంచామృతాభిషేకం చేసిన వాసుపల్లి దంపతులు* *విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి * శ్రీ కనకమహాలక్ష్మి ఆశీస్సులు విశాఖపై ఉండాలని వైసీపీ పార్టీ నాయకులు, విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు ఉత్తరాంధ్ర ఇలవేల్పు కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసో త్సవాల్లో భాగంగా ఈరోజు మూడవ గురువారం పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా వాసుపల్లి కుటుంబ సభ్యులు అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి గర్భాలయంలో పంచామృతాని షేకంతో పూజలు చేశారు అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ మూడవ గురువారం అమ్మవారిని దర్శించుకుని ఆమె ఆశీస్సులు పొందడానికి వేలాది మంది భక్తులు తరలిరావడం జరిగిం దన్నారు కోరిన వరాలు ఇచ్చే కల్పవల్లిగా పేరున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఉత్స వాలు ఘనంగా జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు విశాఖతో పాటు ఇతరజిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అమ్మవారు దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారని చెప్పారు పిల్లల నుంచి వృద్ధుల వరకు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని దర్శించుకుని ఆమె కరుణా కటాక్షాలు పొందారన్నారు అమ్మవారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మంచే జరుగు తుందని చెప్పారు విశాఖ పై అలాగే ఈ ప్రాంత ప్రజలపై ఆమె చల్లని చూపులు ఉండాలని ఉండాలని కోరు తున్నట్లు ఆయన ఆకాం క్షించారు.

విశాఖపట్నం

పోలీస్ కమీషనర్ శ్రీ. శంఖబ్రత బాగ్చి IPS గారి ఆదేశాలతో యాచకులకు ఆశ్రయం కల్పించే మిషన్

* విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి * పోలీస్ కమీషనర్ శ్రీ. శంఖబ్రత బాగ్చి IPS గారి ఆదేశాలతో యాచకులకు ఆశ్రయం కల్పించే మిషన్ జ్యోతిర్గమయ కార్యక్రమంలో భాగంగా ఏయూటిడి మరియు పోలీసుల రెస్క్యూ టీం సంయుక్తంగా ఇద్దరు మహిళలతో పాటు మొత్తం 21 మందిని రెస్క్యూ చేశారు‌. వారిలో మొదట భీంనగర్ షెల్టరుకు తరలించిన వారి పేర్లు ఎడమ నుంచి వరుసగా కృష్ణ (20) ఒడిశా, బాబు (45) బంగ్లాదేశ్, అనురాగ కపూర్ (30) ఒడిశా, సంజయ్ (60) ఒడిశా, బషీర్ (50) ముంబై, సుశాంత్ (36) బంగ్లాదేశ్, మంగులు (40) ఖరగ్ పూర్, రాము (45) శ్రీకాకుళం, సైలేష్ (30) మహారాష్ట్ర, లక్ష్మణరావు (50), ఊరు హైదరాబాద్. అలాగే టి.యస్.ఆర్ కాంప్లెక్స్ షెల్టరుకు తరలించిన వారిలో 9 మంది మానసిక రోగులు ఊరు పేరు ఏమి చెప్పడం లేదు, ఇద్దరు మహిళలు పేర్లు అల్లు నారాయణమ్మ (70), జగదాంబ జంక్షన్, ఇంకొకరు అంకిత (60), బిలాస్ పూర్. వీరందరికీ అన్ని సదుపాయాలతో ఆశ్రయం కల్పించారు. ఈ రెస్క్యూలో కంట్రోల్ రూం ఎస్.ఐ ప్రసాద్, హెచ్.సి శ్రీనివాస్, కానిస్టేబుల్ ప్రతాప్ మరియు ఏయూటిడి నుంచి భాస్కరరావు, రాజేష్ పాల్గొన్నారు.

అన్నమయ్య

ఔరంగాబాద్‌లో భవ్యంగా జరిగిన అవార్డ్స్ వేడుకలో నందలూరుకు చెందిన సయ్యద్ జుల్ఫీకర్‌కు “మానవ హక్కుల పరిరక్షకుడు” అవార్డు

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో ఘనంగా అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించారు. దేశంలోని పలు రాష్ట్రాల నుండి వచ్చిన మానవ హక్కుల కార్యకర్తలు, సమాజ సేవకులు, ప్రతిభావంతులైన వ్యక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా నందలూరుకు చెందిన సయ్యద్ జుల్ఫీకర్ విశిష్ట గౌరవాన్ని అందుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జుల్ఫీకర్ చేసిన మానవ హక్కుల పరిరక్షణ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, పేదల హక్కుల కోసం పోరాడిన ధైర్యం, అల్పసంఖ్యాకులు ఎదుర్కొంటున్న అన్యాయాలపై ఆయన చేసే నిరంతర కృషిని గుర్తిస్తూ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎం.ఆర్. అన్సారీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మస్తాన్ సాహెబ్ చేతుల మీదుగా “మానవ హక్కుల పరిరక్షకుడు అవార్డు” మరియు కాంస్య పతకం ప్రదానం చేశారు. ఈ అవార్డు ప్రదానోత్సవంలో పలువురు ప్రముఖులు మాట్లాడి, జుల్ఫీకర్ సేవలను ప్రశంసించారు. సామాజిక న్యాయం సాధనలో నిరంతర ప్రవాహంలా పనిచేస్తున్న యువతకు జుల్ఫీకర్ ప్రేరణగా నిలుస్తున్నారని అభిప్రాయపడ్డారు. హక్కులు కోల్పోతున్న నిరుపేదలకు ధైర్యం నింపడం, ప్రభుత్వ శాఖల వద్ద న్యాయం పొందే వరకు వారి సమస్యలను వెంటాడడం, అవసరం ఉన్నప్పుడు చట్టపరమైన సాయం అందించడం వంటి పలు రంగాల్లో ఆయన చేస్తున్న సేవలను ప్రత్యేకంగా గుర్తించారు. సయ్యద్ జుల్ఫీకర్ మాట్లాడుతూ “ఈ అవార్డు నాకు గౌరవమే కాదు, మరింత బాధ్యతను గుర్తు చేసింది. సమాజంలో ప్రతి ఒక్కరికీ హక్కులు సమానంగా చేరేలా నేను మరింత శక్తిగా పనిచేస్తాను. ఈ గుర్తింపు నా గ్రామం, నా జిల్లాకు చెందిన ప్రజలందరిది” అని అన్నారు. జుల్ఫీకర్ అవార్డు అందుకున్న వార్త నందలూరు మండలంలో సంతోషాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానిక ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ గర్వంగా భావిస్తున్నారు. మానవ హక్కుల పరిరక్షణలో నందలూరు పేరు ప్రతిష్టాత్మకంగా వెలుగొందించాడని పలువురు అభినందించారు.

విశాఖపట్నం

ఆరోగ్యరంగంలో మహిళా వైద్యుల భాగస్వామ్యం పెరగాలి..*

– *ఆరోగ్యరంగంలో మహిళా వైద్యుల భాగస్వామ్యం పెరగాలి..* – *49వ AOMSI వార్షిక కాన్ఫరెన్స్ ను ప్రారంభించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ* ————- *విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి* విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ రిసార్టులో నిర్వహిస్తున్న AOMSI (Association of Oral & Maxillofacial Surgeons of India) 49వ వార్షిక కాన్ఫరెన్స్ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా విచ్చేసి దీపప్రజ్వలన, రిబ్బన్ కట్ చేసి కాన్ఫరెన్స్ ను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ శస్త్రచికిత్స రంగంలో భారత వైద్యులు అంతర్జాతీయ స్థాయిలో సాధించిన పురోగతిని ప్రశంసించారు. వైద్య రంగ అభివృద్ధిలో నవీన సాంకేతికత, శాస్త్రీయ పరిశోధన, నైపుణ్య శిక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఆరోగ్యరంగంలో మహిళా వైద్యుల భాగస్వామ్యం మరింత పెరగాలని, ప్రోత్సాహ వాతావరణాన్ని సృష్టించడంలో మహిళా కమిషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. AOMSI ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎల్. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఈ మూడు రోజుల కాన్ఫరెన్స్‌లో దేశవ్యాప్తంగా వచ్చిన నిపుణ శస్త్రచికిత్స వైద్యులు పాల్గొని లేటెస్ట్ అడ్వాన్స్‌మెంట్స్, క్లినికల్ రీసెర్చ్‌లు, శస్త్ర చికిత్సా పద్ధతులు, మరియు ఆధునిక మెడికల్ టెక్నాలజీలపై చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు, ప్రతినిధులు, మరియు మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఉత్తర నియోజకవర్గంలో 310 మంది లబ్ధిదారులకు పట్టా ప్రొసీడింగ్స్ పంపిణీ

ఉత్తర నియోజకవర్గంలో 310 మంది లబ్ధిదారులకు పట్టా ప్రొసీడింగ్స్ పంపిణీ *విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి* ఉత్తర నియోజకవర్గంలోని “అందరికీ ఇల్లు” కార్యక్రమం కింద ఒక సెంటు భూమిలో నిర్మించిన ఇళ్లలో ఆప్షన్–3 ప్రకారం పూర్తయిన పాపయ్యపాలెం ప్రాంతానికి చెందిన 49, 50, 51 వార్డుల 310 మంది లబ్ధిదారులకు పట్టా ప్రొసీడింగ్స్‌ను మంగళవారం పంపిణీ చేశారు. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే & బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పీ. విష్ణుకుమార్ రాజు గారు లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో వన్‌సైట్ ఇళ్ల లబ్ధిదారులు 4,974 మంది ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ, “అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు అందేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే ఇల్లు నిర్మాణానికి స్వయంగా ₹35,000 ఖర్చు చేసిన వారికి ప్రభుత్వం అదనంగా సహాయం అందించి, ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతోంది. ఇళ్లు పొందాలని ఆశించే వారు సమీప సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రజల సంకల్పాలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది” అని తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ శాఖ అధికారులైన డి.ఈ. ప్రసాద్, ఈ.ఈ. సూరిబాబు, ఏ.ఈ. ప్రభ జోగినాధం, అలాగే బీజేపీ, టిడిపి, జనసేన నేతలు, మండల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, శ్యామల దీపిక, జోనల్ కమిషనర్ రాము, వరప్రసాద్, వాసు, అరుణ్ బాబు, ప్రసాద్, పద్మజ, దిలీప్, బంగారు రాజు, రామకృష్ణ, సుజాత, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధుల సమావేశంలో మేడా విజయ శేఖర్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన అధికార ప్రతినిధుల సమావేశం సందర్భంగా, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, ప్రజల సమస్యల పరిష్కారం, జిల్లాల స్థాయి అభివృద్ధి వంటి అంశాలపై నాయకుల మధ్య విస్తృతంగా చర్చలు జరిగాయి. అధికార ప్రతినిధుల సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా సమగ్రంగా చర్చించారు. మేడా విజయ శేఖర్ రెడ్డి మర్యాదపూర్వక భేటీపై హోంమంత్రి అనిత, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ సానుకూలంగా స్పందించారు. పార్టీ కార్యకలాపాలు, ప్రజాసేవ పట్ల మరింత శ్రద్ధతో పనిచేసేలా సూచనలు ఇచ్చినట్లు వివరాలు అందాయి.

అన్నమయ్య

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధుల సమావేశంలో మేడా విజయ శేఖర్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన అధికార ప్రతినిధుల సమావేశం సందర్భంగా, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, ప్రజల సమస్యల పరిష్కారం, జిల్లాల స్థాయి అభివృద్ధి వంటి అంశాలపై నాయకుల మధ్య విస్తృతంగా చర్చలు జరిగాయి. అధికార ప్రతినిధుల సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా సమగ్రంగా చర్చించారు. మేడా విజయ శేఖర్ రెడ్డి మర్యాదపూర్వక భేటీపై హోంమంత్రి అనిత, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ సానుకూలంగా స్పందించారు. పార్టీ కార్యకలాపాలు, ప్రజాసేవ పట్ల మరింత శ్రద్ధతో పనిచేసేలా సూచనలు ఇచ్చినట్లు వివరాలు అందాయి.

విశాఖపట్నం

బీజేపీ జిల్లా కార్యాలయంలో కిసాన్ మోర్చా జిల్లా పదాధికారుల నియామకం*

*బీజేపీ జిల్లా కార్యాలయంలో కిసాన్ మోర్చా జిల్లా పదాధికారుల నియామకం* *విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి* ఉదయం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు గారి ఆధ్వర్యంలో జిల్లా కిసాన్ మోర్చా పదాధికారుల నియామక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పొట్నూరు వెంకట కృష్ణారావు, కిసాన్ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు PVV ప్రసాద రావు, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి DPJSV రత్నం, కామేష్ అయ్యగారి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వర రావు, రూపాకుల రవి కుమార్ మరియు కిసాన్ మోర్చా జిల్లా పదాధికారుల పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.