Thursday, 30 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ డెమోగా పదోన్నతి పొందిన శివరామరాజు గారికి సన్మానం*

30.01.2026 చుట్టుగుంట విజయవాడ * డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ నందు దీర్ఘకాలంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా సేవలందించి విధినిర్వహణలో రాష్ట్రస్థాయి ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు, ఆగస్టు 15 జనవరి 26 రాష్ట్ర పర్వదినాల్లో వైద్యారోగ్య శాఖ తయారు చేసే శకటాల తయారీలో చేసిన కృషికి గుర్తింపుగా రాష్ట్ర ఉన్నతాధికారుల మన్ననలు పొంది గత నెలలో కడప జోన్ లో డిప్యూటీ డెమోగా పదోన్నతి పొందిన శుభసందర్భంగా రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ పద్మావతి గారి ఛాంబర్ నందు మేడం గారిచే శివరామరాజు డిప్యూటీ డెమో గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు డబ్ల్యూ. వెంకటరమణ, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ చేజర్ల సుధాకర్ రావు, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ జయ ప్రకాష్, స్టేట్ ట్రెజరర్ నున్న హరిప్రసాద్ గార్లు శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్టేట్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి గారు మాట్లాడుతూ శివరామరాజు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా గొప్పగా సేవలు అందించారు అని వారి సేవలు అభినందనీయమని కొనియాడారు.

వనపర్తి

మామిడిమాడ ఉన్నత పాఠశాల కు సీఎం కప్ వాలీబాల్ విన్నర్ టీమ్ కు అభినందనలు

*మామిడిమాడ క్లస్టర్ అండర్ 18 లో సీఎం కప్ విన్నర్ టీంకు అభినందనలు* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 31/01/ 2026* *సీఎం కప్ మామిడి మాడ క్లస్టర్ అండర్ 18 లో ఈరోజు ఘనపూర్ మండలంలో జరిగిన వాలీబాల్ పోటీల లో విన్నర్ గా నిలిచిందని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ షైనీ జేమ్స్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు మరియు మామిడి మాడ ఉపాధ్యాయ బృందం, సర్పంచ్ బాల్ లింగయ్య మరియు వార్డు మెంబర్లు, విద్యాభిమానులు అందరూ టీం సభ్యులకు అభినందనలు తెలియజేశారు మున్ముందు జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో అనేక బహుమతులు గెలుచుకోవాలని వారు క్రీడాకారులను అభినందనలు తెలియజేశారు*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ

​కొండాపురం జనవరి 31: నేడు కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ​గ్రామ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గారు ఎస్సీ కాలనీలోని ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వితంతువులు మరియు దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ నగదును పంపిణీ చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే సోమిరెడ్డి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. శనివారం బద్దెవోలు క్రాస్ రోడ్డు వద్ద వీర ఆంజనేయ స్వామి 28వ వార్షికోత్సవ పూజల్లో పాల్గొని ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మనుబోలులోని శివాలయం, మాతమ్మ గుడులను పరిశీలించారు. ఆలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొండూరు సత్రంలో పెన్షన్ల పంపిణీ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని జట్ల కొండూరు పంచాయతీకి చెందిన కొండూరు సత్రంలో నిర్వహించిన పెన్షన్ల అందజేత కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలుస్తోందని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుల వరకు చేరేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ వెందోటి భాస్కర్ రెడ్డి ,డి చెన్నకేశవులు ,పసుపులేటి శ్రీనివాసులు , అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పశుపోషకుల ఆదాయ వృద్ధికి ప్రభుత్వం కృషి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) పశుపోషకుల ఆర్థిక జీవనోపాధి పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ గురవారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ పశు వైద్యశాలలో ఆయన మాట్లాడారు. ఈ నెల 19 నుంచి 31 వరకు అన్ని గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. వీటివల్ల వృద్ధిరేటు 10 శాతం పెరుగుతుందన్నారు. ఎదకురాని పశువులకు కృత్రిమ గర్భధారణ సేవలు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు హౌసింగ్ అధికారులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో హౌసింగ్ డీఈ, ఏఈలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లు కట్టమని చెబితే ఒక్కో ఇంటికి రూ.70 వేలు తినేస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రెండేళ్లు జీతం తీసుకోకుండా ఉంటారా అంటూ సూటిగా నిలదీశారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదు చేయాలని సూచించారు. గతంలో ఇద్దరు ఏఈలు చేదు అనుభవాలతో వెళ్లిన విషయం గుర్తు చేశారు. డీఈకి ఫోన్ ద్వారా వార్నింగ్ ఇచ్చి, కాంట్రాక్టర్ మోహన్ రెడ్డి వద్ద నుంచి డబ్బులు రికవరీ చేయాలని ఆదేశించారు.

అనకాపల్లి

ప్రజా సంక్షేమానికి మరో అడుగు: ఏటికొప్పాకలో ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ”

అనకాపల్లి జిల్లా జనవరి 31 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నిర్ణీత తేదీకి ఒకరోజు ముందుగానే ఏటికొప్పాక గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులు, గ్రామ సచివాలయం సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించారు. వృద్ధులు, వికలాంగులు, విధవులు వంటి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. ప్రజల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ముందంజలో ఉందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు కొనసాగుతాయని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.