Sunday, 15 March 2026

Blog

తిరుపతి

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తొలి సమీక్షా సమావేశం

శ్రీకాళహస్తి దేవస్థానంలో జరగబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం నాడు తొలి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఈవో, ఆలయ ఛైర్మన్, పాలక మండలి సభ్యుల, ప్రధాన దేవస్థానం సిబ్బంది పాల్గొని గతంలో కంటే మరింత అద్భుతంగా ఏర్పాట్లు చేయాలని భక్తుల రద్దీ నియంత్రణ, అభివృద్ధి పనులు, భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం, మహా శివరాత్రికి కావలసిన ప్రాథమిక ఏర్పాట్లపై కూలంకషంగా సమీక్షించారు.

తిరుపతి

ఏర్పేడు ఎంపీపీ పదవి కైవసంచేసుకున్న తెదేపా

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో మండలానికి చెందిన 9మంది వైసీపీ ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోగా ఎంపీపీ పదవిని తెదేపా కైవసంచేసుకుంది ఎంపీపీగా ఎన్నికైన ఆదిలక్ష్మి, టిడిపికి భారీగా ఎంపీటీసీల మద్దత్తుతో కంగుతిన్న వైసీపీ. ఎన్నికైన వారిని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రజాస్వామ్యబద్ధంగా సామరస్యంగా ఎటువంటి గొడవలకు తావు లేకుండా గత ప్రభుత్వంలో మాదిరి గందరగోళానికి గురి చెయ్యకుండా తొమ్మిది మంది ఎంపీటీసీలు అందరూ కలుసుకొని ఏకగ్రీవంగా పంగురు గ్రామానికి చెందిన ఆది లక్ష్మమ్మని ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఏర్పేడు టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పేరం ధనం జయులు నాయుడు గారు, చెంచయ్య నాయుడు గారు శివశంకరరెడ్డి గారు, పాపిరెడ్డి గారు, నైనూరు పున్నారావు గారు, ఏర్పేడు pacs ఛైర్మన్ మహేష్ రెడ్డి గారు, క్రిష్ణవేణి, రాఘవేంద్ర, శివాజీ రెడ్డి,గోపాల్ రెడ్డి చంద్రశేఖర్ నాయుడు, బాబు నాయుడు, గిరి నాయుడు, రవి నాయుడు, జగదీష్, కేశినేని సుబ్రహ్మణ్యం, రాచటి సుబ్రహ్మణ్యం, గుణాయాదవ్, రమణ, హేమాక్షి, మోహన్ రెడ్డి, రామదాసు, గోల్డుమెన్, నాగేష్, సురేష్, రాజా, వెంకయ్య, తాళ్లపాకు సుధాకర్ రెడ్డి, మునీశ్వర్, రమేష్ యాదవ్, శీను, నరసింహులు, సుధాకర్ నాయుడు, దినకర్ నాయుడు, మనోహర్ నాయుడు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో డొక్కా సీతమ్మ 70 వ వారం అన్నదాన కార్యక్రమం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 11, శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ 70 వ వారం అన్నదాన కార్యక్రమాన్ని పవన్ ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు నిర్వహించడం జరిగిందని జానసైనికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, మహేష్, భాను ప్రకాష్,నవీన్, ప్రదీప్ కుమార్, పసల సురేష్,లక్ష్మణ్, మహర్షి, మనీ, పసల ఎలిసా, కళ్లిపూడి వెంకటేష్, రాజా, చందు, సాయి, వీర మహిళలు పేట శారద, నారాయణ గాయత్రి, బత్తెమ్మ,పద్మ ,తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శివయ్యను దర్శించుకున్న ఎ.పి. గ్రామీణ బ్యాంకు చైర్మన్

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్ డిసెంబర్ 11, శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసినారు. వీరికి రీజినల్ మేనేజర్ ప్రకాష్ రత్నబాబు ఆర్వో స్టాఫ్ కృష్ణవేణి స్థానిక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజరు వి రమణయ్య, రిటైర్డ్ స్టాఫ్ స్వామి, రాంప్రసాద్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అప్రైజర్స్ అసోసియేషన్ నాయకులు కడూరు నాగరాజు సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించి అనంతరం వేద ఆశీర్వచనము ఏర్పాటు చేయడమైనది.

తిరుపతి

అటల్-మోదీ సుపరిపాలన యాత్రను విజయవంతం చేద్దాం…కోలా ఆనంద్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 11, శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో గురువారం నాడు పట్టణ అధ్యక్షులు ఆర్. హరీష్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిరావహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కోలా ఆనంద్ విచ్చేశారు. ఈ సమావేశమలో కోలా ఆనంద్ మాట్లాడుతూ… భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శత జయంతి సందర్భంగా ఆయన సేవలకు గుర్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజపేయి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి. ఎన్. మాధవ్ సారథ్యంలో చేపడుతున్న అటల్- మోదీ సుపరిపాలన యాత్ర ను విజయవంతం చేయాలని కోలా ఆనంద్ బీజేపీ కార్యకర్తలును కోరుతూ..ఈ 14 వ తేదీన రేణిగుంట మండలంలో మర్రిగుంట నేషనల్ హైవే సర్కిల్ వద్ద విగ్రహ ఆవిష్కరణ, బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, కోలా గోవర్ధన్, అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, పట్టణ అధ్యక్షులు ఆర్ హరీష్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రజ్ఞాశ్రీ, కన్నా వెంకటేశ్వర్లు, కుప్ప ప్రసాద్, యుగంధర్, గోవర్ధన్, శ్రీపురం సుధాకర్, సీనియర్ నేతలు చిలకా రంగయ్య, మద్దు వాసు యాదవ్, కోనేటి అయ్యప్ప, పుణ్యం డిల్లీ కుమార్ రెడ్డి, తానికొండ్ల భరత్, రామ్ ఉమా సింగ్, చెందు, రవి తేజ, తులసీ, ఇత్తడి మహేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో కొత్త తడి, పొడి డస్ట్‌బిన్లు పంచి పట్టణ శుభ్రతకు దోహదం

నందిగామ పట్టణ పరిశుభ్రతను మరింత మెరుగుపర్చేందుకు నందిగామ పురపాలక సంఘం పరిధిలో కొత్త తడి, పొడి చెత్త డస్ట్‌బిన్లు పంపిణీచేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సౌమ్యగారు, పట్టణ ప్రజలందరిని చెత్త వేరు వేరు చేయే అలవాటును పెంపొందిం చాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య కార్మికుల పని భారం తగ్గించేందుకు, శుభ్రమైన నందిగామ నిర్మాణంలో ఈ కొత్త డస్ట్‌బిన్లు కీలకంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమం లో పారిశుద్ధ్య కార్మికుల సమస్య లను తెలుసుకొని, ప్రభుత్వ తరఫున అన్ని అవసరమైన సౌకర్యాలు, రక్షణ సామగ్రి అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఎన్ టి ఆర్ జిల్లా

“నందిగామలో కోటి సంతకాల ఉద్యమం: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకత”

నందిగామ, NTR జిల్లా: మాజీ MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు నేతృత్వంలో నందిగామ టౌన్‌లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జెండా ఊపి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజలు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుమారు 60,000 సంతకాలు సేకరించి, ప్రైవేటీకరణ నిర్ణయానికి ప్రజా వ్యతిరేకతను వ్యక్తం చేశారు. డాక్టర్ జగన్ మోహన్ రావు తెలిపారు, “ప్రైవేటీకరణ వల్ల పేద, సామాన్య విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుంది. ప్రజల కోటి సంతకాలు ప్రభుత్వానికి సరిగ్గా చెబుతున్న సంకేతం.” వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సముదాయాల సహకారంతో, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం ఈ ఉద్యమాన్ని కొనసాగించ నుంది అని ఆయన తెలిపారు.

విశాఖపట్నం

రాంపురం గ్రామంలో రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ వారి సౌజన్యంతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*

*పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ వారి సౌజన్యంతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు* *విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి* పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ వారి సౌజన్యంతో రాంపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఆరు లక్షల రూపాయలతో వంటగది స్టోర్ రూమ్ వితరణ.. రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ సౌజన్యంతో రాంపురం గవర్నమెంట్ హైస్కూల్లో ఆరు లక్షల రూపాయలు వంటగది స్టోర్ నిర్మించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని నూతనంగా నిర్మించిన వంటగది స్టోర్ రూమ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ రొటరీ క్లబ్ కపుల్స్ సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు రాంప్రసాద్ శోభన్ మాట్లాడుతూ కొన్నాళ్ల క్రితం భీమునిపట్నంలో సాగునీటి పథకాన్ని కేజీహెచ్ లో మందులు పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు అనంతరం స్కూల్ విద్యార్థులకు ఆట వస్తువులు విద్యార్థిని విద్యార్థులకు అందజేయడం జరిగినది ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, కె. రాము గారు, సీనియర్ నాయకులు జామి గంగు నాయుడు గారు, పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ అయితే సింహాచలం గారు,ఎంపీటీసీ గండి హిమబిందు గారు,నాగభూషణం గారు, బిజెపి కన్వీనర్ గొర్ల రామానాయుడు గారు, మాజీ జెడ్పిటిసి ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణ రావు గారు ,జనసేన మండల ప్రెసిడెంట్ కొరుపోలు రామనాయుడు గారు, ఏం సి డైరెక్టర్ ఆర్.ఎస్‌. నాయుడు గారు, ముమ్మన సతీష్ గారు, సీనియర్ నాయకులు బయలుపూడి హరగోపాల్ గారు, నీటి పల్లి మహేష్ గారు, గొర్లి అప్పారావు గారు, దాడి భోగలింగం గారు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

అమరావతి

స్థానిక చిన్న పత్రిక ఎడిటర్లకు శుభవార్త …

స్థానిక చిన్న పత్రిక ఎడిటర్లకు శుభవార్త … .. *అమరావతిడిసెంబర్ 11 విశాఖ పున్నమి ప్రతినిధి జర్నలిస్ట్ మిత్రులారా… మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒడిదుడుకులకు లోనై పత్రికలను నిరంతరం వెలువరిస్తూ ఎన్నో కష్టాలు పడుతున్నప్పటికీ స్థానికంగా అన్ని జిల్లాల్లో ఉన్న సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఎం ప్యానల్ మెంట్ లేని చిన్న పత్రికలను ఉమ్మడి జిల్లాల్లో ఏదో ఒక జిల్లాలో అక్రి డేషన్స్ తీసుకోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో మీడియం అండ్ స్మాల్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ నవ్యాంధ్రప్రదేశ్ నాయకులు నేడు సెక్రటేరియట్ 1 బ్లాక్ లో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ K.S విశ్వనాధన్ గారిని కలిసి మన పరిస్థితులను వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారు. చిన్న పత్రికలకు ఉమ్మడి జిల్లాల్లో అక్రిడేషన్స్ ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. అర్.ఎన్.ఐ.కలిగి ఉన్న జిల్లా కాక కొత్త జిల్లాలో కూడాఆక్రిడే షన్ తీసుకునే అవకాశం కల్పించిన సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం.అధ్యక్షులు చంద్రశేఖర్, సెక్రటరీ గురుకాంతాచారి డైరెక్టర్ ను కలిసి జర్నలిస్ట్ ల సమస్యలపై చర్చించడం జరిగింది.

విశాఖపట్నం

విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ శ్రీ కందుల నాగరాజు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, 34వ వార్డు జండా చెట్టు ప్రాంతంలోని హనుమంతుడు దేవస్థానం పెద్దలు

*విశాఖపట్నం డిసెంబర్ 11పున్నమి ప్రతినిధి* విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ శ్రీ కందుల నాగరాజు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, 34వ వార్డు జండా చెట్టు ప్రాంతంలోని హనుమంతుడు దేవస్థానం పెద్దలు తమ ప్రాంత దేవాలయ అభివృద్ధి అంశాలను వివరించారు. రామాలయ అభివృద్ధి కోసం అవసరమైన విగ్రహాలను అందజేస్తానని డాక్టర్ కందుల నాగరాజు గారు హామీ ఇవ్వడం భక్తులకు ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా వేద పండితులు డాక్టర్ నాగరాజు గారిని ఆశీర్వదించి, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమం భక్తి, సేవ, సంప్రదాయాలకు నిదర్శనంగా ప్రత్యేకంగా నిలిచింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.