Sunday, 15 March 2026

Blog

విశాఖపట్నం

మానవ హక్కుల పోరాటంలో కొత్త స్వరం – ఎన్‌హెచ్‌ఆర్‌పీఎఫ్ విశాఖ జాయింట్ సెక్రటరీగా జి. శ్రీకాంత్

నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ (ఎన్‌హెచ్‌ఆర్‌పీఎఫ్) విశాఖ జిల్లా జాయింట్ సెక్రటరీగా జి. శ్రీకాంత్ నియామకం సంస్థలోనే కాదు, మానవ హక్కుల రంగంలోనూ కీలక పరిణామంగా మారింది. హక్కుల పరిరక్షణ పేరుతో జరుగుతున్న పోరాటాలకు కేవలం నినాదాలకే పరిమితం కాకుండా, కార్యాచరణకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా శ్రీకాంత్‌కు విశాఖలో గుర్తింపు ఉంది. సామాజిక అన్యాయాలపై స్పష్టమైన అవగాహన, ప్రజా సమస్యలపై ప్రత్యక్ష అనుభవం, బాధితుల పక్షాన నిలబడే ధైర్యం—ఇవి శ్రీకాంత్‌ను మానవ హక్కుల ఉద్యమానికి దగ్గర చేశాయి. చిన్న సమస్య నుంచి తీవ్రమైన హక్కుల ఉల్లంఘన వరకు ప్రతి అంశాన్ని చట్టపరమైన కోణంలో పరిశీలించి, పరిష్కారం దిశగా నడిపించాలనే ఆలోచన విధానం ఆయనలో కనిపిస్తుంది. ప్రస్తుతం అనేక సందర్భాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలు “సాధారణ ఘటనలు”గా తీసిపారేయబడుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం చేకూరే వరకు పోరాటం చేయాలనే స్పష్టమైన సంకల్పం శ్రీకాంత్ మాటల్లో వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడమే కాకుండా, అవసరమైతే చట్టపరమైన పోరాటానికి సిద్ధంగా ఉండాలన్న దృక్పథం ఆయన నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తుంది. ఎన్‌హెచ్‌ఆర్‌పీఎఫ్ విశాఖ జిల్లా యూనిట్‌కు శ్రీకాంత్ నియామకం వల్ల ప్రజలతో సంస్థ మధ్య దూరం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానవ హక్కులు అంటే కేవలం పెద్ద పెద్ద కేసులకే పరిమితం కాదని, సాధారణ పౌరుడి రోజువారీ జీవితంలో ఎదురయ్యే అన్యాయాలే అసలైన మానవ హక్కుల సమస్యలని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఆ నమ్మకమే ఆయన పని తీరు మీద ప్రభావం చూపే అంశంగా మారనుంది. మొత్తానికి, జి. శ్రీకాంత్ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టడం ఎన్‌హెచ్‌ఆర్‌పీఎఫ్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చే పరిణామం. మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణలోనూ మానవ హక్కుల పరిరక్షణకు నిలబడతారన్న అంచనాలు విశాఖలో బలంగా వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఆయన పాత్ర సంస్థకు మాత్రమే కాకుండా, బాధిత ప్రజలకు కూడా ఎంతవరకు ఆశగా మారుతుందో చూడాల్సి ఉంది.

నాగర్‌కర్నూల్

వెల్దండలో అక్క, బొల్లంపల్లిలో తమ్ముడు విజయం

వెల్దండ: వెల్దండ మండలంలో 32 గ్రామపంచాయతీలకు గాను 4 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 28 సర్పంచ్ స్థానాల్లో 80 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 23, బీఆర్ఎస్ పార్టీ కి 8, స్వతంత్ర అభ్యర్థి 1 సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. వెల్దండ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో గెలిచిన సర్పంచి అభ్యర్థుల వివరాలివే * 4 ఏకగ్రీవ గ్రామాల సర్పంచులు వెళ్లే… 1) కంటోనిపల్లి ఆకుల మమత – కాంగ్రెస్ 2) బండోన్పల్లి ఎనుముల సంగీత – కాంగ్రెస్ 3) కేస్లీ తాండ శ్రీను నాయక్ – కాంగ్రెస్ 4) చౌదర్పల్లి సుంకి రెడ్డి కృష్ణారెడ్డి – కాంగ్రెస్ * మండలంలో గెలిచిన 28 గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు వీళ్లే… 1) వెల్దండ మట్ట యాదమ్మ – కాంగ్రెస్ 2) బొల్లంపల్లి సత్తూరి ప్రసాద్ – కాంగ్రెస్ 3) పెద్దాపూర్ కేశమల్ల అనూష – కాంగ్రెస్ 4) పలుగుతండా సభావాత్ రమేష్ నాయక్ – కాంగ్రెస్ 5) కుందారం తండా గన్యా నాయక్ – కాంగ్రెస్ 6) ఉబ్బలగట్టు తండాలో కేశ్య – కాంగ్రెస్ 7) సిలోనీభావి తండా లక్ష్మీపతి – కాంగ్రెస్ 8) శంకరకొండ తండా ఇస్లావత్ రవీందర్ – కాంగ్రెస్ 9)లింగారెడ్డిపల్లి అన్వర్ పాషా – కాంగ్రెస్ 10) కుప్పగండ్ల మొక్తాల రమేష్ – కాంగ్రెస్ 11) నారాయణపూర్ తండా బాణావత్ బద్రి -కాంగ్రెస్ 12) గుండాల జక్కుల శిరీష – కాంగ్రెస్ 13) మహాత్మా గాంధీ కాలనీ తండా మూడవత్ దస్లీ – కాంగ్రెస్ 14) రాచూరు గున్నెల శ్రీనివాస్ – కాంగ్రెస్ 15) తిమ్మినోనిపల్లి మూడవత్ శారద – కాంగ్రెస్ 16) బైరాపూర్ తిరుగుడు మంజుల – కాంగ్రెస్ 17) గానుగట్ తండా కేతావత్ మౌనిక – కాంగ్రెస్ 18) మర్రిగుంత తండా వాడతావత్ భాగ్యమ్మ – కాంగ్రెస్ 19) అల్లం తోట బావి తండా రాత్లావత్ జ్యోతి – కాంగ్రెస్ 20) చెరుకూరు బచ్చలకూర శ్రీను – బిఆర్ఎస్ 21) చెదుర్పల్లి వాడతావత్ దన్ సింగ్ – బిఆర్ఎస్ 22) రాగాయపల్లి సామ వెంకటయ్య – బిఆర్ఎస్ 23) బర్కత్ పల్లి నవ్య – బిఆర్ఎస్ 24) పోతేపల్లి కొండల్ యాదవ్ – బిఆర్ఎస్ 25) నగరగడ్డ తండా రాత్లావత్ శారద – బిఆర్ఎస్ 26) అజిలాపుర్ సిద్ధగోని రమేష్ గౌడ్ – బిఆర్ఎస్ 27) పోచమ్మ గడ్డ తండా వాడతావత్ మహిపాల్ – బిఆర్ఎస్ 28) కొట్ర షాంపూరి శారద – స్వతంత్ర అభ్యర్థి

విశాఖపట్నం

గురజాడ కాలక్షేత్రం లో బేతనీ స్కూల్ చిన్నారుల కాన్సర్ట్

విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి:- విశాఖపట్నం గురజాడ కలాక్షేత్రం లో బేతని స్కూల్ చిన్నారి విద్యార్థులతో అంగరంగ వైభవముగా బేతనీ స్కూల్ 2025 కన్సర్ట్ జరిగింది ఎల్ కే జి విద్యార్థుల నుంచి 4తరగతి విద్యార్థులతో ఇండియన్ కల్చర్ అనే కాన్సెప్ట్ తొ అలరించిన నృత్య ప్రదర్శన సందర్శకులకు మంత్ర ముగ్దలను చేసి ఆకట్టుకున్నది యీ కాన్సర్ట్ లోముఖ్య అతిధిలుగా రమేష్ పక్కి గారు బేతనీ స్కూల్ టీచర్లు మరియు బేతనీ స్కూల్ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

విశాఖ- విశాఖ ఎకనామిక్ రీజియన్ పై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు*

*విశాఖ- విశాఖ ఎకనామిక్ రీజియన్ పై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు* *విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి* 9 జిల్లాల్లోని వీఈఆర్ పరిధిలో చేపట్టాల్సిన ప్రాజెక్టులు, ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు, లక్ష్యాలు, పెట్టుబడుల ఆకర్షణపై యాక్షన్ ప్లాన్ వీఈఆర్ ప్రస్తుత పరిధి-లక్ష్యం ఇలా • మొత్తం 9 జిల్లాలు… శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ • ప్రస్తుతం 1.65 కోట్ల జనాభా, 38,000 చదరపు కి.మీ విస్తీర్ణం, 52 బిలియన్ డాలర్ల జీడీపీ, 3,170 డాలర్ల తలసరి ఆదాయం, 70 లక్షల వర్క్ ఫోర్స్… • ప్రస్తుతం ఏపీలో 31 శాతం విస్తీర్ణం, 23 శాతం జనాభా, 30 శాతం జీడీపీ వీఈఆర్‌దే భాగస్వామ్యం • లక్ష్యం… 7 గ్రోత్ డ్రైవర్ల ద్వారా అభివృద్ధి… గ్లోబల్ పోర్ట్, నెక్ట్స్ జెన్ ఐటీ, అగ్రికల్చర్, టూరిజం, హెల్త్ కేర్ హబ్, ప్రణాళికాబద్దమైన పట్టణీకరణ-హౌసింగ్, అత్యుత్తమ మౌలిక వసతులు • మొత్తం 6 పోర్టులు : ప్రస్తుత ఆపరేషనల్ పోర్టులు- విశాఖపట్నం, గంగవరం, కాకినాడ డీప్ వాటర్, కాకినాడ యాంకరేజ్. కొత్తగా కాకినాడ గేట్ వే, మూలపేట పోర్టులు • లక్ష్యం : కొత్త 7 రైల్వే ప్రాజెక్టులు, 9 రహదారుల ప్రాజెక్టులు, 77 కి.మీ. మేర వైజాగ్ మెట్రో • 12 తయారీ కేంద్రాలు, 18 వ్యవసాయ ప్రాంతాలు, వరల్డ్ క్లాస్ నర్సరీ, ఫుడ్ పార్క్స్, ఆక్వాపార్క్, 5 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి ప్రణాళికలు • అదనంగా 7.5 లక్షల ఇళ్లు, 10 వేల హోటల్ రూములు, 20 వరకు మెడికల్, ఐటీ, స్కిల్లింగ్ కాలేజీలు, 5,000 హాస్పటల్ బెడ్స్, పరిశ్రమలకు 50 వేల ఎకరాలు, 50 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ సముదాయం, 60 మిలియన్ చదరపు అడుగుల గిడ్డంగులు వీఈఆర్‌ పరిధిలో అవసరమని ప్రణాళికలు

విశాఖపట్నం

25 వేల ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం సమక్షంలో కాగ్నిజెంట్ సీఈఓ ప్రకటన*

*విశాఖలో ఐటీ ఎకో సిస్టం* *స్టార్టప్ కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రొత్సాహం* *టూరిజానికే కాదు… టెక్నాలజీకి కేంద్రంగా విశాఖ* *135 బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా విశాఖ ఎకనమిక్ రీజియన్* *కాగ్నిజెంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు* *25 వేల ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం సమక్షంలో కాగ్నిజెంట్ సీఈఓ ప్రకటన* *విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి* విశాఖలో ఐటీ ఎకో సిస్టం ఏర్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల విశాఖ ఐటీ కేంద్రంగా అవతరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు. 25 వేల మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో క్యాంపస్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మొత్తం రూ.1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ క్యాంపస్ పూర్తి కానుంది. 2026 నాటికి మొదటి దశ నిర్మాణాన్ని కాగ్నిజెంట్ పూర్తి చేసుకోనుంది. అప్పటివరకు తాత్కాలిక కార్యాలయంలో కాగ్నిజెంట్ కార్యకాలపాలు కొనసాగనున్నాయి. ప్రధానంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై కాగ్నిజెంట్ దృష్టి సారించింది. కాగ్నిజెంట్‌ క్యాంపస్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఇన్ హౌస్ కంపెనీగా ఉన్న కాగ్నిజెంట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తోంది. చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, కలకత్తా, పూణేలో కాగ్నిజెంట్ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయి. ఇప్పుడు విశాఖకూ కాగ్నిజెంట్ అడుగుపెట్టింది. హ్యాపెనింగ్ సిటీ విశాఖకు రావాలని కాగ్నిజెంట్ ను ఆహ్వానించాం. త్వరలో 25 వేల మందితో పనిచేసే కేంద్రంగా కాగ్నిజెంట్ త్వరలోనే తయారు కావాలి. 34 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కాగ్నిజెంట్ కార్యకలాపాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. కాగ్నిజెంట్ లో 85 శాతం మంది భారతీయులే. ఆ సంస్థ సీఈఓ కూడా భారతీయుడే కావటం విశేషం. భవిష్యత్తులో విశాఖ క్యాంపస్ లో లక్ష మంది ఉద్యోగులతో పని చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా కాగ్నిజెంట్ ఎదుగుతోంది. గతంలో హైదరాబాద్ లో నాటి టీడీపీ ప్రభుత్వం రూపోందించిన ఎకో సిస్టంతో ఐటీ నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారు. 3 దశాబ్దాల క్రితం చేసిన విజన్ తోనే దిగ్గజ ఐటీ కంపెనీలకు భారతీయులు నాయకత్వం ఇస్తున్నారు. 1995లో వచ్చిన ఇంటర్నెట్ రివల్యూషన్ తో పాటు ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. అందుకే ఐటీకి బ్యాక్ బోన్ గా భారతీయులు నిలిచే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏఐ విషయంలో కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవాలని భావిస్తున్నాం. ఆ దిశగానే ఏఐ, డేటా సెంటర్లతో విశాఖ ఐటీ డెస్టినేషన్ గా నాలెడ్జి ఎకానమీ కేంద్రంగా తయారవుతోంది.”అని సీఎం వెల్లడించారు. *బెస్ట్ కనెక్టివిటీ… మోస్ట్ లివబుల్* “విశాఖ నగరానికి బెస్ట్ కనెక్టివిటీ ఉండడంతోపాటు… మోస్ట్ లివబుల్ సిటీగా ఉంది. భోగాపురం విమానాశ్రయం, మెట్రో లాంటి అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు వస్తాయి. ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా విశాఖ రూపుదిద్దుకుంటుంది. నౌకాదళ కేంద్రం నుంచి టూరిజం కేంద్రంగా, ఇప్పుడు టెక్ సిటీగా విశాఖ ఎదిగింది.కాగ్నిజెంట్ తోపాటు 8 సంస్థలకు ఇవాళ భూమి పూజ చేశాం. గూగుల్ కూడా త్వరలోనే డేటా సెంటర్ ను ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే విశాఖలో 150 టెక్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈ ప్రాంతంలో నైపుణ్యం సాధించిన యువత ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడ్డారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే 20 శాతం జీవన వ్యయం కూడా తక్కువ. ప్రపంచంలోనే బెస్ట్ అండ్ మోస్ట్ లివబుల్ సిటిగా విశాఖను తీర్చిదిద్దుతాం. దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత నగరం కూడా విశాఖే. 2032కి 135 బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా విశాఖ ఎకనామిక్ రీజియన్ తయారవుతుంది. ఎకరా భూమి 99 పైసలకే ఐటీ కంపెనీలకు ఇవ్వటం ఓ గేమ్ ఛేంజర్. గుజరాత్ లో టాటా నానో కారు తయారీ కేంద్రానికి కూడా 99 పైసలకే ఎకరా చొప్పున భూమి ఇచ్చారు. ఇటీవలే భాగస్వామ్య సదస్సులో 613 ఎంఓయూల ద్వారా రూ. 13.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అలాగే ఎస్ఐపీబీల ద్వారా మరో రూ .8.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించాం. నేషనల్ క్యాంటం మిషన్ ను అందిపుచ్చుకుని ఏపీలోని అమరావతిలో క్యాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ కేంద్రం అమరావతిలో ఏర్పాటు కాబోతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను భారతదేశంలో పెట్టుకుంటున్నారు. భారత్ దేశం వైపు ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూస్తోంది. ఈ క్రమంలో ఏపీని, విశాఖను మరింతగా అభివృద్ధి చేస్తున్నాం. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు విశాఖకు వస్తున్నాయి. కాగ్నిజెంట్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా విశాఖలో పెట్టాలని కోరుతున్నాను. రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్స్, మెడ్ టెక్ జోన్లు ప్రపంచస్థాయి ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి. పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు ఎస్క్రో ఖాతాను పెడుతున్నాం. ఈ తరహాలో ఆలోచించే ప్రభుత్వాలు ఉండవు. ఆర్టీఐహెచ్ ద్వారా స్టార్టప్ లకు నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నాం. సంజీవని ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులను కూడా రూపోందిస్తున్నాం. 15 శాతం వృద్ధి రేటు సాధించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది. *8 వేలు కాదు… 25 వేలు* కాగ్నిజెంట్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఆ సంస్థ సీఈఓ రవికుమార్ కీలక ప్రకటన చేశారు. విశాఖ కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. 8 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వంతో కాగ్నిజెంట్ సంస్థ ఒప్పందం చేసుకుంది. అయితే శంకుస్థాపన కార్యక్రమానికి ముందుగా రవికుమార్ తో సీఎం చంద్రబాబు కొద్దిసేపు సంభాషించారు. 8 వేల ఉద్యోగాలు కాదని… విశాఖ క్యాంపస్ లో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు శంకుస్థాపన కార్యక్రమం వేదికగా చంద్రబాబు సమక్షంలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని రవికుమార్ ప్రకటించారు. విశాఖకు రావడం తన సొంతింటికి వచ్చినట్టుందని రవికుమార్ అన్నారు. *మరో 8 సంస్థలకు శంకుస్థాపనలు* కాగ్నిజెంట్ సంస్థతో పాటు త్వరలోనే విశాఖ నుంచి మరికొన్ని సంస్థలు కూడా కార్యాకలాపాలు మొదలు పెట్టనున్నాయి. వీటిల్లో కొన్నింటికి శుక్రవారం నాడే శంకుస్థాపనలు జరిగాయి. టెక్ తమ్మిన, సత్వ డెవలపర్స్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ ఇండియా, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం సర్వీసెస్, నాన్రెల్ టెక్నాలజీస్ వంటి సంస్థలకు శంకుస్థాపనలు జరిగాయి. త్వరలో విశాఖలో తమ కార్యకలాపాలు చేపట్టనున్నట్టు ఆయా సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సంస్ధల ద్వారా రాష్ట్రానికి రూ. 3,740 కోట్ల పెట్టుబడులు, దాదాపు 41,700 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ప్రస్తుతం విశాఖలో 150కి పైగా టెక్ కంపెనీల కార్యకలాపాలు సాగిస్తుండడంతో రాష్ట్రంలో ఐటీ నిపుణులకు విస్తృతంగా అవకాశాలు పెరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో ఒక్క విశాఖలోనే రూ.1.34 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్, డీబీవీ స్వామి, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు ఘంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి, కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్, ఐటీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

అంగన్వాడీల సమస్యల పరిష్కారం కై సమ్మెకుసిద్ధం

అంగన్వాడీల సమస్యల పరిష్కారం కై సమ్మెకుసిద్ధం ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ హెచ్చరిక *విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి* రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈరోజు అప్పుల కోసం జరుగుతున్న టోకెన్ సమ్మె లో భాగంగా విశాఖ నగరంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఇవాళ సెంటర్లన్నీ కూడా బందు చేసి ఏఐటియుసి ,ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పి వెంకటలక్ష్మిఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటలక్ష్మి మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా అంగన్వాడిలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని గ్రాట్యుటి అమలు చేయాలని ఎం వెంకట లక్ష్మి డిమాండ్ చేశారు రాష్ట్రంలో పేదగర్భిణీలు, డిమాండ్ చేశారుబాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీవర్కర్లు హెల్పర్లు మినీవర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదనీ రాష్ట్రంలో మిగిలిన 1810 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని సంక్షేమ పథకాలు అమలు చేసి సెంటర్ నిర్వహణకు ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారం చేయాలని 2023 డిశంబర్ లో 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించారాని సమ్మె ముగింపు సందర్భంగా 2024 జూలైలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని ఇతర సమస్యలు పరిష్కారం చేస్తానని మినిట్స్ ఇచ్చారనీ అయినా నేటి వరకు వేతనాలు పెంచలేదన్నారు. రాష్ట్రంలో ఇటీవల 4687 మినీసెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీఓ ఇచ్చినందుకు అభినందనలునీ ఇంకా 1810 మినీ సెంటర్లలో క్వాలిఫికేషన్ లేదని మెయిన్ సెంటర్లుగా మార్చలేదనీ కొంత మంది మినీ వర్కర్లకు 10 వ తరగతి పాస్ అయిన మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయలేదన్నారు. గ్రాట్యూటీ జీఓ నెం.3 ను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గైడ్ లైన్స్ రూపొందించలేదనీ సంక్షేమ పథకాలు అమలుకావడంలేదు హెల్పర్ల ప్రమోషన్లో రాజకీయ జోక్యo వలన అర్హులకు ప్రమోషన్లు రావడంలేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. సెంటర్ నిర్వహణకు ఇచ్చిన ఫోన్లు పనిచేయనందువల్ల ఫేస్ యాప్, ఆన్లైన్ వర్క్ చేయటానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రీస్కూల్ పీల్లలకు సాయంత్రం ఇస్తున్న స్నాక్స్్స్న ఆపివేశారనీ గుర్తు చేశారు. అన్ని యాప్ లు కలిపి ఒక యాప్ గా మార్చి వేతనంతో కూడిన మెడికల్ లీవ్ లు ఇవ్వాలనీ పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీచేయాలి లబ్దిదారులకు ఆయిల్,కందిపప్పు క్వాంటిటి మెసూ చార్జీలు పెంచి ఉచితంగా గ్యాస్ సరఫరా ప్రీ స్కూల్ బలోపేతం చేయాలన్నారు. ఫ్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి 5 సంవత్సరాల్లోపు పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లో ఉండాలని జీవో ఇవ్వాలన్నా ఏఐటియుసి. జిల్లాఅధ్యక్షులు కార్యదర్శిలు. పి శ్యామల. ఎం వెంకట లక్ష్మి,ఎ నూకరత్నం. పి.సీత. విజయ.సుబ్బలక్ష్మి.రాధ. మంజుల ఐఎఫ్టియు నాయకులు. లక్ష్మీ. గీత. రామలక్ష్మి. పాల్గొన్నారు.

విశాఖపట్నం

జివిఎంసి టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కు 19 వినతులు.

జివిఎంసి టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కు 19 వినతులు. – జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ.ప్రభాకారరావు *విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి * మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమంలో 19 వినతులు వచ్చాయని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ.ప్రభాకారరావు తెలిపారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లో సిపి లు, డీసీపీలు, ఏసీపీ లతో కలిసి ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానరు మాట్లాడుతూ జీవీఎంసీ లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS కార్యక్రమం లో జివిఎంసి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజల నుండి అధికంగా ఫిర్యాదులు నమోదవుతున్నందున, జివిఎంసి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజల నుండి ఫిర్యాదులు/ వినతులను స్వీకరించేఁదుకు గానూ ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమానికి సంబంధించి 19 వినతులు స్వీకరించడం జరిగినదని, అందులో ముఖ్యంగా 1వ జోన్ కు 01, 2వ జోన్ కు 02, 3వ జోన్ కు 08, 4వ జోన్ కు 02, 5వ జోన్ కు 02, 6వ జోన్ కు 03, 8వ జోన్ కు 01 వినతులు వచ్చాయని తెలిపారు. స్వీకరించిన వినతులను /ఫిర్యాదులను నిర్ణీత సమయంలో టౌన్ ప్లానింగు అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించడమైనదన్నారు. పట్టణ ప్రణాళికా విభాగమునకు సంబంధించి ఫిర్యాదులు, అర్జీలు మొదలైనవి ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమంలో ప్రజలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.

విశాఖపట్నం

విశాఖలో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన*

*విశాఖలో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన* *విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి* విశాఖ కాపులుప్పాడలో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంపస్ భవన నిర్మాణానికి (Quarks Technosoft Pvt Ltd) విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖ యూనిట్ ద్వారా రూ.115 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. *హైదరాబాద్ లో చేసిన మ్యాజిక్ ను సీఎం చంద్రబాబు గారు విశాఖలో రిపీట్ చేస్తున్నారు* ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మీరు చూస్తున్నది అంతా చరిత్ర. గతంలో హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు గారు కృషి చేశారు. అలాంటి మ్యాజిక్కే మళ్లీ చంద్రబాబు గారు ఏపీలోని విశాఖలో చేస్తున్నారు. లోకల్ అంత్రపెన్యూర్స్ ను మేం ప్రోత్సహిస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలతో మేం ముందుకు వెళ్తున్నాం. విశాఖలో గాజువాక, భీమిలి ఎమ్మెల్యేలకు అత్యధిక మెజార్టీని ప్రజలకు కట్టబెట్టారు. నాకు మూడో అత్యధిక మెజార్టీ వచ్చింది. ప్రజలు మాపై ఎంతో విశ్వాసం ఉంచారు. వారు నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ఎండీలను నేను మొదటిసారి కలుస్తున్నా. శంకుస్థాపన కార్యక్రమంలోనే నేను కలుస్తానని చెప్పా. అదీ పెట్టుబడుల పట్ల మా కమిట్ మెంట్. *గత 18 నెలల్లో మేం 190 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాం* గత 18 నెలల్లో మేం 190 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాం. మాకు ఏదైనా వదిలిపెడతారా అని ఇతర రాష్ట్రాల వారు ప్రశ్నిస్తున్నారు. దేశంలో ప్రతి పెట్టుబడికి మేం పోటీ ఇస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉంటే.. ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ప్రధాని మోడీ గారు, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన నాయకులు. 75 ఏళ్ల వయసులోనూ పరిగెడుతున్నారు. వీరి నాయకత్వం భారతదేశం, ఏపీకి ఎంతో అదృష్టం. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. ఏపీ, విశాఖ, తెలుగు ప్రజలను గర్వపడేలా చేస్తాం. యువత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. కష్టపడి పనిచేయాలి. విజయానికి దగ్గరి దారులు లేవు. చంద్రబాబు గారు 19 గంటల వరకు కష్టపడతారు. విశాఖ గౌరవాన్ని పెంచే విధంగా మీరు పనిచేయాలి. ముందుండి నడిపించాలి. తర్వాతి తరాలకు మార్గదర్శకంగా ఉండాలి. నేను విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తా. విశాఖ మ్యాజికల్ సిటీ. మీరు రౌడీలను తరిమికొడతారు. రౌడీల చుట్టూ రౌడీలే ఉంటారు. దేశానికి నడిపించాలి అనుకునే వారి చుట్టూ పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నవారే ఉంటారు. అందరం కలిసి విశాఖకు గర్వకారణంగా నిలుద్దాం. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్లు, విశాఖను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం. అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలంటే నైతిక విలువలు కూడా ముఖ్యమే అని గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో విపిన్ వింద్యాల్, డైరెక్టర్ అశుతోష్ కౌశిక్, ఎంపీ శ్రీ భరత్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

విశాఖలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు*

విశాఖలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు* విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి:- • 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో క్యాంపస్ నిర్మాణం • మొత్తం రూ.1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో పూర్తి కానున్న కాగ్నిజెంట్ టెక్నాలజీస్ పూర్తి క్యాంపస్ • 2026 నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకోనున్న కాగ్నిజెంట్ • అప్పటివరకు అద్దె కార్యాలయంలో కార్యకాలపాలు కొనసాగించనున్న కాగ్నిజెంట్ • ప్రధానంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై కాగ్నిజెంట్ దృష్టి • కాగ్నిజెంట్‌తో పాటు మరో 8 ఐటీ సంస్థలకు కూడా విశాఖలో క్యాంపస్‌లు ఏర్పాటుకు భూమిపూజ • ముఖ్యమంత్రితో పాటు పాల్గొన్న ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్, విశాఖ ఎంపీ భరత్, కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ • త్వరలోనే విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్న టెక్ తమ్మిన, సత్వ డెవలపర్స్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ ఇండియా, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం సర్వీసెస్, నాన్రెల్ టెక్నాలజీస్ సంస్థలు • ఈ సంస్థల ద్వారా రాష్ట్రానికి రూ. 3,740 కోట్ల పెట్టుబడులు, దాదాపు 41,700 మందికి ఉద్యోగావకాశాలు • గూగుల్ రాకతో ఇప్పటికే డేటా సిటీగా ఎదుగుతున్న విశాఖ • కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి సంస్థలు ప్రారంభించడంతో విశాఖ వైపు ప్రముఖ ఐటీ కంపెనీల చూపు • ప్రస్తుతం విశాఖలో 150కి పైగా టెక్ కంపెనీల కార్యకలాపాలు, రాష్ట్రంలో ఐటీ నిపుణులకు విస్తృతంగా పెరిగిన అవకాశాలు • కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 18 నెలల్లో ఒక్క విశాఖలోనే రూ.1.34 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు

విశాఖపట్నం

విశాఖలో మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన*

*విశాఖలో మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన* *విశాఖపట్నం * విశాఖపట్నం కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్ లో మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (Motherson Technology Services Limited) ఐటీ సంస్థ క్యాంపస్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ విశాఖ యూనిట్ ద్వారా రూ.109.73 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 1,775 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ హెడ్ ఆఫ్ టెక్నాలజీ డివిజన్ ధీరజ్ ఇంద్ర ప్రకాష్, హెడ్ ఫైనాన్స్ కపిల్ బన్సల్, ఎంపీ శ్రీ భరత్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.