Sunday, 15 March 2026

Blog

అన్నమయ్య

మానవ హక్కుల పరిరక్షకుడు అవార్డు అందుకున్న షేక్ మహమ్మద్ అజీమ్

రైల్వే కోడూరు వాసి షేక్ మహమ్మద్ అజీమ్ మానవ హక్కుల రంగంలో చేసిన సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన “మానవ హక్కుల పరిరక్షకుడు అవార్డు”ను అందుకున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 10న నిర్వహించే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర రాష్ట్రం ఔరంగాబాద్ నగరంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ గౌరవం లభించింది. ఈ కార్యక్రమంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎం.ఆర్. అన్సారీ గారు షేక్ మహమ్మద్ అజీమ్‌కు అవార్డు మరియు కాంస్య పతకంను స్వయంగా అందజేశారు. షేక్ మహమ్మద్ అజీమ్ గత కొన్ని సంవత్సరాలుగా సమాజంలో బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ, పేదలు–నిరుపేదలకు న్యాయం అందేలా పోరాటాలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై అవగాహన కార్యక్రమాలు, అవసరమైన వారికి చట్టపరమైన సహాయం అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన చేసిన నిరంతర కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేయడం గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ అజీమ్ మాట్లాడుతూ, “మానవ హక్కుల పరిరక్షణ అనేది ఒక్క వ్యక్తి పని కాదు, సమాజం మొత్తం బాధ్యత. ఈ అవార్డు నాకు మరింత ప్రేరణనిస్తూ ప్రజల కోసం ఇంకా సేవ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తోంది” అని తెలిపారు. ఈ అవార్డు రైల్వే కోడూరు ప్రాంతానికి గర్వకారణమని స్థానికులు, సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ షేక్ మహమ్మద్ అజీమ్‌కు అభినందనలు తెలిపారు.

Others

బీజేపీ నూతన రద సారధి గా నితిన్ నబి

పున్నమి ప్రతినిధి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ నూతన రాదసారధి గా నితిన్ నబి ని జాతీయ పార్టీ నియమించినది. వీరికి ముందు జగత్ ప్రకాష్ నడ్డ ఈ యొక్క భాద్యత ని నిర్వహించారు. సామాన్య కార్యకర్త కి ఇలాంటి కీలక భాద్యత లు అప్పగించడం అనేది కేవలం బీజేపీ కే సాధ్యం అని బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు.

అనకాపల్లి

హస్తకళాకారులకు పనిముట్లును అందించిన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రడు..!

డిసంబర్ 14 పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్): అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణ దేవి పేట గ్రామంలో కేంద్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మరియు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో గతంలో 50 మంది కళాకారులకు కార్పెంటరీ వుడ్ కార్వింగ్ మీద శిక్షణ ఇవ్వడం జరిగింది .అందులో శిక్షణ పొందినటువంటి ప్రతి కళాకారుడికి పదివేల రూపాయలు విలువచేసే పనిముట్లులను మా గురువర్యులు గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి చేతుల మీదగా పనిముట్లు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కేంద్ర హస్తకళల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ అపర్ణ లక్ష్మి గారు , లేపాక్షి విశాఖపట్నం మేనేజర్ కార్తీక్ గారు,రాజాన సూర్యచంద్ర గారు మరియు అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

దేవాడ 77వ వార్డులో పులిచర్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం విజయవంతం

నమ్మిదొడ్డి జంక్షన్, దేవాడ గ్రామం 77వ వార్డులో ఆదివారం ఉదయం పులిచర్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫోర్ ఎస్ హాస్పిటల్ స్పెషలిస్టుల సహకారంతో మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందారు. ఈ మెడికల్ క్యాంపులో అన్ని విభాగాలకు చెందిన స్పెషలిస్టు డాక్టర్లు పాల్గొని సుమారు నాలుగు వందల మంది వరకు వచ్చిన వారి ఆరోగ్య సమస్యలను సమగ్రంగా పరీక్షించారు. ఎముకల సమస్యలు, నరాల వ్యాధులు, సాధారణ రుగ్మతలతో పాటు ఇతర అనారోగ్యాలపై వైద్యులు సలహాలు అందించారు. పరీక్షల అనంతరం రోగులకు అవసరమైన అన్ని రకాల మందులను పూర్తిగా ఉచితంగా అందించడం ఈ శిబిరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పులిచర్ల ట్రస్ట్ డాక్టర్ రవిశంకర్ ఎంఎస్ ఆర్తో ఆధ్వర్యంలో ఈ మెగా క్యాంపు సక్రమంగా, క్రమబద్ధంగా నిర్వహించబడింది. ఈ సేవా కార్యక్రమంలో సామాజిక కార్యకర్త పులిచర్ల ఫణి కుమార్ ప్రత్యేకంగా పాల్గొని నిర్వాహకులను ప్రోత్సహించారు. ప్రజారోగ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని నిర్వహించిన ఈ మెగా వైద్య శిబిరం స్థానికుల ప్రశంసలు పొందింది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

E-పేపర్

విక్టరీ స్కూల్ బస్సు కింద పడి తోడ విరిగిపోయిన 7 తరగతి విద్యార్థిని ఆదుకోవాలి

విక్టరీ స్కూల్ బస్సు కింద పడి తోడ విరిగిపోయిన 7 తరగతి విద్యార్థిని ఆదుకోవాలి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్కూల్ ని స్కూలుని బస్సులుని సీజ్ చేయాలి వ్యవసాయ కార్మిక సంఘం ఏఐఎస్ఎఫ్ డిమాండ్ ఆరోగ్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థి దగ్గర పోయి వారి తల్లి గారితో వాళ్ళ మామ గారితో పరామర్శిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గం కార్యదర్శి ఎం జయరామయ్య ఉపాధ్యక్షులు కే వెంకటరమణ పరామర్శిస్తూ మెరుగైన వైద్యం చేయించాలని అలాగే మూడు రోజులు కూడా కాలేదు అప్పుడే డిశ్చార్జ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నా యాజమాన్యం యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది వారి తల్లిదండ్రులును కూడా బెదిరిస్తున్నట్టు ఉంది దయవుంచి ముక్కుపుచ్చలారని ఆ విద్యార్థికి న్యాయం జరిగేంత వరకు అందరూ ప్రజాసంఘాలు విద్యార్థి సంఘాలు కలిసి రావాలని కోరడమైనది ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన నిన్న బాల్రెడ్డిపల్లి పంచాయతీ లోని బాలాజీ నగర్ దగ్గర అదే గ్రామానికి చెందిన నల్లమల యువకాంత్ తండ్రి నల్లమల బాబు తల్లి నల్లమల గీతం వారి పుత్రుడు నలమల యూవకాంత్ శుక్రవారం రోజు బడికి పోతూ స్కూల్ వ్యాను డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా వ్యాన్ ఎక్కబోతున్న విద్యార్థి పైకి దూసుకొచ్చి ఎడమ తొడ విరిగిపోయినది విక్టరీ స్కూల్ యాజమాన్యం ఎంతవరకు స్పందించకపోవడం చాలా దారుణంగా ఉంది అంతలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విక్టరీ స్కూలును మూపించాలని అలాగే వారి కుటుంబాలని 50 లక్షల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని అలాగే స్కూలు బస్సులకు సంబంధించి ఆర్టీవో గారు మామూళ్ల మత్తులో మునిగిపోయారు స్కూలు బస్సులు కండిషన్లో ఉన్నాయా లేవని పర్యవేక్షణ కూడా కరువైపోయింది కోడూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూల్ బస్సులను ఒకసారి పర్యవేక్షించాలని కోరడమైనది నియోజకవర్గంలో రైల్వే కోడూరు వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి ఎం జయరామయ్య కోరడమైనది వారి కుటుంబానికి న్యాయం జరిగిన పక్షంలో న్యాయం సోమవారం ఆ విద్యార్థిని తల్లిదండ్రులతో స్కూల్ దగ్గర ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాను

E-పేపర్

రాజంపేట ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి….. ప్రముఖ పారిశ్రామికవేత్త మాచీనేని విశ్వేశ్వర నాయుడు

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి….. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మాచీనేని విశ్వేశ్వర నాయుడు రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు పట్టణంలోని టోల్గేట్ దగ్గర శ్రీ మహాత్మా గాంధీ విగ్రహం సన్నిధిలో ఈరోజు అనగా 14.12.2025 వ తేదీన ఆదివారం నాడు రైల్వే కోడూరు నియోజకవర్గంలోని జేఏసీ నాయకులతో కలిసి రాజంపేట ను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని లేదంటే తిరుపతి జిల్లాలో కలపాలని నిరాహార దీక్షలో పాల్గొన్న ప్రముఖ పారిశ్రామిక మాచినేని విశ్వేశ్వర నాయుడు.

E-పేపర్

రాజంపేట ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి….. ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీనేని విశ్వేశ్వర నాయుడు

రాజంపేట ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి….. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మాజీనేని విశ్వేశ్వర నాయుడు రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు పట్టణంలోని టోల్గేట్ దగ్గర శ్రీ మహాత్మా గాంధీ విగ్రహం సన్నిధిలో ఈరోజు అనగా 14.12.2025 వ తేదీన ఆదివారం నాడు రైల్వే కోడూరు నియోజకవర్గంలోని జేఏసీ నాయకులతో కలిసి రాజంపేట ను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని లేదంటే తిరుపతి జిల్లాలో కలపాలని నిరాహార దీక్షలో పాల్గొన్న ప్రముఖ పారిశ్రామిక మాచినేని విశ్వేశ్వర నాయుడు.

E-పేపర్

అనాధ శవానికి దహన క్రియలు చేసిన బోలా శంకర్ సేవాసమితి

అనాధ శవానికి దహన క్రియలు చేసిన బోలా శంకర్ సేవాసమితి రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు మండలం శాంతినగర్ కు చెందిన పసుపులేటి నరసమ్మ అనారోగ్యంతో మృతి ఈమె శివాలయం వద్ద భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగించేది ఈమెకు భర్త. కుమార్తె. అల్లుడు ఉన్నారు .ఈమెకు వారితో 35 సంవత్సరముల క్రితం మే సంబంధాలు తెగిపోయాయి ఈమె మరణ వార్త తెలుసుకున్న వారు మేము అంత్యక్రియలకు రాలేము మేము చేయము మీరే చేయండి అని.కొంత డబ్బు ఇవ్వగా చుట్టుపక్కల వారికి చెప్పటంతో బోలా శంకర్ సేవా సమితిఅధ్యక్షులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర కోడూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు రంగనాయకులపేట వైసిపి ఇన్చార్జ్ యనమల రత్నయ్య శాంతినగర్ వైసిపి ఇన్చార్జ్ షేక్ మౌలా .వాసబాబు .శివాలయం అర్చకులు యోగి స్వామి గార్లకు తెలియజేయగా వీరి సహాయ సహకారాలతో కోడూరు హిందూ స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలునిర్వహించారు.

విశాఖపట్నం

సోమవారం జీవీఎంసీ లో ప్రజా పరిష్కార వేదిక

సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం . -విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. -జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్. విశాఖపట్నం, డిసెంబర్ 14 : మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోను, అన్ని జోనల్ కార్యాలయాలలోనూ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( Public Grievance Redressal system-PGRS )కార్యక్రమం” 2025 డిసెంబర్ 15 వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించబడునని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పత్రికా ప్రకటన ద్వారా ఆదివారం తెలిపారు. కావున, నగరంలో పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, నీటి సరఫరా, వీధి దీపాలు,హారికల్చర్, రెవిన్యూ, యు సి డి, ఇంజినీరింగ్ మొదలగు జీవీఎంసీ విభాగాలకు సంబంధించిన సమస్యలపై డిసెంబర్ 15 వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నగర ప్రజలు అర్జీల ద్వారా సమస్యలను తెలియపరుచుకోవచ్చునని నగర ప్రజలకు విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ తెలియచేశారు.

విశాఖపట్నం

విశాఖలో ఘనంగా లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం

విశాఖలో 15వ లక్కీ షాపింగ్ మాల్ ఘన ప్రారంభం సినీ నటి–యాంకర్ అనసూయ సందడి… ప్రజాప్రతినిధుల హాజరుతో పండగ వాతావరణం ఉత్తరాంధ్ర ప్రతినిధి డిసెంబర్ 14 యువతరం న్యూస్ విశాఖపట్నంలో లక్కీ షాపింగ్ మాల్ 15వ శాఖ ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ హాజరై అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, గణబాబు, గండి బాబ్జి, పరుశురామరాజు, కందుల నాగరాజు తదితర ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొని మాల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లు వినియోగదారులను విశేషంగా ఆకర్షించాయి. అనసూయను ప్రత్యక్షంగా చూడాలనే ఆసక్తి, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు పొందాలనే ఆశతో భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో షాపింగ్ మాల్ జనసంద్రాన్ని తలపించి పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన అనసూయ భరద్వాజ, లక్కీ షాపింగ్ మాల్ సాధించిన ప్రగతిని అభినందిస్తూ, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. లక్కీ షాపింగ్ మాల్ 15వ శాఖ ప్రారంభం విశాఖ నగరంలో షాపింగ్ ప్రియులకు మరో ఆకర్షణగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.