Sunday, 15 March 2026

Blog

విశాఖపట్నం

నాగవంశం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన భోజన మహోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*నాగవంశం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన భోజన మహోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* *విశాఖపట్నం డిసెంబర్ 14పున్నమి ప్రతినిధి* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు విశాఖపట్నం జిల్లా నాగవంశం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తాళ్ళ వలస వద్ద నిర్వహించిన వన భోజన మహోత్సవ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని సంఘం పెద్దలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రతి కుటుంబం తమ పిల్లల అభ్యున్నతికి , వికాసానికి విద్య ద్వారానే మార్పు వస్తుందని, ఆ దిశగా అడుగులు వేయాలని అన్నారు. విద్యావంతులు వున్న కుటుంబానికి , విద్య లేని కుటుంబానికి తేడాలు గమనించవచ్చని తెలిపారు. అందరి జీవితాల్లో మార్పులు రావాలంటే విద్య పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మరొకసారి తెలిపారు. కార్యక్రమంలో నాగవంశం కుల పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు…

విశాఖపట్నం

సామాజిక బాధ్యత గల పౌరులను తీర్చిదిద్దడమే ఎన్ఎస్ఎస్ లక్ష్యం — డాక్టర్ కందుల నాగరాజు

సామాజిక బాధ్యత గల పౌరులను తీర్చిదిద్దడమే ఎన్ఎస్ఎస్ లక్ష్యం — డాక్టర్ కందుల నాగరాజు *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* సమాజ సమస్యలపై అవగాహన ఉన్న, వాటిని పరిష్కరించడానికి చురుకుగా పనిచేసే సామాజిక బాధ్యత గల పౌరులను అభివృద్ధి చేయడం జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) ప్రధాన లక్ష్యం అని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. ఏవిఎన్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ నిర్వహణలో భాగంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డాక్టర్ కందుల నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ అతిధులు, విశిష్ట అతిథులు చేతుల మీదుగా ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుతున్న నేటి యువతకు చదువు, విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యత, సేవా గుణం పెంపొందాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ జాతీయ సేవా పథకాన్ని ఎన్ఎస్ఎస్ అని పిలుస్తారని చెప్పారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో ఈ పథకం అమలవుతుందన్నారు. చదువుకుంటూనే సామాజిక సేవలో ఎన్ఎస్ఎస్ ద్వారా భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. ఎన్ ఎస్ ఎస్ ద్వారా వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందన్నారు. బృందంతో కలిసి పని చేయగలిగే చొరవ వస్తుందన్నారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. న్యాయకత్వ లక్షణాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అనేక రంగాలలో ప్రవేశించే నేర్పును సాధిస్తారని తెలిపారు. వ్యక్తిగత జీవితాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి కూడా ఎన్ ఎస్ ఎస్ ఉపయోగపడుతుందన్నారు.నిస్వార్థమే లక్షణంగా, సమాజసేవే లక్ష్యంగా, ఎడ్యుకేషన్ ద్వారా సర్వీస్ అంటూ విద్యార్థుల్లో చదువు, విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యతను, సమస్యల పట్ల అవగాహనను పెంపొందిస్తూ విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వానికి, మంచి క్రమశిక్షణకి దారి చూపిస్తూ ప్రజా హృదయపథంలో పయనించే ఆ రథమే జాతీయ సేవా పథకం ‘ఎన్ఎస్ఎస్’ అని కొనియాడారు. సమాజ అవసరాలు, సమస్యలను గుర్తించడం విద్యార్థులను సమస్యల పరిష్కారంలో పాల్గొనేటట్టు చేయడం. క్యాంపులలో సమూహ జీవనం, పనులను పూర్తి చేయడంలో ఒకరికొకరు సాయం చేయడం కోసం అవసరమైన సామర్థ్యాల్ని విద్యార్థుల్లో పెంపొందించడం. అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించడం. జాతీయ సమైక్యత, సామాజిక సామరస్యతను పాటించడం. మొక్కలు, జంతువులు వంటి ఇతర జీవుల పట్ల శ్రద్ధ, దయగా ఉండేటట్లు విద్యార్థులకు నేర్పించడం వంటి అనేక మంచి లక్షణాలని సాధించడానికి ఎన్ఎస్ఎస్ తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఏవి అది బానోజి రావు, ఏబీఎన్ కాలేజ్ రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ ఎన్ ప్రకాష్ రావు, ఏబీఎన్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ ఎం సింహాద్రి నాయుడు, ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి సింహాచలం, ప్రిన్సిపాల్ పి కృష్ణకుమారి, ఏవిఎన్ కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డి. గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

మిరియాల సేవలు అజరామరం* *ఘనంగా 86వ జయంతి వేడుకలు*

*మిరియాల సేవలు అజరామరం* *ఘనంగా 86వ జయంతి వేడుకలు* *పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు* *ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు* *విశాఖపట్నం డిసెంబర్ 14 పున్నమి ప్రతినిధి* మహోన్నత వ్యక్తిగా.. ప్రజా సమస్యలు పరిష్కరించే ఉద్యమ నాయకుడిగా తనదైన రీతిలో చెరగని ముద్ర వేసుకున్న మిరియాల వెంకటరావు సమాజానికి అందించిన సేవలు అజరామరం అనీ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు.. వంశీకృష్ణ శ్రీనివాస్ లు కొనియాడారు ..ఆదివారం. ఇక్కడ వి ఎం ఆర్ డి ఏ బాలల ప్రాంగణంలో మిరియాల వెంకటరావు 86వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ మిరియాల వెంకటరావు ఉన్నతమైన ఆశయాలతో ప్రజా జీవితాన్ని కొనసాగించారన్నారు.. చివరి వరకు ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలనే సంకల్పంతోనే మిరియాల ఫౌండేషన్ ఏర్పాటు చేసి ముందుకు సాగారన్నారు.. అనేక యూనియన్లకు ..సంఘాలకు ప్రాతినిధ్యం వహించి అందరికోసం పాటుపడేవారన్నారు. సమాజంతో పాటు కాపులకు ఎనలేని సేవలు అందించారన్నారు.. అలాగే ఎంతోమందికి మార్గదర్శకులుగా నిలిచారన్నారు.. సభలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు తమ్మిరెడ్డి శివశంకర్(ఎ పి ఎం ఎస్ ఇ చైర్మన్)..బొలిశెట్టి సత్యనారాయణ లు మాట్లాడుతూ కాపుల అభ్యున్నతికి మిరియాల వెంకటరావు ఎంతగానో తోడ్పాటు అందించారన్నారు.. తన వద్దకు వచ్చే వారి విషయంలో ప్రతి సందర్భంలోనూ అయిన దిశ నిర్దిష చేయడంతో పాటు సమాజానికి మన వంతు సహకారం అందించే ప్రయత్నం చేయాలని చెప్పేవారన్నారు.. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వీరు పిలుపునిచ్చారు . మిరియాల పౌండేషన్ ట్రస్ట్ సభ్యులు. కఠారి అప్పారావు మురళి కోట పోతల శ్రీనివాస్ 86 వ. జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు డిసిసిబి చైర్మన్ కోన తాతారావు భీమిలి టిడిపి నాయకులు గంటా రవితేజ.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు.. మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ .కార్పొరేటర్లు ఉషశ్రీ. పివి సురేష్. డాక్ యార్డ్ సంఘము అధ్యక్షులు బత్తుల చిరంజీవి కార్యదర్శి విజనగిరి భాస్కరరావు. కాపు సంఘాల నాయకులు.. గుంటూరు నరసింహ మూర్తి.. తోట రాజీవ్..బి ఎన్ మూర్తి…. సేనాపతి వెంకటేశ్.. సుబ్బు విశ్వనాథ్ తో పాటు పెద్ద ఎత్తున పలు సంఘాల నాయకులు మిరియాల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

విశాఖపట్నం

సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం .

సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం . -విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. -జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్. *విశాఖపట్నం డిసెంబర్ 14 పున్నమి ప్రతినిధి*: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోను, అన్ని జోనల్ కార్యాలయాలలోనూ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( Public Grievance Redressal system-PGRS )కార్యక్రమం” 2025 డిసెంబర్ 15 వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించబడునని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పత్రికా ప్రకటన ద్వారా ఆదివారం తెలిపారు. కావున, నగరంలో పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, నీటి సరఫరా, వీధి దీపాలు,హారికల్చర్, రెవిన్యూ, యు సి డి, ఇంజినీరింగ్ మొదలగు జీవీఎంసీ విభాగాలకు సంబంధించిన సమస్యలపై డిసెంబర్ 15 వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నగర ప్రజలు అర్జీల ద్వారా సమస్యలను తెలియపరుచుకోవచ్చునని నగర ప్రజలకు విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ తెలియచేశారు.

అన్నమయ్య

పంట నష్టం–అప్పుల భారంతో రైతు ఆత్మహత్య

పంటలు పండక పెట్టిన పెట్టుబడులు రాక, గిట్టుబాటు ధరలు లేక అప్పుల భారం తట్టుకోలేక ఓ రైతు పొలంలోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామాన్ని విషాదంలో ముంచింది. మండలంలోని జెట్టివారిపల్లి గ్రామానికి చెందిన యేదోటి వెంకటసుబ్బయ్య కుమారుడు యేదోటి సుబ్బరాయుడు (48) కువైట్‌కు వెళ్లి ఉపాధి సాధించి స్వగ్రామానికి వచ్చి వ్యవసాయంపై ఆశలు పెట్టుకున్నాడు. భార్య సుభాషిణితో కలిసి కౌలుకు 13 ఎకరాలు తీసుకుని పంటలు సాగు చేసిన సుబ్బరాయుడికి వరుస నష్టాలు ఎదురయ్యాయి. వాతావరణ ప్రతికూలతలు, పెరిగిన సాగు ఖర్చులు, దిగుబడులు తగ్గడం, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం కారణంగా దాదాపు రూ.20 లక్షల మేర అప్పులు పేరుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుల వసూళ్ల ఒత్తిడితో తీవ్ర మనోవేదనకు లోనైన ఆయన చివరకు తన పొలంలోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతూ, రైతులను ఆదుకునే విధంగా ధరల హామీ, రుణభారం తగ్గింపు వంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరుకి రావాలని మేకపాటి పిలుపు

ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉదయగిరిలో సంతకాలు సేకరించారు వాటిని నెల్లూర్ నుంచి తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి సోమవారం తరలించనున్నారు ఈ సందర్భంగా నెల్లూరు గాంధీ బొమ్మ నుంచి వి ర్ సి సెంటర్ వరకు ర్యాలీ చేస్తామని అందులో ఉదయగిరి నాయకులు పాల్గొనాలనీ ఇంచార్జీ మేకపాటీ రాజగోపాల్ రెడ్డి కోరారు

అన్నమయ్య

చిట్వేలిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి: నలుగురు అరెస్టు

-పబ్లిక్ స్థలంలో గుట్టు చప్పుడు కాకుండా జూదం ఆడుతున్న ముఠా పట్టివేత -రూ. 6,300 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం.. కేసు నమోదు చిట్వేలి, డిసెంబర్ 14 ఎల్లో సింగం ప్రతినిధి చిట్వేల్ మండలంలో బహిరంగ స్థలాల్లో చట్టవిరుద్ధంగా పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆదివారం నాడు చిట్వేల్ ఎస్ఐ ఎస్. వినోద్ కుమార్ తమ సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.ఆదివారం మధ్యాహ్నం చిట్వేల్ పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా, చెర్లోపల్లి గ్రామానికి పడమర వైపు గల ప్రాంతంలో కొందరు వ్యక్తులు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందింది.సమాచారం అందుకున్న ఎస్ఐ ఎస్. వినోద్ కుమార్ తమ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ కంపచెట్ల పొదల చాటున ఉన్న ఒక పబ్లిక్ స్థలంలో నలుగురు వ్యక్తులు డబ్బులను పణంగా పెట్టి పేకాట (జూదం) ఆడుతుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు.పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి:రూ. 6,300 నగదు (పణంగా పెట్టిన డబ్బు) రెండు సెల్‌ఫోన్లనుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు, ముఖ్యంగా జూదం, పేకాట వంటి వాటిని మండలంలో ఎక్కడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అరెస్టు చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు.

కామారెడ్డి

ఘనంగా గట్టు మల్లన్న జాతర!

– అన్నారం గ్రామంలో భక్తి మహా పండుగ కామారెడ్డి, 14డిసెంబర్, (పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం: ప్రత్యేక సంచరణకామారెడ్డి జిల్లా రామారెడ్డి మండ లం అన్నారం గ్రామంలో గట్టు మల్లన్న ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తుల ఉత్సాహం, గ్రామీణ సంస్కృతి మహిమలు కనిపించిన ఈ జాతరలో వేలాది మంది పాల్గొన్నారు.ఉదయం నుంచి భక్తి సంబరాలుప్రధాన అర్చకులు మాట్లాడుతూ, “ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే మల్లన్న ఉత్సవాలు ఈ ఏటా కూడా అందంగా జరిగాయి” అని పేర్కొన్నా రు. ఉదయం సుప్రభాత సేవలు, అభిషేక పూజల తో ప్రారంభమైన ఉత్సవాలు మల్లన్న కళ్యాణోత్స వం ఘనంగా నిర్వహించారు.భక్తులు వెంట తెచ్చు కున్న మొక్కులను హుండిలో వేసి, మనసులోని మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలు సమర్పించి, దైవదారిశిని పొందారు.ఎడ్లబండ్లు, అన్నదానం.. గ్రామోత్సవ సంబరాలు కుల సంఘా ల ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ప్రదర్శన ఘనంగా జరిగింది. దూండగల నృత్యాలు, ఢమ్ ఢమ్ డ్రమ్స్‌తో గ్రామం మొత్తం మైమపడింది. చివరగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు ఆనందంగా పాల్గొన్నారు.

కామారెడ్డి

ఘనంగా గట్టు మల్లన్న జాతర!

– అన్నారం గ్రామంలో భక్తి మహా పండుగ కామారెడ్డి, 14డిసెంబర్, (పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం: ప్రత్యేక సంచరణకామారెడ్డి జిల్లా రామారెడ్డి మండ లం అన్నారం గ్రామంలో గట్టు మల్లన్న ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తుల ఉత్సాహం, గ్రామీణ సంస్కృతి మహిమలు కనిపించిన ఈ జాతరలో వేలాది మంది పాల్గొన్నారు.ఉదయం నుంచి భక్తి సంబరాలుప్రధాన అర్చకులు మాట్లాడుతూ, “ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే మల్లన్న ఉత్సవాలు ఈ ఏటా కూడా అందంగా జరిగాయి” అని పేర్కొన్నా రు. ఉదయం సుప్రభాత సేవలు, అభిషేక పూజల తో ప్రారంభమైన ఉత్సవాలు మల్లన్న కళ్యాణోత్స వం ఘనంగా నిర్వహించారు.భక్తులు వెంట తెచ్చు కున్న మొక్కులను హుండిలో వేసి, మనసులోని మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలు సమర్పించి, దైవదారిశిని పొందారు.ఎడ్లబండ్లు, అన్నదానం.. గ్రామోత్సవ సంబరాలు కుల సంఘా ల ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ప్రదర్శన ఘనంగా జరిగింది. దూండగల నృత్యాలు, ఢమ్ ఢమ్ డ్రమ్స్‌తో గ్రామం మొత్తం మైమపడింది. చివరగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు ఆనందంగా పాల్గొన్నారు.

కామారెడ్డి

ఘనంగా గట్టు మల్లన్న జాతర!

– అన్నారం గ్రామంలో భక్తి మహా పండుగ కామారెడ్డి, 14డిసెంబర్, (పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం: ప్రత్యేక సంచరణకామారెడ్డి జిల్లా రామారెడ్డి మండ లం అన్నారం గ్రామంలో గట్టు మల్లన్న ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తుల ఉత్సాహం, గ్రామీణ సంస్కృతి మహిమలు కనిపించిన ఈ జాతరలో వేలాది మంది పాల్గొన్నారు.ఉదయం నుంచి భక్తి సంబరాలుప్రధాన అర్చకులు మాట్లాడుతూ, “ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే మల్లన్న ఉత్సవాలు ఈ ఏటా కూడా అందంగా జరిగాయి” అని పేర్కొన్నా రు. ఉదయం సుప్రభాత సేవలు, అభిషేక పూజల తో ప్రారంభమైన ఉత్సవాలు మల్లన్న కళ్యాణోత్స వం ఘనంగా నిర్వహించారు.భక్తులు వెంట తెచ్చు కున్న మొక్కులను హుండిలో వేసి, మనసులోని మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలు సమర్పించి, దైవదారిశిని పొందారు.ఎడ్లబండ్లు, అన్నదానం.. గ్రామోత్సవ సంబరాలు కుల సంఘా ల ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ప్రదర్శన ఘనంగా జరిగింది. దూండగల నృత్యాలు, ఢమ్ ఢమ్ డ్రమ్స్‌తో గ్రామం మొత్తం మైమపడింది. చివరగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు ఆనందంగా పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.