Sunday, 15 March 2026

Blog

అన్నమయ్య

వ్యవసాయ సంక్షోభం: జెట్టివారిపల్లిలో రైతు బలి

వ్యవసాయ సంక్షోభం: జెట్టివారిపల్లిలో రైతు బలి -పెట్టుబడులు నష్టపోయి, గిట్టుబాటు ధరలు లేక అప్పుల ఊబిలో చిక్కుకున్న సుబ్బరాయుడు -మండలంలో రైతుల ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చిట్వేల్, డిసెంబర్ 14: పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి అద్దం పడుతూ, మండలంలోని జెట్టివారిపల్లి గ్రామంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. పంట నష్టం, గిట్టుబాటు ధర లేకపోవడం కారణంగా తీవ్రమైన అప్పుల బాధను తట్టుకోలేక యేదోటి సుబ్బరాయుడు (48) అనే రైతు తన జీవితాన్ని చాలించారు. ఆయన తండ్రి యేదోటి వెంకటసుబ్బయ్య. -ఆర్థిక సంక్షోభం కారణం: గ్రామంలో అంచనా ప్రకారం, సుబ్బరాయుడు ఈ సంవత్సరం సాగు చేసిన పంటల కోసం భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ, అకాల వర్షాలు/వాతావరణ మార్పుల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. పండిన స్వల్ప మొత్తానికి కూడా ప్రభుత్వ మద్దతు ధర లభించకపోవడంతో పెట్టినపెట్టుబడులు పూర్తిగా నష్టపోయారుఫలితంగా, ప్రైవేటు అప్పులు మరియు ఇతర రుణాల భారం పెరిగిపోయింది. ఈ భారాన్ని మోయలేక తీవ్ర మనస్తాపానికి లోనైన సుబ్బరాయుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు.సుబ్బరాయుడు మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న కుటుంబాన్ని పోషించుకోడానికి పడిన తపన విఫలం కావడంతోనే ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు.ఈ సంఘటన రైతాంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు తాజా ఉదాహరణ. ప్రభుత్వం తక్షణం స్పందించి, సుబ్బరాయుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని, అలాగే రైతుల పంటలకు కనీస గిట్టుబాటు ధరలను నిర్ణయించాలని స్థానిక రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

విశాఖపట్నం

విశాఖ ఫోటోగ్రాఫర్స్ ఎకగ్రీవంగా ఎన్నిక:

విశాఖ ఫోటోగ్రాఫర్స్ ఎకగ్రీవంగా ఎన్నిక: విశాఖ జిల్లా ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా శ్రీ మట్టా లోకేష్ కుమార్ , ప్రధాన కార్యదర్శిగా శ్రీ చల్ల నూకరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గా ఎన్నికైన మట్టా లోకేష్ కుమార్ మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు. ప్రదాన కార్యదర్శి గా ఎన్నికైన చల్లా నూకరాజు మాట్లాడుతూ ఎన్నికలకు సహకరించి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎన్నికల అధికారులు గా T. V. R. M. రాజు గారు, బాబా రెడ్డి గారు, K. K. ప్రసాద్ గారు వ్యవహరించారు. అధిక సంఖ్యలో ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు. మన ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్లు తరఫున మీ ఇద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు 🙏.

విశాఖపట్నం

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ ( Operation LUNGS) 2.0 లో ఆక్రమణలు తొలగింపుల కొనసాగింపు * జీవీఎంసీ పరిధిలో ఆదివారం 319 ఆక్రమణల తొలగింపు .

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ ( Operation LUNGS) 2.0 లో ఆక్రమణలు తొలగింపుల కొనసాగింపు * జీవీఎంసీ పరిధిలో ఆదివారం 319 ఆక్రమణల తొలగింపు . – జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ . ప్రభాకర్ రావు *విశాఖపట్నం డిసెంబర్ 14 పున్నమి ప్రతినిధి* మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అన్ని జోన్ల లో ఆపరేషన్ లంగ్స్ 2.0 లో భాగంగా 319 ఆక్రమణలను ఆదివారం తొలగించడం జరిగిందని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ . ప్రభాకర్ రావు ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు సురక్షితంగా ఫుట్ పాతులపై నడక సాగించేందుకు, రోడ్లు, జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా సురక్షిత రవాణా కోసమై జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ (Operation Lungs) 2.0 లో భాగంగా అన్ని జోన్లలో రోడ్లపై జంక్షన్లలో ఆక్రమణలు తొలగించడమైనదని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు. ప్రజా సౌకర్యార్థమై ఆక్రమణల తొలగింపు కొనసాగిస్తూ ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం జరిగినదని, ఇప్పటికే నగరంలో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా రక్షణ చర్యల దిశగా ఆపరేషన్ లంగ్స్ పనిచేస్తుందన్నారు. మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS కార్యక్రమంలో ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులులో ఎక్కువగా రోడ్లు, పుట్ పాత్ ఆక్రమణలు మరియు రోడ్ల కిరువైపుల వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల రోడ్లకు అండంకు ఏర్పడడం, తరచుగా ప్రజల రాకపోకలకు, వాహనాల రవాణాకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని, ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి తక్షణ చర్యలు చేపట్టే ఆవశ్యకత దృష్ట్యా జి.వి.యం.సి లో గల 8 జోన్ల పరిధిలో గల ప్రధాన రహదారులలో, జంక్షన్లలో ఉన్న ఆక్రమణలు గుర్తించి వాటిని వెంటనే పోలీసు వారి సహకారము తో శనివారం తొలగించిన 336 ఆక్రమణలతో పాటు మొత్తంగా 655 ఆక్రమణలను తొలగించడమైనదని సిసిపి తెలిపారు. తొలగించిన ఆక్రమణలను ఈ క్రింద పొందుపరచడమైనది. 1వ జోన్ లోని క్లాక్ టవర్ నుండి తగరపువలస జంక్షన్ వరకు 20 ఆక్రమణలు జోన్ 2 పరిధిలో ఎండాడ నుండి రుషికొండ 100 అడుగుల రోడ్డు వరకు 60 ఆక్రమణలు, 3వ జోన్ పరిధిలో స్పోర్ట్స్ అరీనా నుండి బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ ఎదురు రోడ్డు వరకు, అలాగే మహాలక్ష్మి అపార్ట్మెంట్ నుండి నేషనల్ హైవే శివాజీ పార్క్ రోడ్డు వరకు 42 ఆక్రమణలు, 4 వ జోన్ పరిధిలోని లీలామహల్ జంక్షన్ నుండి సౌత్ జైలు రోడ్డు వరకు 27 ఆక్రమణలు, 5వ జోన్ పరిధిలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుండి మర్రిపాలెం జంక్షన్ వరకు 34 ఆక్రమణలు, 6వ జోన్ పరిధిలోని శ్రీనగర్ నుండి దుర్గా నగర్ రోడ్డు, బీసీ రోడ్డు జంక్షన్ నుండి గంగవరం పోర్టు రోడ్డు వరకు 53 ఆక్రమణలను, 7వ జోన్ పరిధిలో ఎన్టీఆర్ విగ్రహం నుండి చింతా వారి వీధి వరకు 18 ఆక్రమణలు, 8వ జోన్ పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురం నుండి వేపగుంట వరకు వేపగుంట జంక్షన్ నుండి గోపాలపట్నం జంక్షన్ వరకు అలాగే రైల్వే స్టేషన్ రోడ్డు వరకు 65 ఆక్రమణలు తొలగించడం జరిగిందని ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా జోన్ల కమిషనర్లు ,సహాయక ప్రణాళిక అధికారులు, ప్రణాళిక విభాగం సిబ్బంది, సచివాలయం సిబ్బంది , పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (PRSI) ఆధ్వర్యంలో “Empowering Growth, Preserving Roots – The PR Vision for 2047” అనే థీమ్‌తో ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లో డిసెంబర్ 13 నుంచి 15 వరకు నిర్వహించిన 47వ కాన్ఫరెన్స్ లో జివిఎంసి

47వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో జీవీఎంసీకి మూడు ప్రతిష్టాత్మక పి.ఆర్.ఎస్.ఐ – 2025 జాతీయ అవార్డులు. *విశాఖ ప్రజలు, ప్రజాప్రతినిధులు , కౌన్సిల్ సభ్యుల సంపూర్ణ సహకారంతోనే జి.వి.ఎం.సి కి ఈ ఉత్తమ జాతీయ స్థాయి అవార్డులు. *1. బెస్ట్ సి.ఎస్.ఆర్ ప్రాజెక్ట్ ఫర్ చైల్డ్ కేర్ – ప్రథమ స్థానం. 2. బెస్ట్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ఎ కార్పొరేట్ క్యాంపెయిన్ – ప్రథమస్థానం . 3. ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ – ద్వితీయ స్థానం. కేటగిరీలలో జాతీయ అవార్డులు జి వి ఎం సి కైవసం. *విశాఖపట్నం డిసెంబర్ 14 పున్నమి ప్రతినిధి*: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (PRSI) ఆధ్వర్యంలో “Empowering Growth, Preserving Roots – The PR Vision for 2047” అనే థీమ్‌తో ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లో డిసెంబర్ 13 నుంచి 15 వరకు నిర్వహించిన 47వ అఖిల భారత పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ – 2025లో మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ ( జి వి ఎం సి) మూడు ప్రతిష్టాత్మక పి.ఆర్.ఎస్.ఐ – 2025 జాతీయ అవార్డులు సాధించిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. డిసెంబర్ 13వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి ప్రారంభోత్సవం చేయగా డిసెంబర్ 14వ తేదీన అవార్డుల ప్రధానోత్సవం ఉత్తరాఖండ్ శాసనసభ గౌరవనీయ స్పీకర్ శ్రీమతి రీతూ ఖండూరీ భూషణ్ , ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమేష్ పోక్రియల్ నిశాంక్ , పి.ఆర్.ఎస్.ఐ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ అజిత్ పాఠక్ చేతుల మీదుగా జి వి ఎం సి కి ఈ జాతీయ అవార్డులు అందజేయబడ్డాయని కమిషనర్ తెలిపారు. విశాఖపట్నం నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ సభ్యులు అందించిన నిరంతర సహకారం, భాగస్వామ్యం, ప్రోత్సాహంతో జీవీఎంసీ అమలు చేసిన ప్రజా సంక్షేమం, మహిళల సాధికారత ,అభ్యున్నతి, మహిళల ఆర్థిక బలోపేతం,సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు , ప్రజా అవగాహన,ప్రచార,సామాజిక మాధ్యమ కార్యక్రమాలు, బాల్యం విద్యా కేంద్రాలలో బాలల ఆరోగ్యం, విద్య,భద్రత, పోషణ,సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలకు గానూ జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించిందని కమిషనర్ తెలిపారు. జీవీఎంసీకి లభించిన జాతీయ అవార్డుల కేటగిరీల వివరాలు. 1. బెస్ట్ సి.ఎస్.ఆర్ ప్రాజెక్ట్ ఫర్ చైల్డ్ కేర్ – ప్రథమ స్థానం. బాలల సంక్షేమం,ఆరోగ్య రక్షణ కు ఉత్తమ CSR ప్రాజెక్ట్ – విశాఖ నగరంలో జి వి ఎం సి నిర్వహిస్తున్న బాల్యం విద్యా కేంద్రాలలో బాలల ఆరోగ్యం, విద్య,భద్రత, పోషణ,సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల అమలుకు. 2. బెస్ట్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ఎ కార్పొరేట్ క్యాంపెయిన్ – ప్రథమస్థానం . జి వి ఎం సి కార్పొరేట్ స్థాయి ప్రచారంలో సామాజిక మాధ్యమాల ఉత్తమ వినియోగం – విశాఖ నగరంలో ప్రజలకు అందిస్తున్న నగర సేవలు, పాలన, ప్రజా అవగాహన కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా సమర్థవంతంగా ప్రజలకు చేరవేసినందుకు. 3. ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ – ద్వితీయ స్థానం. మహిళల సాధికారత,సామాజిక, ఆర్థిక అభివృద్ధి, స్వయం ఉపాధి, సామర్థ్య వృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు అమలు చేసినందుకు. ఈ అవార్డులను జీవీఎంసీ తరపున జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణ మూర్తి, పౌర సంబంధాల అధికారి ఎన్. నాగేశ్వర రావు అందుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతో, ప్రజా అవసరాలను కేంద్రంగా చేసుకుని జీవీఎంసీ చేపడుతున్న కార్యక్రమాలకు లభించిన గౌరవంగా ఈ అవార్డులను భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ప్రజలతో బలమైన కమ్యూనికేషన్‌తో పాటు సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చేందుకు జీవీఎంసీ కట్టుబడి ఉంటుందని తెలిపారు.

Blog

ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్య సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌరవ ఎమ్మెల్సీ నాగబాబు గారు*

*ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్య సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌరవ ఎమ్మెల్సీ నాగబాబు గారు* *ఎచ్చెర్ల*డిసెంబర్ 14 విశాఖ పున్నమి ప్రతినిధి* ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు వద్ద జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కొణిదెల నాగబాబు గారి తో ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు ముఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అభ్యున్నతికి మరియు ఇతర అంశాలకు సంబంధించిన విషయాలను చర్చించారు . అదేవిధంగా ఎమ్మెల్యేలు నుంచి పలు సూచనలు సలహాలను నాగబాబు గారు స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణ బాబు గారు, జనసేన పార్టీ విశాఖ నగర మరియు రూరల్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు , శ్రీ రమేష్ బాబు గారు, ఎలమంచిలి ఎమ్మెల్యే శ్రీ విజయకుమార్ గారు, నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీ మాధవి గారు, పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ గారు, భీమిలి ఇంచార్జి శ్రీ సందీప్ గారు పాల్గొన్నారు…

విశాఖపట్నం

టిడిపి కార్యకర్తలకు అండగా గంటా రవితేజ*

*టిడిపి కార్యకర్తలకు అండగా గంటా రవితేజ* *కష్టంలో ఉన్న కార్యకర్తల ఇళ్లకు వెళ్లి భరోసా – యువనేత సేవాభావానికి ప్రశంసలు* *విశాఖపట్నం డిసెంబర్ 14పున్నమి ప్రతినిధి* ఎన్నికల సమయంలో కార్యకర్తల ఇళ్ల చుట్టూ తిరిగి హామీలు ఇచ్చే నాయకులను మనం తరచూ చూస్తుంటాం. కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత కార్యకర్తల కష్టసుఖాలను పట్టించుకోని పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితులకు భిన్నంగా, టిడిపి యువనేత, మాజీ మంత్రి, భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి కుమారుడు *గంటా రవితేజ* తన సేవాభావంతో కార్యకర్తల మనసులు గెలుచుకుంటున్నారు. మధురవాడ 5వ వార్డు వైయస్సార్ కాలనీలో నివసిస్తున్న పక్కి విష్ణుమూర్తి అనే సామాన్య టిడిపి కార్యకర్త ఇటీవల పక్షవాతం బారిన పడడంతో కేజీహెచ్‌లో చికిత్స పొందారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే యువనేత గంటా రవితేజ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని, “నీకు ఏ అవసరం ఉన్నా నేను అండగా ఉంటాను” అంటూ భరోసా కల్పించారు. నాయకుడు స్వయంగా తమ ఇంటికి వచ్చి పరామర్శించడంతో ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. అదేవిధంగా, అదే వార్డుకు చెందిన వాసు అనే మరో టిడిపి కార్యకర్త ప్రమాదవశాత్తు కాలు విరగడంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న గంటా రవితేజ మధ్యాహ్న భోజన సమయం అయినప్పటికీ కార్యకర్త కోసం ఎదురుచూసి, ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో తమను ఆదుకోవడానికి నాయకుడు నేరుగా రావడం చూసి ఆ కార్యకర్తలు కన్నీటి పర్యంతమై యువనేతకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకొని వారికి భరోసా కల్పించడం ఒక నిజమైన నాయకుడి లక్షణమని, ఇలాంటి సేవాభావం కలిగిన నాయకులు భవిష్యత్ తరాలకు ఎంతో అవసరమని పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. గంటా రవితేజ చూపిస్తున్న ఆత్మీయతకు తెలుగు తమ్ముళ్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, యార్లగడ్డ జీవన్, ఓలేటి శ్రావణ్, వంక నూకరాజు, మొదలవలస సరస్వతి, మాధవ, కురుమోజి శ్రీను తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

జనవరి 9 నుండి 12 వరకు బిహెచ్.పివి గ్రౌండ్స్ లో క్రికెట్ పోటీలు*

*జనవరి 9 నుండి 12 వరకు బిహెచ్.పివి గ్రౌండ్స్ లో క్రికెట్ పోటీలు* *లోగోను ఆవిష్కరించిన బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కేఎన్ఆర్* *విశాఖపట్నం డిసెంబర్ 14పున్నమి ప్రతినిధి* గాజువాక పాతకర్నవాని పాలెం బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ గాజువాక ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు క్యాంపు కార్యాలయంలో బిహెచ్.పివి మాజీ ఉద్యోగుల సంఘం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసారు.జనవరి 9 నుండి12 వరకు బిహెచ్.పివి గ్రౌండ్స్ లో జరగబోయే క్రికెట్ పోటీల లోగోను కేఎన్ఆర్ చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు 2026 సందర్భంగా మాజీ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి పది టీంలుగా ఏర్పడి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని తెలిపారు. బిగ్ బాస్ రెండో సీజన్ విజేత కౌశల్ మండా, భారత క్రికెటర్ నితీష్ రెడ్డి,వంటి పలువురు ప్రముఖులు కూడా వస్తారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ బుల్లి తెర డి20 డ్యాన్సర్ జాన్షి, కొరియోగ్రాఫర్ రమేష్ మాస్టర్ , కమిటీ సభ్యులు శివ,రాము,అప్పారావు,శ్రీనివాస్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Blog

బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నితిన్‌ నబిన్‌ నియామకం*

*బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నితిన్‌ నబిన్‌ నియామకం* న్యూ ఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్‌కు చెందిన సీనియర్ నేత నితిన్‌ నబిన్‌ను పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించింది. ప్రస్తుతం బీహార్ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న నితిన్‌ నబిన్‌, బంకిపూర్‌ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం కలిగిన నాయకుడు. పార్టీ సంస్థాగత బలోపేతం, రాష్ట్రాల మధ్య సమన్వయం, కేడర్‌ను ఉత్సాహపరిచే బాధ్యతలను నితిన్‌ నబిన్‌ సమర్థంగా నిర్వర్తిస్తారని బీజేపీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

విశాఖపట్నం

నాగవంశం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన భోజన మహోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*నాగవంశం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన భోజన మహోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* *విశాఖపట్నం డిసెంబర్ 14పున్నమి ప్రతినిధి* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు విశాఖపట్నం జిల్లా నాగవంశం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తాళ్ళ వలస వద్ద నిర్వహించిన వన భోజన మహోత్సవ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని సంఘం పెద్దలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రతి కుటుంబం తమ పిల్లల అభ్యున్నతికి , వికాసానికి విద్య ద్వారానే మార్పు వస్తుందని, ఆ దిశగా అడుగులు వేయాలని అన్నారు. విద్యావంతులు వున్న కుటుంబానికి , విద్య లేని కుటుంబానికి తేడాలు గమనించవచ్చని తెలిపారు. అందరి జీవితాల్లో మార్పులు రావాలంటే విద్య పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మరొకసారి తెలిపారు. కార్యక్రమంలో నాగవంశం కుల పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు…

విశాఖపట్నం

సామాజిక బాధ్యత గల పౌరులను తీర్చిదిద్దడమే ఎన్ఎస్ఎస్ లక్ష్యం — డాక్టర్ కందుల నాగరాజు

సామాజిక బాధ్యత గల పౌరులను తీర్చిదిద్దడమే ఎన్ఎస్ఎస్ లక్ష్యం — డాక్టర్ కందుల నాగరాజు *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* సమాజ సమస్యలపై అవగాహన ఉన్న, వాటిని పరిష్కరించడానికి చురుకుగా పనిచేసే సామాజిక బాధ్యత గల పౌరులను అభివృద్ధి చేయడం జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) ప్రధాన లక్ష్యం అని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. ఏవిఎన్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ నిర్వహణలో భాగంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డాక్టర్ కందుల నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ అతిధులు, విశిష్ట అతిథులు చేతుల మీదుగా ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుతున్న నేటి యువతకు చదువు, విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యత, సేవా గుణం పెంపొందాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ జాతీయ సేవా పథకాన్ని ఎన్ఎస్ఎస్ అని పిలుస్తారని చెప్పారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో ఈ పథకం అమలవుతుందన్నారు. చదువుకుంటూనే సామాజిక సేవలో ఎన్ఎస్ఎస్ ద్వారా భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. ఎన్ ఎస్ ఎస్ ద్వారా వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందన్నారు. బృందంతో కలిసి పని చేయగలిగే చొరవ వస్తుందన్నారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. న్యాయకత్వ లక్షణాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అనేక రంగాలలో ప్రవేశించే నేర్పును సాధిస్తారని తెలిపారు. వ్యక్తిగత జీవితాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి కూడా ఎన్ ఎస్ ఎస్ ఉపయోగపడుతుందన్నారు.నిస్వార్థమే లక్షణంగా, సమాజసేవే లక్ష్యంగా, ఎడ్యుకేషన్ ద్వారా సర్వీస్ అంటూ విద్యార్థుల్లో చదువు, విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యతను, సమస్యల పట్ల అవగాహనను పెంపొందిస్తూ విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వానికి, మంచి క్రమశిక్షణకి దారి చూపిస్తూ ప్రజా హృదయపథంలో పయనించే ఆ రథమే జాతీయ సేవా పథకం ‘ఎన్ఎస్ఎస్’ అని కొనియాడారు. సమాజ అవసరాలు, సమస్యలను గుర్తించడం విద్యార్థులను సమస్యల పరిష్కారంలో పాల్గొనేటట్టు చేయడం. క్యాంపులలో సమూహ జీవనం, పనులను పూర్తి చేయడంలో ఒకరికొకరు సాయం చేయడం కోసం అవసరమైన సామర్థ్యాల్ని విద్యార్థుల్లో పెంపొందించడం. అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించడం. జాతీయ సమైక్యత, సామాజిక సామరస్యతను పాటించడం. మొక్కలు, జంతువులు వంటి ఇతర జీవుల పట్ల శ్రద్ధ, దయగా ఉండేటట్లు విద్యార్థులకు నేర్పించడం వంటి అనేక మంచి లక్షణాలని సాధించడానికి ఎన్ఎస్ఎస్ తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఏవి అది బానోజి రావు, ఏబీఎన్ కాలేజ్ రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ ఎన్ ప్రకాష్ రావు, ఏబీఎన్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ ఎం సింహాద్రి నాయుడు, ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి సింహాచలం, ప్రిన్సిపాల్ పి కృష్ణకుమారి, ఏవిఎన్ కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డి. గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.