నిర్మల్
ప్రెస్ నోట్ భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు విజయ్ దివస్ ను అత్యంత ఘనంగా నిర్వహించారు. 1971 Bangladesh Liberation యుద్ధంలో భారత సాయుధ దళాలు సాధించిన చారిత్రక విజయాన్ని స్మరించుకుంటూ, దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ శ్రీ రఘునాథ్ గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విజయ్ దివస్ భారత దేశ గర్వకారణమని, సైనికుల అపార ధైర్యసాహసాలు, త్యాగస్ఫూర్తి ప్రతి భారతీయుడికి శాశ్వత ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. విద్యార్థులు దేశభక్తి, కర్తవ్యబద్ధత, క్రమశిక్షణ వంటి విలువలను తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు డా. పవన్ పాండే, డా. భీమారావు, డా. పి.జి. రెడ్డి, డా. రవి కుమార్, డా. ఎం. శంకర్ డాక్టర్ సంతోష్ కుమార్, అబ్దుల్లా, సురేందర్ ,దివ్య , రాజయ్య, మజార్, కిషన్ ,ఇర్ఫాన్ ,వాయిద్, ఉజ్మా సమరీన్ యుద్ధ ప్రాధాన్యతను వివరిస్తూ ప్రసంగించారు. వారు మాట్లాడుతూ దేశ సమగ్రత, సార్వభౌమత్వం పరిరక్షణలో భారత సైనికుల పాత్ర అమోఘమని కొనియాడారు. వీర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకోవడం మాత్రమే కాకుండా, ఆ త్యాగాలకు తగిన పౌరులుగా మెలగడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్లు శ్రీ ఏ. రాజు, డా. ఓం ప్రకాష్ సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ గీతం ఆలపించడం, వీర జవాన్లకు రెండు నిమిషాల మౌనం పాటించడం, దేశభక్తి ప్రతిజ్ఞ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కార్యక్రమం ముగింపులో విద్యార్థులు దేశ రక్షణకు అంకితమైన భారత సైనికుల త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ, దేశ సేవే పరమ ధ్యేయంగా ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ విధంగా విజయ్ దివస్ కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో దేశభక్తి వాతావరణంలో ఘనంగా ముగిసింది.