Sunday, 15 March 2026

Blog

విశాఖపట్నం

సింబ‌యాసిస్ న‌రేష్ కుమార్‌కు ఏయూ డాక్ట‌రేట్‌

సింబ‌యాసిస్ న‌రేష్ కుమార్‌కు ఏయూ డాక్ట‌రేట్‌ *విశాఖ‌ప‌ట్నం,డిసెంబర్ 16పున్నమి ప్రతినిధి*: ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం కామ‌ర్స్ మేనేజ్‌మెంట్ విభాగం ప‌రిశోధ‌క విద్యార్థి, సింబ‌యాసిస్ టెక్నాల‌జీస్ సిఈఓ ఓరుగంటి న‌రేష్ కుమార్‌కు డాక్ట‌రేట్ ల‌భించింది. ఆర్ట్స్ కామ‌ర్స్ క‌ళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఏ.న‌ర‌సింహా రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వ‌ర్క్‌ప్లేస్ డైన‌మిక్స్ అండ్ చాలెంజెస్ ఇన్ ద ఐ.టి సెక్టార్ పోస్ట్ పేండ‌మిక్‌- ఏ కేస్ స్ట‌డీ ఆన్ వ‌ర్క్ ఫ్రం-హోం ఇన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనే అంశంపై జ‌రిపిన పరిశోధ‌న‌కు డాక్ట‌రేట్ ల‌భించింది. ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ త‌న కార్యాల‌యంలో డాక్ట‌రేట్ ఉత్త‌ర్వుల‌ను న‌రేష్ కుమార్‌కు అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా విభాగ ఆచార్యులు, ప‌రిశోధ‌కులు, శ్రేయోభిలాషులు న‌రేష్ కుమార్‌ను అభినందించారు. అనంతరం నరేష్ కుమార్ ను ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నరసింహారావు తన కార్యాలయంలో అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ప‌నిచేసే కార్యాలయ గతిశీలత మరియు కోవిడ్‌ మహమ్మారి అనంతర ఐటీ రంగంలో సవాళ్లు: ఆంధ్రప్రదేశ్‌లో వర్క్-ఫ్రమ్-హోమ్ పై ఒక అధ్యయనం అనే అంశంపై న‌రేష్ కుమార్ త‌న ప‌రిశోధ‌న జ‌రిపారు. కోవిడ్ అనంత‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఐటి రంగంలో ఎదురైన స‌వాళ్ల‌ను త‌న ప‌రిశోధ‌న‌లో అధ్య‌య‌నం చేశారు. సుదీర్ఘ కాలంగా సాఫ్ట్‌వేర్ సంస్థ‌ను నిర్వ‌హిస్తూ, ఐటి వ్య‌వ‌స్థ‌ను, అభివృద్ధిని, స‌వాళ్ల‌ను సునిశితంగా ప‌రిశీలిస్తున్న న‌రేష్ కుమార్ ఆ రంగానికి ఎదురైన స‌వాళ్ల‌ను ప‌రిశోధ‌న అంశంగా తీసుకుని త‌న ప‌రిశోధ‌న సిద్దాంత గ్రంధాన్ని ఏయూకు స‌మ‌ర్పించి, డాక్ట‌రేట్ పొందారు. ఋషికొండ ఐటీ పార్క్ అసోసియేషన్ , వైజాగ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉపాధ్యక్షునిగా నరేష్ కుమార్ సేవలు అందిస్తున్నారు. నరేష్ కుమార్ గ‌తంలో బిఈ, ఎంబీఏ, ఎంఫిల్ డిగ్రీలను పూర్తి చేసి నేడు ఏయూ నుంచి పీ.హెచ్.డి అందుకున్నారు.

విశాఖపట్నం

పంచగ్రామాల ప్రజలను అక్రమాదారులుగా ముద్ర వేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు – ఇది హెచ్చరిక.

పంచగ్రామాల ప్రజలను అక్రమాదారులుగా ముద్ర వేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు – ఇది హెచ్చరిక. *విశాఖపట్నం డిసెంబర్ 16పున్నమి ప్రతినిధి* సింహాచలం తొలిపావంచా నుంచి పాత అడవివరం జంక్షన్ వరకు నిర్మించిన BRTS రోడ్డుకు సంబంధించి బాధితులకు TDRలు మంజూరు చేస్తూ G.O జారీ చేసిన కూటమి ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకం. ఇందుకు కూటమి ప్రభుత్వానికి పంచగ్రామాల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అయితే, అదే కూటమికి చెందిన ఒక కార్పొరేటర్ పంచగ్రామాల్లో నివసించే రైతులు, ప్రజలను చులకన చేసి అక్రమాదారులుగా చిత్రీకరించడం రాజకీయ నీచత్వానికి నిదర్శనం. అప్పటి వైసీపీ ప్రభుత్వం 273 మంది లబ్ధిదారులుగా గుర్తించి, 205 మందికే TDRలు ఇచ్చినట్టు ఇచ్చి, sale option లేకుండా చేశారు. – ఇదే వాస్తవం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు గారు, విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారి నాయకత్వంలో BRTS బాధితుల సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించి, కమిటీ ఏర్పాటు చేసి, కమిటీ సిఫార్సుల మేరకు 273 మందికీ న్యాయం చేస్తూ G.O జారీ చేయడం జరిగింది. ఇంత స్పష్టమైన అంశాన్ని తణుకు TDR స్కామ్‌తో పోల్చడం అవివేకం మాత్రమే కాదు, బాధితులపై దాడి చేయడమే. కూటమిలో అంతర్గత రాజకీయాలుంటే అవి పెద్దల దగ్గర తేల్చుకోవాలి. సింహాచలం BRTS బాధితుల జోలికి వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవు. ఈ విషయాన్ని పత్రిక సోదరులకు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు స్పష్టంగా తెలియజేస్తున్నామని అడవివరం మాజీ సర్పంచ్ – పాశర్ల ప్రసాద్ తెలిపారు.

కడప

కడప జిల్లా అధ్యక్షునిగా భూపేష్ సుబ్బరామిరెడ్డి

తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షునిగా జమ్మలమడుగు నియోజకవర్గపు ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు నియమితులయ్యారు ఆయన పార్టీకి చేసిన కృషికి గాను ఈ పదవి లభించింది ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు మాట్లాడుతూ ఈ పదవి తనకు మరింత బాధ్యతను పెంచిందని ఇకపై మరింత క్రమశిక్షణతో పని చేస్తానని ఆయన తెలిపారు

E-పేపర్

నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

రైల్వే కోడూరు మండలం స్థానిక టోల్గేట్ వద్ద నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో. ఎంపీటీసీ పుష్పలత గురయ్యా ,రాష్ట్ర కార్యదర్శి ఈరన్న, శీను, శేఖర్, రాము, మనీ, సూరి సుబ్బరాయుడు ,నాగార్జున, హిందూ సంఘాల నుండి సుబ్బరాయుడు, దరిశ వెంకట్ రెడ్డి, సుగవాసి మల్లికార్జున, జయరాం రెడ్డి, సాయి ఆచారి పాల్గొని సంఘీభావం తెలియజేయడం జరిగినది రాజంపేట మొద్దు అనే నిదానంతో నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పాయిగా ర్యాలీ కూడా చేపడం జరిగిందని వారు తెలియజేశారు.

E-పేపర్

నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

రైల్వే కోడూరు మండలం స్థానిక టోల్గేట్ వద్ద నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో. ఎంపీటీసీ పుష్పలత గురయ్యా ,రాష్ట్ర కార్యదర్శి ఈరన్న, శీను, శేఖర్, రాము, మనీ, సూరి సుబ్బరాయుడు ,నాగార్జున, హిందూ సంఘాల నుండి సుబ్బరాయుడు, దరిశ వెంకట్ రెడ్డి, సుగవాసి మల్లికార్జున, జయరాం రెడ్డి, సాయి ఆచారి పాల్గొని సంఘీభావం తెలియజేయడం జరిగినది రాజంపేట మొద్దు అనే నిదానంతో నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పాయిగా ర్యాలీ కూడా చేపడం జరిగిందని వారు తెలియజేశారు.

కామారెడ్డి

సర్పంచ్ లు – వార్డ్ మెంబర్లు ఆప్యాయత సన్మాన బిగ్ బాస్! గెలుపు

– సమావేశంలో ఒకరినొకరు గౌరవింపు వర్షం! కామారెడ్డి,16 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో స్థానిక సంస్థల సర్పంచ్-వార్డ్ మెంబర్ ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులు ఒక్కతాటిపై ఒక్కటిగా మారారు! గెలిచిన సర్పంచులు, వార్డ్ మెంబర్లు కలిసి ఏర్పడిన సమూహంలో ఆప్యాయ తతో ఒకరినొకరు సన్మానం చేసుకున్నారు.ఈ అ సాధారణ కార్యక్రమం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది.గ్రామీణ రాజకీయాల్లో ఐక్యతకు మరో ఉదాహరణ ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్ధృతం గా ఏర్పడిన ఈ విజయ సమూహం, పరస్పర గౌరవంతో సన్మానాలు పురస్కరించుకున్నారు. సర్పంచులు తమ సహచరులను, వార్డ్ మెంబర్లు తమ నాయకులను ఆప్యాయతతో అభినందిం చారు.”ఇది మా మండల ఐక్యతకు చిహ్నం!” అంటూ పాల్గొన్న నాయకులు చెప్పారు.ఈ కార్యక్ర మం గ్రామ ప్రజల్లో తీవ్ర ఆదరణ పొందింది. రామా రెడ్డి మండలంలో ఈ సన్మాన సమ్మేళనం రాజకీయ ఐక్యతకు కొత్త ఆవిష్కరణలా మారింది. భవిష్య త్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరిగితే, గ్రామీణ అభివృద్ధి వేగంగా జరుగుతుందని స్థానికు లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కామారెడ్డి

గెలిచిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు నాయి బ్రాహ్మణుల ఘన సన్మానం!

కామారెడ్డి,16 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో విజయోత్సవాలు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వ ర్యంలో ఘన సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించా రు. మండల కేంద్రంలో జరిగిన ఈ ఉత్సవాత్మక కార్యక్రమం ప్రజల మనసుల్ని ఆకర్షించింది.సంఘ నాయకులు ముందుంచిన ఈ సన్మానం, గ్రామీణ ప్రజల జయకాంక్షలకు చిరస్థాయి! గెలిచిన నాయ కులు ప్రజల సమక్షంలో సంఘ నాయకుల నుంచి గౌరవపూర్వకంగాసన్మాన పత్రాలు ఆవలించుకు న్నారు. పంచాయతీ రాజకీయాల్లో కొత్త అధ్యా యం మొదలైంది అంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధు లు మాట్లాడుతూ, “ఎన్నికల విజేతలు మా సమా జానికి, గ్రామాల అభివృద్ధికి మేలుచూస్తారని నమ్ముతున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మా ఐక్యతను మరింత బలపరుస్తాయి” అని తెలిపారు.రామారెడ్డి మండలం ప్రజలు ఘనంగా అభినందించారు.

E-పేపర్

అన్యమత ప్రచారాన్ని చేస్తూన్నా వారిపై కఠిన చర్యలు తీసుకోండి

రైల్వే కోడూరు మండలం స్థానిక కొత్తకోడూరు దగ్గరలోని ఎస్టీ కాలనీలో రాత్రిళ్ళు జరుగుతున్న అన్యమత ప్రచారాన్ని చేస్తూన్నా వారిపై రైల్వే కోడూరు మండల పరిధిలోని సబ్ ఇన్స్పెక్టర్ కి అలాగే స్థానిక ఎమ్మార్వో గారికి అన్యమత ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవలసినదిగా కొత్తకోడూరు కాలనీ వాసులు మరియు వివిధ హిందూ ధార్మిక సంఘాల సమక్షంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది

E-పేపర్

రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని దీక్ష లోపాల్గొన్న పుల్లంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాపెర్ల చంద్రశేఖర్ నాయుడు

రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని దీక్ష లోపాల్గొన్న పుల్లంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాపెర్ల చంద్రశేఖర్ నాయుడు రైల్వే కోడూరు మేజర్ న్యూస్ అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాక గ్రామానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి రాజంపేట పట్టణాన్ని రాజంపేట జిల్లా కేంద్రంగా చేయకుండా రాళ్ళల్లో, కొండల్లో ఎటువంటి సదుపాయాలు లేకుండా ఉన్నటువంటి రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించి పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి తుగ్లక్ పాలనసాగించి, సునకానందం పొందడమే కాకుండా,రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి,యం.పి పాపాల పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేటకు పట్టణానికి తీరని ద్రోహం చేసి రాజంపేట ప్రజలను విసిగించారని ఇప్పుడు దీనిమీద మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టిపెట్టి రాజంపేట ప్రజల మనోభావాలను దెబ్బ తినకుండా రాజంపేటను వెంటనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కాపెర్ల చంద్రశేఖర్ నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు,మేడికొండు రవికుమార్ నాయుడు, మాజీ అధ్యక్షులు బాపనయ్య నాయుడు, ప్రముఖ డాక్టర్ నవీన్ కుమార్ చౌదరి,కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు, చెరువు ప్రెసిడెంట్ నాగినేని నాగేశ్వరరావు, సింగల్ విండో ప్రెసిడెంట్ మణి నాయుడు,దివాకర్ నాయుడు, తులసి నాగేంద్ర, రాముయాదవ్,గండికోట రామకృష్ణయ్య, కొల్లపనేని వెంకటేశ్వర్లు నాయుడు మరియుఎన్.డి. ఏ కూటమి నాయకులు రాజంపేట ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఎన్ టి ఆర్ జిల్లా

వేదాద్రి కంచల ఎత్తిపోతలకు ₹15 కోట్లు నందిగామలో రైతులతో కలిసి ఘన సంబరాలు

వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం మరమ్మత్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయడంతో నందిగామలో రైతులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని తన కార్యాలయంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య రైతులు, రైతు నేతలు, కూటమి నాయకులతో కలిసి బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం ఈ ప్రాంత రైతులకు చిరకాల స్వప్నమని పేర్కొన్నారు. పథకం మరమ్మత్తుల కోసం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీకి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ పథకంపై నిరంతర పోరాటం చేశామని, ప్రభుత్వ ప్రమాణ స్వీకారం అనంతరం రెండవ రోజే ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశామని తెలిపారు. అలాగే విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్‌ (చిన్ని)తో కలిసి పలుమార్లు సంబంధిత అధికారులను కలిసి సమస్యను వివరించినట్లు చెప్పారు. ముప్పాళ్ల పి–4 కార్యక్రమంలోనూ రైతుల ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. గత ఐదేళ్లుగా రైతులు ఎదుర్కొన్న కష్టాలు తనను కలచివేశాయని, నేడు రైతన్న కళ్లలో ఆనందం చూడటం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతి ప్రభుత్వమని స్పష్టం చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని ఎత్తిపోతల పథకాల మరమ్మత్తులకు నిధులు మంజూరు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 17 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో లాల్ బహదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోటా వీరబాబు, డీసీ చైర్మన్ రాటకొండ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, నీటి సంఘాల ప్రతినిధులు, రైతు నేతలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.