Saturday, 14 March 2026

Blog

తిరుపతి

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు వ్యక్తికీ తీవ్రగాయాలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 18, శ్రీకాళహస్తి మండలంలోని మిట్ట కండ్రిగ గ్రామం వద్ద తిరుపతి నుండి వేగంగా వెళుతున్నటువంటి కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారునికి తీవ్రగాయాలై గాయాలతో అక్కడే పడుపోవడం జరిగింది. గాయపడిన వ్యక్తి మేర్లపాక గ్రామానికి చెందిన వ్యక్తిని సమాచారం. పూర్తీ వివరాలు తెలియవలసివుంది.

తిరుపతి

రాష్ట్ర రాజధానిలో శిక్షణ తరగతుల్లో పాల్గొన్న శ్రీకాళహస్తి టి.డి.పి. నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 18, శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశానుసారం శ్రీకాళహస్తి తెదేపా నాయకులు రాష్ట్ర రాజధానిలోని మంగళగిరిలో తెలుగుదేశం కేంద్ర పార్టీ కార్యాలయంలో రెండు రోజులు పాటు జరుగునున్న శిక్షణా తరగతులలో శ్రీకాళహస్తి పట్టణ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్ శిక్షణ తరగతులలో పాల్గొనడం జరిగింది. వీరితో పాటు వివిధ నియోజకవర్గాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొనడం జరిగింది. ఈ శిక్షణ తరగతులలో పార్టీ భావజాలం, చరిత్ర గురించి గుంటూరు మాజీ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురామరాజు, కేస్ స్టడీస్ గురించి మాజీ MLC అశోక్ బాబు వక్తలుగా వ్యవహరించడం జరిగింది.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో 40 ఏళ్ల చరిత్రను సృష్టించిన కాకతీయ–అపోలో విద్యాసంస్థలు: కాపా రవీంద్రబాబు

నందిగామ పట్టణంలో కాకతీయ –అపోలో విద్యాసంస్థలు 40 సంవత్సరాల సుదీర్ఘ విద్యా చరిత్రను సృష్టించాయని సంస్థల వ్యవస్థాపకులు కాపా రవీంద్రబాబు అన్నారు. గురువారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అనేక మంది విద్యార్థులను ఉత్తమ భవిష్యత్తుకు తీర్చిదిద్దిన ఘనత కాకతీయ విద్యాసంస్థలకే దక్కిందన్నారు. భారతదేశంతో పాటు అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి ప్రపంచ నలుమూలల దేశాల్లో తమ విద్యార్థులు స్థిరపడ్డారని తెలిపారు. కాకతీయ విద్యాసంస్థల అభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు 2019లో సీబీఎస్‌ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కాకతీయ–అపోలో సంస్థల అభివృద్ధికి తమ కుటుంబం నిరంతరం కృషి చేసిందని, ఇక్కడ చదివే విద్యార్థులలో ఎక్కువ మంది రైతుకుటుంబాల నుంచి వచ్చినవారేనని తెలిపారు. కాకతీయ–అపోలో విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకు ఎక్కడ ఉన్నా ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉందన్నారు. భవిష్యత్తులో పాఠశాల తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించను న్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కాపా భారతి, డైరెక్టర్లు కాపా కార్తీక్, కాపా స్ఫూర్తి, రవీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ప్రజా ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించండి.

ప్రజా ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించండి. – జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి *విశాఖపట్నo డిసెంబర్ 18పున్నమి ప్రతినిధి* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి. జె. ఆర్. ఎస్) లోని ప్రజలు పెట్టుకున్న అర్జీలను/ ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో పి. జె. ఆర్. ఎస్ పై జీవీఎంసీ అదనపు కమిషనర్ ఫైనాన్స్ ఎస్. ఎస్. వర్మ, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ. ఎన్. వి. నరేష్ కుమార్ లతోపాటు అన్ని జోన్ల కమిషనర్లు, పట్టణ ప్రణాళిక విభాగం, ఇంజనీరింగ్ విభాగం, పరిపాలన విభాగం, రెవెన్యూ, ప్రజా ఆరోగ్యం విభాగం, ఆర్టికల్చర్ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశ నిర్వహణ పాటు కలెక్టర్ ఆఫీస్ నుండి వచ్చిన పి.జె.ఆర్.ఎస్ ఫ్రీ ఆడిటర్లు సిహెచ్. ప్రసాద్, వి. సూర్య కిరణ్ లతో ఆర్జీలను ఏ విధంగా పరిష్కరించాలన్న దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ అదనపు కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజల కొరకు నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి. జె.ఆర్.ఎస్) లోని ప్రజలు పెట్టుకున్న ఫిర్యాదులు/ ఆర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను అధికారులు తమ లాగిన్ లో 24 గంటలకు మించి ఉంచరాదని, మొదటగా ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి ఫిర్యాదుదారుడు సంతృప్తి చెంది, సమస్య పరిష్కరించిన తర్వాతే అతనికి ఎండార్స్మెంట్ ఇచ్చిన పిదప ఫిర్యాదును క్లోజ్ చేయాలన్నారు. ఫిర్యాదుదారుని సమస్య పూర్తిగా పరిష్కరించకుండానే ఫిర్యాదులను క్లోజ్ చేయడం వలన మరల అదే ఫిర్యాదు రీఓపెన్ అవుతుందని తెలిపారు. ఫిర్యాదులపై సీఎంఓ కార్యాలయం ప్రత్యేక దృష్టి చారించిందని ఫిర్యాదులు పరిష్కరించకుండా క్లోజ్ చేస్తే చార్జ్ మెమో లు ఇవ్వడం జరుగుతుందని అదనపు కమిషనర్ హెచ్చరించారు. అనంతరం అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో (పిజిఆర్ఎస్) రెండు రకాల ఫిర్యాదులు ఉంటాయని ఒకటి ఫైనాన్స్ రెండు నాన్ ఫైనాన్స్ సంబంధించినవని, నాన్ ఫైనాన్స్ కు సంబంధించి ఫిర్యాదులను వెను వెంటనే పరిష్కరించాలని, ఫైనాన్స్ సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు కొంత సమయం పడుతున్నందున ఫిర్యాదుదారుడు తో నేరుగా విషయం వారికి అర్థమయ్యేలా వివరించి, ఆ సమస్య ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలము వారికి తెలిపిన పిదప ఆ ఫిర్యాదుదారుడు మరల ఆ ఫిర్యాదును రీ ఓపెన్ చేయకుండా చూడాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఆఫీస్ నుండి వచ్చిన పి జే ఆర్ ఎస్ ఫ్రీ ఆడిటర్లు ప్రజా సమస్యల పరిష్కార వేదిక లోని ఫిర్యాదులను ఏ విధంగా క్లోజ్ చేయాలన్న దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సహాయ వైద్యాధికారులు, రెవెన్యూ ఆఫీసర్లు, శానిటరీ సూపర్వైజర్లు, డిపిఓలు, ఏపీడీలు, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

నగరంలో సైకిల్ ట్రాక్ ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి .

నగరంలో సైకిల్ ట్రాక్ ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి . – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ . *విశాఖపట్నం డిసెంబర్ 18పున్నమి ప్రతినిధి*: విశాఖ నగరంలో పలు ప్రాంతాలలో సైకిల్ ట్రాక్ ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జీవీఎంసీ పరిధిలోని ముడసరలోవ, రాడిసన్ బ్లూ నుండి సాగర్ నగర్ తదితర ప్రాంతాలలో జీవీఎంసీ ప్రధాన ఇంజనీరు సత్యనారాయణ రాజు తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజలకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం ఎంతో అవసరమని అందుకు నగరంలో ముడసరలోవ పార్కు చుట్టూ ఐదు కిలోమీటర్లు, రాడిసన్ బ్లూ హోటల్ సమీప ప్రాంతం నుండి సాగర్ నగర్ బీచ్ సమీప ప్రాంతం వరకు సైకిల్ ట్రాక్ ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. ముడసరలోవ చుట్టూ సైకిల్ ట్రాక్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. బీచ్ రోడ్ లో సబ్మేరియన్ ఎదురుగా గల టియు 142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం సమీపంలో 75 నుండి 100 మీటర్ల లోపు ఒక జాతీయ జెండా ఏర్పాటుకు అంచనాలను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం మధురవాడలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన చేశారు. ఈ పర్యటనలో జీవీఎంసీ పర్యవేక్షక ఇంజనీరు ఏడుకొండలు, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్సెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్- ఏపీ యు ఐ ఏ ఎం ఎల్ ,రీజినల్ హెడ్ చేతన్, జీవీఎంసీ సహాయక ఇంజనీరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు* *రూ.2.5 కోట్లతో సాగర్ నగర్ లో నైట్ ఫుడ్ కోర్టు*

*రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు* *రూ.2.5 కోట్లతో సాగర్ నగర్ లో నైట్ ఫుడ్ కోర్టు* _*విశాఖ డిసెంబర్ 18పున్నమి ప్రతినిధి*:_ జీవీఎంసీ 8 వ వార్డు పరిధిలోని ఎండాడ, రుషికొండ, సాగర్ నగర్, వైఎల్పీ లే అవుట్, పాత మధురవాడ తదితర ప్రాంతాల్లో 7.74 కోట్లతో ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం శంకుస్థాపన చేశారు. వీటిలో రూ.4.28 కోట్లతో 9 రోడ్లు, రూ. కోటితో 4 డ్రెయిన్లు, రూ.38 లక్షలతో 2 పార్కులు, రూ.1.60 కోట్లతో 2 శ్మశాన వాటికలు ఏర్పాటు సహా రూ. 46 లక్షలతో చెరువు అభివృద్ధి పనులు ఉన్నాయి. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలోని 9 జీవీఎంసీ వార్డుల్లో రూ.150 కోట్లకు పైగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఒక్క నవంబరు నెలలోనే రూ.25 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. రూ. 500 కోట్లతో మధురవాడకు మంచినీటి ప్రాజెక్టు.. రూ. 465 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు పనులు తొందర్లోనే ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. సాగర్ నగర్ బీచ్ బ్యూటిఫికేషన్ కోసం రూ.16 కోట్ల ప్రాజెక్టు డిజైన్ చేశామని, అలాగే 2.5 కోట్లతో సాగర్ నగర్ లోనే నైట్ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అభివృద్ధి పనులు వెల్లువలా జరుగుతున్నాయన్నారు. మధురవాడ ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా మారనుందని, కాగ్నిజెంట్, సత్వా, ఫ్లూయాంట్ గ్రిడ్, ఇమేజినేటేవ్ వంటి 9 ఐటీ.. ఐటీ ఆధారిత కంపెనీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఇటీవల శంకుస్థాపన చేశారన్నారు. తొందర్లోనే ఇన్ఫోసిస్, యాక్సెంచర్ పూర్తిస్థాయి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారని, ఐటీ సంస్థలన్నీ అందుబాటులోకి వస్తే దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల మందికి యువతకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు పంచకర్ల సందీప్, కార్పొరేటర్ లొడగల అప్పారావు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, చెట్టిపల్లి సన్యాసిరావు, శాఖారి శ్రీనివాస్, మంగాదేవి, చెట్టిపల్లి గోపీ, దొరబాబు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

గంటా గ్రీవెన్స్ లో ఎమ్మెల్యే కొండ్రు మురళి* *సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి*

*గంటా గ్రీవెన్స్ లో ఎమ్మెల్యే కొండ్రు మురళి* *సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి* _*విశాఖపట్నం డిసెంబర్ 18పున్నమి ప్రతినిధి*:_ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం మధురవాడ జోనల్ ఆఫీస్ లో నిర్వహించిన గ్రీవెన్స్ లో తన సమస్య తెలియజేయడానికి రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. మురళీకి పీఎం పాలెంలో బాబా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (బిట్స్) కాలేజీ ఉంది. దీనికి సమీపంలోని స్మశానం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రీవెన్స్ లో గంటా దృష్టికి మురళీ తీసుకువచ్చారు. స్మశానానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఈ విషయాన్ని పరిశీలించి శ్మశాన వాటికను ప్రత్యామ్నాయ స్థలానికి మార్చే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులకు గంటా శ్రీనివాసరావు సూచించారు. ఎండాడ, మధురవాడ తదితర ప్రాంతాల్లో బడ్డీలు తొలగించడం వల్ల 20 ఏళ్ల నుంచి ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తూ వినతి పత్రాన్ని అందించారు. డ్రెయిన్లు, రోడ్లు కావాలని.. స్మశానాన్ని అభివృద్ధి చేయాలని.. తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాలని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కోరారు. కార్యక్రమంలో ఇంచార్జ్ జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, చిక్కాల విజయ్ బాబు, కార్పొరేటర్లు లొడగల అప్పారావు, పిల్లా మంగమ్మ, మొల్లి హేమలత, పి.వి.నరసింహం, జీవీఎంసీ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

కేంద్రం జాతీయ ఉపాధి హామి పథకం పేరు మార్చడం పై నిరసన : కాంగ్రెస్*

*కేంద్రం జాతీయ ఉపాధి హామి పథకం పేరు మార్చడం పై నిరసన : కాంగ్రెస్* *విశాఖపట్నం డిసెంబర్ 18 పున్నమి ప్రతినిధి* మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం యూ పి ఏ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం దేశంలో పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడిందని, అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేస్తూ జాతి పిత మహాత్మా గాంధీ పేరు తొలగించడం అన్యాయం అని విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు ఎల్ ఎన్ హాసిని వర్మ అన్నారు. మాజీ ఇంచార్జ్ డీసీసీ వజపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో మహాత్ముల పేర్లు బీజేపీ ప్రభుత్వం చూసి తట్టుకోలేకపోతోందని ఆయన అన్నారు. రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్ మాట్లాడుతూ ఉపాధి హామి పథకం పై కుట్రలు తగవని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరు మార్చడమే కాకుండా గత కొంత కాలంగా నిధులు కోత విదిస్తున్నారని, ప్రస్తుతం తీసుకువచ్చిన సవరణలో దేశ వ్యాప్తంగా సుమారు 30 వేల కోట్లు పథకానికి కోత విధించునున్నారని, అందులో ఆంధ్రప్రదేశ్ కి 3 వేల నుండి 5 వేల వరకు పేరు మార్చి సవరణ చేసిన కొత్త కే వి జీ రామ్ జీ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం భారం పెంచనుందని, అందరు పేరు మాత్రమే మార్చారని అనుకుంటున్నారని, పేరుతో రాజకీయం చేసి, అందరిని పేరు చుట్టూ చర్చలో తిప్పి పెద్ద ఎత్తున ఈ పథకంలో నిధుల కోత పెట్టడమే కేంద్ర ప్రభుత్వం కుట్ర అని ప్రియాంక అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాండవ గాయత్రి,జిల్లా ఎస్ సి సెల్ చైర్మన్ పద్మిని చంద్రశేఖర్,పీసీసీ మెంబెర్ వై ఎస్ జగన్,దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ కే వి సూర్యనారాయణ,భీమిలి ఇంచార్జ్ రామకృష్ణ, గాజువాక మాజీ కన్వీనర్ గవర వెంకటరమణ, సీనియర్ నాయకులు గుత్తుల శ్రీనివాస్, జర్రిపోతుల ముత్యాలనాయుడు, ఉమ్మిడి భాస్కర్,సేవాదళ్ జాతీయ కార్యదర్శి గంగాధర్, ఫర్వీన్ ఖాన్,అప్పారావు, మోహన్, వేమూరి సురేష్,డా.విజయ్ చంద్రా,బాషా, అక్రమాని రమణ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

కేజీహెచ్ లో పేద రోగులకు దుప్పట్ల పంపిణీ.

కేజీహెచ్ లో పేద రోగులకు దుప్పట్ల పంపిణీ………. *విశాఖపట్నం డిసెంబర్ 18 పున్నమి ప్రతినిధి* విషయంలోకి వెళ్తే కింగ్ చార్జి ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది అందరూ నర్సస్ క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నిరుపేద రోగులకు మరియు సేవా వార్డు లో అనాధ రోగులకు చలి రగ్గులను అందించడం జరిగినది. ఈ ఒక్క కార్యక్రమం కింగ్ జార్జ్ ఆసుపత్రి గౌరవ సూపర్నెంట్ గారు శ్రీమతి డాక్టర్ ఐ వాణి ఆధ్వర్యంలో జరుపబడినది. ఈ యొక్క కార్యక్రమం లో డిప్యూటీ సూపర్నెంట్ రాధాకృష్ణ గారు, డాక్టర్ శ్రీహరి గారు సి.ఎస్.ఆర్.ఓ గారు, గ్రేడ్ వన్ నర్సింగ సూపర్డెంట్ శ్రీమతి పద్మావతి గారు, ఏపీ గవర్నమెంట్ నర్సస్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీమతి భవాని శ్రీమతి వరలక్ష్మి కేజీహెచ్ నర్సింగ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది

అమరావతి

ముగిసిన రెండు రోజుల 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్*

*అమరావతి డిసెంబర్ 18 విశాఖ పున్నమి ప్రతినిధి* *ముగిసిన రెండు రోజుల 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్* • రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివిధ అంశాలపై అర్థవంతమైన చర్చలు. • స్పీడ్ ఆఫ్ డెవలిరింగ్ గవర్నెన్స్ విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం. • నెంబర్లు నమ్మను… ఆకస్మిక తనిఖీలకు వెళ్తానని కలెక్టర్ల కాన్ఫరెన్సులో స్పష్టం చేసిన చంద్రబాబు. • ప్రజల సంతృప్తే అధికారుల పనితీరుకు కొలమానమన్న ముఖ్యమంత్రి. • ఏప్రిల్ నుంచి సంక్షేమ క్యాలెండర్ అమలు చేయాలని నిర్ణయం. • కేంద్ర నిధులను ఖర్చు చేయడంతోపాటు… అదనంగా రూ. 5 వేల కోట్లు రాబట్టేలా ఫోకస్ చేయాలని సీఎం సూచన. • ఉత్తమ పద్దతులు అవలంభించిన ఆరు జిల్లాల కలెక్టర్లతో తొలి సారిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్. • ఆరు ఉత్తమ పద్దతులను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశం. • 22ఏ భూముల పరిష్కారానికి టార్గెట్ పెట్టుకుని పని చేయాలని కలెక్టర్లకు ఆదేశం. • 22ఏ భూములను అడ్డం పెట్టుకుని వివాదాలు సృష్టించే వాళ్లపై పీడీ యాక్ట్ పెట్టాలని సీఎం స్పష్టీకరణ. • ఏపీఐఐసీకి చెందిన 82 వేల ఎకరాల భూములకు 22ఏ నుంచి విముక్తి కలిగించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు. • విశాఖ పరిసర ప్రాంతాల్లోని కొంత మంది రాజకీయ నేతలు భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని సీఎం దృష్టికి తెచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. • భూ వివాదాల్లో రాజకీయ జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దని జిలా కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశం. • పట్టాదారు పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను ఇకపై కొరియర్ ద్వారానే యాజమానులకు చేర్చాలని ముఖ్యమంత్రి ఆదేశం. • ఉగాది నాటికి ఫ్యామిలీ కార్డ్ జారీ, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. • జీరో సూసైడ్స్ లక్ష్యంగా రైతులు, విద్యార్థులు, ఒత్తిడిలో ఉన్న కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచన. • ఈ నెల 28వ తేదీ నుంచి అన్ని పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమం అమలు చేయాలని సీఎం ఆదేశం. • రాష్ట్రంలో కాంట్రాక్ట్ పనులు చేస్తూ… ఇతర రాష్ట్రాల నుంచి పెట్రోల్, డిజీల్ సహా ఇతర పరికరాలను కొనుగోలు చేయకుండా చూసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ. • ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు అత్యవసరంగా గైడ్ లైన్స్ ఇవ్వాలని ఆదేశించిన చంద్రబాబు. • శాంతి భద్రతల సమీక్షలో సీఎం చంద్రబాబు సంచలన ఆదేశాలు. • నోటోరియస్ రౌడీలను రాష్ట్ర బహిష్కరణ చేయాలని పోలీస్ శాఖకు ఆదేశం. • అసంబద్దంగా చలానాలు వేసి ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని పోలీసులకు సీఎం సూచన. • సోషల్ మీడియాలో జరిగే ఫేక్ ప్రచారాలు, వ్యక్తిత్వ హననాలపై చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి. • ఈ మేరకు మంత్రివర్గ ఉప సంఘంతోపాటు… పోలీసులు, నిపుణులతో కూడిన బృందం ఏర్పాటు చేయాలని సూచన. • కన్విక్షిన్ రేటు పెరగాలి… క్రైమ్ రేటు తగ్గాలని చంద్రబాబు సూచన. • తీర భద్రతకు తక్షణం బోట్లు కొనుగోలు చేయాలని ఆదేశం. • వచ్చే సమావేశం నాటికి జిల్లాలోని టాప్-3 నేరాలను ఏ విధంగా కట్టడి చేశారనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలన్న ముఖ్యమంత్రి. • ముఖ్యమంత్రికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎకనమిక్ టైమ్స్ ప్రకటించడంపై అభినందనలు తెలిపిన కలెక్టర్లు, హెచ్‌ఓడీలు, మంత్రులు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.