Wednesday, 29 April 2026

Blog

తిరుపతి

ఆలయానికి ఔషదాలు మంచినీటి బాటల్స్ వితరణచేసిన ఆర్య వైశ్య సంఘం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 13: శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా శ్రీ కాళహస్తి కెమిస్ట్రీ ఆండ్ డ్రగ్గిస్ట్ అసోషియేషన్, ఆర్య వైశ్య సంఘం తరపున మెడిసిన్, వాటర్‌ బాటల్స్ ను స్తానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బృందమ్మ, సతీమణి బొజ్జల రీషితా రెడ్డి చేతుల మీదుగా ఆలయ ఆవరణలో ఆలయ డిప్యూటీ ఇ.ఒ ఎన్ ఆర్ కృష్ణా రెడ్డికి అందజేశారు.

తిరుపతి

పేద కుటుంబానికి ఆసరాగ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 13: శ్రీకాళహస్తి తపాలా శాఖలో బీమా తీసుకోవడం వలన పేద కుటుంబాన్ని ఆదుకున్న సంఘటన చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి సబ్ డివిజన్ తపాలా శాఖ ఐపీఓ బాలాజీ కథనం వివరాలు అకస్మాత్తుగా పాలసీదారుడు మరణించడంతో ఓ పేద కుటుంబానికి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పిఎల్ఐ) ఆదుకుంది. శ్రీకాళహస్తి పట్టణంలోని బంగారమ్మ గుడి కాలనీకి చెందిన వి వెంకటాద్రి తపాలా శాఖలో జూలై 22వ సంవత్సరంలో 20 లక్షలు పాలసీ తీసుకున్నాడు. ఏడాదికి రూ. 1,28,040 చొప్పున రెండు సంవత్సరాలు రూ. 2,56,080 లక్షలు ప్రీమియం చెల్లించాడు. అయితే అతను అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ నేపథ్యంలో అతని భార్య పిల్లలు అయోమయ స్థితిలోకి వెళ్లిపోయారు. జీవనం గడవడం కూడా కష్టతరంగా మారింది. శ్రీకాళహస్తి సబ్ డివిజన్ తపాలా శాఖ ఐపీఓ బాలాజీ, శ్రీకాళహస్తి హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్మాస్టర్ రాంబాబు మృతిని భార్య అలేఖ్యకు శ్రీకాళహస్తి తపాలా శాఖ కార్యాలయంలో శుక్రవారం నాడు రూ. 23,02,001 లక్షల బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మృతుడు భార్య అలేఖ్య మాట్లాడుతూ.. తమ భర్త తపాలా శాఖలో పాలసీ వేయడం వలన నేడు తమ కుటుంబానికి ఎంతో ఆసరాగా తోడ్పడిందని ఆమె తెలిపారు. అనంతరం తపాలా శాఖ ఐపీఓ బాలాజీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తపాలా శాఖలో పి ఎల్ ఐ కానీ ఆర్ పి ఎల్ ఐ బీమా తీసుకోవడం వలన వారి కుటుంబానికి అండగా ఉంటుందని గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రజలు తమ గ్రామాల్లో ఉన్న బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో తమ సిబ్బందిని కలిస్తే పూర్తి సమాచారం అందిస్తారని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

తిరుపతి

భక్తుల సేవలో జనసేన- లక్ష నీటి బాటిళ్లను అందజేసిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అజయ్

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 13: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం జనసేన పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అజయ్ భారీ విరాళంతో ముందుకొచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆయన లక్ష (1,00,000) మంచినీటి బాటిళ్లను ఈ మంచినీటి బాటిళ్లను శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్కి అజయ్ విరాళంగా అందజేశారు. దాతలసేవలుఅభినందనీయం-ఆలయచైర్మన్: ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. ఇంత భారీ స్థాయిలో భక్తుల కోసం మంచినీటి సౌకర్యం కల్పించిన అజయ్ ని, జనసేన నాయకులను మనస్ఫూర్తిగా అభినందించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, ఇలాంటి దాతల సహకారం మరింత స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సేవా కార్యక్రమాన్ని భక్తులు, స్థానికులు కొనియాడారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో శివమణి సంగీత విన్యాసానికి మంత్రముగ్దులైన భక్తులు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 13: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడించాయి. ప్రఖ్యాత డ్రమ్స్ వాయిద్య కళాకారుడు శివమణి తన అద్భుత ప్రదర్శనతో క్షేత్రాన్ని హోరెత్తించారు. శివతత్వాన్ని ప్రతిబింబించేలా ఆయన సాగించిన వాయిద్య విన్యాసాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. తనదైన శైలిలో డ్రమ్స్ వాయిస్తూ, సంగీతంతో శివనామ స్మరణను ప్రతిధ్వనింపజేసిన శివమణి ప్రదర్శన ఈ వేడుకలకే ప్రత్యేకంగా నిలిచింది. ప్రదర్శన అనంతరం శివమణిని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, బొజ్జల బృందమ్మ, బొజ్జల రిషితా రెడ్డి ఘనంగా సన్మానించారు. వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల జ్ఞాపికను అందజేసి, దుశ్శాలువతో కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…..శివమణి వంటి గొప్ప కళాకారులు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం సంతోషకరమని, వారి సంగీతం భక్తులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, బోర్డు సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తిరుపతి

ఆది దంపతుల గిరి ప్రదక్షిణకు నూతన శోభ-వర్చువల్‌గా ప్రారంభించిన పవన్ కళ్యాణ్

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 13: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్తుల కల నెరవేరింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా, కైలాసగిరి చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసేందుకు వీలుగా సుమారు ₹10 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన గిరి ప్రదక్షిణ రోడ్డును శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలసి అయన చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభింజేయడం జరిగినది. ఉప ముఖ్యమంత్రి అమరావతి నుండి వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి భక్తులకు ఈ మార్గాన్ని అంకితం చేశారు. శ్రీకాళహస్తిలో ఏటా రెండుసార్లు జరిగే గిరి ప్రదక్షిణలో కొండచుట్టు లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. గతంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ, భక్తుల సౌకర్యార్థం ఈ 22 కిలోమీటర్ల మార్గాన్ని ఆధునీకరించారు. ఈ నూతన రోడ్డు వల్ల శివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు గిరి ప్రదక్షిణ సులభతరం కానుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ హరి ప్రసాద్, మాజీ చైర్మన్ కోలా ఆనంద్‌, మార్కెట్ కమిటి చైర్మన్ రంగినేని చెంచయ్య నాయడు, పాలక మండలి సభ్యులు, కూటమి నాయకులు, జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

​నందిపాడు సెంటర్‌లో ‘సోలార్’ వెలుగులు: ప్రయాణికులకు తప్పిన చీకటి కష్టాలు ​

దుత్తలూరు 13-2-2026 ​నందిపాడు (NH 565) జాతీయ రహదారి 565 పై గల నందిపాడు సెంటర్ ఇప్పుడు సోలార్ వెలుగులతో మెరిసిపోతోంది. గత కొంతకాలంగా రాత్రి వేళల్లో సరైన వెలుతురు లేక ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, స్థానికుల సౌకర్యార్థంనేషనల్ హైవే అధికారులు నందిపాడు సెంటర్లో సుమారు ఒక కిలోమీటర్ సోలార్ వీధి దీపాలను రోడ్డు కి ఇరువైపులా ఏర్పాటు చేశారు, రాత్రి సమయాల్లో ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ జంక్షన్‌లో, సోలార్ లైట్ల ఏర్పాటుతో వాహనదారులకు స్పష్టమైన మార్గం కనిపిస్తోంది, కరెంట్ఆదా చేయడంతో పాటు, పర్యావరణానికి మేలు చేసే విధంగా ఈ సోలార్ వ్యవస్థను రూపొందించారు. ​నందిపాడు చుట్టుపక్కల వ్యాపారస్తులు మరియు రాత్రి వేళల్లో నడిచే పాదచారులు ఈ మార్పు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ​గతంలో చీకటి కారణంగా మలుపుల వద్ద ఇబ్బందులు, ఆక్సిడెంట్ లు జరిగేవి, ఇప్పుడు ఆధునిక సోలార్ లైట్ల వల్ల రాత్రి పూట కూడా పగలులా వెలుతురు ఉండటం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ రహదారి వెంబడి మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి వెలుగులు నింపాలని ప్రజలు కోరుతున్నారు.

తూర్పు గోదావరి

యజమానికి తెలియకుండా పొలం కంచె లోని చెట్లు ధ్వంసం చేసిన ప్రైవేట్ కాంట్రాక్టర్

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంపురం మండలం భీమోలు గ్రామం లో గల రెడ్డి శ్రీరామ్ వెంకట్రావు గారు మరియు రెడ్డి శ్రీహరి గారు పొలంలో నుంచి ఎలక్ట్రికల్ లైను కొరకు ప్రైవేట్ కాంట్రాక్టర్ ప్రసాద్ అనేవ్యక్తి సదరు చేనుగల యజమానికి తెలియపరచకుండా చేలోని పెద్దపెద్ద ( 20 సంవత్సరాల) వేపచ్చేట్లు 50 సంవత్సరాల పెద్ద కుంకుడు చెట్లు జేసీబీ తో లైన్ వేయడానికి అడ్డురాని చెట్లను కూడా పాడుచేయ్యడం జరిగిందని కాంట్రాక్టర్ చేను కంచెలో ఉన్నటువంటి పలు రకాల అడవి జాతి మొక్కలను సైతం నరికివేసాడని రైతు అవేదన వ్యక్తం చేస్తున్నాడు ఈ విషయం పై తగుచర్య తీసుకోవలసిందిగా పై అధికారులకి పిర్యాదు చేసానని రైతు తెలియజేయడం జరిగింది. చెట్లు పాడుచేసిన విషయం తెలేదాకా ఎటువంటి వైర్ లు లాగవద్దని కోరడం జరిగింది END Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రమాదాల నివారణకు కీలక అడుగు: మనుబోలు హైవేలో లైటింగ్ ఏర్పాటు”

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో రోడ్డు భద్రతకు చర్యలు చేపట్టారు. ఎస్ఐ శివ రాకేష్ ఆధ్వర్యంలో మనుబోలు హైవే కూడలి వద్ద టోల్ ప్లాజా సిబ్బంది సహకారంతో ప్రమాదాలకు కారణమయ్యే ప్రతి కూడలి వద్ద ఎలక్ట్రికల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. పై అధికారుల సూచనల మేరకు ఈ ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో టోల్ ప్లాజా అసిస్టెంట్ మేనేజర్ మునయ్య పాల్గొన్నారు. ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

E-పేపర్

ఎన్నో ఏండ్ల నుండి నీళ్లు రాక, బోరు లేక నీళ్ల సమస్యతో బాధ పడుతున్న 9వ వార్డు ప్రజలు నీళ్ల సమస్య తీర్చిన *వార్డు సభ్యులు ఆలంపల్లి* *మహేష్*

పున్నమి న్యూస్ ప్రతినిధి 13 ఫిబ్రవరి 2026 ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పని చేసే పార్టీ ఒక్క ఎర్రజెండానే(సిపిఎం) అని నిరూపించావ్.. “ఎన్నో ఏండ్ల నుండి నీళ్లు రాక, బోరు లేక నీళ్ల సమస్యతో బాధ పడుతున్న 9వ వార్డు ప్రజలు నీళ్ల సమస్య గురించి తమ *వార్డు సభ్యులు ఆలంపల్లి* *మహేష్* దృష్టికి తీసుకురాగా.. ప్రజా సేవలో భాగంగా, ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కారం కోసం ఆ వార్డుకు సంబందించి బోరు వేయించడం జరిగింది….వాళ్ళ కష్టం చూడలేక ఆ భూతల్లి కూడా కరుణించి నీళ్లు పడటం జరిగింది… ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చిన *”9వ* *వార్డు సభ్యులు ఆలంపల్లి మహేష్”* ( *సిపిఎం* *యువనాయకులు)* ప్రత్యేక ధన్యవాదములు .ఈ కార్యక్రమానికి సహకరించిన *6వ వార్డు సభ్యులు అండెకర్* *అనిల్* , *11వ వార్డు సభ్యులు* *వంగూరి మనోహర w/o* *జంగయ్య* *, 12 వార్డు సభ్యులు బూర సురేందర్* మరియు గ్రామ పెద్దల అందరికి ధన్యవాదములు…..ఇలాంటి సేవలు మన గ్రామానికి చాలా అవసరం…

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఫలితాలు: కాంగ్రెస్ ఆధిక్యం

ఖమ్మం, ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) ఖమ్మం జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పలు పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. విడుదలైన గణాంకాల ప్రకారం ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. ఎదులాపురం (32/32): కాంగ్రెస్ – 24, బీఆర్‌ఎస్ – 2, ఇతరులు – 6 వైరా (20/20): కాంగ్రెస్ – 12, బీఆర్‌ఎస్ – 5, ఇతరులు – 3 మధిర (22/22): కాంగ్రెస్ – 18, బీఆర్‌ఎస్ – 1, ఇతరులు – 3 కల్లూరు (20/20): కాంగ్రెస్ – 12, బీఆర్‌ఎస్ – 7, ఇతరులు – 1 సత్తుపల్లి (23/23): కాంగ్రెస్ – 17, బీఆర్‌ఎస్ – 6 ఈ ఫలితాలతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని మరింత బలోపేతం చేసుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా ఎదులాపురం, మధిర వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ గణనీయమైన మెజారిటీ సాధించడం గమనార్హం. ఇక బీఆర్‌ఎస్ పార్టీ కొన్ని పట్టణాల్లో పరిమిత స్థానాలకే పరిమితమైంది. ఇతరులు కూడా కొన్ని వార్డుల్లో విజయాలు నమోదు చేసుకున్నారు. ఈ ఐదు మున్సిపాలిటీలో బీజేపీ ఖాతా తెరవక పోవడం ప్రజల ని విస్మయానికి గురి చేస్తుంది. మొత్తం మీద ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.