Wednesday, 29 April 2026

Blog

తిరుపతి

బాల్య వివాహల నిర్ములన ర్యాలీని ప్రారంభించిన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టే సాయి

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 14: శ్రీకాళహస్తీశ్వరలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ శ్రీకాళహస్తిలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో బాల్య నిర్ములించాలంటూ శ్రీకాళహస్తిలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ భారీ ర్యాలీని సుమారు 200 మంది స్కౌట్స్, గైడ్స్ రోవర్లు, రేంజర్లు ప్ల కార్డులు చేతపట్టుకుని పట్టణ వీధులలో వద్దు.. వద్దు.. బాల్య వివాహలు వద్దు… బాల్యం వయస్సులో పుస్తెల భారం వద్దంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీని రాజగోపురం వద్ద నుండి శ్రీకాళహస్తీశ్వరలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకునే వయస్సులో వివాహలను చేయడం చట్ట రీత్యా నేరమని, వీటికి ప్రోత్సాహంచిన వారిపై కూడా కేసులు నమోదు అవుతాయనన్నారు. స్కౌట్స్ వారు మహశివరాత్రి ఉత్సవాలలో కూడా భక్తులకు సేవలందించాలని అయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమీషనర్లు ఎం ఎం రెడ్డి, టి. రమేష్ బాబు, యూత్ చైర్మన్ అజారుద్దీన్, గైడ్ కెప్టెన్లు, పద్మావతి, నిర్మల, సరిత, స్కౌట్స్ మాస్టర్లు మురళి, సుబ్రహ్మణ్యం, మహేంద్ర, సుబ్రహ్మణ్యం, ధనుష్, మణికంఠ, రోవర్ లీడర్ ఆంజనేయులు, జ్యోతి, మణికంఠ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

నో బ్యాగ్ డే తో విద్యా ర్థులు రోజంతా ఉత్సాహం

తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 14: తొట్టంబేడు మండలంలో శనివారం నాడు నో బ్యాగ్ డే సందర్భంగా దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో విద్యార్థులు ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం సహకారంతో చార్టులతో టోపీలు, కిరీటాలు, శివరాత్రి పురస్కరించుకుని మట్టితో శివలింగాన్ని తయారు చేసారు. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ…ప్రతి శనివారం నో బ్యాగ్ డే వలన విద్యార్థులలో సృజనాత్మకత అభివృద్ధి చెందుతుందని, ప్రత్యక్షంగా బొమ్మలు తయారు చేయడం వలన వారిలో నైపుణ్యాలు మెరుగు పడతాయని అన్నారు. విద్యా ర్థులు రోజంతా ఆట, పాటలతో ఉత్సాహంగా గడిపారన్నారు.

తిరుపతి

హంస, చిలుక వాహనాలపై శ్రీకాళహస్తీశ్వరుడి చిద్విలాసం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 13: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదవ రోజుకు చేరుకోవడంతో క్షేత్రంలో భక్తి పారవశ్యం అంబరాన్నంటింది. శనివారం నాడు ఉదయం జరిగిన ఉత్సవంలో భాగంగా ఆది దంపతులైన శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ దేవి అత్యంత శోభాయమానంగా అలంకరించిన హంస మరియు చిలుక వాహనాలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. వైభవంగా వాహన సేవ: ఉదయం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ వాహన సేవ ప్రారంభమైంది. స్వామి వారు జ్ఞానానికి ప్రతీక అయిన హంస వాహనంపై, అమ్మవారు ప్రేమకు చిహ్నమైన చిలుక వాహనంపై అధిష్టించి పురవీధుల్లో విహరించారు. ఈ దివ్య దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శివనామ స్మరణతో మాడవీధులన్నీ మారుమోగిపోయాయి. భక్తుల కోలాహలం: ముస్తాబైన పురవీధుల్లో కోలాటాలు, భజన బృందాల ప్రదర్శనలు ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. దర్శనం కోసం వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ, తాగునీటి సౌకర్యాలను కల్పించారు. ముగిసిన రావణ వాహన సేవ: అంతకుముందు నాలుగవ రోజు రాత్రి స్వామి వారు రావణ వాహనంపై, అమ్మవారు మయూర వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రేపు (ఫిబ్రవరి 15) మహాశివరాత్రి కావడంతో ఆలయం వద్ద భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

కడప

కడప: పోలీసులుగా చలామణి అవుతూ మోసం

కడప చిన్నచౌక్ పోలీసులు ఆన్లైన్లో POLO. WALLA యాప్లతో ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతపురానికి చెందిన చదువుల కుమార్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులుగా నటిస్తూ కేసులు పెట్టిస్తామని బెదిరించి. కేసుల నుంచి బయటపడేయాలంటే డబ్బులు ఇవ్వాలని నమ్మబలికి పలువురి నుంచి నగదు, బంగారం వసూలు చేసినట్లు విచారణలో బయటపడింది. వారి వద్ద రూ.4.5 లక్షల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

E-పేపర్

మేడిపల్లి నక్కర్త గ్రామంలో పురాతన శివాలయంను పునః ప్రారంభం

మేడిపల్లి నక్కర్త గ్రామంలో పురాతన శివాలయంను పునః ప్రారంభం పున్నమి న్యూస్ ప్రతినిధి 14 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త గ్రామంలో పురాతన శివాలయంను పునః ప్రారంభించాలని ఉద్దేశంతో గ్రామంలో శివాలయాన్ని భక్తుల, గ్రామస్తుల కోరిక మేరకు గత వారం రోజుల క్రితం సర్వే నిమిత్తం (ఎం ర్ ఓ )కి శివాలయ భూమిని గుడికి మాత్రమే చెందాలని ఉద్దేశంతో “సర్పంచ్ ముచ్చర్ల సుగుణ సంపత్” ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యుల నిర్ణయ మేరకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.నిన్న గ్రామ సర్పంచ్ వెంటనే గుడిని సందర్శి రేపు జరగబోయే మహాశివరాత్రి సందర్భంగా గ్రామంలో ఉన్న శివాలయాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకోవడానికి గ్రామస్తులందరి కోరిక మేరకు ఆ గుడిని శుభ్రం చేసి మరియు గుడి చుట్టూ ముట్టు (జేసీబీ,)సహాయంతో చెట్లు, రాళ్ళను తొలగించి మహాశివరాత్రికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా పనులు మొదలుపెట్టిన గ్రామ సర్పంచ్ .ఈ కార్యక్రమానికి సహకరించిన ఉపసర్పంచ్ దెంది మధుకర్ రెడ్డి మరియు పాల్గొన్న నూతన వార్డు సభ్యులు,మాజీ ప్రజా ప్రతినిధులకు,మాజీ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు అందరికీ ధన్యవాదములు.

తిరుపతి

మహాశివరాత్రి ఉత్సవాలకు శైవ క్షేత్రాలు సిద్ధం , పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబైన శివాలయాలు.

శివాలయాలను పరిశీలించిన డీఎస్పీ బి ప్రసాద్ రామచంద్రపురం , పున్నమి ప్రతినిధి మహాశివరాత్రి ఉత్సవాలకు శివాలయాలను నిర్వాహకులు అన్ని హంగులతో ముస్తాబు చేసి సర్వం సిద్ధం చేశారు. మండలంలోని రాయల చెరువు కట్ట కింద ఉన్న శ్రీ జలకన్టేశ్వర స్వామి, శ్రీ కామాక్షి సమేత కోటి లింగేశ్వర స్వామి, అనుపల్లి సమీపంలో ఉన్న జన్మస్థల శివాలయం, బుగ్గ మల్లేశ్వర స్వామి, పార కాలవ సమీపంలోని నవ జ్యోతి పీఠం శివాలయాలను పచ్చని పందిళ్లు, మామిడి తోరణాలు, పుష్పాలు, విద్యుపాలంకరణలతో నిర్వాహకులు సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆదివారం వేకువ జామున నాలుగు గంటలకు సుప్రభాత, రుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించి అనంతరం శ్రీ భవాని జలకంటేశ్వర స్వామి, శ్రీ కామాక్షి సమేత కోటిలింగేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక అలంకరణ చేసి సిద్ధ పూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం భక్తులకు లింగోద్భవ దర్శనం కల్పించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆలయ కళ్యాణ మండపంలో శ్రీ కామాక్షి సమేత కోటిలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం, సాయంత్రం 5గంటలకు శ్రీ భవాని జలకంఠేశ్వర స్వామివార్లకు కళ్యాణోత్సవం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. రాత్రి 7 గంటల నుండి ఆలయ ప్రాంగణంలో భరతనాట్యం, హరికథ కాలక్షేపాలు, 8 గంటలకు అన్నదాన కార్యక్రమాలు, రాత్రి 9 గంటలకు శ్రీ వెంకటేశ్వర నాటికల మండల వారిచే ద్రౌపదీ మాన సంరక్షణ అనే పౌరాణిక నాటకం ప్రదర్శించబడుతుందని గ్రామస్తులు తెలిపారు. శివాలయాల వద్ద ఏర్పాట్లను చంద్రగిరి డిఎస్పి బి ప్రసాద్, సిఐ సురేష్ కుమార్, ఎస్సై భక్తవత్సలం పరిశీలించి, ఆధ్యాత్మిక దైవచింతనతో శివరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. శివాలయాల వద్ద పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని డి.ఎస్.పి ప్రసాద్ తెలిపారు. ఫోటో రైట్ అప్ 1. శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన రాయల చెరువు కట్ట కింద ఉన్న శ్రీ భవాని జలకన్టేశ్వర స్వామి ఆలయం

కడప

ప్రొద్దుటూరులో కూటమి నాయకుల సంబరాలు

కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు నియోజవర్గం టిడిపి కార్యాలయం నందు నాని కాలేజ్ 70 కోట్ల రూపాయలు విడుదల చేశారు ప్రకటించిన విషయమై కూటమి ప్రభుత్వం నాయకులు సంబరాలు. ఈ కార్యక్రమంలో టిడిపి బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని టిడిపి ప్రభుత్వానికి నంద్యాల వరదరా రెడ్డి గారికి ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ గారికి జేజేలు పలుకుతూ సంబరాలు చేశారు.

పల్నాడు

అనుపు నుంచి ఏలేశ్వర గట్టుకు ప్రత్యేక లాంచీలు

మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు వెసులుబాటు యూనిట్ మేనేజర్ మస్తాన్ యాదవ్ వెల్లడి ————————————– మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగార్జునసాగర్ సమీపంలోని అనుపు నుంచి ఏలేశ్వర గట్టు మల్లికార్జున స్వామి దేవాలయానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక లాంచీ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు లాంచీ స్టేషన్ యూనిట్ మేనేజర్ మస్తాన్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీ ఆదివారం శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచే ప్రారంభం.. లాంచీలు ఆదివారం ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని మేనేజర్ తెలిపారు. భక్తులు సురక్షితంగా గట్టుకు చేరుకుని స్వామివారిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. టికెట్ ధరల వివరాలు: ప్రయాణ ఛార్జీల విషయానికొస్తే.. పెద్దలకు రూ. 200, పిల్లలకు రూ. 150 గా నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఏలేశ్వర గట్టుకు వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఖమ్మం

బీఆర్ఎస్ అధ్యక్షులు పగడాల నాగరాజు ని పరామర్శించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) ఖమ్మం జిల్లా జైలులో భారత రాష్ట్ర సమితి ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం పరామర్శించారు. ఇటీవల జరిగిన నిరసన ధర్నా కార్యక్రమంలో అరెస్ట్ అయిన నాగరాజు 14 రోజులుగా రిమాండ్‌లో ఉండగా, త్వరలో బెయిల్ వచ్చే అవకాశం ఉందని ధైర్యంగా ఉండాలని నాగరాజు కి పువ్వాడ అజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూరాకుల నాఘభూషణం, RJC కృష్ణ, మక్బుల్, భీరెడ్డి నాగచంద్రారెడ్డి, బచ్చు విజయ్ కుమార్, బిక్కసాని జస్వంత్, బత్తుల మురళి, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

Featured

రీ–రిలీజ్ హడావిడి… మళ్లీ థియేటర్లలోకి మహేశ్ మాజిక్!

Athadu (2005), దర్శకత్వం Trivikram Srinivas, నటుడు Mahesh Babu ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం టీవీ ప్రసారాల్లో రికార్డు స్థాయికి చేరింది. వెయ్యికిపైగా సార్లు టెలికాస్ట్ అయ్యిందనే ప్రచారం మధ్య, ఇప్పుడు 4K, డాల్బీ సౌండ్‌తో ఈ నెల 28న రీ–రిలీజ్ కానుంది. యాక్షన్, కామెడీ, ఎమోషన్ మేళవింపుతో కథ ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటోంది. త్రిషతో కెమిస్ట్రీ, డైలాగుల మెరుపులు ప్రత్యేక ఆకర్షణ. ఎన్నిసార్లు చూసినా బోర్ రానీయని ఈ క్లాసిక్, థియేటర్లలో మళ్లీ అదే మాయ చూపిస్తుందా అన్నదే ఆసక్తి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.