Saturday, 14 March 2026

Blog

వనపర్తి

నూతన సర్పంచు గారిని ఘనంగా సన్మానించిన మామిడిమాడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం

*నూతన సర్పంచ్ గారిని ఘనంగా సన్మానిస్తున్న మామిడిమాడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 22 /12/ 2025* *ఇటీవలే గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజేతగా నిలిచిన మామిడి మాడ గ్రామ సర్పంచిగా బాల్ లింగం శెట్టి గారిని ఈరోజు గ్రామపంచాయతీ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన సన్మాన మహోత్సవ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప మరియు రవిశంకర్ ఎం ఎన్ విజయకుమార్ ఉపాధ్యాయ బృందం వారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి మౌలిక వసతులు ఏర్పాటుకు గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ అందరూ సహాయ సహకారాలు అందించి పాఠశాల విద్యాభివృద్ధికి తోడ్పడాలని వారు నూతన సర్పంచిని ఉద్దేశించి మాట్లాడారు మున్ముందు పాఠశాల అభివృద్ధికి సహకారాలు అందించాలని వారు ఈ సందర్భంగా కోరారు*

ఖమ్మం

కిష్టాపురం ఘటనపై కాంగ్రెస్ గుండాల వైఖరిని ఖండించిన బీజేపీ నేతలు

ఖమ్మం డిసెంబర్ పున్నమి ప్రతి నిధి స్థానిక పంచాయతీ ఎన్నికల సందర్భంగా కిష్టాపురంలో కాంగ్రెస్ పంచాయతీ అభ్యర్థి, బీజేపీ కారణంగానే తాను ఓడిపోయానని ఆక్రోశంతో భారతీయ జనతా పార్టీ నాయకులు జోగారావు గారి పై దాడి చేయడం దుర్మార్గమని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో గాయపడిన జోగారావు గారిని బీజేపీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు తగు విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావు లేదని, రాజకీయ భేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయుడు రాఘవరావు, వీరం రాజు, ఈవి రమేష్, శాలి శివ సుదర్శన్ మిశ్రతో పాటు భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అటల్ దివస్ – సుపరిపాలన దిన వారోత్సవాలకు ఘన ఏర్పాట్లు

భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా అటల్ దివస్–సుపరిపాలన దిన వారోత్సవాలను విజయవంతం చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది. రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాలతో జిల్లాలో ఫైవ్‌మెన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ముక్కు రాధాకృష్ణ గౌడ్, యశ్వంత్ సింగ్, సన్నీ గంటి శీనయ్య, కంది మల్లికార్జున రెడ్డి, ఉల్లం శరత్ పాల్గొన్నారు. డిసెంబర్ 25–31 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

వనపర్తి

*ఘనంగా గణిత దినోత్సవం*

*మామిడి మాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఘనంగా గణిత దినోత్సవం* *పున్నమి ప్రతినిధి వనపర్తి 22 /12/ 2025* *నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మావిడి మాడయందు గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు మరియు గణిత ఉపాధ్యాయులు ఆనంద్, మెలోడీ మరియు ఉపాధ్యాయ బృందం రవిశంకర్, శ్రీనివాసులు, ఎం ఎన్ విజయ కుమార్, చంద్రశేఖర్, లలిత, షైనీ,పద్మకుమారి, మంజుల,సుమేరా , పావని, మమత, రజనీకాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు* *గణితం పట్ల విద్యార్థులు ఆసక్తిని, జిజ్ఞాసను పెంపొందించుకోవాలని వారి సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు*

వనపర్తి

*ఘనంగా గణిత దినోత్సవం*

*మామిడి మాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఘనంగా గణిత దినోత్సవం* *పున్నమి ప్రతినిధి వనపర్తి 22 /12/ 2025* *నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మావిడి మాడయందు గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు మరియు గణిత ఉపాధ్యాయులు ఆనంద్, మెలోడీ మరియు ఉపాధ్యాయ బృందం రవిశంకర్, శ్రీనివాసులు, ఎం ఎన్ విజయ కుమార్, చంద్రశేఖర్, లలిత, షైనీ,పద్మకుమారి, మంజుల,సుమేరా , పావని, మమత, రజనీకాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు* *గణితం పట్ల విద్యార్థులు ఆసక్తిని, జిజ్ఞాసను పెంపొందించుకోవాలని వారి సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు*

రంగారెడ్డి

*సంస్థాన్ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ని సన్మానించిన సంగిశెట్టి భవాని ధనుంజయ్

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 22 : ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే 3,029 అత్యధిక మెజారిటీలో ఒకటిగా నిలిచి ఘన విజయం సాధించి సంస్థాన్ నారాయణపూర్ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి నీ ఆదివారం వారి నివాసంలో సంగిశెట్టి భవాని ధనుంజయ్ కలిసి శాలువాతో ఘనంగా సన్మానించిన అభినందనలు తెలిపారు

అన్నమయ్య

చిట్వేల్ టౌన్‌లో రేకుల షెడ్ కూలి ప్రమాదం తప్పింది

చిట్వేల్ టౌన్ పాత పోస్టాఫీస్ ఎదుట సోమవారం ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో టిఫిన్ సెంటర్ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతుండగా రేకుల షెడ్ ఒక్కసారిగా కూలిపోయింది. పాత భవనం కావడంతో సన్‌సైడ్ గోడ కూలినట్లు సమాచారం. ఘటన సమయంలో అక్కడ పనులు చేస్తున్నప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. భారీ ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

వనపర్తి

1977- 78 ,10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం చదువులమ్మ ఒడి బడిలో అపూర్వ కలయిక

*ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం చదువులమ్మ చెట్టు నీడలో* *1977 -78 10,వ తరగతి పూర్వ విద్యార్థుల… అపూర్వ సమ్మేళనం..* *పున్నమి ప్రతినిధి పెబ్బేర్ వనపర్తి జిల్లా తేదీ 22/ 12/ 20205* *దాదాపు 70 వసంతాల వయసులో కూడా 1977 -78 సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెబ్బేరు, వనపర్తి జిల్లా యందు జరుపుకోవడం ఆనందదాయకమని నిర్వాహకులు తెలిపారు ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ చదువు చెప్పిన చదువులమ్మ ఒడి గుడి బడి అయినటువంటి ఇక్కడ కలవడం చాలా ఆనందదాయకమని పూర్వ విద్యార్థులు సరళ, హైమావతి, కల్పలత, జి చెన్నమ్మ తెలియజేశారు, కొద్ది బుద్ధిని కృష్ణయ్య, హేమ సుందర్ రెడ్డి, అప్సర్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు శెట్టి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు*

E-పేపర్

ఉసురు తీసిన ‘మధ్యవర్తిత్వ’ అప్పులు

పున్నమి ప్రతినిధి : ఉసురు తీసిన ‘మధ్యవర్తిత్వ’ అప్పులు* *తెలిసిన వారే కదా అని మధ్యవర్తిత్వం వహించి అప్పులిప్పించిన వ్యాపారి చివరకు రుణదాతల వేధింపులు తాళలేక భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు*. *ఈ విషాదం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది*. *రుక్మిణి, శ్రీహర్ష దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు కారణం అయిన వారిని వదిలి పెట్టవద్దని శ్రీ హర్ష తన సుసైడ్ లెటర్ లో పేర్కొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దుత్తలూరు మండల కేంద్రంలోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పోలియో నిరుమూలన కార్యక్రమంలో ఐదు సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో వంటి ప్రమాద కరమైన వ్యాధిని పూర్తిగా నిర్ములిం చాలంటే ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు బాధ్యతగ ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు పోలియో చుక్కలు పిల్లలకు శాశ్వత రక్షణ కల్పించి వారి భవిష్యత్ ను సురక్షితంగా మారుస్తామని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దుత్తలూరు తహశీల్దార్ యనమల నాగరాజు ఎ స్ ఐ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.