Saturday, 14 March 2026

Blog

చిత్తూరు

సీఐని కలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర పాలకమండలి

పలమనేరు అర్బన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ రెడ్డిని సోమవారం పట్టణ మందలి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పాలకమండలి చైర్మన్ మురళీకృష్ణ , వైస్ చైర్మన్ గందోడి మంజునాథ్, పాలక మండలి సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు కుట్టి, పాలకమండలి సభ్యులు రెడ్డప్ప,మోహన ప్రియ, ఎంటిఆర్ ప్రసాద్, వీరప్ప తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

రూ.20 కోట్ల బంగారం డిపాజిట్ కేసులో ఇద్దరు సీనియర్ తెలంగాణ బీజేపీ నాయకులపై కేసు నమోదు

పున్నమి ప్రతినిధి: రూ.20 కోట్ల బంగారం డిపాజిట్ కేసులో ఇద్దరు సీనియర్ తెలంగాణ బీజేపీ నాయకులపై కేసు నమోదు ఉప్పల్‌లోని సిరి గోల్డ్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోసంపూడి రవీంద్ర, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు పెట్టుబడిదారుల నుండి సుమారు రూ. 20 కోట్లు వసూలు చేసి మోసం చేసిన సిరి గోల్డ్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పెట్టుబడి పెడితే రోజువారీ లాభాలు చూపిస్తామని నమ్మించి వేలాది మందితో పెట్టుబడులు పెట్టించిన ప్రమోటర్లు చెప్పినట్లుగా లాభాలు ఇవ్వకుండా, పెట్టుబడులను తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని సంస్థపై ఫిర్యాదు చేసిన బాధితులు BNS సెక్షన్ 316(2) మరియు 318(4) కింద కేసు నమోదు చేశారు, BNS సెక్షన్ 3(5) కింద సీనియర్ బీజేపీ నేతలు కోసంపూడి రవీంద్ర, నెల్లూరు కోటేశ్వరరావుతో పాటు సంస్థ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన CCS పోలీసులు

E-పేపర్

మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు *కొలువు తీరిన కొత్త పాలకవర్గం*

మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు *కొలువు తీరిన కొత్త పాలకవర్గం* రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్: పున్నమి ప్రతినిధి: 23 డిసెంబర్ 2025 మేడిపల్లి నక్కర్త లోని గ్రామ పంచాయతీలలో కొలువు తీరిన కొత్త పాలకవర్గం సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల విరామం తర్వాత గ్రామ పంచాయతీలకు కొత్త పాలకవర్గం ఏర్పడడంతో దీంతో గ్రామాల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీలలో జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను గ్రామాలలో నియమించిన ప్రత్యేక అధికారులచే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను అప్పగించారు. గత పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత, ఎన్నికలు వాయిదా పడటం, సుమారు 22 నెలలుగా పాలకవర్గాలు లేకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు కొత్త పాలకవర్గాల రాకతో ఆశలు చిగురించాయి.

E-పేపర్

జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ ఈ నిర్ణయం

పున్నమి ప్రతినిధి: జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. MPTC, ZPTC ఎన్నికలతో పాటు పలు అంశాలపై ఈ సభలో చర్చించనున్నారు. 42% బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

విశాఖపట్నం

గాజువాక తెలుగు దేశం పార్టీ కార్యాలయం వేదికగా సెమీ క్రిస్మస్ వేడుకలు

గాజువాక డిసెంబర్ (పున్నమి ప్రతినిధి): టీడీపీ క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో ఎపికా గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పిల్లలు నృత్య ప్రదర్శన మరియు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం కేక్ కటింగ్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొండా జగన్, రౌతు శ్రీనివాసరావు, క్రైస్తవ ప్రతినిధులు బిల్లీగ్రామ్, లక్ష్మీనారాయణ, అశోక్ బాబు, మోహన్ రావు, గాజువాక సీఐ పార్థసారథి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చ విజయకుమార్, గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పెంటయ్య, చెరుకూరి నాగేశ్వరరావు, సింగూరి అనంత్, నిర్మల కుమారి, అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

క్రమశిక్షణే పోలీస్ సేవలకు పునాది – 176 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభోత్సవంలో జిల్లా ఎస్పీ డా. అజిత్ వేజెండ్ల

SPS నెల్లూరు జిల్లా క్రమశిక్షణే పోలీస్ జీవితానికి పునాది, శిక్షణ కాలమే భవిష్యత్ సేవలకు ఆధారం-జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,ఐపియస్., గారు • విశాఖపట్నం సిటీ నుండి వచ్చిన 108 మంది, తిరుపతి సిటీ నుండి వచ్చిన 68 మంది, మొత్తం 176 మంది SCPTC లకు 9 నెలల శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి, అనంతరం ఆధునికీకరించిన ఆఫీసు రూమ్, బ్యారక్స్, ఇతర గదులను ప్రారంభించి, ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్స్ (సివిల్) కు మార్గనిర్ధేశం చేసినన జిల్లా యస్.పి. గారు. • ఇది మీ జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం. పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికైనందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. • పోలీస్ యూనిఫారం అందరికీ ఒకేలా ఉంటుంది, అయితే హోదాలు (రాంకులు) భిన్నంగా ఉంటాయి. పోలీస్ చిహ్నం (లోగో) మాత్రం అందరికీ ఒకటే. • పోలీస్ కానిస్టేబుల్ అనేది ప్రజలకు పోలీస్ శాఖతో మొదటి సంప్రదింపు కేంద్రం. పోలీస్ శాఖ ప్రతిష్ఠ ఎక్కువగా కానిస్టేబుల్ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. • * పోలీస్ కానిస్టేబుల్ విధులు కేవలం నేరాల నిరోధకానికి మాత్రమే పరిమితం కావు; ప్రజల శాంతి భద్రతలు, ప్రజా ప్రశాంతత మరియు శాంతి భద్రతల నిర్వహణ కూడా ముఖ్యమైన బాధ్యతలు. • భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత,(BNSS), భారతీయ సాక్ష్య అధినియమం (BSA) మరియు ప్రత్యేక స్థానిక చట్టాలు (SLLs) పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. • కులం, మతం, వర్గం వంటి అన్ని భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలి. • ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత – రెండూ పోలీస్ శాఖ యొక్క ముఖ్యమైన బాధ్యతలు. • మీ వ్యక్తిగత ప్రవర్తన ఎప్పుడూ ప్రజల పరిశీలనలోనే ఉంటుంది. ఒకరి తప్పిదం మొత్తం పోలీస్ శాఖ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది; అదే విధంగా మంచి ప్రవర్తన కూడా శాఖకు మంచి పేరు తీసుకువస్తుంది. • శిక్షణ పొందుతున్న ట్రెయినీలు క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, ధైర్యం వంటి లక్షణాలను జీవితంలో అలవర్చుకోవాలి. • ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు పెద్ద సవాలుగా మారాయని, సాంకేతికతకు అనుగుణంగా శిక్షణ పొందాలని సూచించారు. • శిక్షణార్థుల కోసం అత్యాధునిక కంప్యూటర్, సైబర్ ల్యాబ్‌లు, మెడికల్ సెంటర్‌తో పాటు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. • ట్రైనీ కానిస్టేబుళ్ల సమస్యలు, సూచనల కోసం ‘సజెషన్ బాక్స్’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. • శిక్షణలో ఏ అంశం అర్థం కాకపోతే అధికారులను అడిగి తెలుసుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. • కుటుంబ సహకారం, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. • అదనపు ఎస్పీ అడ్మిన్ (ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్) శ్రీమతి CH.సౌజన్య గారు మాట్లాడుతూ, శిక్షణలో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, వృత్తి నైపుణ్యాల అభివృద్ధి అత్యంత అవసరం. • ఈ కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి CH. సౌజన్య గారు, DPTC DSP శ్రీ గిరిధర్, SB DSP శ్రీ శ్రీనివాసరావు, ఆత్మకూరు DSP శ్రీ వేణుగోపాల్, AR DSP శ్రీ చంద్రమోహన్, HG DSP శ్రీ NV రమణ, AO శ్రీ చంద్రమౌళి గార్లు, సంబంధిత పోలీస్ అధికారులు, ట్రైనింగ్ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం, తేది.22.12.2025.

E-పేపర్

ఎస్ వి ఆర్ట్స్ కళాశాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ లొ ఇంటర్ స్కూల్ తైక్వాండో పోటీలు

ఎస్ వి ఆర్ట్స్ కళాశాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ లొ ఇంటర్ స్కూల్ తైక్వాండో పోటీలు రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వే కోడూరు మండలంలో ఈ నెల 21 వ తేదీ న తిరుపతి ఎస్ వి ఆర్ట్స్ కళాశాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ లొ ఇంటర్ స్కూల్ తైక్వాండో పోటీలు నిర్వహించారు ఇందులో రైల్వే కోడూరు లోని నారాయణ , విస్డం, విక్టరీ స్కూల్ స్ విద్యార్థులు యస్ కే స్పోర్ట్స్ అకాడమీ లొ శిక్షణ తీసుకుంటూ తమ ప్రతిభ చాటుకున్నరూ వారిలో జయ దేవ్,హేమేశ్వర్, మోనిష్, జయ దేవ్, సైఫుల, నిశిత, పవన్, రోషన్ కుమార్ రెడ్డి, మనోజ్, సులేం, మస్తాన్, ప్రభాస్, శశాంక్, కార్తికేయ, మెగా హర్ష, శ్రావ్య, శశాంక్, చందన బంగారు పతకాలు మరియు సాయి రోసిత, యశో వర్ధన్ వెండి పతకాలు సాధించారు అని కోచ్ ఎస్ కె మౌలా వారిని అభినందించారు

కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో పల్లె పంచాయతీల్లో కొలువు దీరిన నూతన సర్పంచులు..

ఘ- ప్రజాసేవలో మునిగిపోతామని తీర్మానం! కామారెడ్డి, 22 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా వివిధ మండలాల్లో గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గ సభ్యులు కొలువు దీరారు. పల్లె తండాల్లో ఘనంగా నిర్వహిం చిన ప్రమాణ స్వీకారోత్సవాలు గ్రామ ప్రజల అనందోత్సహాం ఉత్సాహాన్ని రేకెత్తించాయి. ఈ సందర్భంగా సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజల సమక్షంలో ప్రమాణాలు చేసుకుని, గ్రామాభివృద్ధికి, ప్రజాసేవకు నిజాయితీగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.రామారెడ్డి మండలంలో ఉత్సవాల ముందస్తు!రామారెడ్డి మండలంలోని రామారెడ్డి, గిద్ధ, పోసానిపేట్, రంగంపేట్, మోషంపూర్, రెడ్డిపేట్, జగదాంబ తండా, స్కూల్ తండా, భట్టు తండా, అన్నారం, గొడుమర్రీ తండా, కన్నాపూర్ తండా, కన్నాపూర్, గొల్లపల్లి, గోకుల్ తండా, మద్దికుంట, ఉప్పల్వాయి గ్రామాల్లో నూతన పాలకవర్గ సభ్యులు కొలువు దీరారు. ఈ గ్రామాల్లో ఘనంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవాలకు గ్రామస్తులు, రాజకీయ నాయకులు, అధికారులు హాజరయ్యారు. డీజే చప్పుల్లు, పూల మాలలు వేసి సర్పంచులను అభినందించారు. సర్పంచుల హామీలు.. ప్రజలకు మొదటి బాధ్యత! ఈ సందర్భంగా మాట్లాడిన సర్పంచులు, “గ్రామ ప్రజలు మాతో తోడుగా ఉంటే అభివృద్ధి సాధ్యమే. రోడ్లు, నీటి సమస్యలు, విద్య, ఆరోగ్యం.. అన్ని విషయాల్లో ముందుండి ప్రజాసేవలో మునిగిపోతాము” అని అన్నారు. గ్రామాల్లో పెద్దలు, అధికారులు, విద్యార్థు లు, మహిళలు అందరూ పాల్గొన్న ఈ కార్యక్రమా లు గ్రామీణ ఉత్సవ వాతావరణాన్ని సృష్టించాయి. పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల స్కీంలను పూర్తిగా అమలు చేస్తామని సర్పంచులు స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా మొత్తంలో ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి.పల్లెల్లో ప్రజలు సర్పంచులను ఆశీర్వ దించడంతో పాటు, తమ గ్రామాల అభివృద్ధి కోసం ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.ఈ నూత న పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామాలు మరింత ముందుకు సాగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే పంచాయతీ సమావేశా లు ఏర్పాటు చేసి, అభివృద్ధి పనులకు మొదలు పెడతామని హామి ఇచ్చారు.

E-పేపర్

విద్యార్థులకు అతిథి భోజనం ఏర్పాటు

విద్యార్థులకు అతిథి భోజనాన్ని నందలూరు మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సోమవారం అరవపల్లి క్రీడామైదానంలోని మండల ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ జం బు సూర్యనారాయణ తల్లి తండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థినీ విద్యార్థులకు అతిథి భోజనాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మంచి నాణ్యమైన కలర్ రైస్ చికెన్ అరటిపండు స్వీట్ భోజనాన్ని అందించడం తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మి సుండుపల్లి వెంకటరమణ .జంబు రవీంద్రబాబు జంబు సుదర్శన్ జంబు నవీన్ జైస్ రంజన్. పండు నాని ఉమాది శివకుమార్ శివ నరసింహులు మారే శివ బాలాజీ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కుడికిపల్లి లో క్రిస్టమస్ క్యారల్స్

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 22 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కుడితిపల్లి గ్రామంలోని క్రిస్టియన్ చర్చి నందు పాస్టర్ పగడాల తిమోతి గారి ఆధ్వర్యంలో గ్రామాల్లో క్రిస్మస్ క్యారల్స్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జన్మ సందేశాన్ని పాటల రూపంలో ప్రజలకు చేరవేస్తూ, శాంతి–ప్రేమ–సోదరభావాలను పంచారు. సంఘస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్యారల్స్‌ను పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆనందంగా , ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.