విశాఖపట్నం
విశాఖపట్నం డిసెంబర్ 23పున్నమి ప్రతినిధి:- – నాణ్యమైన వైద్యం, వైద్య విద్యే మా పార్టీ విధానం – మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచాలి – అదే మా పార్టీ విధానం – ప్రైవేటీకరణ పేరుతో స్కాములకు పాల్పడితే ఉపేక్షించేదిలేదు – మేం అధికారంలోకి వస్తే ఇలాంటి వారిపై చర్యలు – మా పార్టీ అధ్యక్షుడూ ఇదే స్పష్టం చేశారు : శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టీకరణ విశాఖపట్నంలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాధ్, ఇతర వైయస్సార్సీపీ నేతలు. – డిప్యూటీ సీఎం పీకుడు భాష తీవ్ర అభ్యంతరకరం – పవన్ కళ్యాణ్ కాగితంపులి మాటలు కట్టిపెట్టండి – గోదావరి జిల్లాల్లో యథేచ్ఛగా పేకాట క్లబ్బులు – సీపోర్టుల ద్వారా లక్షల టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా – అయినా చర్యలు మాత్రం శూన్యం : సూటిగా ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ – కూటమి పాలనలో ప్రతి స్ధాయిలోనూ అవినీతి – యూరియా కొరతపై కుంటిసాకులు – యుక్రెయిన్ యుద్దం కారణమైతే దేశమంతా కొరతుండాలి – ఎన్డీయే రాష్ట్రాల్లో లేని కొరత ఏపీకే ఎందుకు? – ఏపీలో రైతుల తరపున అడిగే నాధుడేలేడు : తేల్చి చెప్పిన బొత్స సత్యనారాయణ – రియల్ ఎస్టేటే కంపెనీలకు కారుచౌకగా భూదోపిడీ – ప్రతిరోజూ పత్రికల్లో మహిళలపై అఘాయిత్యాలు, హత్యా వార్తలే – సంక్షేమ హాస్టళ్లలోనూ కొరవడిన తాగునీరు, పౌష్టికాహారం – నాడు- నేడు పథకానికి మంగళం – ముస్తాబు పేరుతో అద్దం, దువ్వెనలు – భారీగా అప్పులు- అధ్వాన్నంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి – 18 నెలల్లో రూ.2.66 లక్షల కోట్లకు పైగా అప్పులు – భారీగా విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు – నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించని ఆరోగ్యశ్రీ బిల్లులు – ఇది ముమ్మూటికీ అసమర్థ ప్రభుత్వమే : కూటమి పాలనపై బొత్స సత్యనారాయణ ఫైర్ పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్య అందించాలన్నదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని… అందులో భాగంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచాలన్నదే మా పార్టీ విధానమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేటీకరణపేరుతో స్కాములకు మేం విరుద్దమన్న ఆయన.. మా పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ సైతం ఇదే స్పష్టం చేశారని తెలిపారు. బాధ్యతగల ప్రతిపక్షంగా ఇదే మా పార్టీ విధానమని… మేం అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ రద్దు చేయడంతో పాటు స్కాములకు పాల్పడ్డ వారిపై చర్యలు ఖాయమని స్పష్టీకరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీకుడు భాష పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన… కాగితంపులి మాటలు కట్టిపెట్టాలని సూచించారు. గోదావరి జిల్లాల్లో యథేచ్ఛగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నా, సీపోర్టుల ద్వారా లక్షల టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కూటమి పాలనలో పేదల ఉపాధి గండం కలిగేలా… ఉపాధి హామీ చట్టం ఆబ్జెక్ట్ మార్పు చేస్తే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కూటమి పాలనలో ప్రతి స్ధాయిలోనూ అవినీతి రాజ్యమేలుతుందని… యూరియా కొరతపై కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డ బొత్స సత్యనారాయణ, యుక్రెయిన్ యుద్దం కారణమైతే ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో లేని కొరత ఏపీకే ఎందుకని నిలదీశారు. కేవలం ఏపీలో రైతుల తరపున అడిగే నాధుడు లేకపోవడమేనని ఆయన తేల్చి చెప్పారు. ప్రతిరోజూ పత్రికల్లో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలతో పాటు సంక్షేమ హాస్టళ్లలోనూ కొరవడిన తాగునీరు, పౌష్టికాహార వార్తలే దర్శనిమిస్తున్నాయని.. ప్రభుత్వ అసమర్ధ పాలనకు ఇదే నిదర్శనమన్నారు. 18 నెలల్లో రూ.2.66 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా.. విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలతో పాటు, నెట్ వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించలేని అసమర్థ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే.. ● క్షేత్రస్దాయికి వెళ్లి నిజాలు తెలుసుకొండి… నాలుగైదు రోజులగా అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు, వారి భాష, ఆలోచనా విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారం రోజుల క్రితం గవర్నర్ గారిని మా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్.జగన్ తో పాటు మా పార్టీ నాయకులందరం వెళ్లి కలిసాం. ప్రజారోగ్యానికి సంబంధించి మా ప్రభుత్వ హయాంలో పెట్టిన మెడికల్ కాలేజీలను స్వార్ధంతో పీపీపీ విధానంలో ప్రైవేటైజేషన్ చేస్తున్నారని… దీన్ని వ్యతిరేకిస్తూ కోటికి పైగా సంతకాలతో కూడిన ప్రజాభిప్రాయాన్ని గవర్నర్ గారికి సమర్పించాం. అనంతరం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడిన మాటలు, వారి భాషపై ఆలోచన చేయమని ప్రజలను కోరుతున్నాను. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలుంటే కోటి మంది ఎలా సంతకాలు పెట్టారని ప్రశ్నిస్తున్నారు? అసలు రాష్ట్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో మంత్రిగారికి తెలుసా? ప్రజలు ప్రభుత్వ హయాంలోనే మెడికల్ కాలేజీలు ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి, సంతకాలు చేశారు. మీరు మీకు నచ్చిన గ్రామానికి వెళ్లి… మేం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటున్నాం.. ఎవరికైనా అభ్యంతరం ఉందా? అని అడిగితే ప్రజలే వాస్తవాలు చెబుతారు. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుంటే.. మీకే వాస్తవాలు తెలుస్తాయి. కావాలంటే మీరే ప్రజాభిప్రాయం తెలుసుకొండి, అంతే తప్ప చిన్న మాటలు మాట్లాడి మీ స్థాయి తగ్గించుకోవద్దు. ● మా పార్టీ విధానం సుష్పష్టం- అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటీకరణ రద్దు ఖాయం.. ప్రైవేటీకరణ మీ విధానం అని ధైర్యంగా చెప్పండి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పినదేమిటంటే… ఎవరైనా ఆశపడో, అవినీతి కోసమో.. ఈ కార్యక్రమం చేస్తే మేం ప్రజల అండదండలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాన్ని రద్దు చేస్తాం, అవినీతికి పాల్పడిన వారిపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. మరలో మేం మరోసారి చాలా స్పష్టంగా చెబుతున్నాను. మా పార్టీ విధానం చెబితే అది బెదిరింపు ఎలా అవుతుంది? ఉపముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు? ప్రజారోగ్యాన్ని మీ స్వలాభం కోసం మార్చుకోవాలని చూస్తే… వారిపై మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠిన చర్యలు తప్పవన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాం. దీనిపై సీఎం, డిప్యూటీ సీఎంతో సహా మంత్రులందరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ● పేదల ఉపాధికి గండం… మీ ఎన్నికల ప్రణాళిక అమలుతో సహా రాష్ట్రంలో చాలా సమస్యలుంటే వాటిపై మాత్రం మీరు నోరు మెదపడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. మీరు ఆ ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో తెలియదు కానీ… ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం ఆబ్జెక్ట్ మార్చడం వల్ల.. ఈ రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లే పరిస్థితి దాపురిస్తోంది. మరలా రాష్ట్రంలో వలసలు వచ్చే తరుణం ఆసన్నమవుతోంది. గ్రామాల్లో పేద ప్రజలు ఉపాధి కోల్పోయి.. పని దొరక్క ఇబ్బందులు పడే రోజులు రానున్నాయి. ఇది వాస్తవం. ఏదైనా ఒక విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు దాని పూర్వాపరాలు చర్చించి, మంచి చెడ్డలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు పార్లమెంటులో భేషరతుగా మద్దతిచ్చి.. దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ పేరునే తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్… దానికి సంబంధించిన శాఖ బాధ్యతలు చూస్తున్నారు. ● కూటమి పాలనలో ప్రతి స్ధాయిలోనూ అవినీతి.. మరి పేదవాడి గురించి మీ ఆలోచన ఏమైంది? మీరు ఎందుకు దాని గురించి ప్రశ్నించడం లేదు? మీకు బాధ్యత లేదా? నేను ఒక బాధ్యత కోసమే ఈ పార్టీని స్థాపించానని చెప్పే మీరు.. ఈ పేదవాడి బ్రతుకు గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదు? ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు? చంద్రబాబు నాయుడుకి ఎలాగూ పేదలు అవసరం లేదు? ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్పొరేట్ వ్యక్తుల గురించే ఆలోచన చేస్తాడు, వారి గురించే ఆలోచిస్తాడు. పేద, మద్య తరగతి ప్రజల గురించి ఏనాడూ ఆలోచన చేయడు. మీక్కూడా పేదలు, పవన్ కళ్యాణ్ గారూ మీక్కూడా పేదల బాధలు అవసరం లేదా? ప్రశ్నిస్తానని పదే, పదే చెప్పే మీరు.. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి వైద్య ఆరోగ్యశాఖను ప్రజలకు దూరం చేస్తూ.. అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామంటే మేము బెదిరిస్తున్నామంటారా? మా పార్టీ అధికారంలోకి రాదంటూ జ్యోతిష్యాలు చెబుతున్నారు. రాజకీయ పార్టీ అన్నప్పుడు.. ఒక సిద్ధాంతపరంగా ముందుకు వెళ్తుంది. ఆ ఆలోచన, ఆ లక్షణాలు కనిపించడం లేదు? ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కింద నుంచి పై స్థాయి వరకు అవినీతితో నిండిపోతుంది. శాంతిభద్రతలు లేవు. కనీసం ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధులు శుభ్రమైన భోజనం తిని, చక్కగా చదువుకునే పరిస్ధితులే లేవు. ఏ అంశాన్ని తీసుకున్నా ఇదే పరిస్థితి. ● యూరియా కొరతపై కుంటిసాకులు.. డిప్యూటీ సీఎం ప్రసంగం వింటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు? యుక్రెయిన్ యుద్ధం వలన రాష్ట్రంలో యూరియా ధరలు పెరిగిపోయాయని చెబుతున్నాడు. ఇది విమర్శ కాదు. ఒక వేళ యుద్దం వలనే యూరియా డిమాండ్ వస్తే ఆ కొరత భారతదేశమంతటా ఉండాలి కదా, కానీ యూపీలో యూరియా ఎలా దొరికింది? బీహార్, హర్యానా, మన పక్కనే ఉన్న ఒడిషా లో ఎలా దొరికింది? ఏపీలో మాత్రమే ఎందుకు దొరలేదు? కేవలం ఆంధ్రా, తెలంగాణాకే యుద్దం ప్రభావం వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ తప్ప ఎన్టీయే ప్రభుత్వాలు ఉన్నాయో, ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయో అక్కడ మాత్రం యూరియా పుష్కలంగా దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ లో యూరియా కొరత ఉన్నా, రైతులు ఇబ్బండి పడుతున్నా అడిగే నాధుడు లేడు కాబట్టి, వ్యవసాయం శుద్ద దండగ అనేది