Friday, 13 March 2026

Blog

Blog

మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా

నంద్యాల పట్టణ నూతన ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు చేపట్టిన చాంద్ బాషా రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని వారి నంద్యాల క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతపై చర్చించగా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయాలని మంత్రి సూచించారు.

E-పేపర్

సీనియర్ అనస్థీషియా వైద్యులు డాక్టర్ రవి కృష్ణ,డాక్టర్ శేష ఫణి, డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ మాధవి లను సత్కరించిన నంద్యాల ఐఎంఏ వైద్యులు

నంద్యాల పట్టణ నూతన ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు చేపట్టిన చాంద్ బాషా రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని వారి నంద్యాల క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతపై చర్చించగా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయాలని మంత్రి సూచించారు.

విశాఖపట్నం

చలి పంజా

తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం చలి తీవ్రంగా పంజా విసిరింది. తెలంగాణలో పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 5 డిగ్రీల చలితో ప్రజలు గడగడలాడారు. ఆదిలాబాద్, రంగారెడ్డి, కుమురం భీమ్ జిల్లాల్లో 7–9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కూడా రాత్రి వేళ 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉండి అరకూ, ముంచింగిపుట్టు, జి.మాడుగుల ప్రాంతాల్లో 5–8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

విశాఖపట్నం

మహిళా క్రికెట్ జట్టు విజయం

విశాఖ టీ20: శ్రీలంకపై భారత మహిళల జట్టు విజయం 7 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత ఉమెన్స్ టీమ్ శ్రీలంక స్కోర్‌-128/9, భారత్‌ స్కోర్‌-129/3 ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో భారత్‌ ఆధిక్యం

E-పేపర్

హద్దు మీరితే.. ‘హ్యాపీ’ న్యూ ఇయర్ ఉండదు!*

23.12.2025 పున్నమి ప్రతినిధి: *హద్దు మీరితే.. ‘హ్యాపీ’ న్యూ ఇయర్ ఉండదు!* *కొత్త సంవ‌త్స‌రం పేరిట నిబంధనలు ఉల్లంఘింస్తే క‌ఠిన చ‌ర్య‌లు* *హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌న‌ర్ హెచ్చ‌రిక* *రేప‌టి నుంచే డ్రంకెన్ డ్రైవ్ ప్ర‌త్యేక త‌నిఖీలు* *క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో వీడియో కాన్ప‌రెన్స్ నిర్వ‌హ‌ణ‌* నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ హెచ్చరించారు. తాగి వాహనాలు నడిపే వారిపై బుధవారం నుంచి న్యూ ఇయ‌ర్ రోజు వ‌ర‌కు నగరవ్యాప్తంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(టీజీఐసీసీసీ) లో మంగళవారం క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల బందోబస్తుపై న‌గ‌ర సీపీ శ్రీ వీసీ స‌జ్జ‌న‌ర్, ఐపీఎస్ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై ఆయ‌న కీలక సూచనలు చేశారు. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హాట్ స్పాట్లు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించాలని, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. డిసెంబరు 31 రాత్రి నగరవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని సీపీ తెలిపారు. ఇందుకోసం 7 ప్లాటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నామన్నారు. కొత్త సంవత్సరం జోష్‌లో మోతాదు మించి తాగి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వాహన సీజ్‌తో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసే అవకాశం కూడా ఉందన్నారు. పార్టీలకు వెళ్లేవారు ముందుగానే ‘డెసిగ్నేటెడ్ డ్రైవర్’ను ఏర్పాటు చేసుకోవాలని లేదా క్యాబ్‌లను ఆశ్రయించాలని సూచించారు. యువత రోడ్లపై రేసింగ్‌లు, వీలింగ్‌లు, ర్యాష్‌ డ్రైవింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 2026 స్వాగత వేడుకలు ప్రజల జీవితాల్లో తీపి జ్ఞాపకాలుగా మిగలాలే తప్ప, చేదు అనుభవాలుగా మారకూడదని సీపీ హితవు పలికారు. డిసెంబరు 31 రాత్రి పబ్‌లు, త్రీస్టార్‌, ఆపై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. శబ్ద కాలుష్య నిబంధనలు కచ్చితంగా పాటించాలని, డెసిబెల్స్‌ పరిమితి దాటితే సౌండ్‌ సిస్టమ్‌లను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఈవెంట్లలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని, అలాంటి వారి లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. వేడుకల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సీపీ వివరించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్టీ వెన్యూలు, జంక్షన్‌లలో మ‌ఫ్టీలో 15 షీ టీమ్స్‌ నిఘా ఉంచుతాయని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తక్షణమే అరెస్టు చేస్తామని వెల్లడించారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ, సురక్షితంగా 2026కు స్వాగతం పలకాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అద‌న‌పు సీపీ(క్రైమ్స్) శ్రీ ఎం. శ్రీనివాసులు, ఐపీఎస్, వివిధ విభాగాల డీసీపీలు శ్రీమ‌తి ఎన్‌.శ్వేత‌, శ్రీమ‌తి ర‌క్షితాకృష్ణ‌మూర్తి, శ్రీ రూపేష్, ఆర్. వెంక‌టేశ్వ‌ర్లు, వి.అర‌వింద్ బాబు,శ్రీమతి లావణ్య నాయక్ జాదవ్ త‌దిత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. పీఆర్వో, హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అటల్ దివస్ – సుపరిపాలన దిన వారోత్సవాలను జయప్రదం చేయండి.

వింజమూరు లోని బీజేపీ కార్యాలయంలో మండలబీజేపీ అధ్యక్షులు అంబటి ఈశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి మరియు అటల్ స్మృతి సంవత్సర వారోత్సవాలు నిర్వహణ కోసం బిజెపి జాతీయ పార్టీ అధ్యక్షులు నితిన్ నిబిన్ పిలుపుమేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్. మాధవ్ ఆదేశాలతో జిల్లా బిజెపి అధ్యక్షులు ఎస్. వంశీధర్ రెడ్డి సహకారంతో 5మెన్ కమిటీను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు. రాధాకృష్ణ గౌడ్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్నీ గంటి. శీనయ్య బిజెపి ఉదయగిరి అసెంబ్లీ మాజీ కన్వీనర్ కంది. మల్లికార్జున రెడ్డి బీజేవైఎం మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉల్లం. శరత్ లను ఫైవ్ మెన్ కమిటీగా రాష్ట్ర శాఖ నియమించడంతో వింజమూరు లో జరిగిన ఉదయగిరి అసెంబ్లీ సమావేశం లో ముఖ్య అతిది గా పాల్గొన్న ముక్కు రాధా కృష్ణ గౌడ్ మాట్లాడుతూ వాజ్ పేయి రాజకీయ ప్రస్థానం, మౌలిక సదుపాయాలు, విదేశాంగ విధానం, ప్రజా సంక్షేమ రంగాలలో చేసిన ముఖ్యమైన సంస్కరణలతో సహా సుపరిపాలన కొరకు చేసిన కృషిని ఒక ఉత్సవంగా జరపడం, బూత్ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు కార్యకర్తలను సమీకరించి పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడం వాజ్ పేయి వారసత్వ సంరక్షకుడిగా పార్టీ పాత్రను మరింత పటిష్టం చేయడం ఆయన సందేశంలో దేశం ప్రథమం అనే విలువలను హైలైట్ చేసి వారి వారసత్వాన్ని వికసిత భారత్ దిశగా ముందుకు తీసుకెళ్లడం దేశవ్యాప్త భాగస్వామ్యంలో అన్ని కార్యకలాపాలను నిర్వహించి పౌరులకు, యువతకు ప్రేరణ ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు.అలాగే రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలలో కార్యశాలలు నిర్వహించడం డిసెంబర్ 24న వాజ్ పేయి విగ్రహాలను, స్మారక చిహ్నాలు వద్ద స్వచ్ఛత కార్యక్రమాలు, రాష్ట్ర, జిల్లా బిజెపి కార్యాలయాల వద్ద దీపాలు వెలిగించడం, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో సమ్మేళనాలు నిర్వహించడం, డిసెంబర్ 25 నుంచి 31వ తేదీ వరకు వారోత్సవాలలో భాగంగా మండల స్థాయిలో పార్టీ కార్యాలయాలో అటల్ చిత్రపటాలకు పూలమాలంకరణ చేసి ఒక పండగ వాతావరణం లో సమావేశాలు నిర్వహించడం, అటల్ స్మృతి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అన్ని నగరపాలక సంస్థలు మరియు విధాన పరిశోధన సంస్థలలో సుపరిపాలన సమ్మేళనాలు నిర్వహించడం నగరాల్లోని కూడళ్ళుకు, పార్కులకు వాజ్ పేయి పేరు పెట్టడం నూతనంగా విగ్రహాలను స్థాపించడం, దానితో పాటుగా అటల్ వన్ పేరుతో ఉద్యానవనాలను అంకితం చేస్తూ ఒక ప్రత్యేక పథకాన్ని కూడా చేయాలని జిల్లా స్థాయిలోనూ మరియు ప్రముఖ నగరాలలో కవి సమ్మేళనాలు, చిత్రకళా పోటీలు, గ్రాఫిక్స్, రీల్ పోటీలు క్విజ్ పోటీలు, ముగ్గుల పోటీలు, వ్యక్తిత్వ వికాస పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సంపాదకీయ వ్యాసాలు రాయడం, యూట్యూబ్ కంటెంట్, మరియు వలాగింగ్ కూడా ప్రోత్సహించడం తదితర కార్యక్రమాల ద్వారా వాజ్ పేయి జీవితము సాధించిన విజయాల ఆధారంగా రూపొందించే గ్రాఫిక్స్ మరియు రీల్స్ సోషల్ మీడియాలో మాధ్యమాలలో పోస్ట్ చేయడం జరుగుతుందని వారు తెలిపారు.అలాగే జిల్లాలోని అన్ని మోర్చాలు మరియు కమిటీలు ఎన్నికైనప్రజాప్రతినిధులందరూ ఈ అభియాన్ యొక్క ప్రణాళిక మరియు అమలలో భాగస్వాములు అవ్వాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు చీధర్ల శివ పార్వతి, జిల్లా కార్యదర్శి మారెళ్ల బ్రహ్మ రెడ్డి, కార్యవర్గ సభ్యులు చుండి హరి గోపాల్, వరికుంటపాడు మండలం ప్రెసిడెంట్ ఏనుగు ప్రభాకర్ రెడ్డి, నాయకులు, కొండా రెడ్డి, కే అరుణరెడ్డి, శీలం మాల్యాద్రి, మూలే బాలకృష్ణ రెడ్డి, మేకపాటి మాల్యాద్రి, ముడుమల రమేష్ రెడ్డి, రామ్ చంద్ర, నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు .

విశాఖపట్నం

లబ్ధిదారులకు గృహ స్వాధీన పత్రాలను పంపిణీ చేసిన డాక్టర్ కందులనాగరాజు

లబ్ధిదారులకు గృహ స్వాధీన పత్రాలను పంపిణీ చేసిన డాక్టర్ కందుల *విశాఖపట్నం డిసెంబర్ 23 పున్నమి ప్రతినిధి* ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద సబ్బవరం మండలం గంగవరం ప్రాంతంలో ఎన్టీఆర్ కాలనీకి సంబంధించి 46 మంది లబ్ధిదారులకు గృహ స్వాధీన పత్రాలను విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అందజేశారు. అల్లిపురం నేరెళ్ల కోనేరు డాక్టర్ కందుల నాగరాజు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సొంతింటి కల నిజం చేయాలని కోటి సర్కార్ తీసుకున్న నిర్ణయం మేరకు నేడు 46 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందజేయడం జరిగింది అన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వం సొంత ఇంటి కల నిజం చేయడంలో ముందుందని తెలియజేశారు. ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుందని పేర్కొన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుందని వెల్లడించారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. గత వైసిపి ప్రభుత్వంతో పోలిస్తే నేటి ఎక్కువగా ప్రభుత్వం ప్రజలకు ఎక్కువగా మంచి చేస్తుందని తెలిపారు. పార్టీలు కచ్చితంగా అన్ని వర్గాలకు చేయూతనందిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని వెల్లడించారు. ఈ క్రమంలో విశాఖ అభివృద్ధి కూడా జోరందుకుందని తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 32వ వార్డు అభివృద్ధికి కూడా తన పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ ఎం.ఎం.నాయుడు, రాజశేఖర్, కృష్ణమూర్తి, కేదార్ లక్ష్మి, ఎంఎల్ఎన్ రావు ,వెంకట్ లక్ష్మి, కృష్ణ కే.అప్పారావు, వై.ఆది బాబు, సిపిఐ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పూర్ణ మార్కెట్ అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించి బాధితులకు భరోసాను కల్పించిన జీవీఎంసీ కమిషనర్.

పూర్ణ మార్కెట్ అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించి బాధితులకు భరోసాను కల్పించిన జీవీఎంసీ కమిషనర్. *విశాఖపట్నం డిసెంబర్పు 23 పున్నమి ప్రతినిధి* పూర్ణ మార్కెట్ లో జరిగిన అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన సోమవారం అర్ధరాత్రి విశాఖపట్నం పూర్ణ మార్కెట్ లో జరిగిన అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ పూర్ణ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, దుకాణాలు ఇంకా అక్కడక్కడ కాలుచుండడం గమనించి వెంటనే జిల్లా అగ్నిమాపక అధికారితో మాట్లాడి ఫైర్ ఇంజన్ తో మిగిలిన మంటలను ఆర్పే ఏర్పాట్లను చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో పేరుకుపోయిన వ్యర్థాలను యుద్ద ప్రాతిపాదికన తొలగించే ప్రక్రియ ప్రారంభించాలని జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు ను ఆదేశించారు. అనంతరం అగ్ని ప్రమాదంలో కాలిపోయిన 15 దుకాణాల బాధితులను ఓదారుస్తూ వారికి భరోసాను కల్పించారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అన్ని విధాల న్యాయం జరిగేలా తగిన చర్యలు చేపడతామని బాధితులకు భరోసాను కల్పించారు. ఈ పర్యటనలో జీవీఎంసీ కార్య నిర్వహక ఇంజనీరు వెంకటేశ్వరరావు, జీవీఎంసీ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Blog

బంగ్లాదేశ్ జైల్లో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర మత్స్యకారులు 9 మంది విడుదల కోసం అత్యంత ప్రమాదకర పరిస్థితులలో బంగ్లాదేశ్ వెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వాసుపల్లి జానకిరామ్

*బంగ్లాదేశ్డిసెంబర్ 23 (విశాఖ పున్నమి ప్రతినిధి)* బంగ్లాదేశ్ జైల్లో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర మత్స్యకారులు 9 మంది విడుదల కోసం అత్యంత ప్రమాదకర పరిస్థితులలో బంగ్లాదేశ్ వెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వాసుపల్లి జానకిరామ్ బంగ్లాదేశ్ జైల్లో ఉన్న మత్యకారులను కలవటానికి ప్రయత్నాలు చేసిన వాసుపల్లి జానకిరామ్. బంగ్లాదేశ్ జైల్లో ఉన్నటువంటి భారతీయ మత్స్యకారులను ఎవరిని కలవకూడదు అని బంగ్లాదేశ్ కేంద్ర హోం శాఖ ఆదేశాలు ఇవ్వటం వలన మత్స్యకారులు కలవడానికి అనుమతి నిరాకరించిన బంగ్లాదేశ్ బాగర్ హాట్ కేంద్ర కారాగార పోలీసులు. జైల్లో ఉన్న మత్స్యకారులకు ఆహారం మరియు నిత్యవసర వస్తువుల కొరకు కొంత బంగ్లాదేశ్ కరెన్సీ ని జైల్లో డిపాజిట్ చేసిన వాసుపల్లి జానకిరామ్. జైల్లో ఉన్న మత్స్యకారులకు బంగ్లాదేశ్ కరెన్సీ నెల నుంచి నెలన్నర వరకు వారి అవసరాలకు ఉపయోగపడతాయని తెలియజేసిన జానకి రామ్. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ప్రభుత్వం లేకపోవడం వల్ల ఇబ్బందికర వాతావరణం ఉండటం జైలు అధికారులు వీడియో తీయటానికి కూడా నిరాకరించినట్లుగా తెలియజేశారు. అయినా బాధిత కుటుంబాలకు ధైర్యం ఇవ్వటం కోసం జైలు దగ్గర వీడియో చిత్రీకరణ. బంగ్లాదేశ్ జిల్లా కోర్టులో కేసు వివరాలు పై సమావేశం బంగ్లాదేశ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి కోసం బంగ్లాదేశ్ డాఖాలో సుప్రీంకోర్టు అడ్వకేట్ మహమ్మద్ రహ్మాన్ ద్వారా మత్స్యకారుల విడుదల కోసం ప్రయత్నాలు. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి భారత విదేశాంగ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన వాసుపల్లి జానకిరామ్. భారత విదేసాంగ శాఖ అధికారులు జైలులో ఉన్న మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితి పై జైలుకు వెళ్లి మత్స్యకారులతో మాట్లాడటం జరిగింది. చలికాలం కావడం వల్ల అభ్యర్థన మేరకు జైల్లో ఉన్న మత్స్యకారులకు స్వెటర్లు అందజేసిన అధికారులు. ప్రస్తుతం మత్స్యకారులు అందరు కూడా క్షేమంగా ఉన్నారని జైల్లో ఉన్నామనే బాధ, కుటుంబాలకు దూరంగా ఉన్నామని బాధ ఆవేదన వారు వ్యక్తం చేశారని ఆరోగ్యంగా ఉన్నట్లుగా వారి కుటుంబాలకి తెలియజేయాలని జైల్లో ఉన్నవారు కోరినట్లుగా జానకిరామ్ కు తెలియజేసినటువంటి భారత విదేశాంగ శాఖ అధికారులు. మత్స్యకారులు విడుదల కోసం సంబంధిత కేసు వివరాలు డాక్యుమెంట్స్ ను భారత విదేశాంగ శాఖ, బాంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖకు అందజేసిన వాసుపల్లి జానకిరామ్. ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని అల్లర్లు జరుగుతున్నాయని దేశమంతా వాతావరణం అనిర్చితి వాతావరణం ఉందని, హిందువుల పై దాడులు జరుగుతున్నాయని, ప్రధానంగా భారతదేశాన్ని భారతీయుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉండి ఎక్కడికక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయని చాలా భయానక వాతావరణం ఉందని ప్రస్తుతం తెలియజేసిన వాసుపల్లి జానకిరామ్. హిందువులు భారతీయులు అధిక సంఖ్యలో వీసా అనుమతి ఉన్నవారు దగ్గరలో ఉన్న భారత సరిహద్దులకు ప్రాణ భయంతో చేరుకుంటున్నారని, చదువుకోడానికి బంగ్లాదేశ్ వచ్చినటువంటి భారతీయ విద్యార్థులు కూడా హాస్టల్స్ ఖాళీ చేసి భారతదేశానికి బయలుదేరుతున్నట్లుగా వివరించిన వాసుపల్లి జానకిరామ్

విశాఖపట్నం

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ (Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపుల కొనసాగింపు. – జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ.ప్రభాకర రావు *

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ (Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపుల కొనసాగింపు. – జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ.ప్రభాకర రావు *విశాఖపట్నం డిసెంబర్ 23పున్నమి ప్రతినిధి:- *మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అన్ని జోన్ల లో ఆపరేషన్ లంగ్స్ 2.0 లో భాగంగా మంగళవారం 371 ఆక్రమణలను తొలగించడం జరిగిందని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ. ప్రభాకర్ రావు మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు నగర పరిధిలో ప్రజలు సురక్షితంగా ఫుట్ పాతులపై నడక సాగించేందుకు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో లో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా రోడ్లు, జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా సురక్షిత రవాణా కోసమై జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ (Operation Lungs) 2.0 లో భాగంగా అన్ని జోన్లలో రోడ్లపై జంక్షన్లలో ఆక్రమణలు తొలగించడం జరుగుతుందని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు. “తొలగించిన ఆక్రమణలను ఈ క్రింద పొందుపరచడమైనది.” 2 వ జోన్ పరిధిలో కొమ్మాది జంక్షన్ నుండి గాయత్రి కాలేజీ రోడ్డు వరకు, పీఎం పాలెం క్రికెట్ స్టేడియం నుండి జాతర పార్క్ వరకు, కొమ్మాది జంక్షన్ నుండి ఎస్.టి.బి.ఎల్ వరకు 42 ఆక్రమణలు, 3వ జోన్ పరిధిలో ఆర్కే బీచ్ పార్క్ హోటల్ రోడ్డు నుండి ఏయూ అవుట్ గేట్ వరకు, వుడా పార్కు రోడ్డు వయా వాల్తేరు డిపో నుండి శాంతి ఆశ్రమం కామత్ రోడ్డు వరకు, కామత్ హోటల్ రోడ్డు నుండి కైలాసగిరి రోప్ వే వరకు, సిరిపురం జంక్షన్ నుండి ఏయూ అవుట్ గేట్ రోడ్డు వరకు, సిరిపురం జంక్షన్ నుండి వాల్తేరు డిపో వరకు, మద్దిలపాలెం నుండి సత్యం జంక్షన్ వరకు 153 ఆక్రమణలు, 6వ జోన్ పరిధిలో బీసీ రోడ్డు జంక్షన్ నుండి గంగవరం పోర్టు రోడ్డు వరకు, వడ్లపూడి మార్కెట్ రోడ్డు నుండి కూర్మన్నపాలెం భరత్ ఐటి రోడ్డు వరకు, వడ్లపూడి పవన్ సాయి హాస్పిటల్ నుండి గాంధీ విగ్రహం జంక్షన్ వరకు, లాఖ్స్ & లాఖ్స్ జక్షన్ నుండి అపోలో ఫార్మసీ 130 అడుగుల రోడ్డు వరకు, వంటిల్లు జంక్షన్ నుండి జగ్గు జంక్షన్ వరకు 127 ఆక్రమణలు, 7వ జోన్ పరిధిలో జి ఎన్ టి రోడ్డు నుండి గాంధీ బొమ్మ జంక్షన్ వరకు 14 ఆక్రమణలు వెస్ట్ జోన్ పరిధిలో కాకాని నగర్ నుండి కాకాని నగర్ జంక్షన్ వరకు, కంచరపాలెం రైతుబజార్ నుండి ఓరోసీ జంక్షన్ వరకు 20 ఆక్రమణలు, పెందుర్తి జోన్ పరిధిలో గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుండి బాజీ జంక్షన్ వరకు 15 ఆక్రమణలతో కలిపి మొత్తం 371 ఆక్రమణలను తొలగించడం జరిగిందని ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా జోనల్ కమిషనర్లు, సహాయక ప్రణాళిక అధికారులు, ప్రణాళిక విభాగం సిబ్బంది, సచివాలయం సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.