Friday, 13 March 2026

Blog

E-పేపర్

క్రిస్మస్ పండుగ సందర్భంగా మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేసిన వ్యాపార వేత్త గోళ్ళ రాజేష్

నంద్యాల పట్టణంలోని జ్ఞానాపురం పెద్ద చర్చి సమీపంలోని గూడెంలో కార్యనిర్వాకులు సీనియర్ రిపోర్టర్ ఏపీయుడబ్ల్యూజే నంద్యాల ఉపాధ్యక్షులు నూర్ భాషా ఆధ్వర్యంలో నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త గొళ్ళ రాజేష్ ఆదేశాలతో క్రిస్మస్ పండుగ సందర్భంగా పేద మహిళలకు వ్యాపార వేత్త గోళ్ళ రాజేష్ సౌజన్యంతో ఉచితంగా చీరలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమాలను నిర్వహించే సమన్వయకర్త, సీనియర్ పాత్రికేయులు నూర్ బాషా ఆధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వక్తలు క్రిస్టియన్ జేఏసీ నాయకులు జానయ్య, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల్ల రహీం, సిపిఎం నాయకులు నర్సింహులు,శివరామిరెడ్డి, దైవ సేవకులు పాస్టర్లు తదితరులు మాట్లాడుతూ నంద్యాల పట్టణ వాసి, వ్యాపారవేత్త గొళ్ళ రాజేష్ స్థానికంగా వ్యాపార రిత్యా అందుబాటులో లేనప్పటికీ తాను నమ్మే సిద్ధాంతం ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్న ఉద్దేశంతో ఇప్పటికే నంద్యాల పట్టణ ప్రాంతాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు అందించి క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలనే తలంపుతో ప్రతి ఒక్కరూ బాగుండాలని ఆయన కోరిక మేరకు ఈ రోజు దాదాపు 200 మందికి పైగా చీరలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన యేసు ప్రభు వారిని ప్రార్థిస్తూ ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి కోవత్తుల దీపాకాంతులతో క్రిస్మస్ పర్వదినం సంతోషాలను పంచుకోవడం జరిగింది. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న గోళ్ళ రాజేష్ ఏసుక్రీస్తు పుట్టిన రోజు పవిత్రమైన క్రిస్మస్ పండుగను పేద మహిళలు కూడా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని తన వంతు సహాయంగా ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ గోళ్ళ రాజేష్ తమకు ఉచితంగా చేరాలను ఇవ్వడం మరువలేనిదని, ఆయన చల్లగా ఉండాలని ఏసుక్రీస్తు కృప ఆయన మీద ఉండాలని దీవించారు. ఈ పండుగ సమయాన తమకు చీరలు ఇవ్వడం సంతోషకరమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య ప్రదర్శన ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల రహీం,ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల క్రిస్టియన్ జేఏసీ కన్వీనర్ మన్నెం జానయ్య, సిపిఎం జిల్లా నాయకులు పుల్లా నరసింహులు, చిరు వ్యాపారస్తుల సంఘం నంద్యాల ఉపాధ్యక్షులు చంద్రపాల్,శివ రామిరెడ్డి, దైవ సేవకులు పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరు లో ఘనంగా అటల్ జయంతి వేడుకలు

అటల్ జయంతి వేడుకలు… వింజమూరు మండలం బీజేపీ అధ్యక్షులు అంబటి ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీస్ లో భారత్ రత్న,మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి 101 వ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. అణువణువునా దేశభక్తి… కణకణమున హిందుత్వాను రక్తి… ఎంత ఎత్తుకు ఎదిగినా నేలపైననే చూపు ఉండాలని కోరుకున్న సమున్నత జ్ఞానమూర్తి…తన మాటతో మంత్రముగ్ధుల్ని చేసిన అసామాన్య వచోధృతి… తన తనువు, మనస్సు సర్వం భరతమాతకే అంకితం చేసిన త్యాగశీలి, అజాతశత్రువు, మాజీ ప్రధాని, భారతరత్నస్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయి గారు భారత రాజకీయ యవనికపై అజాతశత్రువు, అపూర్వ వాగ్ధాటి కలిగిన కవి, దూరదృష్టి గల మహోన్నత నాయకుడు, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి అటల్ జీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న ‘సుపరిపాలన దినోత్సవం’ (Good Governance Day) . పారదర్శకమైన, జవాబుదారీతనం గల పాలనే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.భారతదేశ కీర్తిని దశదిశలా చాటిన రాజనీతిజ్ఞుడు, అణు పరీక్షలతో భారత్ సత్తాను ప్రపంచానికి చాటిన ధీశాలి అటల్ జీ. ఆయన ఆశయాలే మనకు మార్గదర్శకం. స్వర్ణ చతుర్భుజీ, గ్రామ సడక్ యోజన, దీపం పధకం, పొక్రాన్ అణు పరీక్షలు ఈ కార్యక్రమం లో నాయకులు మల్లం కొండారెడ్డి, దాసరి ప్రసాద్, నాగేంద్ర, డి నారాయణ రెడ్డి, రాజ రమేష్, బీవీ సురేష్ ఇతర నాయకులు పాల్గొన్నారు

E-పేపర్

ఆదిబట్ల పి. యస్. పరిదిలో పేకాట స్థావరంపై దాడి

పున్నమి ప్రతినిధి: ఆదిబట్ల పి. యస్. పరిదిలో పేకాట స్థావరంపై దాడి ఈరోజు అనగా తేది. 25.12.2025 నాడు మద్యాహ్నం నాదర్గుల్ గ్రామ పరిదిలో ఉన్న న్యూ శాంతి నగర్ కాలనీలో ఉన్న ఒక ఇంటి లో ఉన్న పెంట్ హౌస్ లో కొంత మంది డబ్బులు పెట్టి మూడు ముక్కలాట పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో ఆదిబట్ల పోలీసు వారు రైడ్ చేసి అక్కడ పేకాట ఆడుతున్న ఆరుగురు నేరస్తులను పట్టుబడి చేసినారు. వారి వద్ద నుంచి మొత్తం Rs.50,560/- రూపాయలను, 6 మొబైల్ ఫోన్ లను మరియు 03 సెట్ ల పేక ముక్కలను స్వాదీనం చేసుకున్నారు. *నిందితుల వివరాలు:* 1). చింత రవి S/o లింగన్న, వయస్సు: 40 సంవత్సరాలు, Caste: మేదరి, Occ: వుడ్ బిసినెస్, R/o: నియర్ రెలియన్స్ సూపర్ మార్కెట్, చంద్రయాంగుట్ట, హైదరాబాద్. N/o: దమన్నపేట్ గ్రామం, కమ్మర్ పల్లి మండల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లా. 2) బొమ్మిడి రంజిత్ కుమార్ S/o శంకర్, వయస్సు: 30 సంవత్సరాలు, Caste: మేదరి, Occ: బిసినెస్, R/o: ప్లాట్ నంబర్: 81, శంక్ కాలనీ, కాప్రా, హైదరాబాద్. 3) సూరినిడా రాజేందర్ S/o పొశెట్టి, వయస్సు: 40 సంవత్సరాలు, Caste: మేదరి, Occ: బిసినెస్, R/o: ప్లాట్ నంబర్: 39, MRR కాలనీ, తొర్రూర్ గ్రామం, అబ్దుల్లాపుర్మెట్ మండల్, రంగారెడ్డి జిల్లా. 4) ఏనుగందుల నరేందర్ S/o లింబయ్య, వయస్సు: 46 సంవత్సరాలు, Caste: మేదరి, Occ: లేబర్, R/o: బాలాపూర్ x రోడ్, బాలాపూర్ గ్రామం & మండల్, రంగారెడ్డి జిల్లా. N/o: బీమ్ గల్ గ్రామం & మండల్, నిజామాబాద్ జిల్లా. 5) సూరినిడా ప్రభాకర్ S/o పొశెట్టి, వయస్సు: 38 సంవత్సరాలు, Caste: మేదరి, Occ: బిసినెస్, R/o: ప్లాట్ నంబర్: 39, MRR కాలనీ, తొర్రూర్ గ్రామం, అబ్దుల్లాపుర్మెట్ మండల్, రంగారెడ్డి జిల్లా. N/o: చేపూర్ గ్రామం, నిజామాబాద్ జిల్లా. 6) మాధ బాలకృష్ణ S/o బాలయ్య, వయస్సు: 34 సంవత్సరాలు, Caste: మేదరి, Occ: లేబర్, R/o: ప్లాట్ నంబర్: 206, సాయి నగర్ కాలనీ, ECIL, కుషాయిగూడ, హైదరాబాద్.

తెలంగాణ పిల్లలకు పెద్దపల్లి విద్య విజ్ఞానం హైదరాబాద్

విహార యాత్రలతో విద్యార్థులకు విజ్ఞానం

_మంథని మండల విద్యాధికారి దాసరి లక్ష్మీ_ మంథని, డిసెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి ): పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం బుధవారం హైదరాబాద్‌లోని ప్రముఖ చారిత్రక, విజ్ఞాన కేంద్రాలను విజ్ఞాన విహార యాత్రలో భాగంగా సందర్శించారు. ఈ యాత్రలో విద్యార్థులు గోల్కొండ కోట, చార్మినార్, బిర్లా సైన్స్ మ్యూజియం, నెహ్రూ జూ పార్క్‌లను సందర్శించి ఆయా ప్రాంతాల చరిత్ర, ప్రాధాన్యతలను తెలుసుకున్నారు.గోల్కొండ కోట, చార్మినార్‌లను సందర్శించిన సందర్భంగా వాటి నిర్మాణ శైలి, చారిత్రక నేపథ్యంపై అవగాహన పొందిన విద్యార్థులు ఆసక్తి వ్యక్తం చేశారు. నెహ్రూ జూ పార్క్‌లో వివిధ జంతువులు, పక్షులను పరిశీలిస్తూ వాటి జీవన విధానాలపై అవగాహన పెంచుకున్నారు. బిర్లా సైన్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన శాస్త్రీయ ప్రదర్శనలు, ప్రయోగాలు, డైనోసార్ నిజ అస్థిపంజరం, వృక్ష శిలాజాలను చూసి విద్యార్థులు ఎంతో ఉత్సాహం కనబరిచారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, మంథని మండల విద్యాధికారి దాసరి లక్ష్మి మాట్లాడుతూ.. ఇలాంటి విజ్ఞాన విహార యాత్రల ద్వారా విద్యార్థులకు వినోదంతో పాటు విజ్ఞానం చేకూరుతుందని, అనుభవపూర్వకంగా నేర్చుకున్న విషయాలు జీవితాంతం గుర్తుండిపోతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాసం శివలీల, కర్రు సురేష్, కాసిపేట భూమయ్య, వడ్లకొండ స్వామి, రవీందర్, దాసరి నరేందర్, మూడెత్తుల సమ్మయ్య, సుప్రజ, విద్యార్థులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

ఖమ్మంపల్లిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

_క్రైస్తవ సోదర సోదరీమణులకు సర్పంచ్ నక్క రాజేశ్వరి రాజయ్య దంపతుల శుభాకాంక్షలు_ మంథని, డిసెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి ):పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలో క్రైస్తవ సోదర సోదరీమణులు క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రత్యేక ప్రార్థనలు, వేడుకలు నిర్వహించగా గ్రామ సర్పంచ్ నక్క రాజేశ్వరి – రాజయ్య దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జాన్ వెస్లీ (ఫేత్ బాప్టిస్ట్ చర్చ్), సాముల జీసస్ (ప్రేయర్ చర్చ్) ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను సర్పంచ్ దంపతులు ఆవిష్కరించారు. అనంతరం క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నక్క రాజేశ్వరి మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. గ్రామంలో అన్ని మతాల ప్రజలు సోదరభావంతో కలిసి పండుగలు జరుపుకోవడం ఆనందకరమని అన్నారు. క్రైస్తవులందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, క్రైస్తవ సంఘ నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

రంగారెడ్డి

బాలాపూర్ లొ ఘనంగా అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకలు

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 06 :బాలాపూర్ మండల కేంద్రంలో బిజెపి నాయకులు రామిడి శేఖర్ రెడ్డి, పెద్దింటి సుధాకర్, మునగాల ప్రభాకర్ రెడ్డి ల ఆధ్వర్యంలో జరిగిన అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకల్లో బిజెపి కార్యవర్గ సభ్యులు కోలన్ శంకర్ రెడ్డి రాష్ట్ర ముఖ్య అతిధీ గా పాల్గొని మాట్లాడతు రాజకీయలలో నైతిక విలువలకు మారుపేరు అటల్ బిహారీ వాజ్ పేయి అని 6 సం లలో దేశ వ్యాప్తంగా అభివృద్ధిని పునాదులు వేసిన ఘనత వాజపేయ్ కి దక్కింది అన్నారు అజాత శత్రువు అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కల్లెం లక్ష్మ రెడ్డి, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పెద్దింటి సుధాకర్, కొంతం సంపత్ రెడ్డి, రామిడి శేఖర్ ఏ, మునగాల ప్రభాకర్ రెడ్డి, బాలకృష్ణ, లక్ష్మణ్ రాజు, సంబే రవికుమార్, కమల కుమార్, శశిబాబు, సూర్యప్రకాష్, రామిడి మహేందర్ రెడ్డి, రాజు గౌడ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ పెద్దపల్లి హైదరాబాద్

ఐదుతరాల అపురూప సమ్మేళనం

_ఒక్క వేదికపై 200 మంది కుటుంబ సభ్యులు_ హైదరాబాద్/మంథని, డిసెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి ): ఉమ్మడి కుటుంబాలు క్రమంగా కనుమరుగవుతూ, కుటుంబ విలువలు ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత కాలంలో ఐదు తరాల వారసులు ఒకే వేదికపై కలుసుకున్న అపురూప ఘట్టం అందరినీ ఆకట్టుకుంది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కొంతం కిష్టయ్య కుటుంబ వారసులు గురువారం హైదరాబాద్ కొండాపూర్‌లోని అపర్ణా సెరేన్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన కుటుంబ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 200 మంది సభ్యులు ఒక్కచోట చేరి ఆనందోత్సాహాలతో వేడుక జరుపుకున్నారు. ఈ సమ్మేళనంలో 80 ఏళ్ల వృద్ధులు మొదలుకొని ఆరు నెలల శిశువుల వరకు అయిదు తరాలకు చెందిన కుటుంబ సభ్యులు పాల్గొనడం విశేషంగా నిలిచింది. సామాన్య నేపథ్యం నుంచి జీవితం ప్రారంభించిన ఈ కుటుంబం, చదువునే ఆయుధంగా మలుచుకుని తరం తరంగా ఎదిగి, నేడు వివిధ రంగాల్లో నాయకత్వ స్థానాలకు చేరుకోవడం అనేక మందికి స్ఫూర్తినిచ్చింది. వేడుక సందర్భంగా కుటుంబ సభ్యులు తమ పూర్వీకులు ఎదుర్కొన్న కష్టాలను స్మరించుకుంటూ, నేటి తరాల విజయాలను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. మూలాలను మరువకుండా, విద్య ద్వారా జీవితాన్ని మలుచుకోవచ్చని ఈ కుటుంబం మరోసారి నిరూపించిందని పలువురు వ్యాఖ్యానించారు. పెద్దల ఆశీస్సులు, చిన్నారుల చలాకితనం కలగలసిన ఈ కార్యక్రమం ఒక మధుర అనుభూతిగా నిలిచింది. ఈ సందర్భంగా కొంతం కిష్టయ్య కుటుంబ వంశవృక్షాన్ని చిత్రరూపంలో ప్రదర్శించారు. అనంతరం ప్రతి కుటుంబ శాఖకు చెందిన సభ్యులు తమ పరిచయాలను చేసుకున్నారు. చిన్నారుల కళా ప్రదర్శనలు, ఆటపాటలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంథని ఫ్యామిలీ గ్రూప్ వాట్సాప్ బృందం ఈ సమ్మేళనానికి రూపకల్పన చేసి విజయవంతంగా నిర్వహించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి, అలాగే విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చలిని, ప్రయాణ వ్యయప్రయాసలను లెక్కచేయకుండా కుటుంబ సభ్యులంతా ఉత్సాహంగా హాజరయ్యారు. కుటుంబ పెద్దల విలువలు, సభ్యుల ఫొటోలు, పరిచయాలతో కూడిన ప్రత్యేక స్మారక పుస్తకాన్ని ప్రచురించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇలాంటి కుటుంబ సమ్మేళనాలు నేటి సమాజానికి అత్యంత అవసరమని, తరతరాల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేస్తాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్

హైదరాబాద్‌–సికింద్రాబాద్‌లో క్రిస్మస్ వేడుకలు

హైదరాబాద్‌ మరియు సికింద్రాబాద్‌ నగరాల్లో క్రిస్మస్ పండుగ ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. డిసెంబర్‌ 25న యేసు క్రీస్తు జన్మదినాన్ని స్మరించుకుంటూ క్రైస్తవులు ప్రార్థనలు, ప్రత్యేక పూజలతో ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. నగరంలోని ప్రసిద్ధ చర్చిలైన మెదక్‌ కేథడ్రల్‌, సెయింట్‌ జోసెఫ్‌ కేథడ్రల్‌, సెయింట్‌ మేరీస్‌ బసిలికా తదితర చర్చిలు అందమైన దీపాల అలంకరణతో వెలుగొందుతాయి. క్రిస్మస్ ఈవ్ రోజున అర్థరాత్రి ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. చర్చిల్లో కేరోల్స్‌ పాటలు, యేసు జననం సూచించే క్రిబ్‌ అలంకరణలు భక్తులను ఆకట్టుకుంటాయి. నగరమంతా క్రిస్మస్ చెట్లు, సాంటా క్లాజ్‌ బొమ్మలు, నక్షత్రాలతో శోభిల్లుతుంది. హైదరాబాద్‌–సికింద్రాబాద్‌లలో క్రిస్మస్ కేవలం క్రైస్తవుల పండుగగా కాకుండా అన్ని మతాల ప్రజలు కలిసి జరుపుకునే పండుగగా మారింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ కేకులు, స్వీట్లు పంచుకుంటారు. ఈ పండుగ నగరంలో సోదరభావం, ఐక్యత, ప్రేమను మరింత బలపరుస్తుంది.

అన్నమయ్య

చిట్వేల్ ప్రజలకు ఎస్సై వినోద్ కుమార్ క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చిట్వేల్ పోలీస్ స్టేషన్ ఎస్సై ఎస్. వినోద్ కుమార్ మండల ప్రజలకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక అయిన క్రిస్మస్ పండుగ ప్రతి కుటుంబానికి ఆనందాన్ని, శుభసమృద్ధిని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎస్సై వినోద్ కుమార్ మాట్లాడుతూ – క్రిస్మస్ సందేశమైన సోదరభావం, మానవత్వం సమాజంలో మరింత విస్తరించాలని అన్నారు. అన్ని మతాలు, వర్గాలు పరస్పర గౌరవంతో మెలగాలని, శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. పండుగ వేళల్లో ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిల వద్ద, రద్దీ ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిట్వేల్ మండల ప్రజలంతా ఆనందోత్సాహాలతో, సుఖశాంతులతో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ఎస్సై వినోద్ కుమార్ మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.

E-పేపర్

మీకు తెలుసా 3 సార్లు ఫెయిలైతే సర్పంచ్ తొలగింపు

పున్నమి ప్రతినిధి: మీకు తెలుసా 3 సార్లు ఫెయిలైతే సర్పంచ్ తొలగింపు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లో సర్పంచ్లకు అధికారాలతో పాటు విధుల గురించి ప్రస్తావించారు. కేటాయించిన నిధులు సరిగా ఖర్చు చేయకుంటే పాలకవర్గం మొత్తాన్ని రద్దు చేయొచ్చు. ఇక 2 నెలలకు ఓ సారి జరగాల్సిన గ్రామసభలు వరుసగా 3 సార్లు నిర్వహించకపోయినా సర్పంచ్ను తొలగించవచ్చు. ప్రజలకు అవగాహన, చైతన్యం పెరిగిన నేపథ్యంలో పాలకులు ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా పదవులు ఊడే అవకాశముంది జాగ్రత్త

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.