Tuesday, 28 April 2026

Blog

తిరుపతి

రక్తదాన శిబిరంలో సామాజిక బాధ్యత చాటుకున్న చిందేపల్లిగ్రామస్తులు

ఏర్పేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామంలో గురువారం నాడు రక్తదాన శిబిరం నిరావహించారు. స్థానిక శ్రీ ద్రాక్షాయని, పార్వతీ సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త డాక్టర్ గంగలపూడి గిరిధర్ రెడ్డి అధ్యక్షతన ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతికి చెందిన రక్షణ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు ఈ శిబిరంలో పాల్గొని రక్తాన్ని సేకరించారు. గ్రామానికి చెందిన సుమారు 35 మంది యువకులు, పెద్దలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ముఖ్యంగా చిందేపల్లి గ్రామం నుండి తిరుపతిలోని ఎస్జీఎస్ కళాశాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆదుకోవడానికి రక్తదానం ఎంతో మేలు చేస్తుందని, ఈ శిబిరానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

తిరుపతి

ఉత్సాహంగా ఎమ్మెల్యేల క్రికెట్ టోర్నీ.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసిన యువనేతలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: విజయవాడ వేదికగా జరుగుతున్న శాసనసభ మరియు శాసనమండలి సభ్యుల క్రికెట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఈ పోటీలలో భాగంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి చురుగ్గా పాల్గొని తన క్రీడా ప్రతిభను చాటుకుంటున్నారు. రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు, ఒత్తిడిని అధిగమించి క్రీడల్లో పాల్గొనడం గమనార్హం. ఈ క్రీడా వేడుకల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. క్రీడా మైదానంలో తమ నాయకుడిని కలవడం, ఆయన ఆడుతున్న తీరును ప్రత్యక్షంగా చూడటం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నమయ్యే తమకు, ఇలాంటి క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని తోటి ప్రజాప్రతినిధులతో కలిసి ఆడుతుండటం వల్ల స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మీడియా ఇంచార్జ్ నాగమల్లి దుర్గాప్రసాద్, నాయకులు కన్నలి ప్రతాపరెడ్డితో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన జట్టు విజయం సాధించాలని ఆకాంక్షించారు.

తిరుపతి

లబ్ధిదారుల చెంతకేళ్లి సి. యం.ఆర్. యఫ్. చెక్కులిచ్చిన ఎమ్మెల్యే సతీమణి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: శ్రీకాళహస్తి పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషిత రెడ్డి స్వయంగా అందజేశారు. మానవీయ కోణంలో ఆమె లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి చెక్కులను పంపిణీ చేయడం విశేషం.వ్యాధి తీవ్రతను బట్టి ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ. 30,000 నుండి గరిష్టంగా రూ. 2, 96,050 వరకు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరు చేసింది. పట్టణంలోని నెహ్రూ స్ట్రీట్, ఎంజీ స్ట్రీట్, పద్మశాలిపేట, ఉప్పు వీధి, అరుందతి వాడ, గాంధీ వీధి, ఎన్టీఆర్ నగర్, శ్రీరామ్ నగర్ కాలనీ వంటి 17కు పైగా ప్రాంతాల్లో బాధితులకు ఈ సాయం అందింది. ఈ సందర్భంగా రిషిత రెడ్డి మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంగా మారిందన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రజా సేవలో ఎమ్మెల్యే కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని ఆమె పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రభుత్వం, ఎమ్మెల్యే కుటుంబం తమను ఆదుకోవడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

తిరుపతి

చిచ్చరపిడుగుల ‘కథల’ లోకం-నారాయణ పాఠశాలలో ఘనంగా కథల పోటీలు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: శ్రీకాళహస్తి పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసేందుకు నిర్వహించిన ‘కహానియన్ క క్యారవన్ (కథల ప్రయాణం) కార్యక్రమం కనువిందుగా సాగింది. నర్సరీ నుండి PP2 తరగతుల వరకు మొత్తం 42 మంది చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొని తమ వాక్చాతుర్యాన్ని చాటుకున్నారు.చిన్న వయస్సులోనే వేదికపై నిలబడి నీతికథలు, జంతువుల కథలు మరియు ప్రేరణాత్మక కథలను చిన్నారులు ముద్దుగా వినిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. కథ చెప్పే తీరు, భావ వ్యక్తీకరణ, ఉచ్చారణ మరియు వారు ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రాతిపదికగా తీసుకుని న్యాయనిర్ణేతలు విజేతలను ఎంపిక చేశారు. ఏజిమ్ శ్రీనివాసులు, కోఆర్డినేటర్ చూడామణి, ఆర్.ఐ కిరణ్, ఈ-కిడ్స్ వైస్ ప్రిన్సిపల్ మఫ్రీన్ పాల్గొని చిన్నారులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, భవిష్యత్తులో మరిన్ని సృజనాత్మక పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్లు సింధూజ, మల్లిక, ప్రభావతి, అరుణ, వెంకటలక్ష్మి, చందన, మమతలతో పాటు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

తిరుపతి

బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా ఇంచార్జిగా కోలా ఆనంద్ నియామకంపై సర్వత్ర హర్షం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, నిబద్ధత గల నాయకులు కోలా ఆనంద్ కి పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. ఆయనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి కిసాన్ మోర్చా ఇంచార్జిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిని, రైతు సమస్యలపై ఆయనకు ఉన్న అవగాహనను గుర్తించి ఈ పదవిని కట్టబెట్టినట్లు తెలుస్తోంది. కోలా ఆనంద్ కిసాన్ మోర్చా ఇంచార్జిగా నియమితులవడం పట్ల ఆయన స్నేహితులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి నాయకుడిగా ఎదిగిన ఆనంద్ కి ఈ పదవి దక్కడం పట్ల సర్వత్ర సానుకూల స్పందన లభిస్తోంది. రైతు సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే ఆయన నాయకత్వంలో కిసాన్ మోర్చా మరింత బలోపేతం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు మాట్లాడుతూ.. “కోలా ఆనంద్ తమ అంకితభావంతో పార్టీలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భవిష్యత్తులో ప్రజలకు సేవ చేసేందుకు మరిన్ని పెద్ద బాధ్యతలు ఆయనను వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము” అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బిజెపి శ్రేణులు మరియు రైతాంగం నుంచి ఆయనకు అభినందనల వెల్లువ కొనసాగుతోంది.

తిరుపతి

ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాలలకు జీవన నైపుణ్యాలపై అవగాహన సదస్సు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: శ్రీకాళహస్తి రూరల్ మండలం పాపన్నపల్లి గ్రామంలో ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లైఫ్ స్కిల్స్ మాడ్యూల్స్ జీవన నైపుణ్యాలపై బాలలకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రగతి స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం కోఆర్డినేటర్ నారాయణ మాట్లాడుతూ బాల్య దశలోనే జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని స్వీయ గుర్తింపు సమూహ గుర్తింపు విభిన్న రకాల ఆలోచనలలోని తేడాలు ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించడం కాలానుగుణంగా నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం జీవితంలో ఎదురయ్యే బాల్య దశ నుండి ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొని నైపుణ్యాలు పెంపొందించుకుని ఇతరుల కంటే భిన్నంగా అభివృద్ధి సాధించాలని బాలలకు సంబోధించారు స్వీయ గుర్తింపులో వ్యక్తుల వయస్సు లింగం విద్యా సామర్థ్యం వైకల్యం ప్రతిభ పిల్లల అభివృద్ధి వివిధ దశల్లో జరుగుతుందని మరియు వారి పరిసరాల ప్రభావంతో పిల్లలకు స్వతంత్రంగా తమ పనులను పూర్తి చేసే అవకాశం కల్పించాలని అప్పుడు తమదైన శైలిలో భిన్నంగా ఆలోచించి అసాధారణంగా తమ శక్తి సామర్థ్యాలు వివిధ రంగాల్లో ప్రదర్శిస్తారని తెలిపారు రేణిగుంట పాప నాయుడుపేట ఏర్పేడు మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీకాళహస్తి మండల కన్వీనర్ చంద్రశేఖర్ ఏర్పేడు మండల కన్వీనర్ శిరీష రేణిగుంట మండల కన్వీనర్ జయలక్ష్మి ప్రగతి సిబ్బంది రామచంద్ర మురగయ్య వెంకటేశు సురేషు సుభాష్ చంద్రబోస్ విద్యార్థులు పాల్గొని వివిధ రకాల ప్రదర్శనలు నిర్వహించారు.

తిరుపతి

12వ అదనపు కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ ఎన్నికైన అడ్వొకేట్ జైసారధి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: శ్రీకాళహస్తిలోని కోర్టు సముదాయంనందుఉన్న 12వ అదనపు అడిషనల్ జిల్లా కోర్టుకి పబ్లిక్ ప్రాసిక్యూటర్.. ఏపీ ప్రభుత్వంచే ఎన్నికైన న్యాయవాది దారపనేని జైసారధి నీ పలువురు న్యాయవాదులు.. ఆయన అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. 12 అదనపు జిల్లా న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్ దారపనేని జైసారధి మాట్లాడుతూ..తను గత 30 సంవత్సరాలుగా శ్రీకాళహస్తిలో న్యాయవాదిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, న్యాయస్థానంలోని పలు పదవులతో అనేక మందికి సేవలు అందించానని, తన సేవలను గుర్తించి నేడు ఏపీ ప్రభుత్వం తనని శ్రీకాళహస్తిలోని 12వ అదనపు జిల్లా న్యాయస్థానానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందే విధంగా తాను కృషి కృషి చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా తాను న్యాయపక్షాన నిలబడతానన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు గరికిపాటి రమేష్. తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

500 సంవత్సరాలు చరిత్ర కలిగిన శివయాలనికి శంకుస్థాపన

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: శ్రీకాళహస్తి మండలం చుక్కల నిడిగల్లు గ్రామపంచాయతీ సంబంధించిన చుక్కలు నిడిగల్లుఎస్టీ కాలనీలో గురువారం నాడు శివయ్యకు శంకుస్థాపన, బాలలయం కార్యక్రమం నిర్వహించి అనంతరం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి.ఎస్.పి నరసింహమూర్తి, ఎక్సైజ్ సీఐ లావణ్య, ఐ సి డి సి ప్రాజెక్టు అధికారి దుర్గా ప్రియాంక బోడి దేవాలయం కమిటీ సభ్యులు అర్చకులుపాల్గొని కార్యక్రమం నిర్వహించారు. నాలుగు కలశాల సుగంధ ద్రవ్యాలతో స్వామికి శాస్త్రపరంగా పూజలు నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. గత 500 సంవత్సరాలు చరిత్ర కలిగిన పురాతన కాలమైన ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శివయ్యకు నీడ కలిగినందుకు చుక్కలు నిడుగల్లు భక్తులు ఆనంద వ్యక్తం చేశారు గ్రామం పచ్చగా ఉండాలని ఊరు అభివృద్ధి కావాలని కోరుకున్న వారు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొమ్మలపూడిలో క్షయ రోగి కుటుంబాన్ని పరామర్శించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో క్షయ వ్యాధిగ్రస్తుడి కుటుంబాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి డాక్టర్ నితీష్ రామ్ స్వయంగా పరామర్శించారు. రోగికి మందులు సకాలంలో అందుతున్నాయా, ఆర్థిక సహాయం చేరుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు. రోగి కుటుంబం సంతృప్తికర సమాధానాలు ఇవ్వగా వైద్య బృందం అభినందించింది. సమయానికి మందులు తీసుకుని త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షయ నివారణ అధికారి దేవ గణేష్, జిల్లా అదనపు వైద్యాధికారి ఖాదరవల్లి తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

రాష్ట్రస్థాయి సైన్స్ పోటీలకు చిట్వేల్ విద్యార్థులు.

సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సైన్స్ సమగ్ర శిక్ష మహోత్సవం పోటీలకు పి.ఎం.శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిట్వేల్ విద్యార్థులు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయులు బి.దుర్గరాజు తెలిపారు.పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుల సహకారంతో వివిధ విభాగాల కింద విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ఈనెల 23వ తేదీన ఆన్లైన్ విధానం ద్వారా సమర్పించగా, అందులో పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఎ.శివన్నారాయణ గౌడ్ మార్గదర్శకత్వంలో ఏ.సుస్మిత వి.దివ్యశ్రీ మరియు ఆర్. కుషాల్ రూపొందించిన రాకెట్ మోడల్ ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.దుర్గరాజు మాట్లాడుతూ, సైన్స్ సమగ్ర మహోత్సవం పోటీల ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్కోణం అభివృద్ధి చెందడం,రోజువారీ జీవితంలో శాస్త్రాన్ని ఎలా ఉపయోగించాలో అవగాహన పెరుగుతుందని,అనుభవాత్మక అభ్యసనంను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులలో స్వయంకృషి, పరిశోధనాత్మక దృక్కోణం అభివృద్ధి చెందుతుందని, జాతీయ విద్యా విధానం- 2020 లక్ష్యాల సాధనకు తోడ్పాటు,విద్యార్థుల ప్రతిభను సమాజం నేరుగా చూసే అవకాశం లభిస్తుందని,స్కూళ్లలో ఆరోగ్యకరమైన పోటీ, సృజనాత్మకతకు ప్రోత్సహిస్తుందని,డిజిటల్ లిటరసీ & స్టెమ్ నైపుణ్యాలకు బలం చేకూరుస్తుందని అన్నారు.అలాగే ప్రతిష్టాత్మకమైన ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కవర్ పేజీ నందు ఆన్లైన్ ద్వారా విద్యార్థులు సమర్పించిన ప్రాజెక్టు ఫోటోలకు స్థానం దక్కడం పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సైన్సు ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, సోఫియా, కళావతి, సుహాసిని, సునీత కుమారి మొదలగు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.