Friday, 13 March 2026

Blog

తిరుపతి

01 హోం మంత్రితో కలిసి గంగమ్మ సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 26: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి తిరుపతిలోని పుణ్యక్షేత్రంలోని తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, సాప్ (SAP) చైర్మన్ రవినాయుడు, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.

గూడూరు

వీర్ బల్ దివస్‌ను శ్రద్ధాసక్తులతో జరుపుకున్న ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

గూడూరు @ 26 డిసెంబరు ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ‘వీర్ బల్ దివస్‌’ ను పురస్కరించుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో వీర్ బల్ దివస్‌ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, గణిత శాస్త్ర అధ్యాపకురాలు మరియు ఇంచార్జి ప్రిన్సిపాల్ కిరణ్మయి, అధ్యాపకులు డాక్టర్ గోవిందు సురేంద్ర, డాక్టర్ పీర్ కుమార్ తదితరులు మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 9, 2022న సాహస బాలల (పదవ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ చిన్న కుమారులు సాహిబ్‌జాదా జోరావర్ సింగ్ మరియు సాహిబ్‌జాదా ఫతే సింగ్‌) స్మారకార్థం డిసెంబర్ 26ను ‘ వీర్ బాల్ దివస్గా’ ప్రకటించారని, అప్పటినుండి ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ 26న వీర్ బల్ దివస్‌ను జరుపుకుంటున్నామని, చిన్న వయస్సులోనే వారు ప్రదర్శించిన అచంచలమైన అసాధారణ ధైర్యం, విశ్వాసం మరియు ధర్మం పట్ల నిబద్ధతను, వారి త్యాగాన్ని గౌరవించటానికి మరియు నేటి తరానికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ దినోత్సవం జరుపుకుంటున్నామని, విద్యార్థినీ విద్యార్థులు మానవత్వ విలువలు పెంపొందించుకుని ధర్మబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి జాతీయస్థాయిలో 20 మందికి పురస్కారాలు ప్రకటించిందని, ధైర్య సాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణం, ఇన్నోవేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు అనే ఆరు విభాగాల్లో సృజనాత్మకత చూపించిన వారికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందిస్తారని, అవార్డులు పొందిన వారి సాహసాలు, విజ్ఞానం దేశానికి గర్వకారణం గా భావించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు లక్ష్మీ హిమబిందు, శ్రీలత, ఉష, రమేష్ తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

అన్ని ఫైళ్లూ ఈ-ఆఫీస్ విధానంలోనే పంపించాలి* * జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

*అన్ని ఫైళ్లూ ఈ-ఆఫీస్ విధానంలోనే పంపించాలి* * జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ *విశాఖపట్నం డిసెంబర్ 26 పున్నమి ప్రతినిధి * జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇకపై ప్రతి ఫైలు తప్పనిసరిగా ఈ-ఫైల్ రూపంలోనే నిర్వహించాలని, తనకి సమర్పించే ఫైళ్లను కూడా ఈ-విధానంలోనే పంపించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ఫిజికల్ ఫైళ్ల నిర్వహణకు పూర్తిగా స్వస్తి పలికి, ఈ-ఆఫీస్ విధానాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరి 15వ తేదీ తర్వాత ప్రజలకు ప్రభుత్వం అందించే అన్ని సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందించనున్నట్లు గుర్తు చేస్తూ స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17, 18వ తేదీల్లో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంశాలపై వివరించే నిమిత్తం కలెక్టరేట్ మీటింగ్ హాలులో అధికారులతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. *మనమిత్రపై మరింత అవగాహన పెంచాలి* ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ‘మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా సేవలందించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని కలెక్టర్ పేర్కొన్నారు. మనమిత్ర (95523 00009)ను ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ-ఫైల్ విధానం, ఆన్‌లైన్ సేవల అమలుపై జిల్లా స్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టి, నిర్ణీత గడువులో లక్ష్యాలు సాధించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యాలయ ఫైల్ నిర్వహణ, మెమోల జారీ, ఇతర అంశాల్లో ఏజెంట్ స్పేస్, సెర్చ్ బార్ అనే సాంకేతిక సాధనాలను ఉపయోగించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని చెప్పారు.

విశాఖపట్నం

ఎం.వి.పి క్రైమ్ మరియు లా & ఆర్డర్ పోలీసు స్టేషన్ లను సందర్శించి ,ఇన్ స్పెక్షన్ చేసిన కమీషనర్

*విశాఖపట్నం డిసెంబర్ 26పున్నమి ప్రతినిధి* *ఎం.వి.పి క్రైమ్ మరియు లా & ఆర్డర్ పోలీసు స్టేషన్ లను సందర్శించి ,ఇన్ స్పెక్షన్ చేపట్టిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు* *నగరంలో లా & ఆర్డర్ అదుపులో ఉంచుతూ నగరం మొత్తం ప్రశాంతముగా ఉండేలా నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల నందు సిపి గారు రెండవ విడత ఇన్ స్పెక్షన్ చేపట్టడం జరుగుతుంది*, రెండవ విడత ఇన్స్పెక్షన్ లో భాగముగా సిపి గారు ఈ రోజు రాత్రి ఎం.వి.పి క్రైమ్ మరియు లా & ఆర్డర్ పోలీసు స్టేషన్ల నందు ఇన్ స్పెక్షన్ నిర్వహించారు. పోలీసు స్టేషన్ పరిసరాలను సందర్శించిన సీపీ గారు అధికారులు, సిబ్బంది విధులను సమీక్షించి, సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు, స్టేషన్ రికార్డులు అన్నీ సక్రమముగా ఉన్నదీ లేనిదీ పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను జారీ చేయడం జరుగుతుంది. సదరు ఇన్స్పెక్షన్ నందు క్రైమ్ అధికారులు, స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది హాజరు కావడం జరిగినది.

విశాఖపట్నం

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ★ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు చర్యలు

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ★ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు చర్యలు ★ సేవా కార్యక్రమాలలో పోలీసులు భాగస్వామ్యం కావాలి — పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి *విశాఖపట్నం డిసెంబర్ 26పున్నమి ప్రతినిధి* శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు నిబద్ధత తో పని చేయాలని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆయన టూటౌన్ లా అండ్ ఆర్డర్, క్రైం, స్టేషన్ లను సందర్శించారు. ఈ సందర్బంగా డీసీపీ -1 మణికంఠ చందోలు, ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కే.లక్ష్మణమూర్తి, ఇంచార్జ్ క్రైం ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, టూటౌన్ సీఐ వీ.వీ.సీ.ఎం.ఎర్రం నాయుడు, ఈస్ట్ సబ్ డివిజన్ క్రైం సీఐ సీహెచ్.రాజుల నాయుడు, సీసీఎస్ సీఐ కోరాడ రామారావు ఇతర అధికారులు, పండితుల వేదమంత్రోచ్చరణల నడుమ పూర్ణ కుంభంతో పోలీస్ కమిషనర్ కు స్వాగతం పలికారు. అనంతరం సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫ్లవర్ గార్డెన్ ను, మెడికల్ క్యాంపును సిపి ప్రారంభించారు. దివ్యాంగులను పరామర్శించారు. ప్రేమ సమాజం పిల్లలకు, వృద్ధులకు దుప్పట్లు,పండ్లు, పెన్నులు, పుస్తకాలు, బకెట్లు, మగ్గులు, స్టీల్ కంచాలు గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపి డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ సాటివారికి సహాయం చేసే విషయంలో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా స్పందించాలని కోరారు. సేవే దైవంగా భావించాలని చెప్పారు. పోలీసులు విధి నిర్వహణతో పాటు సేవా కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పలువురికి పోలీసులు స్ఫూర్తిదాయంగా నిలవాలని తెలిపారు. అదేవిధంగా ప్రజలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించే విషయంలో చొరవ చూపించాలని చెప్పారు. మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో అసాంఘిక శక్తులకు చెక్ పెట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సమర్థవంతంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ దొంగతనాలు జరుగకుండా చూసుకోవాలని, విస్తృతంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలన్నారు. డయల్‌ 100 కాల్‌ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, విశాఖ దక్షిణ జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ప్రేమ సమాజం పిల్లలకు సీపీతో కలిసి బకెట్లు, మగ్గులు, స్టీల్ కంచాలు గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ వరుసగా సేవా కార్యక్రమాలు చేపడుతూ సాటివారికి సహాయం చేస్తూ వస్తున్న పోలీస్ కమిషనర్ విశాఖ ప్రజల మనసులలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో33వ వార్డు కార్పొరేటర్ బీశెట్టి వసంత లక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు ఎస్ఐలు సతీష్, మన్మధరావు, లక్ష్మి, సంధ్య, రమేష్, క్రైం ఎస్ఐ నాయుడు, అలాగే బి.రాము,ఎం.శ్రీను , సుందర రాజు సాయిబాబా, పురుషోత్తం, అగర్వాల్ హాస్పిటల్, ఎంవిపి తిరుమల విజయ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పదో తరగతి విద్యార్థులకు క‌లెక్ట‌ర్ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ పంపిణీ*

*పదో తరగతి విద్యార్థులకు క‌లెక్ట‌ర్ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ పంపిణీ* *ఆర్థిక సాయ‌మందించిన ఇంగ్లాండ్‌లో నివసిస్తున్న విశాఖవాసి రామ్ గోపాల్ *విశాఖపట్నం డిసెంబర్ 26పున్నమి ప్రతినిధి * ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య శాఖ జారీ చేసిన వందరోజుల ప్ర‌ణాళిక‌కు అనుగుణంగా ప‌దో తరగతి పరీక్షల స్టడీ మెటీరియల్‌ను సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ శుక్రవారం అంద‌జేశారు. వీటి కొర‌కు ఇంగ్లాండ్‌లో నివసిస్తున్న విశాఖవాసి రామ్ గోపాల్ నిధులను స‌మ‌కూర్చారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని సహకారం అందించిన దాతను ఈ సంద‌ర్బంగా క‌లెక్ట‌ర్ అభినందించారు. ఈ స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల‌ని, పరీక్షల్లో ఉత్త‌మ ఫ‌లితాలు సాధించి, జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. వసతి గృహాల్లోని విద్యార్థులందరూ వంద‌ శాతం ఉత్తీర్ణత సాధించేలా కష్టపడి చదవాలని సూచించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె. రామారావు, సహాయ సంక్షేమ అధికారి ఆర్. శ్యామల, ఇత‌ర అధికారులు సత్యవతి, మహేంద్ర మణి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

4వ రాష్ట్ర శిబిరం మరియు ర్యాలీ ప్రారంభం: డీఆర్‌ఎం శ్రీ లలిత్ బోహ్రా*

*4వ రాష్ట్ర శిబిరం మరియు ర్యాలీ ప్రారంభం: డీఆర్‌ఎం శ్రీ లలిత్ బోహ్రా* *విశాఖపట్నo డిసెంబర్ 26పున్నమి ప్రతినిధి* వాల్టైర్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) మరియు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, వాల్టైర్ జిల్లా పక్షాన శ్రీ లలిత్ బోహ్రా, ఈరోజు వాల్టైర్ డివిజన్ క్యాంపింగ్ సెంటర్ ఆధ్వర్యంలో 4వ రాష్ట్ర శిబిరం మరియు ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి జ్యోత్స్నా బోహ్రా, ECoRWWO అధ్యక్షురాలు మరియు స్కౌట్స్ & గైడ్స్ ఉపాధ్యక్షురాలు, పాల్గొన్నారు. డిసెంబర్ 26 నుండి 30, 2025 వరకు జరుగుతున్న ఈ శిబిరంలో, తూర్పు తీర రైల్వేలోని నాలుగు జిల్లాల – సెంట్రల్, ఖుర్దా, వాల్టైర్, మరియు సంబల్‌పూర్ నుండి 300 మంది స్కౌట్స్ మరియు గైడ్స్ క్యాడెట్లు పాల్గొంటున్నారు. క్యాంప్‌ఫైర్, డ్రిల్ మరియు డిస్‌ప్లే పోటీలు, మెలోడ్రామా, రాష్ట్ర ఎక్స్‌పో, మార్చ్-పాస్ట్, గేట్-మేకింగ్, క్యాంప్ క్రాఫ్ట్, ఎక్స్‌హిబిషన్స్, కల్చరల్ ఎక్స్‌ట్రావగంజా, మరియు క్విజ్‌లు వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీ లలిత్ బోహ్రా, స్కౌటింగ్‌లో తన బాల్య అనుభవాలను పంచుకుంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాల్టైర్ జిల్లా స్కౌట్స్ & గైడ్స్ బృందాన్ని ప్రశంసించారు. స్కౌటింగ్ సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేస్తుందని, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంచుతుందని, మరియు సమాజ శ్రేయస్సుకు దోహదపడుతుందని ఆయన నొక్కిచెప్పారు. అరన్యకు సందర్శించి, ఈ శిబిరం మరియు ర్యాలీని చూడాలని పిల్లలతో సహా ప్రజలను ఆయన కోరారు. ADRM/ఆపరేషన్స్ మరియు జిల్లా చీఫ్ కమిషనర్ శ్రీ కె. రామ రావు, సీనియర్ డివిజనల్ ఇన్స్పెక్టర్ మరియు జిల్లా కమిషనర్ (స్కౌట్స్) శ్రీ ఏ.కె. మోహరానా, డివిజనల్ మెడికల్ ఆఫీసర్ మరియు జిల్లా కమిషనర్ (గైడ్స్) డా. భాషిని ప్రియాంక, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ శ్రీ జుసుఫ్ కబీర్ అన్సారీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. డా. భాషిని ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం ప్రారంభమైంది. డీఆర్‌ఎం శ్రీ లలిత్ బోహ్రా, కళాకారులను మరియు నృత్య దర్శకులను ప్రశంసించారు. కె. పవన్ కుమార్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్

విశాఖపట్నం

రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే.

*తిరుపతి డిసెంబర్ 26 విశాఖ పున్నమి ప్రతినిధి* – రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే. – రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం. – పోస్టర్లపై జంతు రక్తం చల్లి భయబ్రాంతులకు గురిచేసే సంస్కృతి ఏమిటి? – గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టిన పోలీసులకు అభినందనలు. – అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు భరోసాగా పోలీసులు. *తిరుపతిలో నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత గారు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ గారు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు. కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా విజిటర్స్ పుస్తకంలో తన అభిప్రాయాలను రాసిన ముఖ్యమంత్రి.

విశాఖపట్నం

సిఐటియు అఖిలభారత మహాసభలు జయప్రదంకై సిఐటియు బైక్ ర్యాలీ

సిఐటియు అఖిలభారత మహాసభలు జయప్రదంకై సిఐటియు బైక్ ర్యాలీ *విశాఖపట్నం డిసెంబర్ 26పున్నమి ప్రతినిధి* విశాఖలో ఈ నెల 31 నుండి జనవరి 4వరకు జరుగుతున్న సిఐటియు అఖిలభారత 18వ మహాసభలను విజయవంతం చేయాలని మద్దిలపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ బైక్ ర్యాలీని ప్రజాశక్తి జనరల్ మేనేజర్ కె. హరికిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ మద్దిలపాలెం ఆఫీస్ నుండి ప్రారంభమై సత్యం జంక్షన్, సీతమ్మధార, హెచి కాలనీ, వెంకోజీపాలెం, ఎంవిపి, వాల్తేరు మీదుగా సిరిపురం నుండి మద్దిలపాలెంకు చేరుకుంది. ఈ సందర్భంగా జోన్ కార్యదర్శి పి. వెంకటరావు మాట్లాడుతూ విశాఖలో జరిగే ఆలిండియా మహాసభలకు వివిధ రాష్ట్రాల నుండి 1500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. ఎయు కన్వెన్షన్ హాల్లో జరిగే మహాసభల్లో ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మికవ్యతిరేక పోరాటాలను చర్చించడం జరుగుతుందన్నారు. 27 నుండి జనవరి 2వ తేదీ వరకు బీచ్డ్డులో ఉన్న ఎయు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో శ్రామిక ఉ త్సవాలను రేపు సాయంత్రం జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తారని, సినీ ప్రముఖులు ప్రకాష్రజ్ ముఖ్యఅతిధిగా హజరవుతున్నారన్నారు. 4న మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో సిఐటియు నాయకులు వి.సరేంద్రకుమార్, కె. కుమారి, శంకర్, శ్రీను, నాయుడు, ఆదినారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

రంగారెడ్డి కలెక్టరేట్ జర్నలిస్టుల ధర్నా జయప్రదం చేయండి* 👉*అక్రిడిటేషన్ జీవో 252ను సవరించాలి* 👉 *ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు సూరమోని సత్యనారాయణ*

కలెక్టరేట్ జర్నలిస్టుల ధర్నా జయప్రదం చేయండి* 👉*అక్రిడిటేషన్ జీవో 252ను సవరించాలి* 👉 *ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు సూరమోని సత్యనారాయణ* పున్నమి న్యూస్ ప్రతినిధి: ఇబ్రహీంపట్నం డిసెంబర్ 26 ) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ జీవో 252ను సవరించాలని కోరుతూ టి యు డబ్ల్యూ జే – హెచ్,143 పిలుపుమేరకు ఈనెల 27న చేపట్టనున్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా జయప్రదం చేయాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టి యు డబ్ల్యూ జే – హెచ్,143 అధ్యక్షులు సూరమోని సత్యనారాయణ కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం ఉదయం 9:30 గంటల వరకు జర్నలిస్టులందరూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నూతనంగా జారీ చే సిన జర్నలిస్టు అక్రిడిటేషన్ జీవో 252ను నిరసిస్తూ ధర్నా చేపడం జరుగుతుందన్నారు. అర్హులైనజర్నలిస్టులందరికీ అక్రిడి టేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టుల జo గ్ సైరన్ పేరిట చలో కలెక్టరేట్ నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని జర్నలిస్టులను కోరారు.రాష్ట్ర రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని, తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.