Friday, 13 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

పెన్షన్ ల కోసం దేశం లోనే అత్యధికం గా ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ :మంత్రి కొల్లు రవీంద్ర

బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో సిసి రోడ్లు, రైతు సేవా కేంద్రం, సచివాలయం ఓపెనింగ్ వంటి పలు ప్రారంభోత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర గనులు, భూగర్భవనరులు,మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రభుత్వం సూపర్ సిక్స్ వంటి పథకాలతో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ, మరోపక్క ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకుంటూ వెళుతుందని ఆయన అన్నారు. పెన్షన్లకే సుమారు 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, అలాగే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మబడి పథకాన్ని వర్తింప చేస్తుందని, సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు పథకం వంటి పథకాలను ప్రవేశపెట్టిందని, స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని మండలాలు, పంచాయితీలు ప్రభుత్వానికి గెలిపించి ఇస్తే మరింత అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుందని ఆయన అన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామని, మచిలీపట్నం పోర్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని దానివల్ల అనుబంధ సంస్థలు వచ్చి ఈ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, దానికి అనుగుణంగానే NH216 రహదారిని ఆరువరుసుల రహదారిగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు.

అనకాపల్లి

ఏటికొప్పాకలో బాల్య వివాహాలపై అవగాహన..!

డిసెంబర్ 27న అనకాపల్లి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి: ఏటికొప్పాక గ్రామ హైస్కూల్‌లో బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా న్యాయవాది నూకరాజు పాల్గొని బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, అవి విద్య, ఆరోగ్యం, భవిష్యత్తును దెబ్బతీస్తాయని వివరించారు. సర్పంచ్ భజంత్రీల లక్ష్మి, వైస్ సర్పంచ్ సింహాచలం, పాఠశాల చైర్మన్, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను పరిశీలించారు.

రంగారెడ్డి

* సమస్యలతో సర్పంచ్ లకు స్వాగతం *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 27 : గ్రామాలలో సర్పంచ్ పాలకమండలి పరిపాలన లేకపోవడంతో గ్రామాలలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామాలలో గ్రామ సర్పంచులు పాలకమండలి సభ్యులు గ్రామాల అభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగా ఉన్నారు. గత సర్పంచులు పాలకమండలి సభ్యులు పదవీకాలం ముగిసిన దగ్గర నుండి గ్రామాలలో సరి అయిన పరిపాలన లేకపోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లు, అభివృద్ధి పథకాలకు ఇచ్చే నిధులు ఆగిపోవడంతో గ్రామాలలో అభివృద్ధి కుంటుబడింది. గ్రామపంచాయతీలకు కొత్త సర్పంచులు రావడంతో వారికి గ్రామాలలో అనేక సమస్యలు తో పాటు అభివృద్ధి పనులు, కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలను అమలుపరచడంలో కీలకం కానున్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం కూడా సర్పంచులు పాలక మండలి సభ్యులే గ్రామాల అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం కానున్నారు. సర్పంచ్ పాలకమండలి ఆధ్వర్యంలో గ్రామాలు అభివృద్ధిలో రూపురేఖలు మారనున్నాయి. కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ లు పాలకమండలి సభ్యులకు గ్రామాలు స్వాగతం పలుకుతూనే, వివిధ సమస్యలు కూడా స్వాగతం పలుకుతున్నాయి. గ్రామపంచాయతీలలో గత సర్పంచులు పాలక మండలి సభ్యులు పదవీకాలం ముగిసిన తర్వాత, దీర్ఘకాలికంగా గ్రామాలలో పరిపాలన లేక అంతర్గత రోడ్లు, డ్రైనేజీ కాలువలు తీయించడం పరిశుద్ధం పనులను చేయించడం విద్యుదీకరణ పనులు స్వచ్ఛమైన త్రాగునీటి సౌకర్యం గ్రామాలలో ప్రజలందరికీ కల్పించడం రైతులకు పంటలు పండించేందుకు సాగునీరు అందించడం, యువతకు, నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకాలను అందించడం, కొన్ని గ్రామాలలో సరియైన రోడ్లు వసతి లేకపోవడం, గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడం, బస్ షెల్టర్ నిర్మించడం, విద్య, వైద్యం, వసతి పేదలందరికీ అందుబాటులోకి గృహం. తీసుకురావడం, కొన్ని గ్రామాలలో కోతుల బెడద వంటి సమస్యలు సర్పంచులకు దర్శనమిస్తున్నాయి. కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన సర్పంచులు పాలక మండల సభ్యులు స్థానిక రాజకీయాలతో సంబంధం తీయించడం పారిశుధ్య పనులను చేయించడం విద్యుదీకరణ పనులు, స్వచ్ఛమైన త్రాగు నీటి సౌకర్యం గ్రామాలలో ప్రజలందరికీ కల్పించడం, రైతులకు లేకుండా గ్రామ ప్రజలందరినీ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ గ్రామాల ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ పదవీకాలంలో గ్రామాలు రూపురేఖలు మార్చాలని గ్రామ ప్రజలను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలని వారిని మనస్ఫూర్తిగా అభినందించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షిద్దాం… ( సంగిశెట్టి ధనుంజయ్ 8074058200 )

జనగాం

వృద్ధులకి దుప్పట్లు పంపిణీ చేసిన తెరోజు అమ్మ

గౌరవనీయులు శ్రీమతి తేరోజ్ అమ్మ wife of late శౌ రెడ్డి గారి( సతీష్ కళామందిర్)ఆధ్వర్యంలో మన ఇప్పగూడెం గ్రామపంచాయతీ సిబ్బంది మరియు వృద్ధులకి సుమారు 50 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ మందపురం రాణి అనిల్ గౌడ్ మరియు ఉప సర్పంచ్ లింగన్న బోయిన రాజు గారు మాజీ సర్పంచ్ కత్తుల కట్టయ్య గారు వార్డ్ మెంబర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగన్న బోయిన శ్రీనివాస్ గారు ఆరుట్ల సందీప్ గారు కృష్ణమూర్తిగారు కారోబార్ శ్రీనివాస్ గారు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రెండు కోట్లు రేషన్ నొక్కేసిన దొంగలు

ఉదయగిరి గోడౌన్ అక్కడి ఉద్యోగులే రేషన్ సరుకులు నొక్కేసినట్లు ఉదయగిరి సీఐ వెంకట్రావు తెలిపారు ఉన్నతాధికారులు ఫిర్యాదు మేరకు అక్కడి కాంట్రాక్టు ఉద్యోగి టెక్నికల్ అసిస్టెంట్ మునాఫ్, డేటా ఇంటర్ ఆపరేటర్ షహీద్, సెక్యూరిటీ రఫీ అరెస్ట్ చేశారు 1.5 రూ కోట్లు విలువైన బియ్యం పంచదార నూనె కందిపప్పు నిందితులు నొక్కేసినట్లు తెలుస్తోంది బహిరంగ మార్కెట్లో విటి విలువ సుమారు 2.10 కోట్లు ఉంటుందని తెలిపారు

E-పేపర్

తస్మాత్ జాగ్రత్త! రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: సీఐ శివప్రసాద్

గన్నవరంలో వాహన తనఖీ నిర్వహణలో భాగంగా యువతకు హెల్మెట్ ధారణ పై అవగాహన కార్యక్రమం రూల్స్ అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు గన్నవరం సీఐ శివప్రసాద్ హెచ్చరిక గన్నవరం: పున్నమి ప్రతినిధి సురేష్ కృష్ణాజిల్లా,గన్నవరం,జాతీయ ప్రధాన రహదారి, స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ ప్రధాన కూడలిలో సీఐ శివప్రసాద్ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు హెల్మెట్ ధారణపై, మైనర్ డ్రైవింగ్ పై అవగాహన కల్పిస్తూ., హెల్మెట్ ధారణ యొక్క ప్రయోజనాలు, హెల్మెట్ ధరించకపోవడం వలన జరుగు ప్రమాదాల గురించి వివరించారు. ఈ క్రమంలో ఎవరికైనా సరే వాహన ధ్రువపత్రాలు సరిగా లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా, హెల్మెట్ ధరించకపోయినా తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శివప్రసాద్ హెచ్చరించారు.

E-పేపర్

తస్మాత్ జాగ్రత్త! రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: సీఐ శివప్రసాద్

గన్నవరంలో వాహన తనఖీ నిర్వహణలో భాగంగా యువతకు హెల్మెట్ ధారణ పై అవగాహన కార్యక్రమం రూల్స్ అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు గన్నవరం సీఐ శివప్రసాద్ హెచ్చరిక గన్నవరం: పున్నమి ప్రతినిధి సురేష్ కృష్ణాజిల్లా,గన్నవరం,జాతీయ ప్రధాన రహదారి, స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ ప్రధాన కూడలిలో సీఐ శివప్రసాద్ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు హెల్మెట్ ధారణపై, మైనర్ డ్రైవింగ్ పై అవగాహన కల్పిస్తూ., హెల్మెట్ ధారణ యొక్క ప్రయోజనాలు, హెల్మెట్ ధరించకపోవడం వలన జరుగు ప్రమాదాల గురించి వివరించారు. ఈ క్రమంలో ఎవరికైనా సరే వాహన ధ్రువపత్రాలు సరిగా లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా, హెల్మెట్ ధరించకపోయినా తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శివప్రసాద్ హెచ్చరించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రమాదకరంగా ఉన్న స్తంభం

ఉదయగిరి లోని ర్ టీ సీ సమీపంలో ఓ విద్యుత్ స్తంభం శిధిలావస్తకు చేరింది ఎప్పుడైనా పడిపోవడానికి సిద్ధంగా ఉంది స్థానికులు ఆందోళన చెందుతున్నారు పలుమార్లు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు రాకపోకలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో స్తంభం ప్రమాదకారంగా ఉందని ఇప్పటికైనా ఉన్నాథికారులు స్పందిoచి శిధిల స్తంభం నీ తొలగించాలని వారు కోరారు.

E-పేపర్

పరుగులు పెడుతున్న పసిడి ధరలు రికార్డు స్థాయిలో ఒక్క రోజులోనే రూ.20 వేలు పెరిగిన కిలో వెండి ధర

పున్నమి ప్రతినిధి: పరుగులు పెడుతున్న పసిడి ధరలు రికార్డు స్థాయిలో ఒక్క రోజులోనే రూ.20 వేలు పెరిగిన కిలో వెండి ధర 6 రోజుల్లోనే రూ.43 వేలు పెరిగిన వెండి ధర.. కిలో వెండి ధర రూ.2,74,000 10 గ్రాములపై రూ.1200 పెరిగి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,220 10 గ్రాములపై రూ.1100 పెరిగి 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,29,450

E-పేపర్

తూర్పు నాయుడుపాలెంలో మత్య్సకారులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద సబ్సిడీకి వలలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి

తూర్పు నాయుడుపాలెంలో మత్య్సకారులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద సబ్సిడీకి వలలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి తూర్పు నాయుడుపాలెం డిసెంబర్ పున్నమి ప్రతినిధి కడలి పుత్రులకు ఎప్పుడూ అండగా నిలిచింది టీడీపీ ప్రభుత్వమే మత్స్యకారులకు సబ్సిడీకి వలలు, బోట్లు, అవుట్ బోట్ మోటార్లు పంపిణీ చేస్తున్నాం 40% సబ్సిడీతో త్వరలో ఆటోలు కూడా అందిస్తాం మత్స్యకారులకు వేట నిషేధ భృతి రూ.4500 నుంచి రూ. 20 వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే రాష్ట్రంలో మత్స్య సంపద పెంపునకు, మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.