Sunday, 15 March 2026

Blog

E-పేపర్

తెలంగాణలో రికార్డు స్థాయిలో లిక్కర్‌ అమ్మకాలు* రూ.5 వేల కోట్లు దాటిన లిక్కర్ సేల్స్

*తెలంగాణలో రికార్డు స్థాయిలో లిక్కర్‌ అమ్మకాలు* రూ.5 వేల కోట్లు దాటిన లిక్కర్ సేల్స్ కొత్త మద్యం పాలసీతో రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ ఈరాత్రి అమ్మకాల తర్వాత మరింత పెరగనున్న సేల్స్ గత ఏడాదితో పోలిస్తే రూ.వెయ్యి కోట్లు అదనం.

సాహితీ

నూతన సంవత్సర స్వాగతాక్షర సుమాంజలి(2026) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

వి *నూ* తన ప్రపంచంలో విహరించగ, విధి రా *త* లు జీవన పుష్ప రేఖలై పరిమళించగ జ *న* సమోహం సత్ప్రవర్తన గీతం ఆలపించగ ఆ *సం* గీత సరాగసుమాలు దీర్ఘాయుషు నివ్వగ న *వ* వసంతనాదం సంతసమున చేయూత నందించగ వా *త్స* ల్య వాయువు సులక్షణ సుమాలు వెదజల్లగ ప్రా *రం* భం కానున్న ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకగ విజయ సంకల్ప సోపాన తోరణాల ఆహ్వానం సరికొత్త ఆశల ఆత్మీయ సంపదల జీవన గమనం నిరంతరం సాగాలని కాంక్షిస్తూ… పలుకుతున్నాము నూతన సంవత్సరానికి స్వాగతం అందుకుందాము మధుర స్మృతుల సమ్మేళన ఫలితం.

తిరుపతి

చిట్వేలు జెడ్పీ హైస్కూల్‌లో అధికారుల నిర్లక్ష్యం

ఒకప్పుడు క్రమశిక్షణకు, ఉత్తమ విద్యా ప్రమాణాలకు మారుపేరుగా నిలిచిన చిట్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేడు అధికారుల ఉదాసీనతకు నిలువుటద్దంగా మారింది. ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసి, చిట్వేలు మండలాన్ని అన్నమయ్య జిల్లా నుంచి తిరుపతి జిల్లా లోకి చేర్చిన పాఠశాల ప్రధాన ముఖద్వారం వద్ద ఉన్న బోర్డును మార్చకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. బోర్డుపై పాత జిల్లా పేరే.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి కార్యాలయం మరియు పాఠశాల బోర్డులపై జిల్లా పేరును సవరించాల్సి ఉంది. కానీ ఈ పాఠశాల బోర్డుపై నేటికీ పాత జిల్లా పేరే దర్శనమిస్తోంది. పాఠశాల పరిపాలన యంత్రాంగం కనీసం బోర్డును మార్చే ప్రయత్నం కూడా చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయుల తీరుపై ‘గుసగుసలు’: పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. క్రమశిక్షణకు పెట్టింది పేరైన ఈ పాఠశాలలో ప్రస్తుతం విద్యా ప్రమాణాలు తగ్గుతున్నాయని, దీనికి ఉపాధ్యాయుల అలసత్వమే కారణమని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. తక్షణ చర్యలు అవసరం: పాఠశాల బోర్డును వెంటనే మార్చాలని, అలాగే ఉపాధ్యాయుల పనితీరుపై పర్యవేక్షణ పెంచి పాఠశాల పూర్వ వైభవాన్ని తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

తిరుపతి

నూతన సంవత్సరానికి సిద్ధమవుతున్న శ్రీ వినాయక హోటల్

తిరుపతి జిల్లా చిట్వేలు మండలంలో శివాలయం ఎదురుగా ఉన్న శ్రీ వినాయక హోటల్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను ఆహ్వానిస్తోంది. హోటల్ యజమాని గిరి ఎంతో కష్టపడి అంచులంచెలుగా ఎదిగిన ఈ హోటల్ నేడు రుచికి, నాణ్యతకు మరో పేరుగా నిలుస్తోంది. శుభ్రత, రుచిపై ప్రత్యేక శ్రద్ధతో వెజ్, నాన్‌వెజ్ వంటకాలను అందిస్తూ ప్రతిరోజూ ఏదో ఒక స్పెషల్ ఐటమ్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రతి ఆదివారం 99 రూపాయలకే బిరియాని మరియు ప్రత్యేక ఆఫర్లు ఉండటంతో కుటుంబాల ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హోటల్‌కు వచ్చే కస్టమర్లందరికీ గిరి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేవలం రూ.99కే రుచికరమైన బిరియాని అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రత్యేక ఆఫర్‌తో చిట్వేలు ప్రాంతంలో శ్రీ వినాయక హోటల్ రుచుల కేంద్రంగా మరింత గుర్తింపు పొందుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

తిరుపతి

మెరుగైన సమాజ నిర్మాణానికి సి.హెచ్.ఎస్ సేవా బాట

తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలంలో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం, నీటి కొరత సమస్యలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ (సి.హెచ్.ఎస్) సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి ఫిల్టర్లను అమర్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ కార్యదర్శి గాడి ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల చిట్వేల్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత త్రాగునీరు, ఫుడ్ బ్యాంక్, పాత వస్తువుల డొనేషన్ స్టాండ్ వంటి సేవా కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందన్నారు. అదే విధంగా మార్గోపల్లి, వెంకటరాజుపల్లి, నగిరిపాడు, తిమ్మాయపాలెం, కేఎస్ అగ్రహారం తదితర గ్రామాల నుండి సి.హెచ్.ఎస్ సభ్యులు, గ్రామస్తులు ముందుకు వచ్చి తమ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా త్రాగునీటి ఫిల్టర్లు ఏర్పాటు చేయాలని అభ్యర్థించినట్లు తెలిపారు. దీని కొనసాగింపుగా నేడు ఆయా గ్రామాలకు కూలింగ్ వాటర్ ఫ్రిజ్‌లను డెలివరీ చేయడం జరిగిందని, త్వరలోనే ఆర్వో ఫిల్టర్ల ఇన్‌స్టాలేషన్ కూడా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరాల నిర్వహణ, నిరుపేదలకు ఆపద సమయంలో చేయూతనివ్వడం వంటి అనేక సేవా కార్యక్రమాలను సి.హెచ్.ఎస్ సంస్థ నిరంతరంగా చేపడుతోందన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనుకునే వారు సభ్యత్వం తీసుకోవచ్చని, సభ్యత్వం పొందిన వారికి ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉంటుందని తెలిపారు. మానవ జన్మ సార్థకత పుచ్చుకోవడంలో కాకుండా ఇచ్చుకోవడంలోనే ఉందని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏబీఎన్ ప్రసాద్, సూర్యనారాయణ, బొంతల సతీష్, సంస్థ సభ్యులు ఎంవి నరసారెడ్డి, తిరుమల రెడ్డయ్య, అలిశెట్టి పెంచలయ్య, గాడి ఇంతియాజ్, బాలరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్‌కు కస్తూరి విశ్వనాథ నాయుడు ఘన నివాళి

రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు గుంటి వెంకటేశ్వర ప్రసాద్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలో చికిత్స పొందుతున్న ప్రసాద్ మంగళవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం చిట్వేలు పట్టణంలోని ఆయన స్వగృహానికి చేరుకున్న కస్తూరి విశ్వనాథ నాయుడు, మాజీ ఎమ్మెల్యే పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గుంటి ప్రసాద్ కుటుంబ సభ్యులను కస్తూరి విశ్వనాథ నాయుడు పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంటి ప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మరణం రైల్వే కోడూరు రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు. మృదుస్వభావిగా అందరితో ఆప్యాయంగా ఉండే నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. మాజీ ఎమ్మెల్యేను కడసారి చూసేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు, బంధువులు, శ్రేయోభిలాషులు మరియు ఆత్మీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నియోజకవర్గవ్యాప్తంగా ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కస్తూరి విశ్వనాథ నాయుడు వెంట పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని నివాళులర్పించారు.

తిరుపతి

గ్రామస్థాయి సమస్యల పరిష్కారమే లక్ష్యం: ముక్కా రూపానంద రెడ్డి

గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా చిట్వేల్ మండల నాయకులు, కార్యకర్తలతో బుధవారం రోజున ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించినట్లు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తెలిపారు. రైల్వే కోడూరు పట్టణం రాఘవరాజుపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చిట్వేల్ మండలానికి చెందిన గ్రామ, పంచాయతీ నాయకులు పాల్గొని తమ గ్రామాల్లో ఉన్న తాగునీటి సమస్యలు, సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, గ్రావెల్ రోడ్లు, పాఠశాలల మౌలిక వసతులు, పంచాయతీ స్థాయి సమస్యలను వివరించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా అమలు చేయడానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన ముక్కా రూపానంద రెడ్డి, గ్రామస్థాయిలో టీడీపీని మరింత బలంగా నిలబెట్టేందుకు నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన సంవత్సర సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేశారు.

తిరుపతి

కంపసముద్రం ‘స్తంభారాయుని’ క్షేత్రంలో జనవరి 1న విశేష పూజలు

తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేలు మండలం కంపసముద్రం పంచాయతీ పరిధిలోని గుడ్లవారిపల్లె గ్రామంలో వెలసిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ స్తంభారాయు స్వామి ఆలయం నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబైంది. ప్రతి ఏటా జనవరి 1న స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా బుధవారం స్వామివారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ, గ్రామస్తులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉదయం 7 గంటల నుంచే విశేష అభిషేకాలు, ఫలపుష్ప అలంకరణలు, హారతులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. స్వామివారిని నూతన ఏడాది తొలిరోజున దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రత్యేకతగా పేరుగాంచిన పొంగుబాలు సమర్పణ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకునేందుకు భారీగా తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి చెక్కభజనలు నిర్వహించడంతో పాటు రోజంతా నిరంతర అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు క్రమశిక్షణ పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకుని వేడుకను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మీయ సమావేశం

రాధాకృష్ణ ప్రభుత్వ ఉన్నత పాఠశాల చాకలకొండ నందు పాత,కొత్త ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పాఠశాల నందు గత కొన్ని సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహించి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, మరియు బదిలీ పై ఈ పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయునికి మరియు ప్రమోషన్ పై వివిధ పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులకు, మరియు ఇదే పాఠశాలలో పనిచేస్తూ మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు అందుకున్న ఉపాధ్యాయునికి, ఇదే పాఠశాలలో ప్రమోషన్ పొందిన వ్యాయామ ఉపాధ్యాయునికి మరియు నూతనంగా 2025 DSC ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, మరియు ఎంఆర్సి సిబ్బందికి, ఆత్మీయ సమావేశం ఘన మరియు సన్మానం ప్రధానోపాధ్యాయులు P. రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పై కార్యక్రమంలో MEO – 1 పి.రమేష్, ఏ. సుభాషిని, ఎస్ తులసీరామ్ రెడ్డి, సమీరా బేగం, ప్రతాప్, నరేష్, మస్తానయ్య, వెంకటేశ్వర్లు, మము లాభి, లక్ష్మీ ప్రసన్న, లక్ష్మయ్య, మహేష్, మోహన్ రావు, సూరా రామిరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు వెలుగోటి కృష్ణ, ఎమ్మార్సీ సిబ్బంది మౌనిక రెడ్డి, ధర్మారెడ్డి హజరత్ రెడ్డి,జలీల్ పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.