Tuesday, 28 April 2026

Blog

ఖమ్మం

వెలుగుమట్ల ఘటనపై కేరళ సీఎం పినరయివిజయన్

*ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇండ్ల కూల్చివేతలపై తీవ్ర విమర్శలు చేసిన కేరళ సీఎం పినరయి విజయన్…🔥* తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది *ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం 700 ఇళ్లను కూల్చివేసి, 3,000 మందిని నిరాశ్రయులను చేసింది..* *బీజేపీ మోడల్ బుల్డోజర్ రాజ్యాన్ని తెలంగాణలో కాంగ్రెస్ అనుసరిస్తుంది..* *తెలంగాణలో అణగారిన వర్గాలపై కాంగ్రెస్ చేస్తున్న దాడులకు సమాధానం చెప్పాలి..* *తెలంగాణలో అణగారిన వర్గాల ఇండ్లను కూల్చి, కేరళలో ప్రజలతో నిలబడతామని కాంగ్రెస్ చెప్పడం అవమానం అని కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శించారు.

యాదాద్రి భువనగిరి

* హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సంస్థాన్ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 03 : సంసాన్ నారాయణపూర్ హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని సంస్థాన్ నారాయణపూర్ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోలీ పండుగ స్నేహభావం, ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో భేదాభిప్రాయాలను పక్కనపెట్టి పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా, ఆనందంగా హోలీ వేడుకలను జరుపుకోవాలని, యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

యాదాద్రి భువనగిరి

కామ దహనం కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 03 : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో స్థానిక రామాలయం దేవాలయం ముందు కామ దహనం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ప్రత్యేక పూజ నిర్వహించి కామ దహనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ, మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ, రామాలయ దేవస్థాన అధ్యక్షులు వడ్డేపల్లి రాములు సాగర్, వార్డు మెంబర్లు పందుల యాదగిరి గౌడ్, సూరపల్లి వెంకటేష్, సభావాత్ రఘు, బల్గురి శివ, పట్నం బాలకృష్ణ, కట్ల వనజ భాస్కరాచారి, చిలువేరు రమాదేవి శంకర్, మహమ్మద్ హలీమా యూసుఫ్ ఖాన్, సింగపంగా ప్రశాంతి రమేష్, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

హోలీ శుభాకాంక్షలు తెలిపిన కొండపల్లి శ్రీధర్ రెడ్డి

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) వరంగల్: హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, వరంగల్ జిల్లా బీజేపీ ఇంచార్జి కొండపల్లి శ్రీధర్ రెడ్డి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోలీ పండుగ స్నేహభావం, ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో భేదాభిప్రాయాలను పక్కనపెట్టి పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా, ఆనందంగా హోలీ వేడుకలను జరుపుకోవాలని, యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

ఖమ్మం

హోలీ శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు

ఖమ్మం: హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ హోలీ పండుగ సౌభ్రాతృత్వానికి, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో విభిన్న వర్గాల మధ్య ప్రేమ, పరస్పర గౌరవం పెంపొందించే పండుగ హోలీ అని అన్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా, పర్యావరణ హితంగా హోలీ వేడుకలను జరుపుకోవాలని సూచించారు.

ఖమ్మం

హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం: రంగుల పండుగ హోలీ సందర్భంగా ఖమ్మం పట్టణ ప్రజలకు ధనియాకుల వెంకట్ నారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షుడిగా ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ, హోలీ పండుగ ఆనందం, ఐక్యత, స్నేహభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో, ఆనందోత్సాహాలతో హోలీ పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. సమాజంలో సోదరభావం పెంపొందించేందుకు ఈ పండుగ ఒక మంచి అవకాశం అని తెలిపారు. యువత బాధ్యతాయుతంగా, పర్యావరణ హితంగా హోలీ వేడుకలు నిర్వహించాలని సూచించారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నియోజకవర్గ నాయకులతో సమావేశం వింజమూరు నందు నిర్వహించడం జరిగింది

అందరికీ జైభీం ఈ రోజు ఉదయగిరి నియోజకవర్గ బహుజన సమాజ పార్టీ నియోజకవర్గ అద్యక్షులు కర్రా గోపాల్ అద్యక్షతన నియోజకవర్గ నాయకుల సమావేశం వింజమూరు నందు జరిగింది.ఈ సమావేశానికి నియోజకవర్గ కన్వీనర్ బెజవాడ ప్రకాశరావు,మరియొక కన్వీనర్ పంటా మురళి, మాజీ కన్వీనర్ అంకబాబు ,వారిశ్రీమతి,కె.చిన్నా,ఈశ్వర్ ,కొండల్ రావు,టి.సాయిక్రష్ణ,వెంకటేష, లక్ష్మీనారాయణ, వాగాల పెంచలయ్య ,కె.వాసు,జంగం మాలకొండయ్య ,పూరిమిట్ల మాలకొండయ్య,దాసరి శ్రీనివాసులు ,నేలటూరు ధనుంజయ,పి.మురళీ,బి.కిరణ్,సాంసన్ ,రత్నం తదితరులు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్చార్జి మరియు రాష్ట్ర మహిళా కన్వీనర్ క్రాకుటూరు పుష్పాంజలి మాట్లాడుతూ రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలంగా తయారు చేయాలన్నారు.అదే విధంగా మాన్యవర్ కాన్షీరాం గారి జయంతిని కొండాపురం మండలంలో జరిపేటందుకు సమాయత్తం కావాలని కోరారు.

హైదరాబాద్

“Neurology and What Lies Beyond”

న్యూరాలజీ మన నరవ్యవస్థ నిర్మాణం, కార్యాచరణ, వ్యాధులను అధ్యయనం చేసే వైద్యశాఖ. మెదడు-మనస్సు సంబంధం ఇంకా అనేక రహస్యాలను దాచుకుంది. నాడీ కణాల సంకేతాలు జ్ఞాపకం, భావాలు, ప్రవర్తనను నియంత్రిస్తాయి. భవిష్యత్తులో న్యూరోసైన్స్ మానసిక ఆరోగ్యం, పార్కిన్సన్, అల్జీమర్ వంటి రుగ్మతల నివారణకు కొత్త మార్గాలు తెరుస్తుందని World Health Organization పేర్కొంటుంది.

తిరుపతి

గ్రహణాలకూ లొంగని మహాక్షేత్రం- శ్రీకాళహస్తిలో ఆగని అభిషేకాలు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 02,ప్రపంచవ్యాప్తంగా గ్రహణ కాలంలో ఆలయాలన్నీ తలుపులు మూసివేసి, శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. దానికి భిన్నంగా, గ్రహణ పట్టు విడుపు కాలంలో కూడా భక్తులతో కళకళలాడే ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి. రాహు-కేతు క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయంలో గ్రహణ సమయంలోనూ విశేష అభిషేకాలు నిర్వహించడం వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యాలను ఆలయ వేద పండితులు వివరింస్తూ.. శ్రీకాళహస్తి క్షేత్రం గ్రహణాలకు ఎందుకు అతీతమో వివరిస్తూ.. ఇక్కడ కొలువైన స్వామివారు, అమ్మవార్ల సర్పరూపాలే దానికి ప్రధాన కారణమని ఇక్కడి శివలింగం ఐదు తలల పాము (నాగపడిగ) నీడలో కొలువై ఉంటుందని జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నడుముకు నాగపాము ఒడ్యాణంగా ఉంటుంది. సాధారణంగా గ్రహణాలకు కారణమయ్యే రాహు, కేతువులు సర్ప రూపధారులు. సాక్షాత్తు ఆ సర్పాలనే ఆభరణాలుగా ధరించిన స్వామి, అమ్మవార్లు ఇక్కడ కొలువై ఉండటం వల్ల, గ్రహణ ప్రభావం ఈ క్షేత్రంపై ఉండదని వేద పండితులు స్పష్టం చేశారు. గ్రహణ సమయం ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు (పట్టు-విడుపు కాలం) స్వామివారికి, అమ్మవారికి నిరంతరాయంగా విశేష అభిషేకాలు జరపడం ఈ ఆలయ ప్రత్యేకత. ఇతర ఆలయాల్లో గ్రహణం వీడిన తర్వాతే తలుపులు తీసి సంప్రోక్షణ చేస్తారు, కానీ శ్రీకాళహస్తిలో గ్రహణ సమయమే అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. జాతకంలో రాహు-కేతు దోషాలు ఉన్నవారు, గ్రహణ సమయంలో ఇక్కడ జరిగే అభిషేకాల్లో పాల్గొనడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. సర్ప దోష నివారణకు ఈ క్షేత్రం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది కావడంతో, గ్రహణ కాలంలో కూడా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అర్చకులు తెలపారు.

తిరుపతి

వ్యర్ధలతో నిండిపోతున్న కాలువలు-రోగాల బారిన పడుతున్న ప్రజలు

తొట్టంబేడు పున్నమి న్యూస్, మార్చి 02, తొట్టంబేడు మండలం తొట్టంబేడు పంచాయతీలో చెత్తాచెదారాలు వ్యర్ధాలతో మురుగు కాలువలు నిండిపోతునన్నాయని ఈదులగుంట కాలనీ వాసులు పలు రోగాలతో ఆసుపత్రి పాలవుతున్నా పంచాయతీ అధికారులుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోని పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ఈదులగుంట వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత జిల్లా స్థాయి అధికారులు చర్య తీసుకోవాలని ఈదులకుంట కాలనీవాసులు కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.