Thursday, 12 March 2026

Blog

అమరావతి

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సోమనాథ్ రాజీనామా ఆలోచన?

అమరావతి : (పున్నమి ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంతరిక్ష సాంకేతిక సలహాదారుగా నియమితులైన డా. ఎస్. శ్రీధర పణిక్కర్ సోమనాథ్ తన పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తొమ్మిది నెలల క్రితం నియమితులైనప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి బాధ్యతలు, కార్యాలయం కేటాయించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్పేస్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు వచ్చిన సోమనాథ్‌ను పట్టించుకోకపోవడం ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కామారెడ్డి

సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా వేడుకలు

– మద్దికుంట సర్పంచ్ తాండ్ర మనీషా.. కామారెడ్డి 3 జనవరి (పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి ని నిర్వహించారు.గ్రామ సర్పంచ్ తాండ్ర మనీషా – రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయు లు, అంగన్వాడీ టీచర్లను ఘనంగా సత్కరించారు. సావిత్రిబాయి పూలే స్త్రీ విద్యా కార్యక్రమాలకు చేసిన అమోఘ కృషిని కొనియాడుతూ, ఆమె ఆచరణలను గ్రామీణ మహిళలకు ఆదర్శంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్ర మంలో వార్డు సభ్యులు,పి.ఆర్.టి.యు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బాలకిషన్, కృష్ణమోహన్, లక్ష్మణ్, తాండ్ర రామస్వామి, రాములు,వడ్ల కిష్ట య్య, గ్రామ కార్యదర్శి, డ్వాక్రా సంఘ మహిళా అధ్యక్షురాలు భూలక్ష్మి, గ్రామ ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

వనపర్తి

సావిత్రిబాపూలే విగ్రహానికి పూలమాల వేస్తున్న ప్రధానోపాధ్యాయులు

*సావిత్రిబాపూలే విగ్రహానికి పూలమాల వేస్తున్న ప్రధానోపాధ్యాయులు* *పున్నమి ప్రతినిధి వనపర్తి* *జిల్లా తేదీ 3/01* /2026* *సావిత్రిబా పూలే జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడి మాడ ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప మరియు ఉపాధ్యాయ బృందం పూలమాలతో ఆమె సేవలను కొనియాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులనుదేశించి మాట్లాడారు*

తెలంగాణ

ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేసిన: కలెక్టర్

నకిరేకల్ :జనవరి ( పున్నమి ప్రతినిధి ) నల్గొండ మున్సిపాలిటీ వార్డుల్లో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఉదయమే ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వార్డ్ నెంబర్ 28 శ్రీకృష్ణ నగర్ లో స్థానికులతో ముఖాముఖి నిర్వహించి పారిశుధ్య, తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. డ్రైన్ల శుభ్రత, చెత్త నిర్వాణపై, ఆదేశాలు జారీ చేశారు. అమృత2 క్రింద మోతికుంట బండ్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సూచించారు.

విజయనగరం 

2026లో ప్రభుత్వం ప్రకటించిన సెలవులు.

2026లో ప్రభుత్వం ప్రకటించిన సెలవులు.. *పండుగ – తేదీ* *1. భోగి – జనవరి 14* 2. మకర సంక్రాంతి-జనవరి 15 3. కనుమ – జనవరి 16 4. రిపబ్లిక్‌ డే- జనవరి 26 5. మహా శివరాత్రి – ఫిబ్రవరి 15 6. హోలీ – మార్చి 3 7. ఉగాది – మార్చి 19 8. రంజాన్‌ – మార్చి 20 9. శ్రీరామ నవమి – మార్చి 27 10. గుడ్‌ ఫ్రైడే – ఏప్రిల్ 3 11. బాబు జగ్జీవన్‌రావ్‌ జయంతి – ఏప్రిల్ 5 12. బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి – ఏప్రిల్ 14 13. బక్రీద్ – మే 27 14. మొహర్రం – జూన్ 25 15. ఇండిపెండెన్స్‌ డే – ఆగస్టు 15 16. వరలక్ష్మి వ్రతం – ఆగస్టు 21 17. మిలాద్ -ఉన్-నబీ – ఆగస్టు 25 18. శ్రీకృష్ణాష్టమి – సెప్టెంబర్ 4 19. వినాయక చవితి – సెప్టెంబర్‌ 14 20. గాంధీ జయంతి – అక్టోబర్‌ 2 21. దుర్గాష్టమి – అక్టోబర్‌ 18 22. విజయ దశమి – అక్టోబర్‌ 20 23. దీపావళి – నవంబర్‌ 8 24. క్రిస్మస్‌ – డిసెంబర్‌ 25 ఇలా 2026లో మొత్తం 24 శెలవు దినాలు. గవర్నమెంట్ పబ్లిక్‌ హాలీడేస్‌ …

తెలంగాణ

*_Telangana Assembly Today: నేడు కృష్ణా జలాలపై అసెంబ్లీలో కీలక చర్చ..!!_*

*_Telangana Assembly Today: నేడు కృష్ణా జలాలపై అసెంబ్లీలో కీలక చర్చ..!!_* _Krishna Water Dispute: తెలంగాణ శాసనసభలో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన కృష్ణా నదీ జలాల అంశంపై అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ జరగనుంది._ _ఈ చర్చపై అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఆసక్తి నెలకొంది. కృష్ణా జలాల పంపకాల అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటి నుంచో సున్నితమైన అంశంగా ఉండటంతో, ఈ రోజు జరిగే చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది._ _ఈ చర్చలో భాగంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కృష్ణా నదిపై తెలంగాణకు ఉన్న హక్కులు, గతంలో జరిగిన అన్యాయాలు, ప్రస్తుత నీటి వినియోగ పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలను ప్రజెంటేషన్ ద్వారా సభకు వివరించనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో జల వివాదాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సభ ముందుంచనున్నారు._ _ఇదిలా ఉండగా, ఇవాళ శాసనసభలో ప్రభుత్వం నాలుగు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిలో ప్రధానంగా తెలంగాణ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్, రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్, పే స్ట్రక్చర్) సవరణ బిల్లు, అలాగే దీనికి సంబంధించిన రెండో సవరణ బిల్లు ఉన్నాయి. ఈ బిల్లుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, సిబ్బంది నిర్మాణం, వేతన విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది._ _అదేవిధంగా పంచాయతీ రాజ్ సవరణ బిల్లు మరియు దానికి సంబంధించిన రెండో సవరణ బిల్లును కూడా సభ ముందుకు తీసుకురానున్నారు. స్థానిక సంస్థల పరిపాలనను మరింత సమర్థవంతంగా చేయడమే లక్ష్యంగా ఈ సవరణలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయి పరిపాలనలో అధికారాల పంపకం, పరిపాలనా సౌలభ్యం పెంచే దిశగా ఈ బిల్లులు ఉపయోగపడనున్నాయని ప్రభుత్వం చెబుతోంది._ _కృష్ణా జలాలపై చర్చతో పాటు కీలక బిల్లుల ప్రవేశం నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉండటంతో, సభలో వాడివేడిగా చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి._

తిరుపతి

అభివృద్ధిని అడ్డుకోవడమే వైసిపి నైజం… టి.డి.పి. పట్టణ మహిళా అధ్యక్షురాలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 02: పట్టణంలోని కైలాసగిరి కాలనీలో ఉన్న మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధిపనులపై శ్రీకాళహస్తి పట్టణ తెలుగుదేశంపార్టీ మహిళా అధ్యక్షురాలు అల్లం సుమతి మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేకుండా పాఠశాల దుస్థితిలో కొనసాగిందన్నారు. అప్పుడు “నాడు–నేడు” అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా, ఆ పథకం ఈ పాఠశాలకు మాత్రం కాగితాలకే పరిమితమైందని వైసీపీ ప్రభుత్వపాలనలో పాఠశాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేశారని ఆ నిధులను పక్కదారి మళ్లించి వాటిని సరైన విధంగా వినియోగించకపోవడం, పనులను మధ్యలోనే ఆపేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆ సమయంలో పాఠశాలలో కేవలం 65 మంది విద్యార్థులే ఉండగా, తగిన మౌలిక వసతుల లేమి కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పాఠశాలలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిందని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించి, పాఠశాల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన బాత్రూమ్స్, తాగునీరు, అధ్వానంగా ఉన్న పాఠశాల ముందర భాగంలో గ్రావెల్ మట్టితో సుందరంగా తీర్చిదిద్ది రోడ్డు వసతి కల్పించారు ఇతర మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టారని ఈ క్రమంలో సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసి, పనులు వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పాఠశాల అభివృద్ధికి కృషి చేయడంతో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య వందకు (100) పైగా పెరిగిందని ఇది ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోందన్నారు. ఇప్పుడు పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక, వైసీపీ నాయకులు నిందలు వేస్తూ పనులకు ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని గతంలో తామే ఆపేసిన పనులపై నోరు విప్పని వైసీపీ, ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరించడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కైలాసగిరి మునిసిపల్ ప్రాథమిక పాఠశాల విషయంలో గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుండగా, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం వెనుక రాజకీయ స్వార్థమేనని ఆమె పేర్కొన్నారు.

అన్నమయ్య

నూకనేనిపల్లిలో భారీగా బిజెపిలో చేరికలు: ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ​నందలూరు:

నందలూరు మండలం నూకనేనిపల్లి గ్రామపంచాయతీలో ఈరోజు యువత మరియు గ్రామ ప్రజలు భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజెపి జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు సాయి లోకేష్ సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం ఘనంగా జరిగింది. ​ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేసి, పార్టీలో చేరిన వారికి కాషాయ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై యువత పెద్ద సంఖ్యలో బిజెపిలో చేరడం శుభపరిణామమని పేర్కొన్నారు. ​పాల్గొన్న ముఖ్య నాయకులు: ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ మోర్చా నాయకుడు షబిర్ అహ్మద్, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ యాదవ్, జిల్లా కార్యదర్శి నరేంద్ర రాజు, జిల్లా డైరెక్టర్ విఠలాచారి, అసెంబ్లీ కో కన్వీనర్ డాక్టర్ అరిగే రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ​అలాగే సీనియర్ నాయకుడు కోడురా ఆదినారాయణ, మున్సిపల్ కౌన్సలర్ వర్మ, మండల అధ్యక్షుడు చుక్కా శ్రీనివాసులు మరియు నందలూరు బిజెపి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

తిరుపతి

లబ్ధిదారులకు పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీచేసిన తెదేపా నాయకులు

తొట్టంబేడు పున్నమి న్యూస్, జనవరి 02: తొట్టంబేడు మండలంలోని కారకొల్లు పంచాయతీ, డొంగలముడురు గ్రామంలోని రైతులకు నూతన పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో థోట్టంబేడు మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీ జై చంద్ర నాయుడు, థొట్టంబేడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మునిరాజ నాయుడు పాల్గొని లబ్ధిదారులకు పాస్‌బుక్స్ అందజేశారు.

తిరుపతి

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న వాహనం యువకుడు మృతి

తొట్టంబేడు పున్నమి క్రైం న్యూస్, జనవరి 02: తొట్టంబేడు బెడు పోలీస్ స్టేషన్ పరిధిలో రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర సాయంత్రం 4:00 గంటల సమయంలో రాయచోటికి చెందిన చందు అనే యువకుడు (వయస్సు 21 సం) స్ప్లెండర్ బైక్ పై వెళ్తుండగా అతనిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో వాహన చోదకునికి తల, ముఖంపై తీవ్రమైన రక్తగాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108 కి సమాచారం ఇవ్వగా తక్షణమే 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్‌కు తరలించగా ఆసుపత్రి వైద్యులు చందుని పరిశీలించి అతను మృతి చెందినట్లు నిర్ధారించడంతో ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.