Thursday, 12 March 2026

Blog

కామారెడ్డి

ప్రజా ప్రభుత్వం పేదల పెన్నిధి

కామారెడ్డి , 07జనవరి, ( పున్నమి ప్రతినిధి ) ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావు స్పష్టమైన ఆదేశాల మేరకు రామారెడ్డి మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగిందని తెలిపా రు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ,అనారోగ్యంతో బాధపడుతు న్న పేదలకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబా లకు ఈ సహాయం తక్షణ ఆశ్రయంగా మారిందని చెప్పారు.ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టు బడి ఉంద ని,ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయక త్వంలో మరి న్ని కార్యక్రమాలు జరుగు తాయని చెప్పారు.గ్రామా ల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ పర్యవేక్షణ లో ఈ చెక్కు ల పంపిణీ పూర్తి చేశామన్నారు.సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ప్రకారం వైద్య చికిత్స ఖర్చు లు,కుటుంబ ఆర్థిక స్థిరత్వం, అత్యవసర అవసరా ల కోసం ఈ సహాయం అందుబాటులోకి వచ్చింది. లబ్ధిదారులు తమ అనుభవాలను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్ర మం మండల ప్రజలలో సంతోష రాగాలను రేకెత్తిం చింది లబ్ధిదారుల పూర్తి జాబితా చెక్కులు పంపిణీ చేసిన లబ్ధి దారుల వివరాలు ఇలా ఉన్నాయి. రామారెడ్డి, ఇసనపల్లి, పోసాని పేట్, మోశంపూర్, ఉప్పల్ వాయి,గ్రామాలకు చెందిన సుమారుగా 315,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను 9 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశామన్నా రు. ప్రతి ఒక్కరూ తమ అవసరాలకు తగ్గట్టుగా మొత్తాలు పొందారు.ఈ చెక్కులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో డిపాజి ట్ అయి వెంటనే వాడుకకు అందుబాటులోకి వస్తాయి.ఈ సహాయం తో తమ కుటుంబాల భవి ష్యత్తును రక్షించుకోగల రని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ల్యాగల ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు గిరెడ్డి మహేందర్ రెడ్డి, పోసానిపేట్ గ్రామ ఉప సర్పంచ్ అంజయ్య, రామా రెడ్డి సర్పంచ్ ప్రవీణ్,ఇసన్నపల్లి సర్పంచ్ దోకి లచ్చ య్య కన్నాపూర్ సర్పంచ్ గొల్ల మహేష్ గొల్లపల్లి సర్పంచ్ కిషన్ యాదవ్, వార్డు సభ్యులు గ్రామస్తు లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

PSLV-C62 ప్రయోగం: కౌంట్ డౌన్ కు సర్వం సిద్దం

*PSLV-C62 ప్రయోగం: కౌంట్ డౌన్ కు సర్వం సిద్దం* శ్రీ హరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) PSLV- C62 మిషన్ ప్రయోగానికి సిద్ధమైంది. 2026 జనవరి 12న ఉదయం 10:17 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు ఇస్రో అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా లాంచ్ వ్యూ గ్యాలరీ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మెగా ఇంపాక్ట్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్ & జాబ్ మేళా

సికింద్రాబాద్, (మన పున్నమి ప్రతినిధి) లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320హెచ్ ఆధ్వర్యంలో మెగా ఇంపాక్ట్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్ & జాబ్ మేళాను ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో హరిహర కళాభవన్‌లో నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువత, గ్రాడ్యుయేట్లు, గృహిణుల కోసం ఉచితంగా నిర్వహించే ఈ మూడు రోజుల కార్యక్రమంలో ప్రముఖ వక్తలు పాల్గొననున్నారు. రోజుకు 2000 మందికి భోజన సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశం పూర్తిగా ఉచితం.

ఆంధ్రప్రదేశ్

ఒత్తిడిని అధిగమించేందుకు ధ్యానమే పరమౌషదం – స్వామి స్మరణానంద

శ్రీసిటీ, జనవరి 07, 2026: ఆధునిక జీవన ఒత్తిళ్లు, ఆందోళనలు అధిగమించేందుకు ధ్యానమే తగు పరిష్కారం అని స్వామి స్మరణానంద స్పష్టం చేశారు. శ్రీసిటీ ఆధ్యాత్మిక-సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో యోగద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (YSSI) సంస్థ సహకారంతో “క్రియా యోగ ధ్యానం: ఒత్తిడి, ఆందోళనలకు శాశ్వత ఉపశమనం” అనే అంశంపై బుధవారం శ్రీసిటీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, ఘనంగా సత్కరించారు. ఎనలేని ఆనందాన్ని పొందడమే జీవిత లక్ష్యంగా పేర్కొన్న స్వామి స్మరణానంద, అది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమని తెలిపారు. ఆనందం కోసం పలు విధాలుగా బయట వెదుకులాడుతున్నామని, అది అంతరంగంలో నిక్షిప్తమై ఉందన్నారు. తైత్తిరీయ ఉపనిషత్తును ఉదహరిస్తూ దైవ స్వరూపం ‘సచ్చిదానందం’ అని, ఆ స్థితిని ప్రత్యక్షంగా అనుభవించడానికి ధ్యానమే మార్గమని చెప్పారు. ధ్యానం శారీరక–మానసిక–ఆధ్యాత్మిక సమతుల్యతను పెంపొందించి, అంతర్దృష్టిని బలోపేతం చేస్తుందని అన్నారు. పరమహంస యోగానంద బోధనలను ప్రస్తావిస్తూ, నిరంతర సాధన మరియు అంతరంగ నిశ్శబ్దమే ధ్యానానికి పునాదిగా పేర్కొన్నారు. సరస్సులో అలల వలె మనస్సులో ప్రకంపనలు శాంతికి భంగం కలిగిస్తుందని, ధ్యానం ఆ సహజ ప్రశాంతతను పునరుద్ధరిస్తుందని వివరించారు. హంస, ఓం, క్రియ యోగా వంటి ధ్యాన పద్ధతులు, వాటి ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమం ముగింపులో పలువురు క్రియా యోగ ధ్యానం అభ్యసించేందుకై ఆసక్తి కనబరుస్తూ YSSI హోమ్–స్టడీ పాఠ్యాంశాల్లో (తెలుగు, ఇంగ్లీష్) తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రసంగం అనంతరం స్వామీజీ శ్రీసిటీ పరిసరాలను సందర్శించారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, నక్షత్ర వనం, నవగ్రహ వనం వీక్షించారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఆహ్లాదభరిత వాతావరణంలో ప్రగతి దిశగా పయనిస్తున్న శ్రీసిటీ అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజలతో భాగస్వామ్యంగా అవగాహన కార్యక్రమాలు — జిల్లా ఎస్పీ డా. అజిత్ వేజెండ్ల, ఐపీఎస్

పున్నమి ప్రతినిధి | నెల్లూరు | 07-01-2026 నెల్లూరు జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను పోలీసులు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డా. అజిత్ వేజెండ్ల, ఐపీఎస్ తెలిపారు. ఎస్పీ ఆదేశాలు, అదనపు ఎస్పీ (అడ్మిన్) సూచనల మేరకు గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యువతతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేర నియంత్రణ, శాంతి భద్రతలు, సైబర్ మోసాలు, గంజాయి, ఇసుక అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలు–బాలబాలికల భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో సామరస్యంగా జీవించాలని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పద సమాచారం కోసం 112 లేదా ఈగల్ సెల్ 1972కు తెలియజేయాలని సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లావ్యాప్తంగా డ్రోన్ నిఘా—నేర నియంత్రణే లక్ష్యం: జిల్లా ఎస్పీ డా. అజిత్ వేజెండ్ల, ఐపీఎస్

పున్నమి ప్రతినిధి | నెల్లూరు | 07-01-2026 నెల్లూరు జిల్లాలో నేరాల నియంత్రణ లక్ష్యంగా డ్రోన్ నిఘాను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డా. అజిత్ వేజెండ్ల, ఐపీఎస్ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (అడ్మిన్) సూచనలతో డీఎస్పీల పర్యవేక్షణలో పట్టణ, శివారు, నిర్మానుష్య ప్రాంతాల్లో డ్రోన్లతో క్షుణ్ణ పరిశీలన కొనసాగుతోంది. ఉదయం 9–11, సాయంత్రం 4–6 గంటల పాటు, టౌన్ పరిసరాల్లో రాత్రి 7–9 వరకు నిఘా ఏర్పాటు చేశారు. ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, గంజాయి, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ 1972కి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

నారాయణపేట

స్పీడ్ బ్రేకర్ వద్ద గుంతల రోడ్డును సరిచేసిన ఆర్మీ సూరి గ్యాంగ్

గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఎదురుపదాల రోడ్ సైడ్ గుంతలుగా వాహన దారులకు,వచ్చి పోయేవారికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితిని గమనించిన ఆర్మీ సూరి గ్యాంగ్ సభ్యులు ముందుకు వచ్చారు. ప్రమాదాలకు దారితీసే స్థితిలో ఉన్న ఆ ప్రాంతాన్ని పరిశీలించి వారు వెంటనే అక్కడ కాంక్రీట్ వేసి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ పనుల వల్ల వాహనదారులకు ఉపశమనం లభించింది అని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారాన్ని అందించిన ఆర్మీ సూరి గ్యాంగ్ కి గ్రామస్తుల తరఫున అభినందించడం జరిగింది. ఇంకా ఊరిలో ఉన్న అక్కడక్కడ ఉన్న గుంతలకు తమ వంతు సహకారం గా మరమత్తులు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది

విశాఖపట్నం

ఎమ్మెల్యే గంటా హామీ నెరవేరింది.. 89వ వార్డులో రోడ్డు పనులకు మోక్షం*

*ఎమ్మెల్యే గంటా హామీ నెరవేరింది.. 89వ వార్డులో రోడ్డు పనులకు మోక్షం* *ఎస్సీ కాలనీ – కంటైనర్ యార్డు రహదారి కష్టాలకు శాశ్వత పరిష్కారం *పనులు ప్రారంభం: హర్షం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర ప్రోటోకాల్ కన్వీనర్ బాల రాజేశ్వరరావు *14 గ్రామాల ప్రజలకు కలగనున్న ప్రయోజనం *విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి * భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 89వ వార్డు పరిధిలోని ప్రజలు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న ప్రధాన రహదారి సమస్య పరిష్కారానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎమ్మెల్యే చొరవతో ఈ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కానుండటంపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రోటోకాల్ కన్వీనర్ బాల రాజేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. 89వ వార్డు పరిధిలోని ఎస్సీ కాలనీ నుండి ఎయిర్‌పోర్ట్ (కంటైనర్ యార్డు) వైపు వెళ్లే రహదారి గత కొంతకాలంగా అత్యంత అధ్వాన్నంగా మారి, గుంతలమయమైంది. దీనివల్ల వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తీవ్రమైన సమస్యను గుర్తించిన బాల రాజేశ్వరరావు, గత ఏడాది జులై 28న (28-07-2024) స్వయంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ని కలిసి, అక్కడి దుస్థితిని వివరించారు. అప్పట్లో దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, త్వరలోనే ఈ రోడ్డు సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నిధులు మంజూరవడం, ఇప్పుడు నేటినుంచి పనులు ప్రారంభం కానుండటం శుభపరిణామమని బాల రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే సమీపంలోని సుమారు 14 గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయి. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులకు ఇది ఎంతో ఊరటనిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా సమస్యపై తక్షణమే స్పందించి, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కి స్థానికులు, పార్టీ శ్రేణులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారంలో కీలక పాత్ర పోషించిన బాల రాజేశ్వరరావు కి గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు.

విశాఖపట్నం

విశాఖ 12వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు హాజరైన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్

*విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి * విశాఖ 12వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు హాజరైన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తనపై సాక్షి పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై పరువునష్టం దావా వేసిన మంత్రి నారా లోకేష్ నేడు విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్ ఇప్పటికే ఈ కేసులో రెండు దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి నేడు మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్ కు లాయర్లతో కలిసి హాజరైన మంత్రి లోకేష్ ‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ శీర్షికతో 2019, అక్టోబర్ 22న సాక్షి పత్రిక అసత్య కథనం.

విశాఖపట్నం

కూటమికి భయం మొదలైంది : జీ వి వి ఎస్ కమలాకర్*

*కూటమికి భయం మొదలైంది : జీ వి వి ఎస్ కమలాకర్* *విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి * మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడమే కాకుండా రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధుల్లో కోత విధించడంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త నీరసనలకు పిలుపునివ్వడం, తొలి నిరసన అనంతపురం జిల్లా, బండ్లపల్లిలో నిర్వహిస్తుండడంతో కూటమి ప్రభుత్వంలో భయం మొదలైందని, మరి ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి వి ఎన్ మాధవ్ నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అందుకే రాష్ట్ర వ్యాప్తంగా MGNREGA పై ప్రజల్లో అవగాహన యాత్రకు అంటూ బయలుదేరుతున్నారని, ఎన్ని యాత్రలు చేసిన కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న అనంతపురం సభ తరువాత బీజేపీతో పాటు కూటమిలో ఉన్న టీడీపీ, జనసేనని కూడ ప్రజలు తిప్పి కొడతారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జీ వి వి ఎస్ కమలాకర్ విమర్శించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.