Thursday, 12 March 2026

Blog

విశాఖపట్నం

గాజువాక డిపోలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం – డ్రైవర్లకు ఫ్యామిలీ కౌన్సిలింగ్

గాజువాక, (పున్నమి ప్రతినిధి): జాతీయ రహదారి భద్రతా మాసము కార్యక్రమంలో భాగంగా గురువారం గాజువాక డిపోలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా యాక్సిడెంట్ మరియు డ్యామేజ్ డ్రైవర్లకు రహదారి భద్రత, ప్రమాద రహిత డ్రైవింగ్ విధానాలు, రహదారి నియమాల పాటింపు, ఒత్తిడి లేని జీవన విధానం, విధులకు హాజరయ్యే ముందు తగిన విశ్రాంతి అవసరం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. డ్రైవర్లు మానసిక ప్రశాంతతతో విధులు నిర్వహిస్తే ప్రమాదాలు తగ్గుతాయని, కుటుంబ సహకారం కూడా కీలకమని వక్తలు సూచించారు. రహదారిపై ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాజువాక డిపో మేనేజర్ శ్రీ పి. మల్లేశ్వరరావు, ఎంఎఫ్, ఏఎం(పి), డిపో ఎస్‌డీఐ తదితర అధికారులు పాల్గొని డ్రైవర్లకు అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.

విశాఖపట్నం

గాజువాక సుందరీకరణకు గుడ్ న్యూస్: ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ నిధులతో రూ.కోటి అభివృద్ధి పనులకు మంత్రి నారాయణ హామీ

విశాఖ జనవరి (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గంలో పార్కులు, చెరువుల సుందరీకరణకు ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ నిధులతో రూ.కోటి అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. అమరావతిలోని ఏపీ సీఆర్‌డీఏ భవనంలో జరిగిన ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ కీలక ప్రకటన చేశారు. ఈ సమావేశానికి కార్పొరేషన్ ఛైర్మన్ సుగుణమ్మ, ఎండీ శ్రీనివాసులు, బోర్డ్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణతో పాటు రాష్ట్ర సుందరీకరణలో ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. బోర్డ్ సభ్యులు చేసిన సలహాలు, సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మొల్లి పెంటిరాజు మంత్రి నారాయణకు వినతిపత్రం అందజేసి, గాజువాక నియోజకవర్గంలో పార్కులు, చెరువుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రి, రూ.కోటి నిధులు మంజూరు చేస్తామని, తగిన ప్రతిపాదనలు త్వరగా పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ హామీపై మొల్లి పెంటిరాజు మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఇతర బోర్డు సభ్యులు కూడా పాల్గొన్నారు.

విశాఖపట్నం

స్టీల్ ప్లాంట్‌లో విషాదం: 50 అడుగుల ఎత్తు నుంచి పడి కార్మికుడు మృతి

విశాఖపట్నం: జనవరి (పున్నమి ప్రతినిధి) విశాఖ స్టీల్ ప్లాంట్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సింటర్ ప్లాంట్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు కిందపడడంతో మృతి చెందాడు. గాజువాక సమీపంలోని అజీమాబాద్‌కు చెందిన మహమ్మద్ సుబాన్ (41) గురువారం విధులు ముగించుకుని ఎత్తైన ప్లాట్‌ఫామ్ నుంచి కిందకు దిగుతుండగా అదుపు తప్పి సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే స్టీల్ ప్లాంట్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు సుబాన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు.

విశాఖపట్నం

గాజువాకలో మహిళా దొంగల బాగోతం బట్టబయలు… జడలో బంగారం దాచుతూ పట్టుబడిన కిలేడీలు

విశాఖపట్నం, గాజువాక జనవరి (పున్నమి ప్రతినిధి) గాజువాకలో మహిళా దొంగల దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. గాజువాక బీసీ రోడ్డు పరిధిలోని ఓం జ్యువలరీ షాపులో బంగారం కొనుగోలు నెపంతో వచ్చిన ముగ్గురు మహిళలు చాకచక్యంగా బంగారు వస్తువులను తస్కరించే ప్రయత్నం చేశారు. బంగారాన్ని జడలో దాచుతున్న దృశ్యాన్ని గమనించిన షాప్ నిర్వాహకులు వెంటనే అప్రమత్తమై వారిని పట్టుకున్నారు. సమాచారం అందుకున్న గాజువాక క్రైమ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భోజ నాగమణి, బోజగాని జ్ఞానమ్మ, పోన్నా పద్మగా గుర్తించిన ముగ్గురు మహిళా దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తస్కరించిన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరిన్ని దొంగతనాల్లో వీరి పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గాజువాక పరిధిలో జ్యువలరీ షాపులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. Uploaded Video:

విశాఖపట్నం

విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా వన్నెంరెడ్డి సతీష్ కుమార్ నియామకం

విశాఖపట్నం, జనవరి (పున్నమి ప్రతినిధి): విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా వన్నెంరెడ్డి సతీష్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు (G.O) జారీ అయ్యాయి. ఈ సందర్భంగా వన్నెంరెడ్డి సతీష్ కుమార్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతాయుతమైన పదవిని అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థను మరింత అభివృద్ధి చేసి, విద్యార్థులు, యువత, సాధారణ పాఠకులకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా పరిధిలో గ్రంథాలయాలను ఆధునికీకరణ చేయడంతో పాటు చదువు సంస్కృతిని ప్రోత్సహించడమే తన ప్రధాన లక్ష్యమని చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ తెలిపారు.

కామారెడ్డి

కుటుంబ కలహాలతో ఉప్పల్వాయి గ్రామంలో 50 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య

కామారెడ్డి, 08 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, ఉప్పల్వా యి గ్రామంలో కుటుంబ కలహాలతో కుమ్మరి రాములు (50) తండ్రి పోశయ్యా అనే వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఎస్ఐ.రాజశేఖర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు శవాన్ని గమనించి పోలీసులకు సమా చారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాజశేఖర్‌లు పరిస్థితులు పరిశీ లించి వివరాలు సేకరించారు. శవాన్ని కామారెడ్డి (జి.జి.ఎచ్ ) ఆరోగ్యకేంద్రానికి పోస్టుమార్టం నిమి త్తం తరలించారు.ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ, మృతుని భార్య మన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నాము. మరిన్ని వివరాలు తెలుస్తే తెలియజేస్తాము అని తెలిపారు. గ్రామస్థు లు ఈ సంఘటనపై విషాదం వ్యక్తం చేస్తున్నారు

మహబూబ్ నగర్

టెట్ విషయంలో డేటా సేకరణ ప్రారంభించిన భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రిన్సిపాల్ సెక్రటరీ ఉత్తరం ద్వారా సేకరణ

*అన్ని రాష్ట్రాల ప్రిన్సిపాల్ సెక్రటరీలకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి టెట్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు డేటా సేకరణ ప్రారంభం* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ:: 08/01/2026* . జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో టెట్ అంశంపై గౌరవ మెంబర్ అఫ్ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో టెట్ అంశంపై లేవనెత్తిన అంశాల సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం నుండి అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్స్ సెక్రటరీలకు lettar పంపించడం జరిగింది అందులో ఈ క్రింద కనపరిచిన అంశాలను పేర్కొనడం జరిగింది 👉ఏ ఏ రాష్ట్రాల్లో ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు ఇంతవరకు టెట్ పరీక్ష పాస్ కాలేదు 👉ఎంతమంది ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి RELAXATION అవసరం ఉంది . 👉ఏ ప్రాతిపదికన ఇన్సర్విస్ ఉపాధ్యాయులకు టెట్ అంశం నుండి విముక్తి కల్పించాలి . పైన కనపర్చిన అంశాలను శీతాకాల సమావేశాలు ముగిసే లోపు ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించాలని అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలకుlettars పంపించడం జరిగిందని రికగ్నైజేషన్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎండి అమీర్ పాషా ఒక ప్రకటనలో తెలియజేశారు

E-పేపర్

నత్త నడక సాగుతున్న రహదారి పనులు

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం గోపాలపురం మండలం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం నుంచి భీమూలు వెళ్లే రోడ్డు పనులు సాగుతున్నయు . పనులు త్వరితగతిన మరియు నాణ్యత తో కూడిన పనులు చేయవలసిందిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. END

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రక్తదాన సేవకు ఘన సత్కారం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధ) గతరెండేళ్లుగా రక్తదానం ప్రాముఖ్యతను ప్రజల్లో విస్తృతంగా చాటి చెప్పి, అనేక మందిని స్వచ్ఛందంగా రక్తదానం చేయించినందుకు మనుబోలు ఎస్సై శివ రాకేష్ జిల్లా కలెక్టర్ ఘనంగా అభినందించారు. సమాజహితాన్ని దృష్టిలో పెట్టుకుని రక్తదాన శిబిరాల నిర్వహణ, యువత ప్రోత్సాహంలో చూపిన సేవలను ప్రశంసిస్తూ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఈ సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు బీసీ కాలనీలో దొంగతనం, బట్టల దుకాణంపై కూడా దాడి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు బీసీ కాలనీలోని కొమరాల శ్రీకాంత్ ఇంటిలో అర్ధరాత్రి సమయంలో దొంగతనం జరిగింది. ఇంట్లోని రెండున్నర సవర బంగారం, సుమారు రూ.50 వేల నగదు, వెండి కుంకుమ భరిని, రెండు దీపపు స్తంభాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అదే సమయంలో కోదండరామపురంలోని ఒక బట్టల దుకాణంలో తలుపులు, కిటికీలు పగలగొట్టి చోరీకి ప్రయత్నించారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. గ్రామంలో భయాందోళన నెలకొంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.