Thursday, 12 March 2026

Blog

వనపర్తి

సీఎం కప్ టోర్నమెంట్ టార్చ్ ర్యాలీని ప్రారంభిస్తున్న మండల విద్యాధికారి శ్రీ జయశంకర్ సార్ గారు

*సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభిస్తున్న మండల విద్యాధికారి శ్రీ జయశంకర్ సార్* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 9/ 1 /2026* *చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీ ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు ఘనపూర్ యందు మండల విద్యాధికారి జయశంకర్ సార్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుల్తానా, కాళిదాసు మేడం ఫిజికల్ డైరెక్టర్ జి ఇందిర, పిఈటీ దేవేందర్, సర్పంచ్ ,వార్డు సభ్యులు మండల సబ్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జి మండల రెవెన్యూ అధికారి మండల పరిషత్ అధికారులు,మండల అధికారులు యువకులు, క్రీడాభిమానులు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై ఈ నెలలో జరిగే సీఎం కప్ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని ర్యాలీని ప్రారంభిస్తూ మండల విద్యాధికారి మాట్లాడుతూ మండలంలో ఉన్న యువకులు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వివిధ రకాల పోటీలలో పాల్గొని విజేతలుగా నిలవాలని వారు కోరారు*

కామారెడ్డి

ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో 5 వేల మంది సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం.

గ్రామాల అభివృద్ధికి దిశానిర్దేశం! కామారెడ్డి,09 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నూతన సర్పంచు లు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులతో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. లింగంపేట్ మండల కేంద్రంలోని జీఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వ హించిన ఈ కార్యక్రమానికి 176 గ్రామాల నుంచి 5 వేల మందికి పైగా పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తలు, ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగ తం పలికారు.కార్యక్రమం ప్రారంభంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ జ్యోతిని వెలిగించి సభను ఆరం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన, వారందరూ విధుల పట్ల అవ గాహన కలిగి, పరస్పర సహకారంతో గ్రామాభివృద్ధి కి కృషి చేయాలని సూచించారు. మహిళా సర్పం చులు ముందుండి పని చేయాలని అన్నారు. కుటుంబ సభ్యుల జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు.గత ప్రభుత్వంలో నియోజకవర్గం నిర్లక్ష్యాని కి గురైందన్నారు.ఇప్పుడు అందరూ కలిసి పునర్ని ర్మాణం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, త్రాగునీరు, ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు కల్పించేలా పని చేయాలన్నారు. ప్రతి పంచాయతీ కార్యాలయంలో లైబ్రరీ ఏర్పాటు చేయాలి, నెలకు రెండుసార్లు ప్రభు త్వ పాఠశాలల్లో జీపీ పాలకులు మధ్యాహ్న భోజ నం చేయాలని అన్నారు.ప్రతి సర్పంచుకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు కల్పించడం తన ఆశయమని చెప్పారు. సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేయాలని కోరారు. సర్పంచులు హుందాగా పని చేసి, పార్టీలకు అతీతంగా అందరి నీ కలుపుకోవాలని సలహా ఇచ్చారు.సర్పంచ్ ఎన్ని కల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపా రు. 209 పంచాయతీల్లో 176 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగరడం ప్రజల నమ్మకానికి నిదర్శనమన్నారు. 46 సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించా మని సంతోషం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అంటే డిసిప్లిన్… డిసిప్లిన్ అంటే కాంగ్రెస్” అని పేర్కొన్నా రు.ఈ ఉత్సాహంతో మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పి టిసి ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు సాధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహుమతిగా అందిం చాలని దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో ఎని మిది మండల అధ్యక్షులు, ఎఎంసీ చైర్మన్లు,సీని యర్ నాయకులు, నూతన సర్పంచులు, కార్యక ర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

వనపర్తి

సీఎం కపూర్ ర్యాలీ టార్చ్ ర్యాలీని ప్రారంభిస్తున్న మండల విద్యాధికారి శ్రీ జయశంకర్ సార్ గారు

*సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభిస్తున్న మండల విద్యాధికారి శ్రీ జయశంకర్ సార్* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 9/ 1 /2026* *చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీ ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు ఘనపూర్ యందు మండల విద్యాధికారి జయశంకర్ సార్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుల్తానా మేడం ఫిజికల్ డైరెక్టర్ జి ఇందిర, పిఈటీ దేవేందర్, వార్డు సభ్యులు మండల సబ్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జి మండల రెవెన్యూ అధికారి మండల పరిషత్ అధికారులు,మండల అధికారులు యువకులు, క్రీడాభిమానులు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై ఈ నెలలో జరిగే సీఎం కప్ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని ర్యాలీని ప్రారంభిస్తూ మండల విద్యాధికారి మాట్లాడుతూ మండలంలో ఉన్న యువకులు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వివిధ రకాల పోటీలలో పాల్గొని విజేతలుగా నిలవాలని వారు కోరారు*

వనపర్తి

సీఎం కప్ టోర్నమెంట్ ర్యాలీ ప్రారంభిస్తున్న మండల విద్యాధికారి జయరాములు సార్ గారు

*సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభిస్తున్న మండల విద్యాధికారి శ్రీ జయశంకర్ సార్* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 9/ 1 /2026* *చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీ ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు ఘనపూర్ యందు మండల విద్యాధికారి జయశంకర్ సార్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుల్తానా మేడం ఫిజికల్ డైరెక్టర్ జి ఇందిర, పిఈటీ దేవేందర్, వార్డు సభ్యులు మండల సబ్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జి మండల రెవెన్యూ అధికారి మండల పరిషత్ అధికారులు,మండల అధికారులు యువకులు, క్రీడాభిమానులు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై ఈ నెలలో జరిగే సీఎం కప్ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని ర్యాలీని ప్రారంభిస్తూ మండల విద్యాధికారి మాట్లాడుతూ మండలంలో ఉన్న యువకులు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వివిధ రకాల పోటీలలో పాల్గొని విజేతలుగా నిలవాలని వారు కోరారు*

విశాఖపట్నం

గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జాగరపు శ్రీను ఆధ్వర్యంలో – మత్తు వ్యసనాలకు వ్యతిరేకంగా 2కే రన్

విశాఖపట్నం (పున్నమి ప్రతినిధి): యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా సమాజం అప్రమత్తంగా ఉండాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖ్రబాత్ భాగ్ఛీ పిలుపునిచ్చారు. జనవరి 26వ తేదీన గాజువాక కూడలి నుంచి జింక్ గేట్ వరకు నిర్వహించనున్న మత్తు వ్యసన వ్యతిరేక 2కే రన్ అవగాహన ర్యాలీ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం మహాత్మ మదర్ థెరీసా ట్రస్ట్ అధ్యక్షుడు జాగరపు శ్రీను ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జాగరపు శ్రీను మాట్లాడుతూ, నేటితరం యువత మత్తు వ్యసనాల నుంచి దూరంగా ఉండేందుకు అవగాహన ర్యాలీలు ఎంతో అవసరమని అన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున జాగరపు శ్రీను ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంతో పాటు పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ శిబిరంలో కంటి, దంత, చెవి పరీక్షలు, ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, గుండె సంబంధిత ECG పరీక్షలు ఉచితంగా అందించనున్నట్టు పేర్కొన్నారు. Uploaded Video:

జయశంకర్ భూపాలపల్లి

ఆత్మీయత సేవా సొసైటి ఆధ్వర్యంలో విద్యార్థులకు షూస్, ప్లేట్స్ పంపిణీ

జయశంకర్ భూపాలపల్లి, జనవరి 5 (పున్నమి ప్రతినిధి): ఆత్మీయత సేవా సొసైటి ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక రాంనగర్‌లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు దాతల సహకారంతో షూస్ మరియు ప్లేట్స్ పంపిణీ చేశారు. ప్లేట్స్‌ను శ్రీలత బిక్షపతి గార్లు (KTK – 1 Incline) విరాళంగా అందించారు. ఈ సందర్భంగా సొసైటి అధ్యక్షులు బయ్యన మహేందర్ గారు మాట్లాడుతూ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. గోవర్ధన్ సర్ పిల్లలకు షూస్ అవసరం ఉందని తెలియజేయడంతో దాతల సహాయంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం గోవర్ధన్ సర్, ఉపాధ్యాయిని అపర్ణ మేడం, దాతలు మల్లేష్ గారు, సొసైటి సభ్యులు క్రాంతికుమార్, షాకీర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండలం బోటికర్లపాడు గ్రామం లోనీ నివాస గృహం లో అగ్నిప్రమాదo

దుత్తలూరు Date:9-1-2026 దుత్తలూరు మండలం బోటికర్లపాడు గ్రామంలో నివసించే కండె సురేష్ఇం ట్లో అనుకొని అగ్నిప్రమాదం సంభవించినది, వివరలోకి వెళ్తే స్థానికంగా నివసించే కండే సురేష్ ఇంట్లో ఎవరు లేనీ సమయం లో అనుకోని అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లోనీ ఎలక్ట్రానిక్ వస్తువులు, వంట సామాగ్రి దుస్తులు పూర్తిగా కాలిపోయినవీ.సురేష్ కి ఇద్దరూ కుమార్తెలు వారి యొక్క సామాగ్రి కూడా పూర్తిగా కాలిపోయినవి. సంఘంటానా స్థలాన్ని స్థానిక సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ గార్లు పరిశీలించి నారు.బాధిత కుటంబానికి తగిన సహాయం చేయవసలిందిగా గ్రామస్తులు కోరుకుంటున్నారు.

కామారెడ్డి

శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో చైర్మన్ చింతల శంకర్ ప్రమాణస్వీకారం

శనివారం.. దక్షిణ కాశీ ప్రాముఖ్యత, అభివృద్ధి ప్రణాళికలు కామారెడ్డి, 9 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లోని రామారెడ్డి-ఇసన్నపల్లి శివారులో వెలసిన పవిత్ర ధామం శ్రీ కాలభైరవ స్వామి ఆలయ సన్నిధిలో శనివారం (జనవరి 10) చైర్మన్ చింతల శంకర్ ప్రమాణ స్వీకారం ఘనంగా జరుగనుంది. ఎమ్మెల్యే కె. మదన్మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి పలువురు వీఐపీలు పాల్గొంటారు. ఆలయ చైర్మన్ చింతల శంకర్ మాట్లాడుతూ, ఈ మహోత్సవం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తుందని తెలిపారు. ఆలయ చరిత్ర, ప్రాముఖ్యత ఈ ఆలయం క్రీశ 16వ శతా బ్దంలో కాశీ నుంచి స్వామివారి స్వయంభు విగ్రహా న్ని ఎద్దు బండిపై తీసుకొస్తున్నప్పుడు ఇక్కడే భారీ శబ్దంతో బండి విరిగి, 14 అడుగుల ఎత్తు విగ్రహం నిటారుగా నిలబడింది. దాంతో ఈ ప్రదేశాన్నే స్వామి కోరిక మేరకు ఆలయంగా ప్రసిద్ధిగాంచిం దన్నారు.కాశీ తర్వాత దక్షిణ భారతదేశంలోనే ఏకైక కాలభైరవ క్షేత్రం ఇది. గ్రహదోషాలు, అపమృ త్యు దోషాలు, దుష్టశాంతి నివారణకు ఇక్కడ పూజలు చేస్తే సకల సుఖాలు కలుగుతాయని చైర్మన్ చింతల శంకర్ ప్రాధాన్యత చెప్పారు. కార్తిక బహుళాష్టమి జయంతి ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తండోపాతండాలుగా తరలి వచ్చి దర్శనం పొందుతారని గుర్తు చేశారు. అభివృ ద్ధి ప్రణాళికలు ఇకపై ఆలయాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చుతాము. నిధులు రాక పోయినా దాతలు, భక్తుల సహకారంతో గోపురాలు నిర్మించాం, ఇకమీదట మహిళలకు వసతి గృహా లు, ప్రసాద షెడ్‌లు, రహదారి అభివృద్ధి, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే మరింత వేగంగా పనులు పూర్తి చేస్తామని చైర్మన్ శంకర్ ఆత్మవి శ్వాసంగా ప్రకటించారు. ధర్మకర్తల మండలి సభ్యులు, డైరెక్టర్లతో కలిసి గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.స్థానికుల ఆకాంక్షలు స్థానిక గ్రామస్తులు ఈ అభివృద్ధి ప్రణాళికలకు స్వాగతం పలికుతామని హామి ఇచ్చారు. ఎమ్మెల్యే మదన్మో హన్ రావు మద్దతుతో ఆలయం మరింత ఆకర్షణీ యంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తులు ప్రతి మంగళవారం ఘనంగా పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని చైర్మన్ ఆహ్వానిం చారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్లారెడ్డి ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆరోగ్యమైన మనస్సుకు ఆరోగ్యమైన శరీరం అవసరం

స్వామి వివేకానంద సందేశం (మన పున్నమి ప్రతినిధి): “ఆరోగ్యమైన శరీరంలోనే ఆరోగ్యమైన మనస్సు ఉంటుంది” అని Swami Vivekananda స్పష్టం చేశారు. శారీరక ఆరోగ్యం, మానసిక స్థైర్యం, ఆధ్యాత్మిక వికాసం పరస్పరం అనుసంధానమై ఉంటాయని ఆయన పేర్కొన్నారు. బలమైన మనస్సు కోసం క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరమని, యువత శరీర దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలని ఆయన సందేశం నేటికీ ప్రాసంగికంగా నిలుస్తోంది.

విశాఖపట్నం

విశాఖ జిల్లాలోకి గంజాయి ముఠా పాత గాజువాకలో అర్ధరాత్రి ముగ్గురు మహిళల అరెస్ట్ – 40 కేజీల గంజాయి స్వాధీనం

విశాఖ గాజువాక జనవరి (పున్నమి ప్రతినిధి) విశాఖపట్నం జిల్లా పాత గాజువాకలో అర్ధరాత్రి వేళ గంజాయి తరలిస్తున్న ముగ్గురు మహిళలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం అర్ధరాత్రి పాత గాజువాక జంక్షన్‌లోని 38 బస్ స్టాప్ సమీపంలో ఏజెన్సీ ప్రాంతం నుంచి విశాఖకు 40 కేజీల గంజాయిని తీసుకువచ్చి దించుతుండగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ సిబ్బంది అక్కడ దాడి చేసి ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 40 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మహిళలను తదుపరి విచారణ నిమిత్తం గాజువాక పోలీసులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. గంజాయి సరఫరా వెనుక ఉన్న ముఠాపై దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.