Friday, 27 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

కలెక్టర్ ను కలిసిన నెల్లూరు జిల్లా APJF నేతలు.

నెల్లూరు జిల్లాలోని జర్నలిస్ట్ లకు కరోన, కోవిడ్ -19 సందర్భంగా ఆర్థికంగా వెనుకబడిన జర్నలిస్ట్ లకు పని వత్తిడి లో రేషన్ కార్డులు కూడా లేవని,ఆర్థికంగా ఎంతో వెనుక బడిన జర్నలిస్ట్ లకు బి.పి.ఎల్ క్రింద అందరికి మూడు నెలలు నిత్యావసర వస్తువులు, బియ్యం, గ్యాస్ సిలిండర్ లు ,నగదు ఇవ్వాలని కోరారు.గురువారం apjf నెల్లూరు జిల్లా నేతలు పత్రికముకంగా కొరగా శుక్రవారం కలెక్టర్ గారిని స్వయంగా ఇతర జర్నలిస్ట్ లతో కలిసి కోరడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు స్పందించి సంబంధిత జిల్లా అధికారులు కు తగు సూచనలు చేశారు. అలాగే మీడియా లో పని చేస్తున్న జర్నలిస్ట్ లకు/నాన్ జర్నలిస్ట్ కు కరోన పాస్ లు మంజూరు చేయాలని కోరాము,తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చి జిల్లా సమాచార శాఖ D. D గారికి తగు ఆదేశాలు పంపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం గౌరవాధ్యక్షుడు ఆకుల పురుషోత్తం బాబు (సింహపురి బాబు) అధ్యక్షుడు శాఖమూరి శ్రీనివాసులు ( అభయం శీను)ప్రధాన కార్యదర్శి సుబ్బు సింగ్, కోశాధికారి మల్లికార్జున్, ఉపాధ్యక్షులు నన్నూరు శ్రీనివాసరావు ఓ.వెంకటేశ్వర్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ దిలీప్ జాయింట్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు జైపాల్ సింగ్ కమిటీ మెంబర్లు శ్రీహరి , శంకర్, శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

కరోనా వ్యాధిపై అవగాహన కల్పిస్తున్న ఆశావర్కర్లు గ్రామ వాలంటీర్లు

  రాపూరు పట్టణం కొత్తపేట లో ఏడవ వార్డు నందు ఆశ వాలంటీరు మరియు గ్రామ వాలంటీర్లు సర్వే నిర్వహిస్తూ వార్డు లోని ప్రజలకు ఎవరికైనా జలుబు దగ్గు జ్వరం ఉన్నాయా లేవా అని పరిశీలించి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి ఉంటే వారి వివరాలను నమోదు చేసుకుని అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం జరుగుతుంది మరియు కరోనా వ్యాధిపై అవగాహన కల్పిస్తు చేతులు మరియు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలని వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు సలహాలు తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలోఆశా వాలంటీర్ లక్ష్మి గ్రామ వాలంటీర్ ఆస్మా

Featured ఆంధ్రప్రదేశ్

అన్నార్తులకు ఆహారం

లాక్ డౌన్ తో నెల్లూరు నగరంలో భోజనం లేక ఇబ్బందులు పడుతున్న పేదలు , నిరాశ్రయులకు మాగుంట సేవాసమితి ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవాసమితి వ్యవస్థాపకులు మాగుంట శరత్ చంద్రారెడ్డి, సాయి, నిషాద్ పాల్గొన్నారు..

Featured ఆంధ్రప్రదేశ్

‘‘‌మనికిరెడ్డి సేవలు ఆదర్శనీయం’’ – స్పెషల్‌ ‌జ్యూడిషియల్‌ ‌జడ్జి చింతా పద్మారావు.

మనికిరెడ్డి సేవలు ఆదర్శనీయమని, ఉభయ గోదావరి జిల్లాలలో మానికిరెడ్డి హెల్త్ ‌కేర్‌ ‌ఫౌండేషన్‌ ‌ద్వారా డాక్టర్‌ ‌మానికిరెడ్డి సత్యనారాయణ చేస్తున్న సేవలు అభినందనీయమని కొవ్వూరు స్పెషల్‌ ‌జ్యూడిషియల్‌ ‌జడ్జి చింతా పద్మారావు అన్నారు. మార్వెల్‌ ‌బుక్‌ ఆఫ్‌ ‌రికార్డస్ ‌సామాజిక సేవలో తక్కువ సమయంలో వివిధ ప్రాంతాల్లో ఎక్కువ సేవలు చేసినందుకు గాను డాక్టర్‌ ‌మానికిరెడ్డి సత్యనారాయణ కు శనివారం సాయంత్రం కొవ్వూరులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రికార్డ్ ‌ధ్రువీకరణ పత్రాన్ని, జ్ఞాపికను, మెడల్‌ ‌ను జడ్జి పద్మారావు చేతులమీద అందించారు. మార్వెల్‌ ‌బుక్‌ ఆఫ్‌ ‌రికార్డస్ ‌ప్రతినిధి డాక్టర్‌ అద్దంకి రాజా మాట్లాడుతూ మానికిరెడ్డి హెల్త్ ‌కేర్‌ ‌ఫౌండేషన్‌ ‌ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్‌ ‌క్యాంపులు, కాలేజీలలో విద్యార్థులకు చీ•• ద్వారా సామాజిక సేవతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు, లయన్స్ ‌క్లబ్‌, ‌రెడ్‌ ‌క్రాస్‌ ‌ద్వారా సేవా కార్యక్రమాలు. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాల ఆడ పిల్లలకు ఉన్నత విద్యకు నగదు ప్రోత్సహకాలు. ఎయిడ్స్, ‌కుష్టు నివారణా కార్యక్రమాలు తక్కువ సమయంలో ఎక్కువ కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా గుర్తించి ఈ రికార్డును అందించామన్నారు. కార్యక్రమంలో జి. కె స్టడీ సర్కిల్‌ ‌నిర్వాహకుడు సామాజికవేత్త గెల్లా కేశవ, పి.డి.ఎస్‌. ‌యూ రాష్ట్ర నాయకుడు నంబూరి మహర్షి తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఒక్క ఫోన్‌ ‌కాల్‌తో ఇంటి వద్దకే సరుకులు

కరోనా మహమ్మారి ప్రబలమవుతున్న కారణంగా నెల్లూరు నగరంలో ప్రజలు తిరగకుండా ఉండేందుకు గాను నెల్లూరు నగర మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌ప్రత్యేక శ్రద్ద తీసుకుని నెల్లూరు నగరము నందు గల ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకులు, కూరగాయలు కాల్‌ ఆన్‌ ‌డెలివరి సర్వీసు ద్వారా అందించుటకు జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారం నెల్లూరు నగర కమిషనర్‌, ఆహార భద్రత అధికారి, కిరాణా మర్చంట్స్ అసోసియేషన్స్ ‌వారితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఒక్క ఫోన్‌ ‌కాల్‌తో ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేయుటకు నిర్ణయించారు. ఈ క్రింద తెలిపిన షాపులలో సరకులు తీసుకొనవచ్చును. ఒక్క ఫోన్‌ ‌కాల్‌ ‌ద్వారా మీకు అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలు పొందవచ్చని కమిషనర్‌ ‌తెలిపారు. 1. ‌మోర్‌ ‌సూపర్‌ ‌మార్కెట్‌, వేదాయపాళెం  ‌నిత్యావసర సరుకులు, కూరగాయలు  9705807146 8008534066 2. మోర్‌ ‌సూపర్‌ ‌మార్కెట్‌, మాగుంట లేఅవుట్‌   ‌నిత్యావసర సరుకులు,  ‌కూరగాయలు  9912226853, 9666452697 3. మోర్‌ ‌సూపర్‌ ‌మార్కెట్‌, రాంజీనగర్‌  ‌నిత్యావసర సరుకులు, కూరగాయలు 9030929165 4. రిలయన్స్ ‌స్మార్ట్, ‌దర్గామిట్ట నిత్యావసర సరుకులు, కూరగాయలు 9398736650,  8886083226, 7569042117 5. వెంకయ్య స్వామి ట్రేడర్స్, ఎ.కె.నగర్‌  ‌నిత్యావసర సరుకులు 9030544863 6. ‌మంచికంటి శ్రీనివాసులు ప్రొవిజన్స్, ‌స్టోన్‌హౌస్‌పేట –  నిత్యావసర సరుకులు 9849226000 7. మంచికంటి సూపర్‌ ‌మార్కెట్‌, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 9985995995 8. అద్దెపల్లి సుబ్బారావు ప్రొవిజన్స్, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 8978433867 9. సరాబు వెంకటేశ్వర్లు ప్రొవిజన్స్, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 9885190744 10. భార్గవి ప్రొవిజన్స్, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 8309238999 11. శ్రీనివాస ప్రొవిజన్స్, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 9700555844 12. బిగ్‌ ‌బజార్‌, ఎం.‌జి.బి.మాల్‌ ‌- నిత్యావసర సరుకులు, కూరగాయలు  9136976270 పైన తెలిపిన షాపులు ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించుటకు అంగీకారము తెలియపరిచారు. సరుకులు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల లోపు చేరవేయుటకు పోలీసులు అనుమతిచ్చారు. కావున ప్రజలకు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిత్యావసర సరుకులు, కూరగాయలు కావల్సిన వారు పైన తెలిపిన ఫోన్‌ ‌నెంబర్లకు ఫోన్‌ ‌చేసి తెప్పించుకొనవచ్చునని తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ

రాపూరు పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి స్వయంగా యం.పి.డి.ఓ ఆమోస్ బాబు దగ్గర ఉండి పంచాయతీ సిబ్బంది చేత చెత్తను తొలగించి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కెమికల్ స్ప్రే చేయించడం బ్లీచింగ్ చల్లడం పర్యవేక్షిస్తున్నరు. అలాగే రాపూరు మండలం లోని 18 సచివాలయాలు లోనూ సచివాలయ సిబ్బంది తో ఆ గ్రామాలలో పారిశుద్ధ్య లోపం లేకుండా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. వీరి వెంట పంచాయతీ విస్తరణ అధికారి గంగయ్య పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

కరోనా వ్యాధి .. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మన ముందున్న ప్రాథమిక కర్తవ్యం.

కరోనా వ్యాధి …..మూడు రోజుల్లో లక్ష మందికి కరోనా అతి భయంకరమైన అంటువ్యాధిగా మారింది.గత డిసెంబర్లో చైనాలో పుట్టింది. మూడు నెలల్లోనే ప్రపంచంలోని దేశాలన్నింటికీ పాకింది. ఈరోజుకి 3,95,564 మందికి సోకింది. 17,233 ప్రాణాలను బలితీసుకుని ప్రపంచ జనాభానంతా గడగడలాడిస్తుంది. 22వ తేదీ మన దేశంలో జరిగిన స్వచ్ఛంద గృహనిర్బంధ కార్యక్రమాన్ని పరిశీలించినట్లయితే ప్రజలు ఎంత భయానికి లోనవుతున్నారో తెలుస్తుంది. ఈ వ్యాధి సోకిన వారి గణాంకాలను పరిశీలిస్తే ప్రజల భయాలు ఇంకా స్పష్టంగా తెలుస్తాయి. ప్రపంచ వ్యాపితంగా కరోనా సోకిన వారి సంఖ్య లక్షకు చేరుకోవడానికి 67 రోజులు పట్టింది. మరో 11 రోజులలోనే ఈసంఖ్య రెండు లక్షలకు చేరుకుంది. మరో మూడు రోజులలోనే ఈ రెండు లక్షలు సంఖ్య మూడు లక్షలు గా మారింది. 23వ తేదీ ఒక్క రోజే 41,371మందికి సోకింది. ఈ వ్యాప్తి ఇలాగే కొనసాగితే ప్రజల భవిష్యత్తు ఏమిటన్నది పెద్ద ప్రశ్న. సరైన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం కారణంగా చైనా తన దేశంలో పుట్టిన ఈ వ్యాధిని అదుపులో పెట్టుకోగలిగింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగానే ఇటలీలో మరణ మృదంగం మోగుతుంది. ఈ వ్యాధి ని అదుపు చేయలేక అల్లాడి పోతుంది. ఈ వ్యాధి గురించి భయపడి పోవడం కాదు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మన ముందున్న ప్రాథమిక కర్తవ్యం.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

మాస్కులు కరోనా వైరస్ ను అడ్డుకుంటాయా?

పత్రికలు, టీవీలు, ఫేస్ బుక్ లు, వాట్సాప్ లలో విపరీతంగా చర్చ జరుగుతున్న అంశం ‘ కరోనా‘. ప్రస్తుతం ప్రతి నోట వినిపిస్తున్న మాట కూడా ‘కరోనా‘. కరోనా  దెబ్బకి ప్రపంచమంతా అట్టుడికి పోతోంది.  ఈ వ్యాది నివారణకు ప్రభుత్వాలు పాఠశాలలకు,సినిమాహాళ్ళకు మూతలు వేస్తుంటే ప్రజలు తమ మూతికి మాస్కులు  వేసుకుంటున్నారు. మూతికి మా స్కూలు కట్టుకోవడం ప్రారంభంకాగానే వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  మూడు రూపాయలకు అమ్మే మాస్కు 60 రూపాయలకు కూడా దొరకడం లేదంటే మాస్కుల డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ మాస్కులు కరోనా వ్యాదిని నివారించ గలవా?.మాస్కులను కట్టుకోవడం అవసరమా? మాస్కు ల వల్ల ప్రయోజనం ఉందా? లేదా?.ఎవరు వాడాలి?ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? అనే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా మన ముందుకు వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ మరియు భారతీయ వైద్య పరిశోధనా మండలి జారీ చేసిన సూచనల ప్రకారం కరోనా నివారణ కొరకు దేశంలోని ప్రజలందరూ మూతికి మాస్కులు కట్టుకోనవసరం లేదు. వాటిని కట్టుకోవడం ద్వారా ఈ వ్యాది నుండి రక్షించుకోవచ్చు అనే అభిప్రాయంతో లక్షలాది మంది మూతికి మాస్కులు కట్టుకుంటూ అనేక రకాల వైరస్ లను కూడా తెచ్చు కుంటారు. అది ఎలా అని అనుకుంటున్నారా? ఒకసారి   మాస్క్ కట్టుకున్న తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ చేతితో ఆ మాస్క్ ను తాకరాదు.  మాట్లాడేటప్పుడు చేతితో  మాస్కును కిందికి పైకి లాగడం చేస్తుంటారు.దీని వలన  చేతికి అంటుకుని వున్న రకరకాల క్రిములను, వైరస్ లను మాస్కులకు అంటించుకుంటారు. ఇలా మాస్కులకు  అంటుకున్న వైరస్ నోరు, ముక్కుల ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నారు. ఒక్కసారి కట్టుకున్న మాస్క్ ఆరు గంటలు మాత్రమే పని చేస్తుంది. ఆ తర్వాత దాన్ని  తీసివేసి వేరే మాస్కును వాడుకోవాలి కానీ సాధారణ ప్రజలు ఓకే మాస్కును రోజుల తరబడి వాడుతున్నారు . ప్రమాదాలను పెంచుకుంటున్నారు.ఇలా ప్రతి 6 గంటలకు ఒక మాస్క్ ను మార్చుకోవడం సాధారణ ప్రజానీకానికి వారి వృత్తి  మరియు ఆర్థిక పరిస్థితి  రీత్యా సాధ్యం కాదు.వ్యయ ప్రయాసలకు ఓర్చి కట్టుకున్నా రక్షణ ఉండదు.వీటికంటే తరచుగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. కరోనా రోగికి వైద్యం చేసే డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, కరోనా వ్యాదిగ్రస్తుల శుభ్రతకు ఉపయోగపడే శానిటరీ సిబ్బందికి, దగ్గరుండి చూసుకునే సహాయకులకు కరోనా వ్యాది సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారిని హైరిస్క్ గ్రూపు అంటారు. వీరు మాత్రం ఈ మాస్కులను  తప్పనిసరిగా వాడాలి. ఎందుకంటే పేషెంట్ నుండి ఆ వైరస్ వీరికి సోకకుండా ఉండడానికి. *పేషెంట్ కు సహాయకులుగా ఉండేవారు, పేషెంట్ ని పరామర్శించుటకు వచ్చే వారు కూడా మాస్క్ కట్టుకోవాలి.కరోనాతో బాధపడుతున్న రోగి తప్పకుండా మాస్క్ వాడాలి. రోగి మాస్కు కట్టుకోవడం వల్ల రోగికి ఉపయోగం ఏమీ లేదు కానీ అది సమాజానికి ఉపయోగపడుతుంది.తన నోరు మరియు ముక్కు నుంచి వెలువడే వైరస్ ను ఇతరులకు వ్యాపించకుండా ఈ మాస్క్ పనిచేస్తుంది. సర్జికల్ మాస్కులని, రెండు లేయర్ల మాస్కులని, మూడు లేయర్ల మాస్కులని, N95 మాస్కులని అనేక రకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. N95 మాస్క్ ఎక్కువ ఉపయోగం. కానీ వాటి ఖరీదు ఎక్కువ. మాస్కులను వాడిన తరువాత తీసివేసే  ఉత్తమ పద్ధతులను కొన్నింటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. అవి ఏమంటే:- మాస్కును కట్టుకునే ముందు చేతులను సబ్బుతో గాని ఆల్కహాల్ తో కూడిన స్టెరిలైజర్ తో గాని 40 సెకండ్లపాటు శుభ్రం చేసుకోవాలి. మాస్కును కట్టుకున్న తర్వాత దానిని ఎట్టి పరిస్థితులలోనూ చేతులతో పైకి కిందకి లాగడం, మాస్కును సర్దుకోవడం లాంటివి చేయకూడదు. మాస్కును ఎట్టి పరిస్థితిలో కూడా చేతితో తాకరాదు.ఏదయినాఅవసరమై మాస్కులను తాక వలసి వస్తే చేతులను తప్పనిసరిగా సబ్బుతో శుభ్రం చేసుకున్న తర్వాతే తాకాలి.చేతులు శుభ్రం చేసుకోకుండా తాకితే ఆ మాస్కును తీసివేయాలి. అలా జరగకపోతే చేతికున్న క్రిములు మాస్కుకు అనవసరంగా  పాకవచ్చు. దీని వల్ల వ్యాది సోకవచ్చు. .మాస్కులు తీసేటప్పుడు దానిని వెనక నుండి తీసివేయాలి. మాస్కులు తీసివేసిన  తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. వాడి తీసివేసిన మాస్కును ఎక్కడంటే అక్కడ  వేయరాదు.దానిని ప్రత్యేకమైన వేస్ట్ బుట్టలో వేయాలి. తగలబెట్టడం కానీ భూమిలో  పూడ్చిబెట్టడం కానీ చేయాలి. అలా చేయకపోతే ఈ మాస్కుల  కారణంగా కరోనా వ్యాది మరికొందరికి వచ్చే అవకాశం ఉంది. కరోనా నివారణకు ప్రజలందరూ మాస్కులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎదుటివారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు విడుదలయ్యే గాలి తుంపర్లు మన మొఖం మీద పడకుండా ఉండేందుకు మాస్కులు ఉపయోగపడుతాయి అనే భావనతో మాస్కును కట్టుకుంటారు.మాస్కుని సరైన పద్ధతిలో వాడకపోతే కరోన వైరస్ ని నిరోధించడం సాధ్యం కాక పోగా కరోనా వ్యాది వ్యాప్తి జరిగే అవకాశమే ఎక్కువ.  మాస్కులను సరైన పద్ధతిలో వాడలేకపోతే మాస్కు లను వాడకపోవడం మంచిది. గంటకోసారి చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం ద్వారా  కూడా కరోనా వ్యాప్తిని నిరోధించగలం. డాక్టర్ యం. వి. రమణయ్య ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు 9490300431

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

గూడూరు లో మరో షహీన్ బాగ్..

ఢిల్లీ షహీన్ బాగ్ ( పున్నమి ప్రతినిధి గూడూరు) రగిలించిన స్ఫూర్తి భారతదేశమంతటా విస్తరిస్తోంది. మతోన్మాదుల ఆశయాలను అడియాశలు చేస్తూ దేశమంతటా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ప్రజలు ముఖ్యంగా మహిళలు తమ నిరసనలను దీక్షల రూపంలో తెలియజేస్తున్నారు. పాలకుల మనసులు మారాలని తద్వారా హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి సమైక్యతను కాపాడుకోవాలని దీనికి రాజ్యాంగ రక్షణే శిరోధార్యమని ప్రజలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా గూడూరు  పట్టణంలో గత 27 రోజులుగా స్థానిక పెద్ద మసీదునందు కులమతాలకతీతంగా ప్రజలు తమ నిరసనలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో నేడు గూడూరు మహిళలు కూడా దీక్షలో పాల్గొనడం ఈ ఉద్యమానికి మరింత వూతం లభించినట్లయింది. గూడూరు పట్టణ చరిత్రలో అప్పుడెప్పుడో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహిళలు తిరిగి అదే మసీదు నందు తమ దీక్షను ప్రారంభించడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ షంషేర్ మాట్లాడుతూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను తెచ్చింది కనుక ప్రజలందరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈమె కోరారు. దేశంలోని ప్రజలంతా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఈమె వాపోయారు. NPR చట్టాలకు వ్యతిరేకంగా వైయస్ జగన్ గారు అసెంబ్లీలో తీర్మానం చేస్తామనడం మంచి పరిణామమని షంషేర్ చెప్పారు. స్వాతంత్రం కోసం ఎందరో ముస్లిములు ప్రాణత్యాగం చేశారు అలాంటి ముస్లింలను ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని, అలాగే నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని బిజెపి నాయకులను హెచ్చరించారు. హాషిం..ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు హాషిం మాట్లాడుతూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ చట్టాలపై పూర్తి అవగాహన ఉందని కనుకనే మహిళలు ఈ నల్లచట్టాలకు  వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే గూడూరు పట్టణంలో మహిళలు సైతం దీక్షలో పాల్గొనడం కేంద్ర ప్రభుత్వాలకు చెంప పెట్టు లాంటిదని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని తల్లితో పేర్కొనే మోడీ, అమిత్షాలు భారతదేశంలోని తల్లులను వీధుల్లోకి లాగటం ఎంతవరకు సమంజమని పేర్కొన్నారు. ఇది బీజేపీ నాయకుల కుటిలత్వాన్ని సూచిస్తుందని ఈయన స్పష్టం చేశారు.

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ప్రతిఒక్కరు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని దీనికి తమ వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని మిత్ర ఫౌండేషన్ చైర్మన్ షేక్. షబ్బీర్ భరోసానిచ్చారు. గూడూరులోని విందూరు మిత్ర ఎస్టీ కాలనిలో 5వ తేది సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  పేదవారి బిడ్డల చదువు మధ్యలో ఆగిపోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిందని అయిన కొంతమంది ఏవో కారణాలతో డ్రాపౌట్స్ గా మిగిలిపోతున్నారని ఆవేదన చెందారు. అలాంటి వారికోసం తమ సంస్థ అన్నిరకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఈ సందర్బంగా అక్కడి పేద విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, పలకలు, ఛార్ట్స్, పరీక్షలకు అవసరమగు మెటీరియల్స్ తదితర సామాగ్రిని అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణ మరియు పట్టుదలతో చదవాలని, అలాగే ఎవరైనా క్రీడాకారులు వుంటే వారిని గుర్తించి తగిన క్రీడా వస్తుసామాగ్రిని అందిస్తామని షబ్బీర్  పేర్కొన్నారు. ఆరోగ్య విషయంలో విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని షబ్బీర్ ఉపదేశిస్తూ విద్యార్థులు మంచి ఆరోగ్య అలవాట్లను అలవర్చుకోవాలని వారికి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం విందూరు మిత్ర ST కాలనీలో నివసిస్తున్న 30 కుటుంబాలకు మరియు చిన్న పిల్లలకు బ్రెడ్, పాలు, పాయసం, ఆపిల్ పండ్లుతో పాటు మరికొన్ని వస్తువులను  అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలని ప్రజలతోపాటు షేక్.అబ్దుల్లా, జాఫర్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.